
దీపికా పదుకోన్ ఎలాగుంటారు? కత్తిలా... అందంలోనూ, అభినయంలోనూ! ఎన్ని గుండెల్లో దిగిందో... కత్తిలాంటి ఆమె అందం, అభినయం! అటువంటి కత్తి చేతికి కత్తి ఇచ్చారు దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ. ఆయన తీసిన ‘గోలియోంకి రాసలీలా రామ్‌లీలా’లో... బొమ్మ సూపర్‌హిట్! మళ్లీ దీపికతో యుద్ధాలు, కత్తులు... ‘రామ్‌లీలా’ వంటి బొమ్మే (‘పద్మావతి’) తీశారు భన్సాలీ.
వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ బొమ్మ గురించి బోల్డంత రచ్చ జరుగుతోంది! ఈ రచ్చ సంగతి పక్కన పెడితే, ‘కత్తిలాంటి దీపిక చేత్తో కత్తి పట్టుకుంటే... బొమ్మ సూపర్‌హిట్టే’ అని ప్రముఖ ఫొటోగ్రాఫర్ డబూ రత్నానికి ఐడియా వచ్చినట్టుంది! ఆలస్యం చేయకుండా... ఆయన క్యాలెండర్ కోసం ఇలా ఫొటోషూట్ చేశారు. కత్తిలా ఉంది కదూ!
Comments
Please login to add a commentAdd a comment