న్యూఢిల్లీ: ‘పద్మావతి’ సినిమా వివాదంపై వివరణ ఇచ్చేందుకు ఆ చిత్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ.. సమాచార సాంకేతిక శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా భన్సాలీపై కమిటీ ప్రశ్నల వర్షం కురిపిం చింది. ‘సీబీఎఫ్‌సీ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్)కి నవంబర్ 11న దరఖాస్తు చేసుకుని.. డిసెంబర్ 1న సినిమా విడుదల చేస్తామని ఎలా అనుకుంటారు.
సినిమా టోగ్రఫీ చట్టం ప్రకారం.. ఓ చిత్రానికి సర్టిఫికెట్ ఇచ్చేందుకు సీబీఎఫ్‌సీ 68 రోజుల సమయం తీసుకుంటుందని తెలియదా? ఎంపిక చేసిన కొన్ని మీడియాలకే సినిమా చూపించడం న్యాయమా?’ అంటూ ప్రశ్నించింది. మరోవైపు పార్లమెంటరీ కమిటీ ముందు సీబీఎఫ్‌సీ చీఫ్ ప్రసూన్ జోషి కూడా హాజరయ్యారు. నిపుణులను సంప్రదించిన తర్వాతే సినిమా సర్టిఫికెట్‌పై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment