సాక్షి, బెంగళూర్ : కర్ణాటక రాజకీయ పరిణామాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కాంగ్రెస్ శుక్రవారం నిర్వహించిన శాసనసభాపక్ష సమావేశానికి నలుగురు ఎమ్మల్యేలు గైర్హాజరు కావడంతో ఎమ్మెల్యేలందరినీ బెంగళూర్‌లోని రిసార్ట్స్‌కు తరలించారు. సీఎల్పీ భేటీకి పార్టీ ఎమ్మెల్యేలు రమేష్ జర్కోలి, బీ నాగేంద్ర, మహేష్ కే, ఉమేష్ జాదవ్‌లు హాజరు కాలేదు. తాను అనారోగ్య కారణాలతో సమావేశానికి హాజరు కాలేనని జాదవ్ పార్టీ నేత సిద్ధరామయ్యకు లేఖ రాశారు.
సీఎల్పీ భేటీకి 80 మంది ఎమ్మెల్యేలకు గాను 76 మంది హాజరయ్యారని సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య వెల్లడించారు. గైర్హాజరైన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసి హైకమాండ్ సూచలనకు అనుగుణంగా చర్యలు చేపడతామని చెప్పారు. సీఎల్పీ భేటీ అనంతరం సమావేశానికి హాజరైన 76 మందిని ప్రత్యేక బస్సుల్లో నగర శివార్లలోని ఈగల్టన్ గోల్ఫ్ రిసార్ట్స్‌కు తరలించారు. కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ సర్కార్‌ను అస్ధిరపరిచేందుకు బీజేపీ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తోందని సిద్ధరామయ్య ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment