‘యెడ్డీకి మతి భ్రమించింది’ | Karnataka Assembly Elections 2018 : Siddaramaiah Says Yeddyurappa Is Mentally Disturbed  | Sakshi
Sakshi News home page

‘యెడ్డీకి మతి భ్రమించింది’

Published Sat, May 12 2018 1:39 PM | Last Updated on Sat, May 12 2018 4:10 PM

Karnataka Assembly Elections 2018 : Siddaramaiah Says Yeddyurappa Is Mentally Disturbed  - Sakshi

కర్ణాటక సెఎం సిద్ధరామయ్య, బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్ప (ఫైల్‌పోటో)

సాక్షి, బెంగళూర్‌ : కర్ణాటక బీజేపీ సీఎం అభ్యర్థి బీఎస్‌ యడ్యూరప్పకు మతి భ్రమించిందని సీఎం సిద్ధరామయ్య అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 120 స్ధానాలకు పైగా గెలుపొందుతుందని ధీమా వ్యక్తం చేశారు. మే 17న సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తానన్న యడ్యూరప్ప వ్యాఖ్యలపై ఆయన స్పందనను కోరగా సిద్ధరామయ్య ఈ వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక ప్రజలు ఇవాళ చరిత్ర సృష్టించేందుకు క్యూల్లో నిలబడి ఓట్లు వేస్తున్నారని వ్యాఖ్యానించారు. దేశానికి సుపరిపాలనతో కూడిన పురోగామి రాజకీయాలను చాటిచెపుతున్నారని అంటూ సిద్ధరామయ్య ట్వీట్‌ చేశారు. తమ పార్టీకి అండగా నిలిచిన కర్ణాటక ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు.

మరోవైపు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధిస్తుందని, ఈనెల17న తాను సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తానని యడ్యూరప్ప ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌, బీజేపీ హోరాహోరీగా తలపడిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈనెల 15న వెలువడనున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement