
సాక్షి,న్యూఢిల్లీ:బాలీవుడ్‌లో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకునే హీరోయిన్లలో ముందుండే దీపికా పదుకోన్ తాను ప్రధాన పాత్రలో నటించిన చారిత్రక దృశ్యకావ్యం పద్మావతికి భారీ మొత్తం అందుకున్నట్టు తెలిపింది. తనకు రెమ్యూనరేషన్ కన్నా తాను లీడ్ రోల్ పోషించిన ఈ మూవీపై నిర్మాతలు పెద్దమొత్తం వెచ్చించడం సంతృప్తి ఇస్తోందని చెప్పారు. ఈ సినిమాకు తనకు ముట్టచెప్పిన మొత్తం భారీగానే ఉందని చెప్పిన దీపిక ఎంత అందుకున్నారనేదానిపై మాత్రం సమాధానం దాటవేశారు.
పద్మావతి మూవీలో ప్రధాన పాత్రల్లో నటించిన రణ్‌వీర్‌సింగ్, షాహిద్ కపూర్‌ల కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ దీపికకే దక్కినట్టు సమాచారం. మహిళా ప్రాధాన్యత కలిగిన చిత్రాలకు పద్మావతి నూతన ఒరవడి సృష్టిస్తుందని దీపిక చెబుతున్నారు. పలు వివాదాలు, ప్రత్యేకతలతో ప్రేక్షకుల్లో నానుతున్న పద్మావతి మూవీ డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment