sidharamaiah
-
'నేమ్‌ప్లేట్‌పై కన్నడ తప్పనిసరి..' బెంగళూరులో భాషా వివాదం
బెంగళూరు: బెంగళూరులో హిందీ వర్సెస్ కన్నడ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. నగరంలో వాణిజ్య దుకాణాలకు ఉండే బోర్డులను కన్నడలోనే ఉంచాలని బెంగళూరు నగర మహాపాలిక సంస్థ ఆదేశాలు జారీ చేసింది. నేమ్ ప్లేట్లపై 60 శాతం కన్నడ పదాలని ఉపయోగించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని బృహత్ బెంగళూరు మహానగర పాలిక చీఫ్ కమిషనర్ తుషార్ గిరి నాథ్ తెలిపారు. కర్ణాటక రక్షణ వేదిక (కెఆర్‌వి) సమక్షంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు మాట్లాడారు. "నగరంలో 1400 కి.మీ మేర ఆర్టీరియల్, సబ్ ఆర్టీరియల్ రోడ్లు ఉన్నాయి. ఈ రోడ్లపై ఉన్న అన్ని వాణిజ్య దుకాణాలను మండలాల వారీగా సర్వే చేసి.. అనంతరం 60 శాతం కన్నడ వాడని దుకాణాలకు నోటీసులు ఇస్తాం. నోటీసు జారీ చేసిన తర్వాత కన్నడ భాషా నేమ్ప్లేట్లను అమలు చేయడానికి ఫిబ్రవరి 28 లోగా సమయం ఇస్తాం. ”అని గిరి నాథ్ చెప్పారు. కొత్త ఆదేశాల తర్వాత కేఆర్‌వి మద్దతుదారుడు దుకాణాదారులను హెచ్చరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'ఇది కర్ణాటక. కన్నడ మాట్లాడే ప్రజలు ఈ రాష్ట్రానికి గర్వకారణం. మీ రాష్ట్రంలో ఇష్టం వచ్చినట్లు చేసుకోండి. మార్వాడీలందరికీ కన్నడ రావాల్సిందే.' అని ఓ మహిళ బెదిరిస్తున్నట్లు ఆ వీడియోలో ఉంది. కర్ణాటకలో నివసించే ప్రజలందరికీ కన్నడ రావాల్సిందేనని సీఎం సిద్ధరామయ్య గత అక్టోబర్‌లో ఇప్పటికే స్పష్టం చేశారు. దీంతో అప్పట్లోనే కన్నడ వర్సెస్ హిందీ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. సిద్ధరామయ్య గతంలోనూ కన్నడ భాషపై ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. బ్యాంకుల్లో ఉద్యోగులకు కన్నడ తప్పకుండా రావాలని ఆదేశించారు. ఇదీ చదవండి: Corona New Variant: ప్రతిసారి డిసెంబర్లోనే వైరస్ వ్యాప్తి.. ఎందుకు? -
ఆ మూడు బ్యాంకుల్లో కోట్ల రూపాయల కుంభకోణం.. సీబీఐ విచారణకు ఆదేశం
కర్ణాటకలోని మూడు సహకార బ్యాంకుల్లో నిబంధనలకు విరుద్ధంగా ఆర్థిక లావాదేవీలు జరిగియని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరోపించారు. త్వరలో ఈ బ్యాంకులపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీఈఐ) విచారణ జరపనున్నట్లు తెలిపారు. అందుకు సీబీఐకు విచారణ చేపట్టేందుకు ఆమోదం లభించినట్లు ముఖ్యమంత్రి తన ఎక్స్ ఖాతాలో తెలిపారు. గురు రాఘవేంద్ర కోఆపరేటివ్ బ్యాంక్, వశిష్ఠ బ్యాంక్, గురు సావరిన్ బ్యాంకుల్లో జరిగిన కుంభకోణాల్లోని బాధ్యులు త్వరలోనే బయటపడతారని తెలిపారు. ‘వేలాది మంది డిపాజిటర్లు ఎన్నో కలలతో తమ కష్టార్జితాన్ని ఈ బ్యాంకుల్లో పొదుపు చేసుకున్నారు. బ్యాంకర్ల మోసగించడంతో వారి భవిష్యత్ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. నేను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా మోసపోయిన డిపాజిటర్లకు న్యాయం చేయాలని పోరాడాను. సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నాను. ఇప్పటికి అది సాకారమైంది' అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇదీ చదవండి: ప్రపంచంలోనే నాసా కంటే ఎక్కువ డేటా ట్రాన్స్ఫర్..! కానీ.. శ్రీ గురు రాఘవేంద్ర కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, వశిష్ఠ క్రెడిట్ సౌహార్ద కో-ఆపరేటివ్ లిమిటెడ్, గురు సార్వబహుమ సౌహార్ద క్రెడిట్ మేనేజ్మెంట్ పై సీబీఐ విచారణ జరపనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఆయా బ్యాంకుల బోర్డు డైరెక్టర్లు, చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లు, సిబ్బంది చేసిన కోట్లాది రూపాయల మోసాలను బయటపెట్టేందుకు చర్యలు ప్రారంభించినట్లు తెలిసింది. -
కర్ణాటకలో కాంగ్రెస్ విజయదుందుభి.. 135 సీట్లతో భారీ మెజార్టీ
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఐదేళ్ల తర్వాత తిరిగి అధికారాన్ని చేజిక్కించుకుంది. మొత్తం 224 స్థానాలకు గానూ మెజార్టీకి 113 సీట్లు అవసరం కాగా.. కాంగ్రెస్ 135 స్థానాలు కైవసం చేసుకుని తిరుగులేని విజయం సాధించింది. హస్తం పార్టీ దెబ్బకు 14 మంది బీజేపీ మంత్రులు పరాభవం చవిచూశారు. ఎన్నికల్లో విజయదుందుభి మోగించడంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. బాణసంచా పేల్చి, మిఠాయిలు పంచి ఆనందం వ్యక్తం చేశాయి. మరోవైపు ఈ ఎన్నికల్లో అధికార బీజేపీ ఘోర పరాభవం చవిచూసింది. ఆ పార్టీ కేవలం 66 స్థానాలకే పరిమితమైంది. కాగా.. కింగ్ మేకర్ అవుతుందని భావించిన జేడీఎస్ 19 స్థానాలతోనే సరిపెట్టుకుంది. ఇతరులు నాలుగు చోట్ల గెలిచారు. ఓటింగ్ శాతం ఎంతంటే.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 43 శాతం ఓట్లు వచ్చాయి. బీజేపీకి 36 శాతం, జేడీఎస్‌కు 13.3 శాతం ఓట్లు పోలయ్యాయి. మిగతా ఏ పార్టీలు అంతగా ప్రభావం చూపలేకపోయాయి. మరోవైపు కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ కసరత్తు మొదలుపెట్టింది. ఆదివారం బెంగళూరులో సీఎల్పీ సమావేశం నిర్వహించనుంది. సీఎం అభర్థిని ఖరారు చేసిన అనంతరం సాయంత్రం వెళ్లి గవర్నర్‌ను కలవనుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజార్టీ ఉందని లేఖ అందించనుంది. కాగా.. కర్ణాటక సీఎం అభ్యర్థి ఎవరనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. రేసులో సీనియర్ లీడర్ సిద్ధ రామయ్య, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఉన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం వీరిలో ఒక్కరిని ఖరారు చేయనుంది. సీఎం ఎవరనే విషయాన్ని సోనియా గాంధీ, రాహుల్ గాంధీలే నిర్ణయిస్తారని ఇద్దరు నేతలు చెబుతున్నారు. కొన్ని గంటల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కలిసొచ్చిన రాహుల్ భారత్ జోడో యాత్ర.. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రభావం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టంగా కన్పించింది. ఆయన యాత్ర సాగిన నియోజకవర్గాల్లో 73 శాతం సీట్లను కాంగ్రెస్ పార్టీనే కైవసం చేసుకుంది. దక్షిణాదిలో వాడిపోయిన కమలం.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో దక్షిణాదిలో అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రాన్ని బీజేపీ కోల్పోయినట్లైంది. కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కమలం పార్టీ ఏ ప్రభుత్వంలోనూ భాగంగా లేదు. కర్ణాటక మినహా మిగతా రాష్ట్రాల్లో ఆ పార్టీ ప్రభావం అంతంతమాత్రంగానే ఉంది. మరోవైపు కర్ణాటక ఫలితాలు ఇచ్చిన జోష్‌తో తెంలగాణలోనూ అధికారంపై కాంగ్రెస్ గురిపెట్టింది. చదవండి: కాంగ్రెస్ విజయానికి కారణమైన 6 మంత్రాలివే.. -
ఆర్సీబీ జట్టుపై సిద్ధరామయ్య ఎమోషనల్ ట్వీట్.. కన్నడిగులు ఫిదా..
బెంగళూరు: ఐపీఎల్లో తమ తొలి మ్యాచ్‌లో ముంబైపై ఆర్సీబీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ అనంతరం కర్ణాటక మాజీ సీఎం, ప్రతిపక్షనేత సిద్ధరామయ్య చేసిన ట్వీట్ కన్నడిగుల మనసులు దోచుకుంది. ఆర్సీబీ తన అభిమాన జట్టు అని, ఈ టీంను చూస్తే తనకు గర్వంగా ఉంటుందని సిద్ధరామయ్య అన్నారు. ఆర్సీబీ జట్టుకు నాలాగే కోట్ల మంది అభిమానులున్నారు. ఈసారి మనం కచ్చితంగా ఐపీఎల్ కప్పు గెలుస్తామని నాకు బలమైన విశ్వాసం ఉంది. ఒక కన్నడిగగా.. నా మద్దతు ఎప్పుడూ ఆర్సీబీకే ఉంటుంది' అని సిద్ధ రామయ్య ట్వీట్ చేశారు. ఈ మ్యాచ్‌ను ఆయన స్టేడియంకు వెళ్లి స్వయంగా వీక్షించి ఆద్యంతం ఎంజాయ్ చేస్తూ కన్పించారు. ఆయనతో పాటు మరో ఇద్దరు కాంగ్రెస్ నేతలు కూడా మ్యాచ్‌ను తిలకించారు. ಕ್ರಿಕೆಟ್ ನನ್ನ ಇಷ್ಟದ ಆಟ, ಆರ್ಸಿಬಿ ನನ್ನ ಹೆಮ್ಮೆಯ ತಂಡ.. ನನ್ನಂತಹ ಕೋಟ್ಯಂತರ ಅಭಿಮಾನಿಗಳ ಹಾರೈಕೆ ಆರ್.ಸಿ.ಬಿ ಹುಡುಗರ ಜೊತೆಗಿದೆ.. ಇಂದಲ್ಲ ನಾಳೆ ನಮ್ಮವರೂ ಕಪ್ ಗೆಲ್ಲುತ್ತಾರೆ ಎಂಬ ವಿಶ್ವಾಸ ನನಗಿದೆ. ಓರ್ವ ಕನ್ನಡಿಗನಾಗಿ ನನ್ನ ಬೆಂಬಲ ಯಾವಾಗಲೂ ನಮ್ಮ ಆರ್ಸಿಬಿಗೆ.@RCBTweets #RCBvMI pic.twitter.com/KgCOrbsNle — Siddaramaiah (@siddaramaiah) April 2, 2023 ఆర్సీబీ జట్టుకు కోట్ల మంది అభిమానులున్నారు. అయితే ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఈ టీం ఐపీఎల్ ట్రోఫీ గెలవలేకపోవడం వారిని నిరుత్సాహపరిచే ఏకైక విషయం. మొత్తం 15 సీజన్లలో మూడు సార్లు ఫైనల్ చేరిన ఆర్సీబీ.. ఒక్కసారి కూడా ట్రోఫీని ముద్దాడలేకపోయింది. 2009, 2011, 2016 సీజన్లలో రన్నరప్‌గా నిలిచి సరిపెట్టుకుంది. చదవండి: కోహ్లి దెబ్బకు ఆర్చర్‌కు చిప్ దొబ్బినట్లుంది! -
కాంగ్రెస్ సీనియర్ లీడర్ ఆరోగ్యం విషమం.. వెంటిలేటర్‌పై చికిత్స
సాక్షి, కోలారు(కర్ణాటక): గత రెండు రెండురోజులుగా ఆనారోగ్యం వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆర్ఎల్ జాలప్పను మాజీ సీఎం సిద్ధరామయ్య ఆదివారం పరామర్శించారు. జాలప్ప ఆరోగ్యం విషమంగా ఉందని, ప్రస్తుతానికి స్థిరంగానే ఉందని సిద్ధరామయ్య అన్నారు. మత మార్పిడి నిషేధ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. జేడీఎస్ ఎప్పటికి బీజేపీకి బి – టీం గానే ఉంటుందని అన్నారు. చదవండి: ప్రభుత్వ ఉద్యోగాల్లో కుల రిజర్వేషన్లు రద్దు చేయాలి -
‘బంగ్లా’ రగడ
శివాజీనగర: విమర్శలు, ప్రతి విమర్శలతో వేడిమీదున్న యడియూరప్ప, సిద్ధరామయ్య మధ్య బంగ్లా మరో వివాదమైంది. అదృష్ట నివాసంగా రాజకీయ రంగంలో గుర్తింపు పొందిన కావేరి బంగ్లా కోసం ముఖ్యమంత్రి బీ.ఎస్.యడ్యూరప్ప, శాసనసభా ప్రతిపక్ష నాయకుడు సిద్ధరామయ్యల మధ్య సంఘర్షణ తారాస్థాయికి చేరింది. నాలుగు రోజుల్లోఇల్లు ఖాళీ చేయకపోతే సదుపాయాలను బంద్ చేయనున్నట్లు అందులో ఉంటున్న సిద్ధరామయ్యను ప్రభుత్వం హెచ్చరించడంతో ఈ రగడ రచ్చకెక్కింది. కావేరి బంగ్లా గేటుకున్న సిద్ధరామయ్య నామ ఫలకాన్ని శనివారం రాత్రి డీపీఏఆర్ సిబ్బంది తొలగించి, నాలుగు రోజుల్లోగా ఇంటిని ఖాళీ చేయాలని అక్కడి సిబ్బందికి స్పష్టంచేశారు. ఒకవేళ నిర్ధారించిన సమయంలోగా ఇల్లు ఖాళీ చేయకపోతే 5 రోజుల తరువాత విద్యుత్, నీటి సరఫరాతో పాటు ప్రభుత్వ సదుపాయాలను స్తంభింపజేయనున్నట్లు నోటీస్‌లో పేర్కొన్నారు. కావేరి నివాసం ఇప్పటికే ముఖ్య మంత్రి బీ.ఎస్.యడ్యూరప్పకు కేటాయించారు. కానీ ఇందులో ఇప్పటికీ సిద్ధరామయ్యే ఉంటున్నారు. నిజానికి ఆయన ప్రతిపక్ష నాయకునికి కేటాయించిన రేస్ కోర్స్ రోడ్డులోని కాటేజ్ రేస్ వ్యూ– 2కు మారాలి. లేనిపక్షంలో చట్టపరంగానే ఖాళీ చేయిస్తామని అధికారులు తాజా నోటీస్‌లో తేల్చిచెప్పడం గమనార్హం. డీపీఏఆర్ సిబ్బంది శనివారం సిద్ధరామయ్య కార్యాలయానికి దీనిపై సమాచారం అందించగా, ఈ వారంలోగా కావేరి నివాసాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం సీఎం యడియూరప్ప నగరంలో డాలర్స్ కాలనీలో ఉన్న సొంత ఇంట్లో కార్యకలాపాలు చేపడుతున్నారు. ప్రతి రోజు రాష్ట్ర వివిధ ప్రాంతాల నుంచి ముఖ్యమంత్రిని కలుసుకోవటానికి వందలాది మంది వస్తుంటారు. ధవళగిరి నివాసంలో అంతమందిని కలవడానికి స్థలం లేదు. ప్రజలు రోడ్ల మీదనే నిలబడుతుంటారు, దీనివల్ల స్థానిక ప్రజలకు ఇబ్బందులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కార్యక్రమాలకు వీలుగా ముఖ్యమంత్రికి కావేరి నివాసాన్ని కేటాయించాలని నిర్ణయించారు. ఇప్పటికే ఇచ్చిన గడువు పూర్తయిందని, ఇంక పొడిగించడం సాధ్యం కాదని సిద్ధరామయ్యకు స్పష్టం చేశారు. అయితే సిద్ధరామయ్య ఎలా స్పందిస్తారోనని ఉత్కంఠ నెలకొంది. -
డీకే శివకుమార్ అరెస్ట్ వెనుక సిద్ధూ హస్తం!
సాక్షి బెంగళూరు: మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీకే శివకుమార్ అరెస్ట్ వ్యవహారంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హస్తం ఉన్నట్లు తనకు అనుమానం ఉందని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నళీన్కుమార్కటీల్ ఆరోపించారు. ఆయన ఆదివారం బాగల్కోటెలో విలేకరులతో మాట్లాడారు. డీకే శివకుమార్ రాజకీయంగా ఎదుగుతున్నారన్న కారణంతో సిద్ధూ రాజకీయంగా కక్ష పెంచుకున్నారని సంచలన వ్యాఖ్యల చేశారు. 2017లో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉందని, సిద్ధూ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే డీకేశి ఇంటిలో ఐటీ దాడులు జరిగాయని గుర్తు చేశారు. ఆ సమయంలో నోరు మెదపని సిద్ధూ ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై నిందలు వేయడం సమంజసం కాదన్నారు. డీకేశి అవినీతి ఆరోపణలపై అరెస్ట్ అయ్యారని, ఇందులో కేంద్రం హస్తం లేదన్నారు. ఈడీ అన్ని ఆధారాలతో డీకేశిని అరెస్టు చ చేసిందన్నారు. వరదల నేపథ్యంలో సీఎం యడియూరప్ప సుడిగాలిలా పర్యటించారన్నారు. ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత చురుకుగా పనిచేయలేదన్నారు. బాధితులకు తాత్కాలికంగా రూ.10వేలు పంపిణీ చేయడం ప్రభుత్వ ఘనత అని అన్నారు. గత ప్రభుత్వం ఇళ్లు నిర్మించుకోవడానికి కేవలం రూ.92 వేలు ఇవ్వగా బీజేపీ ప్రభుత్వం రూ.5 లక్షలు ప్రకటించిందన్నారు. -
మా వెనుకున్నది ఆయనే: రెబల్ ఎమ్మెల్యే
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో కుమారస్వామి ప్రభుత్వం పడిపోవడానికి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రధాన కారణమని వార్తలు వినిపిస్తోన్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ రెబల్స్ వెనుక ఆయన హస్తం ఉందంటూ జేడీఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా వారి ఆ వార్తలను నిజం చేస్తూ.. కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యే శివరాం హెర్బర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తామంతా సిద్దరామయ్య సూచనల మేరకే నడుచుకున్నామంటూ బాంబు పేల్చారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘కర్ణాటకలో నెలకొన్న అనిశ్చితికి సిద్దరామయ్యే కారణం. పార్టీకి దూరంగా ఉండమని కొద్ది రోజుల క్రితం ఆయన మాకు చెప్పారు. కానీ ఇప్పుడు మమ్మల్నే నిందిస్తున్నారు. మేమంతా ఏకతాటిపై ఉన్నాం. అందరం కలిసే నిర్ణయం తీసుకున్నాం. మేం బీజేపీలో చేరుతున్నామనేది అబద్ధం’ అని తెలిపారు. శివరాం వ్యాఖ్యలపై కన్నడ రాజకీయాల్లో పెను దుమారం చేలరేగుతోంది. ఈ నేపథ్యంలో హెర్బర్ వ్యాఖ్యలపై సిద్దరామయ్య స్పందించారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగించడానికే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారన్నారని. ఇంకోసారి ఇలాంటి ఆరోపణలు చేస్తే వారికి గట్టిగా బుద్ధి చెప్తానని ట్వీట్ చేశారు. విశ్వాస పరీక్షలో ప్రభుత్వాన్ని కాపాడటానికి తనవంతు కృషి చేశానని సిద్దూ చెప్పుకొచ్చారు. కాగా కర్ణాటక సంక్షోభం అనంతరం స్థానిక నేతలపై రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రభుత్వ పతనం వెనుక సిద్దరామయ్య ఉన్నారన్న వార్తలు కాంగ్రెస్ అధిష్టానం దృషికి కూడా వెళ్లాయి. దీంతో ఆయనపై పార్టీ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: ప్రభుత్వ పతనం వెనుక కాంగ్రెస్! ఇదిలావుండగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా శుక్రవారం సాయంత్రం యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్‌తో భేటీ అనంతరం ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు తెలపకుండా ఉండేందుకు మరోసారి రెబల్స్‌ను బుజ్జగింజే ప్రయత్నంలో పడ్డారు జేడీఎస్, కాంగ్రెస్ నేతలు. మరోవైపు వారి రాజీనామాలపై అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. దీంతో కర్ణాటక రాజకీయాల ఉత్కంఠ మరికొన్ని రోజులు సాగనున్నట్లు తెలుస్తోంది. -
కర్ణాటకం: పతనం వెనుక కాంగ్రెస్!
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలడానికి కారణం ఎవరు. అసెంబ్లీ ఎన్నికల్లో అతి తక్కువ స్థానాలు గెలుకుచుకున్న జేడీఎస్‌కు సీఎం పదవి దక్కడంతో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్దరామయ్య ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెరవెనుక చక్రం తిప్పారా?. అంటూ కన్నడ వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. మంగళవారం జరిగిన విశ్వాసపరీక్షలో కుమారస్వామి ప్రభుత్వం సభ విశ్వాసాన్ని కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో ఆయన సీఎం పదవికి రాజీనామా చేయగా.. నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప సిద్ధమయ్యారు. అయితే ఈ విషయంలో కాంగ్రెస్ నేతల తీరుపై రాహుల్ గాంధీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పార్టీలో సీనియర్ నాయకులు ఉండి బీజేపీ వ్యూహాలకు చెక్ పెట్టలేకపోయారంటూ రాష్ట్ర నేతలపై అసహనంగా ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా సిద్దరామయ్యపై వ్యవహారంపై రాహుల్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, పతానానికి కారణం ఆయనే అంటూ మండిపడుతున్నారని తెలిసింది. దీనికి కారణం కూడా లేకపోలేదు. సీఎంగా కుమారస్వామి పదవీ బాధ్యతలు చేపట్టనప్పటి నుంచీ ప్రభుత్వంపై సిద్దరామయ్య తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. గత ప్రభుత్వంలో కాంగ్రెస్‌కు అన్నీ తానై నడిపించిన తనను కాదని, అతి తక్కువ స్థానాలు గెలుచుకున్న జేడీఎస్‌కు, అందులోనూ తనకు గిట్టని కుమారస్వామికి సీఎం పదవి కట్టబెట్టడంపై రామయ్య గుర్రుగా ఉన్నారంటూ పెద్దస్థాయిలో చర్చ కూడా జరిగింది. అంతేకాదు సంకీర్ణ ప్రభుత్వం ఎక్కువ రోజులు నిలబడదని, రానున్న ఏడాదిలోపు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద మార్పులు చోటుచేసుకుంటాయని గతంలో ఆయన వ్యాఖ్యానించిన సందర్భాలెన్నో. మరోవైపు కుమారస్వామితో పాటు, మాజీ ప్రధాని దేవెగౌడ సైతం సిద్దరామయ్య తీరుపై అనేకసార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు సిద్దూ కుట్రపన్నుతున్నారని, తమకు వ్యతిరేకంగా వ్యూహాలు రచిస్తున్నారంటూ బహిరంగ ప్రకటనలు కూడా చేశారు. ప్రభుత్వం ఏర్పడిన తొలినాటి నుంచి వీరి మధ్య సరైన అవగహన లేనట్లు బయటపడింది. దీనికి తోడు ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఇరు పార్టీలు ఘోర పరాజయం పాలవ్వడం సంకీర్ణంలో విభేదాలు మరింత పెరిగాయి. జేడీఎస్-కాంగ్రెస్ కూటమి రాష్ట్ర వ్యాప్తంగా 28 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయగా.. ఇరు పార్టీలు కేవలం ఒక్కో స్థానానికి మాత్రమే పరిమితమయ్యాయి. దేవెగౌడ సైతం ఓటమి చవిచూడక తప్పలేదు. ఫలితాల అనంతరం సిద్దరామయ్య మాట్లాడుతూ.. జేడీఎస్‌తో పొత్తు కారణంగా తాము ఎంతో నష్టపోయామని ఏకంగా మీడియా సమావేశంలోనే విమర్శించారు. దేవెగౌడ, కుమారస్వామి కాంగ్రెస్ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేసారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలూ చేశారు. దీంతో కన్నడ పంచాయతీ కాంగ్రెస్ పెద్దల దగ్గరకు వెళ్లడంతో సిద్దరామయ్య అధిష్టానం ఆగ్రహానికి కూడా గురయ్యారు. ఇదిలావుండగా తాజాగా ప్రభుత్వం పడిపోవడానికి కూడా కారణం ఆయనే అని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. ప్రభుత్వంపై తిరుగుబాటుకు దిగిన ఎమ్మెల్యేలు అత్యధిక మంది సిద్దరామయ్య వర్గానికి చెందినవారే ఉన్నారు. రెబల్స్ వెనుక సిద్దూ హస్తం ఉందంటూ జేడీఎస్ మొదటి నుంచి చెబుతూనే ఉంది. అయినా కూడా కాంగ్రెస్ పెద్దలు పట్టించుకోలేదని ఆ పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇరుపార్టీల మధ్య ఉన్న విభేదాలను ప్రతిపక్ష బీజేపీ ఆసరాగా చేసుకుని రెబల్స్‌ను తమపైపు తిప్పుకున్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చివరికి ఉన్న ప్రభుత్వం ఊడిపోయి.. బీజేపీ ఖాతాలోకి మరో రాష్ట్రం చేరబోతోంది. -
హిందీని రుద్దితే ఊరుకోం : సిద్ధరామయ్య
బెంగళూర్ : హిందీయేతర రాష్ట్రాల్లో హిందీని తప్పనిసరిగా బోధించాలన్న ప్రతిపాదనపై కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏదైనా భాషను నేర్చుకోవడం విద్యార్ధుల ఎంపిక అని, దాన్ని బలవంతంగా రుద్దకూడదని ఆయన హితవు పలికారు. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన మన సమాజంలో శాంతియుత సహజీవనం అవసరమని, బలవంతంగా ఏమైనా చేయాలని చూడటం సమాజ నిబంధనలకు విరుద్ధమని సిద్ధరామయ్య వరుస ట్వీట్లలో పేర్కొన్నారు. కన్నడ ప్రజలుగా తాము ఇతర భాషలను నేర్చుకోవడం స్వచ్ఛందంగా జరగాలని, బలవంతంగా తమపై ఏ భాషనూ రుద్దడం తగదని హితవు పలికారు. ప్రాంతీయ గుర్తింపు కలిగిన రాష్ట్రాలపై ఇతర భాషలను రుద్దడం పాశవిక దాడేనని ఆయన అభివర్ణించారు. మరోవైపు త్రిబాష ఫార్ములా పేరుతో ఓ బాషను ఇతర రాష్ట్రాలపై రుద్దరాదని కర్నాటక సీఎం హెచ్డీ కుమారస్వామి కేంద్రాన్ని ఆక్షేపించారు. -
సంకీర్ణ సర్కారులో ఏదో జరుగుతోంది?
సిద్ధరామయ్య సక్రమంగా పరిపాలించి ఉంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎందుకు అంత తక్కువ సీట్లు వచ్చాయి? అని జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు విశ్వనాథ్ విమర్శించడం, దానికి సిద్ధు తీవ్రంగా స్పందించడంతో సంకీర్ణ సర్కారులో ఏదో జరుగుతోందని చాటిచెప్పింది. ఇరు పార్టీల నేతలు కూడా విమర్శలకు పదునుపెట్టారు. సర్కారును ఏర్పాటు చేద్దామని కాంగ్రెస్సే తమ తలుపు తట్టిందని జేడీఎస్ నేతలు ఎద్దేవా చేశారు. రానున్న రోజుల్లో ఇది మరింత తీవ్రమైనా ఆశ్చర్యం లేదు. సాక్షి, బెంగళూరు: కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణం విభేదాలతో కుతకుతలాడుతోంది. సోమవారం ఉదయం సంకీర్ణ సమన్వయ సమితి అధ్యక్షుడు సిద్ధరామయ్య చేసిన ట్వీట్ కలకలం సృష్టించింది. జేడీఎస్ నాయకులు తనను టార్గెట్ చేశారని ఆయన ఆరోపించారు. ‘మొదట జీటీ దేవెగౌడ, ప్రస్తుతం హెచ్.విశ్వనాథ్, రానున్న రోజుల్లో ఇంకెవరు విమర్శిస్తారో తెలియదు’ అని సిద్ధరామయ్య ట్వీట్ చేశారు. దీంతో కాంగ్రెస్ – జేడీఎస్ నాయకుల మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రమైంది. జేడీఎస్ అధ్యక్షుడు హెచ్.విశ్వనాథ్ వివాదాస్పద వ్యాఖ్యలకు ముందు వరుసలో ఉంటారు, ఆయనకు వివరణ ఇచ్చేందుకు సంకీర్ణ ధర్మం అడ్డు వస్తోందని సిద్ధరామయ్య తెలిపారు. అయితే సమన్వయ సమితి సమావేశంలో సమాధానం చెబుతానని పేర్కొన్నారు. దీనిపై జేడీఎస్ నాయకుల నుంచి ప్రత్యారోపణలు వచ్చాయి. అధికారం కోసం జేడీఎస్ నేతలు ఎవ్వరూ కాంగ్రెస్ వద్దకు వెళ్లలేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పెద్దలే స్వచ్ఛందంగా తమకు మద్దతు కావాలని కోరినట్లు తెలిపారు. అన్నింటా సిద్ధూ విఫలం: విశ్వనాథ్ సిద్ధరామయ్య ట్వీట్‌పై జేడీఎస్ అధ్యక్షుడు హెచ్.విశ్వనాథ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి విమర్శించారు. సీఎల్పీ నేత సిద్ధరామయ్య ఐదేళ్లుగా సీఎంగా పని చేసినప్పటికీ ఏ ఒక్క సరైన నిర్ణయం తీసుకోలేకపోయారన్నారు. ఐదేళ్లు మంచి పాలన అందించి ఉంటే కాంగ్రెస్ 80 సీట్లకే ఎందుకు పరిమితం అవుతుందని ప్రశ్నించారు. తాను గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసినట్లు గుర్తు చేశారు. తనకు 30 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పారు. సిద్ధరామయ్య చెప్పినట్లు తాను నీతిమాలిన రాజకీయాలకు పాల్పడే రకం కాదని అన్నారు. కాగా, సిద్ధరామయ్య గురించి తాను ఏకవచనంతో సంబోధించలేదని మంత్రి జీటీ దేవెగౌడ అన్నారు. సిద్ధరామయ్య మరోసారి సీఎం కావాలని కోరుకునే వారి జాబితాలో తాను కూడా ఉన్నట్లు తెలిపారు. బీజేపీకి లాభం: ఈశ్వరప్ప కాంగ్రెస్ – జేడీఎస్ నేతల మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధంతో తమకు లాభమని బీజేపీ నేత కేఎస్ ఈశ్వరప్ప అన్నారు. సిద్దరామయ్య ఈ జన్మలో సీఎం కాలేరని, అధికారంలోకి వస్తామనే భ్రమల్లో కాంగ్రెస్ నాయకులు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. -
కర్ణాటక హైడ్రామా : రిసార్ట్స్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
-
కర్ణాటక హైడ్రామా : రిసార్ట్స్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
సాక్షి, బెంగళూర్ : కర్ణాటక రాజకీయ పరిణామాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కాంగ్రెస్ శుక్రవారం నిర్వహించిన శాసనసభాపక్ష సమావేశానికి నలుగురు ఎమ్మల్యేలు గైర్హాజరు కావడంతో ఎమ్మెల్యేలందరినీ బెంగళూర్‌లోని రిసార్ట్స్‌కు తరలించారు. సీఎల్పీ భేటీకి పార్టీ ఎమ్మెల్యేలు రమేష్ జర్కోలి, బీ నాగేంద్ర, మహేష్ కే, ఉమేష్ జాదవ్‌లు హాజరు కాలేదు. తాను అనారోగ్య కారణాలతో సమావేశానికి హాజరు కాలేనని జాదవ్ పార్టీ నేత సిద్ధరామయ్యకు లేఖ రాశారు. సీఎల్పీ భేటీకి 80 మంది ఎమ్మెల్యేలకు గాను 76 మంది హాజరయ్యారని సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య వెల్లడించారు. గైర్హాజరైన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసి హైకమాండ్ సూచలనకు అనుగుణంగా చర్యలు చేపడతామని చెప్పారు. సీఎల్పీ భేటీ అనంతరం సమావేశానికి హాజరైన 76 మందిని ప్రత్యేక బస్సుల్లో నగర శివార్లలోని ఈగల్టన్ గోల్ఫ్ రిసార్ట్స్‌కు తరలించారు. కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ సర్కార్‌ను అస్ధిరపరిచేందుకు బీజేపీ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తోందని సిద్ధరామయ్య ఆరోపించారు. -
గవర్నర్‌తో జేడీఎస్-కాంగ్రెస్ బృందం భేటీ
సాక్షి, బెగళూరు: కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నామని జేడీఎస్-కాంగ్రెస్‌లు గవర్నర్ చెప్పాయి. కుమారస్వామి నేతృత్వంలో జేడీఎస్-కాంగ్రెస్ సభ్యుల బృందం మంగళవారం సాయంత్రం గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలాను మర్యాదపూర్వకంగా కలిసింది. భేటీ అనంతరం రాజ్‌భవన్ వద్ద నేతలు మీడియాతో మాట్లాడారు. ‘‘జేడీఎస్‌కు కాంగ్రెస్ మద్దతు ఇస్తున్న విషయాన్ని గవర్నర్‌కు స్పష్టం చేశామని, సంబంధిత తీర్మానాలు కూడా సమర్పించామని కర్ణాటక పీసీసీ చీఫ్ పరమేశ్వర చెప్పారు. ‘కుమారస్వామి ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి కాంగ్రెస్ మద్దతు ఇస్తున్నది. ఆయనను(స్వామిని) ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్‌ను కోరాం. ఏ విషయమైంది రెండు రోజుల్లో చెబుతానని గవర్నర్ అన్నారు’’ అని సిద్దరామయ్య తెలిపారు. రాజ్‌భవన్‌కు వెళ్లిన నేతల్లో మల్లికార్జున ఖర్గే, గులాంనబీ ఆజాద్, అశోక్ గెహ్లాట్ తదితరులున్నారు. -
‘యెడ్డీకి మతి భ్రమించింది’
సాక్షి, బెంగళూర్ : కర్ణాటక బీజేపీ సీఎం అభ్యర్థి బీఎస్ యడ్యూరప్పకు మతి భ్రమించిందని సీఎం సిద్ధరామయ్య అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 120 స్ధానాలకు పైగా గెలుపొందుతుందని ధీమా వ్యక్తం చేశారు. మే 17న సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తానన్న యడ్యూరప్ప వ్యాఖ్యలపై ఆయన స్పందనను కోరగా సిద్ధరామయ్య ఈ వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక ప్రజలు ఇవాళ చరిత్ర సృష్టించేందుకు క్యూల్లో నిలబడి ఓట్లు వేస్తున్నారని వ్యాఖ్యానించారు. దేశానికి సుపరిపాలనతో కూడిన పురోగామి రాజకీయాలను చాటిచెపుతున్నారని అంటూ సిద్ధరామయ్య ట్వీట్ చేశారు. తమ పార్టీకి అండగా నిలిచిన కర్ణాటక ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. Today People of Karnataka are standing in queues to create history & show the nation the way to liberal, progressive, peaceful & compassionate politics & governance. I thank them for their support & wish them well. https://t.co/XC662rENDI — Siddaramaiah (@siddaramaiah) 12 May 2018 మరోవైపు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధిస్తుందని, ఈనెల17న తాను సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తానని యడ్యూరప్ప ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీగా తలపడిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈనెల 15న వెలువడనున్నాయి. -
సిద్ధూ కోటలో ఐటీ దాడులు
సాక్షి, బెంగళూర్ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ప్రధాన రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం పతాకస్థాయికి చేరింది. తాజాగా సీఎం సిద్ధరామయ్య నియోజకవర్గంలో ఐటీ దాడులు కలకలం రేపాయి. సిద్ధరామయ్య బరిలో నిలిచిన బాదామి నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతకు చెందిన ఓ రిసార్ట్‌పై ఐటీ దాడులు జరిగాయి. రాజకీయ కక్ష సాధించేందుకే ఈ దాడులు జరిగాయని, వీటికి ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా బాధ్యత వహించాలని సిద్ధరామయ్య పేర్కొన్నారు. మరో నాలుగు రోజుల్లో పోలింగ్ జరగనున్న క్రమంలో ఐటీ దాడులు జరగడం పట్ల విమర్శలు వెల్లువెత్తడంపై బీజేపీ స్పందించింది. దాడులు జరిగిన సమయాన్ని అనుమానించడం తగదని, ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలు జరుగుతున్న నేపథ్యంలో చీకటి ఒప్పందాలను రట్టు చేయాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ ప్రతినిధి సంబిట్ పాత్రా అన్నారు. అక్రమ ఒప్పందాలను నియంత్రించాల్సిన బాధ్యత ఈసీపై ఉందన్నారు. మరోవైపు కర్ణాటకలో ప్రచారానికి తుదిగడువు సమీపిస్తుండటంతో అగ్రనేతలు పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలకు దిగుతున్నారు. కాంగ్రెస్ తరపున సోనియా గాంధీ ప్రచార బరిలోకి దిగడంతో కాంగ్రెస్, బీజేపీల మధ్యం మాటల యుద్ధం ముదిరింది. మే 12న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, 15న ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు. -
బీజేపీపై సిద్ధూ ట్వీట్ వార్
సాక్షి, బెంగళూర్ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల మధ్య పదునైన విమర్శలు కాకరేపుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీలు పరస్పరం మాటల తూటాలు పేల్చుతున్నాయి. ఎన్నికలకు ఇక ఎనిమిది రోజుల వ్యవధే ఉండటంతో బీజేపీపై నిప్పులుచెరుగుతూ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వరుస ట్వీట్లు చేశారు. అధికారం కోసం బీజేపీ కుయుక్తులకు పాల్పడుతోందని విమర్శించారు. కొన్ని ఓట్ల కోసం సీఎం అభ్యర్థిగా యడ్యూరప్పను ప్రకటించి ఆ తర్వాత పక్కనపెట్టారని, హంగ్ అసెంబ్లీ భయంతో రెడ్డి సోదరులను రంగంలో దింపారని ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థుల పైకి ఐటీ అధికారులను ఉసిగొల్పుతున్నారని, దేవెగౌడను ప్రశంసలతో ముంచెత్తుతూ జేడీఎస్‌ను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని సిద్ధరామయ్య బీజేపీపై ధ్వజమెత్తారు. మతప్రాతిపదికన ఓట్లను చీల్చేందుకు యూపీ సీఎంను రప్పించారని ఆరోపించారు. మరోవైపు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. కర్ణాటకలో పాలక కాంగ్రెస్ విజయాలపై 15 నిమిషాల పాటు పేపర్ చూడకుండా ప్రసంగించాలని రాహుల్‌కు మోదీ సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. -
‘కన్నడిగులను సిద్దరామయ్య అవమానించారు’
సాక్షి, బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు సీఎం సిద్దరామయ్యకు అర్థం కాలేదంటూ జనతాదళ్ (సెక్యూలర్) అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ మండిపడ్డారు. ఓ దక్షిణాది వ్యక్తి సీఎం అయ్యారని ప్రధాని ప్రశంసించారని, అంత మాత్రాన బీజేపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కన్నడ వ్యక్తి ప్రధాని కావడం దక్షిణాది వారికి ఎంతో గౌరవమంటూ దేవెగౌడను ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ ప్రశంసించిన విషయం తెలిసిందే. వంశపారం పర్యంగా అధికారం కట్టబెట్టే యత్నం చేస్తూ తాను (దేవెగౌడ) రాజకీయాలను నాశనం చేస్తున్నారంటూ సిద్దరామయ్య విమర్శలు చేసి జాతీయ స్థాయిలో కన్నడిగుల పరువు, మర్యాదలు మంటకలిపారంటూ ధ్వజమెత్తారు. సిద్దరామయ్య కూమారుడు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆయన అంత తీవ్ర వ్యాఖ్యలు ఎలా చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రాహుల్ గాంధీ మాజీ ప్రధాని దేవెగౌడపై వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదంగా కనిపిస్తోందని, దేవెగౌడను తాను గౌరవిస్తానని మంగళవారం ఓ ర్యాలీలో మోదీ తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యల వెనుక, కాంగ్రెస్‌పై మోదీ విమర్శలకు జేడీఎస్ అధ్యక్షుడు దేవెగౌడనే కారణమని భావిస్తోన్న సీఎం సిద్దరామయ్య తీవ్ర వ్యాఖ్యలు చేయగా దుమారాం రేగుతోంది. -
మోదీకి సిద్ధూ సవాల్
సాక్షి, న్యూఢిల్లీ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సవాళ్లు, ప్రతిసవాళ్లు పతాక స్థాయికి చేరాయి. కర్ణాటకలో పాలక కాంగ్రెస్ సాధించిన విజయాలపై 15 నిమిషాల పాటు పేపర్ చూడకుండా మాట్లాడాలని ప్రధాని మోదీ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీకి సవాల్ విసరగా తాజాగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రధాని మోదీకి సవాల్ విసిరారు. గతంలో కర్ణాటకలో యడ్యూరప్ప నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం గురించి 15 నిమిషాలు ప్రసంగించాలని మోదీకి సిద్ధరామయ్య సవాల్ విసిరారు. తమ పార్టీ చీఫ్‌కు ప్రధాని మోదీ విసిరిన సవాల్‌పై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సహా ఆ పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తంచేశారు. విపక్షాలు లేవనెత్తిన అంశాలపై బదులిచ్చేందుకు ప్రధాని వద్ద ఎలాంటి సమాధానాలు లేవని ఆయన వ్యాఖ్యలను బట్టి అర్ధం అవుతోందని కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది. వాస్తవాలను వక్రీకరించకుండా ప్రధాని కేవలం 15 సెకన్లు మాట్లాడాలని డిమాండ్ చేసింది. నీరవ్ మోదీ, జై షా, రాఫెల్ డీల్, పీయూష్ గోయల్ అవినీతి ఇలా ఏ అంశంపైనా ప్రధాని వద్ద సమాధానాలు లేవని కాంగ్రెస్ ప్రతినిధి సుస్మితా దేవ్ అన్నారు. మరోవైపు ప్రధాని మోదీ సవాల్‌ను స్వీకరించాలని జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్ధుల్లా రాహుల్‌కు సూచించారు. అప్పుడు లైంగిక దాడులపై నోరు మెదపాలని తాము ప్రధానిని కోరతామని ఆయన ట్వీట్ చేశారు. -
‘యోగి ప్రచారం చేస్తే బీజేపీ గల్లంతే’
సాక్షి, బెంగళూర్ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ప్రచారం చేస్తే బీజేపీపై ప్రతికూల ప్రభావం పడుతుందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. ‘ఆదిత్యానాథ్ ఇక్కడికి వస్తే అది బీజేపీకి మైనస్ పాయింటే అవుతుంది..ఆయన యూపీకి ఏం చేశారు..ఏడాది పాలనలో దారుణంగా విఫలమైన యోగి కర్ణాటకలో ఏం సాధిస్తార’ని నిలదీశారు. యోగి సొంత నియోజకవర్గంలోనే బీజేపీ ఓటమి పాలైందన్నారు. యోగి ఆదిత్యానాథ్ కర్ణాటకలో దాదాపు 35కి పైగా ర్యాలీలు, రోడ్‌షోలలో పాల్గొననున్నారు. కర్ణాటకలోని కోస్తా ప్రాంతంలో ఆదిత్యానాథ్‌కు చెందిన వర్గీయులు అధికంగా ఉండటంతో ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ను ఓడించేందుకు ఆయన ప్రచారం ఉపకరిస్తుందని కర్ణాటక బీజేపీ నేతలు భావిస్తున్నారు. మరోవైపు బీజేపీ ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌లను నమ్ముకుందని, సీఎం అభ్యర్థి యడ్యూరప్ప కేవలం డమ్మీలేనని సిద్ధరామయ్య వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కర్ణాటకలో నేతలు కరువైన బీజేపీ ఉత్తరాది నేతలను దిగుమతి చేసుకుంటోందని ఆయన దుయ్యబట్టారు. -
‘దిగుమతి నేతలే దిక్కయ్యారు’
సాక్షి, బెంగళూర్ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌లను బీజేపీ ఉత్తరాది నుంచి దిగుమతి చేసుకుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. కర్ణాటకలో బీజేపీకి నాయకులే లేరని ఆయన ఎద్దేవా చేశారు. బీజేపీ సీఎం అభ్యర్థి బీఎస్ యడ్యూరప్ప కేవలం డమ్మీ మాత్రమేనని వ్యాఖ్యానించారు. ఉత్తరాది నుంచి ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌లను ప్రచార పర్వంలో దింపడం ద్వారా రాష్ట్రంలో నాయకులు లేరని బీజేపీ అంగీకరించిందని సిద్ధరామయ్య ట్వీట్ చేశారు. ప్రధాని వస్తూ పోతుంటారని, రాష్ట్రంలో మాత్రం తనకు, యడ్యూరప్పకు మధ్య యుద్ధం నడుస్తోందని అన్నారు. మే 12న జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందో కమలనాథులకూ తెలిసిపోయిందని సిద్దరామయ్య వ్యాఖ్యానించారు. అయితే సిద్ధూ వ్యాఖ్యలకు బీజేపీ దీటుగా బదులిచ్చింది. ఉత్తరాది, దక్షిణాది అంటూ విభజన రేఖలు గీయడం సరికాదని హితవు పలికింది. పార్టీ భాగస్వాములే తిరస్కరిస్తుండటంతో సిద్దరామయ్య నైరాశ్యంలో ఉన్నారని వ్యాఖ్యానించింది. ప్రధాని మోదీకి దేశవ్యాప్తంగా ఎంతో ప్రతిష్ట ఉందని పేర్కొంది. -
రైతులను కాదని కార్పొరేట్లకు..
సాక్షి, బెంగళూర్ : రైతు రుణ మాఫీపై ప్రధాని నరేంద్ర మోదీ, కర్ణాటక బీజేపీ చీఫ్ బీఎస్ యడ్యూరప్పలను టార్గెట్ చేస్తూ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య విమర్శలు గుప్పించారు. మోదీ సర్కార్ వ్యవసాయ రుణాలను మాఫీ చేయకపోగా, ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ 2.7 లక్షల కోట్ల విలువైన కార్పొరేట్ల రుణాలను రద్దు చేశాయని అన్నారు. రాష్ట్రంలో 22.5 లక్షల మంది రైతుల రుణాలను తమ ప్రభుత్వం మాఫీ చేస్తే కేంద్ర మంత్రులు ఇక్కడికొచ్చి అవాకులు చెవాకులు పేలుతున్నారని విమర్శించారు. మోదీ సర్కార్ రైతు రుణమాఫీ గురించి ఏమీ మాట్లాడటం లేదని, రైతు రుణాల మాఫీకి తమవద్ద నోట్లు ముద్రించే యంత్రం లేదని బీజేపీ నేత యడ్యూరప్ప వ్యాఖ్యానించడం ఆక్షేపణీయమన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రం రూ లక్షల కోట్ల కార్పొరేట్ రుణాలను మాఫీ చేస్తున్నాయని లక్షలాది రైతులను పక్కనపెట్టిన మోదీ ప్రభుత్వం కొద్ది మంది కార్పొరేట్లకు అనుకూలంగా ఎందుకు వ్యవహరిస్తోందని సిద్ధరామయ్య నిలదీశారు. -
కన్నడ బరిలో అగ్ర నేతల కుమారుల ఢీ
సాక్షి, బెంగళూర్ : పాలక కాంగ్రెస్‌కు, బీజేపీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్కంఠ పోరు నెలకొంది. వరుణ అసెంబ్లీ నియోజకవర్గంలో రసవత్తర పోటీ నెలకొంటుందనే వార్త మరింత ఉత్కంఠ రేపుతోంది. ఈ నియోజకవర్గం నుంచి సీఎం సిద్ధరామయ్య కుమారుడు డాక్టర్ యతీంద్ర, మాజీ సీఎం, బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్ప కుమారుడు బీవై విజయేంద్రతో తలపడతారని భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఈ నియోజకవర్గం నుంచి యతీంద్ర బరిలో ఉంటారని ప్రకటించగా, బీజేపీ ఇంకా విజయేంద్ర అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయలేదు. సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర వైద్య వృత్తిలో ఉంటూ 2013 కర్ణాటక ఎన్నికల్లో చురుకుగా వ్యవహరించారు. వరుణ నియోజకవర్గం నుంచి యడ్యూరప్ప కుమారుడు బరిలో ఉంటారన్న వార్తలపై యతీంద్ర స్పందించారు. ప్రజాస్వామ్యంలో అంతిమంగా ప్రజలే విజేత ఎవరన్నది నిర్ణయిస్తారని వ్యాఖ్యానించారు. ఈ వారంలోనే విజయేంద్ర మైసూరు నుంచి వరుణ నియోజకవర్గంలో తన పర్యటనను చేపడతారని భావిస్తున్నారు. 2016లో తన పెద్ద సోదరుడి మరణానంతరం రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించాలని తాను నిర్ణయించుకున్నానని విజయేంద్ర చెప్పారు. ఇరు పార్టీల అగ్రనేతల కుమారులు తలపడుతున్న వరుణ నియోజకవర్గంపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. -
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు : ఈ రెండే కీలకం..
సాక్షి, బెంగళూర్ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో లింగాయత్‌లు, దళితుల అంశాలు అనూహ్యంగా తెరపైకి వచ్చాయి. మే 12న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు ప్రధాన వర్గాలకు సంబంధించిన అంశాలు పెనుప్రభావం చూపనున్నాయి. లింగాయత్‌లకు మైనారిటీ హోదాను మత నేతలు ఆమోదించరని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యలతో పాటు ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టంపై సుప్రీం తీర్పు నేపథ్యంలో దళిత సంఘాల ఆందోళన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయని భావిస్తున్నారు. ఈ రెండు అంశాలపై తాజా పరిణామాలతో దళితులు, లింగాయత్‌ల మద్దతు కాంగ్రెస్‌కు లభిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తుండగా..వీటిపై ప్రజలకు ఎవరు దీటుగా వివరించగలరో వారికి అనుకూలంగా ఆయా వర్గాల మద్దతు అందివస్తుందని మరికొందరు సామాజిక విశ్లేషకులు లెక్కలు కడుతున్నారు. లింగాయత్‌లలో ఉన్న 99 ఉప కులాలతో కూడిన వారంతా నూతన మతంగా ఆవిర్భవించడానికి బీజేపీ మద్దతు ఇవ్వదని వీరశైవ లింగాయత్ మఠాలకు చెందిన 100 మందికి పైగా మత నేతలతో ఇటీవల సమావేశమైన సందర్భంగా అమిత్ షా స్పష్టం చేశారు. లింగాయత్‌లకు మైనారిటీ హోదాను ఎవరు కోరారని ఆయన ప్రశ్నించారు. అయితే బీజేపీకి మద్దతు ఇస్తూ లింగాయత్‌లను ప్రత్యేక మతంగా పరిగణించాలని కోరేవారంతా ఇప్పుడు కాంగ్రెస్ వైపు దృష్టిసారిస్తారని ప్రముఖ సామాజిక విశ్లేషకులు, రచయిత చంద్రశేఖర్ పాటిల్ పేర్కొన్నారు. అయితే లింగాయత్‌ల మద్దతు తమకే ఉంటుందని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. లింగాయత్‌లకు మైనారిటీ హోదా కట్టబెడుతూ సీఎం సిద్ధరామయ్య తీసుకున్న నిర్ణయం రాజకీయ ప్రయోజనాల కోసమేనని ఆరోపిస్తోంది. కర్ణాటక సీఎం అభ్యర్ధిగా లింగాయత్ వర్గానికి చెందిన బీఎస్ యడ్యూరప్పను బీజేపీ ప్రకటించడంతో వారి మద్దతు తమ పార్టీకే ఉంటుందని బీజేపీ ఆశలు పెట్టుకుంది. మరోవైపు ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంపై సుప్రీం కోర్టు తాజా ఉత్తర్వులపై దళిత సంఘాలు దేశవ్యాప్తంగా నిరసనలతో హోరెత్తిస్తున్నాయి. సుప్రీం ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్ధానం దిగిరాకపోవడంపై దళిత సంఘాల ఆగ్రహం నేపథ్యంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పరిణామం బీజేపీకి ప్రతికూలంగా మారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
కేంద్రం నిధులపై సిద్ధూ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, బెంగళూర్ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం తీవ్రస్ధాయికి చేరుకుంది. 14వ ఆర్థిక సంఘం ద్వారా రాష్ట్రానికి కేంద్ర నిధులపై బీజేపీ చీఫ్ అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు కర్ణాటక సీఎం, సీనియర్ కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య వరుస ట్వీట్లలో దీటుగా బదులిచ్చారు. కేంద్రం నుంచి నిధులను పొందే హక్కు రాష్ట్రాలకు ఉందని, ఇది యూపీఏ లేదా ఎన్డీఏ బహుమతి కాదని, 1950 నుంచి ఈ ఒరవడి కొనసాగుతోందని సిద్ధరామయ్య బదులిచ్చారు. అమిత్ షా వ్యాఖ్యలు ఆయన అజ్ఞానాన్ని ప్రతిబింబిస్తున్నాయని చెప్పుకొచ్చారు. తాను 5 బడ్జెట్లు ప్రవేశపెట్టానని.. వీటికి ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లు, సొంత వనరులు, అప్పులు ద్వారా నిధులు సమీకరించామని చెప్పారు. ఈ నిధులు ఏమయ్యాయన్న అమిత్ షా ప్రశ్నకూ సిద్ధూ వివరణ ఇచ్చారు. నీటిపారుదల, విద్యా, వైద్యం, రుణ మాఫీ, పంటల బీమా వంటి పలు ప్రజోపయోగ పథకాలపై వీటిని వెచ్చించామని చెప్పారు. బడ్జెట్లను శాసనసభ, మండలిలో ప్రవేశపెట్టి విపక్ష బీజేపీ సభ్యుల ఆమోదం కూడా పొందామని అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకు వచ్చిందని అమిత్ షా తీరును సీఎం ఆక్షేపించారు. కాగా, మే 12న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.