మరోసారి గాయపడ్డ హీరో : షూటింగ్ కు బ్రేక్ | Shahid Kapoor injured on the sets of Padmavati | Sakshi
Sakshi News home page

మరోసారి గాయపడ్డ హీరో : షూటింగ్ కు బ్రేక్

Published Sun, Oct 1 2017 2:44 PM | Last Updated on Sun, Oct 1 2017 3:16 PM

Shahid Kapoor

బాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పద్మావతి సినిమాను ఏదో ఒక సమస్య ఇబ్బంది పెడుతూనే ఉంది. షూటింగ్ ప్రారంభమైన కొద్ది రోజులకే హీరో షాహిద్ కపూర్ గాయపడటంతో కొద్ది రోజులు బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. తరువాత రాజస్థాన్ లో షూటింగ్ జరుగుతుండగా కొంతమంది సినిమా కథ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ యూనిట్ సభ్యులపై దాడికి దిగటంతో ఆ లోకెషన్ లో షూటింగ్ అర్థాంతరంగా ముగించుకోవాల్సి వచ్చింది.

తాజాగా మరోసారి  పద్మావతి సినిమా షూటింగ్ కు బ్రేక్ పడిందన్న టాక్ వినిపిస్తోంది. ఇటీవల పోరాట సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా షాహిద్ కపూర్ మరోసారి గాయపడ్డాడు. కాలిగాయం తీవ్రంగా ఉండటంతో పది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలి డాక్టర్లు సూచించారట. దీంతో షూటింగ్ బ్రేక్ ఇవ్వాలని భావిస్తున్నారు చిత్రయూనిట్. భారీ యుద్ధ సన్నివేశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రమాధాలు తప్పటంలేదు.

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పద్మావతిగా హాట్ బ్యూటీ దీపికా పదుకొనే నటిస్తోంది. షాహిద్ కపూర్ తో పాటు మరో హీరో రణవీర్ సింగ్ మరో కీలక పాత్రలోనటిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో విజువల్ వండర్ గా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నాడు దర్శకుడు బన్నాలీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement