‘పద్మావతి’ సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ వివాదాలు, విమర్శలు అధికమవుతున్నాయి. పద్మావతి చిత్రం విడుదల చేస్తే దాడులు చేస్తామంటూ రాజ్‌పుత్ కర్ణిక సేన కార్యకర్తలు తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పద్మావతి చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన దీపికా పదుకునే ముక్కు కోస్తామని కొందరు అంటే.. ఆమెను చంపితే రూ. 5 కోట్లు ఇస్తామని మరో సంస్థ ప్రకటించింది.
రాజ్‌పుత్ కర్ణిక సేన కార్యకర్తలు చేసిన హెచ్చరికలు, ఆందోళనలపై బహుభాష నటుడు ప్రకాశ్‌రాజ్ తన ట్విట్టర్‌లో తీవ్రంగా ఖండించారు.
‘కొద్ది రోజులుగా కళాకారులపై దాడులకు పాల్పడతామని.. హెచ్చరికలు చేస్తుండటం ఆందోళనకర పరిణామని అని అన్నారు. అనేక భాష్లలో విశృంఖలంగా నిర్మితమవుతున్న అశ్లీల చిత్రాల గురించి నోరు మెదపని వాళ్లు.. చారిత్రతాత్మక, సందేశాత్మక చిత్రాలో నటించిన, నటిస్తున్న కళాకారులపై దాడులకు పాల్పడతామంటూ హెచ్చరించడం ఎంత వరకు సమంజసమని’ ఆయన ప్రశ్నించారు. ఈ చిత్రాన్ని సంజలీలా భన్సాలీ రూపొందిస్తున్నారు.
పద్మావతి చిత్రంపై ఎవరూ ఊహించని స్థాయిలో కర్ణిసేన ప్రతిస్పందిస్తోంది. సినిమా విడుదలను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించమని సంస్థ తేల్చి చెప్పింది. సంజయ్‌లీలా భన్సాలీ హిందువుల మనోభావాలను దెబ్బతీశారని కర్ణిసేన ఆరోపించింది. సినిమా విడుదల ఆపకపోతే దీపిక ముక్కు కత్తిరిస్తామని కర్ణిసేన బహిరంగంగా ప్రకటించింది. థియేటర్లను ధ్వంసం చేస్తామని స్పష్టం చేసింది. మరికొందరు మాత్రం దీపికను చంపితే రూ. 5 కోట్లు బహుమతిగా ఇస్తామని ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment