యోగి ఆదిత్యానాథ్, సిద్ధరామయ్య (ఫైల్‌ఫోటో)
సాక్షి, బెంగళూర్ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ప్రచారం చేస్తే బీజేపీపై ప్రతికూల ప్రభావం పడుతుందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. ‘ఆదిత్యానాథ్ ఇక్కడికి వస్తే అది బీజేపీకి మైనస్ పాయింటే అవుతుంది..ఆయన యూపీకి ఏం చేశారు..ఏడాది పాలనలో దారుణంగా విఫలమైన యోగి కర్ణాటకలో ఏం సాధిస్తార’ని నిలదీశారు. యోగి సొంత నియోజకవర్గంలోనే బీజేపీ ఓటమి పాలైందన్నారు. యోగి ఆదిత్యానాథ్ కర్ణాటకలో దాదాపు 35కి పైగా ర్యాలీలు, రోడ్‌షోలలో పాల్గొననున్నారు.
కర్ణాటకలోని కోస్తా ప్రాంతంలో ఆదిత్యానాథ్‌కు చెందిన వర్గీయులు అధికంగా ఉండటంతో ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ను ఓడించేందుకు ఆయన ప్రచారం ఉపకరిస్తుందని కర్ణాటక బీజేపీ నేతలు భావిస్తున్నారు. మరోవైపు బీజేపీ ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌లను నమ్ముకుందని, సీఎం అభ్యర్థి యడ్యూరప్ప కేవలం డమ్మీలేనని సిద్ధరామయ్య వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కర్ణాటకలో నేతలు కరువైన బీజేపీ ఉత్తరాది నేతలను దిగుమతి చేసుకుంటోందని ఆయన దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment