సాక్షి,న్యూఢిల్లీ: వివాదాస్పద పద్మావతి మూవీ ప్రకంపనలు రాజకీయ పార్టీల్లోనూ సెగలు రేపుతున్నాయి. ఈ చిత్రంపై కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల సీఎంల్లో చీలిక నెలకొంది. పద్మావతికి కాంగ్రెస్ పాలిత కర్ణాటక సీఎం సిద్ధరామయ్య బాసటగా నిలిస్తే అదే పార్టీకి చెందిన పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ వ్యతిరేకించారు. చరిత్రను వక్రీకరించే సినిమాలను అనుమతించబోమని స్పష్టం చేశారు. పటియాలా రాజకుటుంబానికి చెందిన అమరీందర్ సింగ్ కర్నాటక సీఎంతో విభేదించారు.
చరిత్రను ఇష్టానుసారం వక్రీకరిస్తే నిరసనలు తెలపడం ప్రజాస్వామిక హక్కని అమరీందర్ అన్నారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య పద్మావతిపై నిరసనలను తోసిపుచ్చారు. మూవీ హీరోయిన్ దీపికా పడుకోన్‌కు వస్తున్న హెచ్చరికలను తీవ్రంగా ఖండించారు. మహిళలను బెదిరించడం పెరుగుతున్న అసహనానికి మరో సంకేతమని, బీజేపీ స్వార్థపూరిత రాజకీయాల్లో ఇది భాగమని వ్యాఖ్యానించారు. దీపిక కుటుంబానికి కర్ణాటక ప్రభుత్వం పూర్తి భద్రత కల్పిస్తుందని భరోసా ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment