
సాక్షి,న్యూఢిల్లీ: వివాదాలకు కేంద్ర బిందువైన సంజయ్ లీలా భన్సాలీ వెండితెర దృశ్య కావ్యం పద్మావతి వార్తల్లో నానుతూనే ఉంది. పద్మావతి మూవీ విడుదలను నిలిపివేయాలని రాజస్థాన్‌లో నిరసనలు మిన్నంటాయి. పద్మావతి చిత్రం విడుదలకు అభ్యంతరం వ్యక్తం చేస్తూ చిత్తోర్‌ఘర్‌లో ఆందోళనకారులు భారీ నిరసనను చేపట్టారు. చిత్రంలో అభ్యంతరకర సన్నివేశాలున్నాయంటూ పద్మావతి మూవీని వ్యతిరేకిస్తూ చిత్తోర్‌ఘర్ బంద్‌ను పాటించారు.
పద్మావతి సినిమాలో చరిత్రను వక్రీకరించారంటూ రాజ్‌పుట్ కర్ణి సేన రాజస్థాన్ అంతటా నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే. భారత్‌కు గర్వకారణమైన చరిత్రను వక్రీకరించేందుకు తాము ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించమని రాజ్‌పుట్ కర్ణి సేన జాతీయ కన్వీనర్ ప్రమోద్ రాణా స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment