Camp Politics
-
కౌన్సెలర్స్ కొనుగోలు చేసిన బాలకృష్ణ..
-
Rishikesh: ‘హిమాచల్’ సంక్షోభం మళ్లీ మొదటికి..?
రిషికేష్: హిమాచల్‌ప్రదేశ్ సంక్షోభం మళ్లీ మొదటికి వచ్చినట్లు కనిపిస్తోంది. ఇటీవల రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్‌ఓటింగ్‌కు పాల్పడ్డ ఆరుగురు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలతో పాటు ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు, మరో ఇద్దరు ఎమ్మెల్యేలు మొత్తం 11 మంది తాజాగా శనివారం(మార్చ్ 9) ఒక ప్రత్యేక బస్సులో బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌లోని రిషికేష్ చేరుకున్నారు. అత్యంత భద్రత నడుమ బస్సు దిగి తాజ్ రిషికేష్ హోటల్‌లోనికి ఎమ్మెల్యేలు వెళ్లారు. శుక్రవారమే హిమాచల్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిశారు. రెబల్స్‌ను మళ్లీ తీసుకుంటారా అని ఢిల్లీలో మీడియా ఆయనను ప్రశ్నించగా తప్పు తెలుసుకుంటే మరో చాన్స్‌కు అర్హులవుతారు అని సుఖు సమాధానమిచ్చారు. ఇంతలోనే రెబల్ ఎమ్మెల్యేలు మళ్లీ క్యాంపునకు వెళ్లడం చర్చనీయాంశమైంది. కాగా, ఫిబ్రవరిలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు బీజేపీకి ఓటు వేయడంతో బలం లేని కాషాయ పార్టీ అభ్యర్థి రాజ్యసభ ఎంపీగా గెలిచారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మనుసింఘ్వి ఓటమి పాలయ్యారు. ఈ సంక్షోభం తర్వాత స్పీకర్ ఆరుగురు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీ నుంచి బయటపడి మళ్లీ మెజారిటీలోకి వెళ్లింది. అయితే స్పీకర్ నిర్ణయంపై రెబల్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్‌పై సుప్రీం నిర్ణయం వెల్లడించాల్సి ఉంది. ఇదీ చదవండి.. లోక్‌సభ ఎన్నికల వేళ.. బిహార్‌లో ఈడీ దాడుల కలకలం -
హైదరాబాద్ వేదికగా మరో క్యాంపు రాజకీయం
సాక్షి, హైదరాబాద్: జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం)క్యాంపు రాజకీయం ముగియటంతో జేఎంఎం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ రాష్ట్రం జార్ఖండ్‌కు బయలుదేరారు. మరోవైపు హైదరాబాద్ మరో రాష్ట్ర క్యాంపు రాజకీయాలకు వేదికైంది. తాజాగా బిహార్ క్యాంపు రాజకీయం తెలంగాణలోని హైదరాబాద్‌కు చేరుకుంది. బిహార్‌లో తాజా పరిణామాల నేపథ్యంలో 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు హైదరాబాద్‌లోని ఇబ్రహింపట్నం పార్క్ అవెన్యూ రిసార్ట్స్‌లో తెలంగాణ కాంగ్రెస్ క్యాంపును ఏర్పాటు చేసింది. ఈ క్యాంపు బాధ్యతలను ఏఐసీసీ సెక్రటరీ సంపత్, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి తెలంగాణ పీసీసీ అప్పగించింది. #WATCH | Telangana: The 16 Congress MLAs reach Hyderabad. The floor test of the newly elected NDA government in Bihar is likely to happen on February 12. (Visuals from Hyderabad airport) pic.twitter.com/SELbKPBlPG — ANI (@ANI) February 4, 2024 ఇటీవల బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మహాఘట్ బంధన్ కూటమి నుంచి వైదొలగడంతో బిహార్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రతిపక్ష ‘ఇండియా కూటమి’కి గుడ్‌బై చెప్పిన నితీష్ కుమార్ బీజేపీ మద్దతుతో ఎన్డీయే కూటమిలో చేరి.. నితీష్ కుమార్ బిహార్‌లో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. బిహార్‌కు 9వసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నితీష్ కుమార్ ప్రభుత్వం ఈ నెల 12వ తేదీన అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కొనుంది. అయితే ఈ నేపథ్యంలోనే తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎటువంటి ప్రలోభాలకు గురి కావొద్దనే ఉద్దేశంతో కాంగ్రెస్ అప్రమత్తమై ఎమ్మెల్యేను హైదరాబాద్‌కు తరలించటం గమనార్హం. -
Siddaramaiah vs DK Shivakumar: కర్ణాటకలో కుర్చీలాట!
సాక్షి, బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ పార్టిలో వర్గపోరు పెరుగుతోంది. ఎవరికి వారు వర్గాలుగా మారి సీఎం కురీ్చపై టార్గెట్ పెట్టారు. ఇందులో ముఖ్యంగా సిద్ధరామయ్య వర్గం, డీకే శివకుమార్ వర్గం పేర్లు కీలకంగా వినిపిస్తున్నాయి. ఈ సమయంలో గురువారం హోసపేట నగరంలో సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ రానున్న ఐదేళ్ల పాటు తానే సీఎంగా కొనసాగుతానని వ్యాఖ్యలు చేయడంతో డీకే శివకుమార్ వర్గం నోటిలో పచ్చి వెలక్కాయ పడ్డట్లయ్యింది. రెండున్నరేళ్ల తర్వాత అధికార మార్పిడితో తాను సీఎం అవుతానని ఆశలు పెట్టుకున్న డీకే శివకుమార్‌కు ఈ వ్యాఖ్యలు మింగుడు పడడం లేదు. ముఖ్యమంత్రిగా ఆరు నెలలు పూర్తి చేసుకున్న సిద్ధరామయ్య రానున్న ఐదేళ్లపాటు తానే సీఎంగా కొనసాగుతానని నర్మగర్భంగా వ్యాఖ్యలు చేయడంపై రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. సీఎం వ్యాఖ్యలపై అనుకూల, ప్రతికూల వ్యాఖ్యానాలను రాజకీయ విశ్లేషకులు చేస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టిలో ఈ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రెండున్నరేళ్ల తర్వాత తానే సీఎం అనే ఆశలతో ఉన్న ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మాత్రం తాను కేవలం హైకమాండ్ మాట మాత్రమే వింటానని, ఎవరేమి చెప్పినా పట్టించుకోనని తెలిపారు. ఇదే సమయంలో కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా అధిష్టాన నిర్ణయమే శిరోధార్యమని బాహాటంగా వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ లోలోపల ఎవరి వర్గానికి వారు మద్దతు ప్రకటిస్తూ వస్తున్నారు. ఈ విషయంపై మంత్రి ప్రియాంక్ ఖర్గే శుక్రవారం మైసూరులో విలేకరులతో మాట్లాడుతూ సీఎం వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, ఎవరిని కొనసాగించాలి, ఎవరికి అడ్డుకట్ట వేయాలనే విషయం తమ అధిష్టానం చూసుకుంటుందని తెలిపారు. మరో మంత్రి కేఎన్ రాజణ్ణ శుక్రవారం తుమకూరులో మాట్లాడుతూ మాజీ డీప్యూటీ సీఎం, హోం మంత్రి పరమేశ్వరకు కూడా సీఎం అయ్యే అర్హత ఉందని పేర్కొన్నారు. తుమకూరులో హోం మంత్రి పరమేశ్వర మాట్లాడుతూ సీఎం వ్యాఖ్యలపై తాను స్పందించబోనని చెప్పారు. అధికార పంపిణీ కేవలం సీఎం, డీసీఎం మధ్యజరిగిన చర్చ అని, అసలు ఢిల్లీలో ఎలాంటి ఒప్పందం జరిగిందనే విషయంపై వారిద్దరికే స్పష్టమైన అవగాహన ఉందని, అలాంటప్పుడు ఇది సత్యం, ఇది అబద్ధమని తానే వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. అయితే రామనగర ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ మాత్రం డీసీఎం డీకే శివకుమార్‌కు మద్దతు పలికారు. పోస్టు ఖాళీగా లేదు కదా! ఖాళీగా లేని ముఖ్యమంత్రి పదవిపై అవసరంగా చర్చ సాగుతోందని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సోదరుడు, ఎంపీ డీకే సురేశ్ అన్నారు. ఇలాంటి చర్చకు అర్ధం లేదని వ్యాఖ్యానించారు. ‘ప్రస్తుతం సిద్ధరామయ్య సీఎంగా ఉన్నారు. సీఎం పోస్టు ఖాళీగా లేదు. ఆ పదవి ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే దీనిపై చర్చించాలి. ఇప్పుడు మాట్లాడుకోవడం వల్ల లాభం ఏమిటి?’ అని వ్యాఖ్యానించారు. -
అసమ్మతి మీటింగ్‌కు ముత్తిరెడ్డి! షాకైన నేతలు
సాక్షి, హైదరాబాద్: జనగామ బీఆర్ఎస్ టికెట్ రేస్ పంచాయితీ హైదరాబాద్‌కి చేరింది. ప్రగతి భవన్‌కి కూతవేటు దూరంలో క్యాంప్ రాజకీయం ఆసక్తికరంగా సాగింది. ఎమ్మెల్సీ పల్లాను కలిసేందుకు బీఆర్ఎస్ నాయకులు హైదరాబాద్‌కు రాగా, వారు హైదరాబాద్ వెళ్లారనే సమాచారంతో హుటాహుటిన నగరానికి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిగిరిరెడ్డి వచ్చారు. టూరిజం ప్లాజాలో ఆయన ప్రత్యక్షమవడంతో జనగామ బీఆర్ఎస్ నేతలు షాకయ్యారు. ముత్తిరెడ్డికి తెలియకుండానే పల్లా పిలిపించాడని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. అధిష్టానం ఇలాంటి చర్యలను క్షమించదని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అన్నారు. ‘‘ఇక్కడకు వచ్చిన వారిలో ముఖ్య కార్యకర్తలు ఎవరూ లేరు. జడ్పీటీసీ, ఎంపీపీ, మండలాధ్యక్షులు నా వెంటే ఉన్నారు. కొంత మంది మా నియోజకవర్గ పార్టీ నేతలు హరిత ప్లాజాకు వచ్చారని తెలిసింది. ఎవరు వచ్చారో తెలుసుకుందామని వచ్చాను. ..తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెన్నంటి నడిచిన వ్యక్తిని నేను. గతంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి నాకు ఫోన్ చేసి ఇలాంటివి ప్రోత్సహించనని చెప్పారు. అసమ్మతి సంగతి అధిష్టానం చూసుకుంటుంది’’ అని ముత్తిరెడ్డి అన్నారు. చదవండి: టార్గెట్ కేసీఆర్.. రేవంత్ ఆరోపణలకు అర్థాలు లేవులే! -
కాంగ్రెస్ హైకమాండ్ రాంగ్ సిగ్నల్?
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న పంజాబ్‌లో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. అధికార కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, నవజ్యోత్ సింగ్ సిద్ధూ మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను తెరదించేందుకు అధిష్టానం సర్వశక్తులు ఒడ్డుతోంది. అందులోభాగంగా ఎన్నికలకు కెప్టెన్ సారథ్యం వహిస్తారని, సిద్ధూకి పీసీసీ అధ్యక్ష పదవి వంటి కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయంటూ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ హరీష్ రావత్ గురువారం ఇచ్చిన స్నిగల్ పరిస్థితిని చక్కదిద్దకపోగా, మరింత ఆందోళనలకు కారణమైంది. కెప్టెన్ అమరీందర్‌పై సిద్ధూ అసంతృప్తి, తిరుగుబాటు శైలిని చూసి రాష్ట్ర పార్టీ బాధ్యతలు అప్పగించాలనుకున్న హైకమాండ్ ప్లాన్ క్యాంపు రాజకీయాలకు ఆజ్యం పోసినట్లయింది. సిద్ధూ, కెప్టెన్ తమకు అనుకూలంగా ఉన్న మంత్రులు, శాసనసభ్యులతో క్యాంపు సమావేశాలు జరిపారు. నవ్‌జ్యోత్‌సింగ్ సిద్ధూ శుక్రవారం ఢిల్లీలో సోనియాగాంధీని కలవడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. సిద్ధూ అంతకుముందు జూన్ 30 న ఢిల్లీకి వచ్చి ప్రియాంకా గాంధీని కలిశారు. అదే సమయంలో కెప్టెన్ అమరీందర్ సింగ్ సైతం పార్టీ అధినేత్రితో భేటీ అయ్యారు. సోనియాతో జరిగిన సమావేశంలో రాహుల్‌గాంధీ, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ హరీష్ రావత్ పాల్గొన్నారు. కాగా సిద్ధూ సోనియాగాంధీని కలిసే ముందే ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ పార్టీ అధినేత్రికి ఒక లేఖ పంపించారని తెలిసింది. వచ్చే ఏడాది జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపుకు కెప్టెన్, సిద్ధూలు కలిసి పనిచేయగల శాంతి సూత్రాన్ని కేంద్ర నాయకత్వం రూపొందిస్తోందని రావత్ అభిప్రాయపడ్డారు. సమావేశం తరువాత మీడియాతో మాట్లాడిన రావత్ ‘నేను పంజాబ్‌లో పార్టీకి సంబంధించి నివేదికను సమర్పించడానికి పార్టీ అ«ధినేత్రిని కలిశాను. పంజాబ్ కాంగ్రెస్ విషయంలో పార్టీ అధ్యక్షురాలు తీసుకున్న నిర్ణయం గురించి నాకు సమాచారం వచ్చిన వెంటనే, మీ అందరికీ చెబుతాను’అని అన్నారు. అంతేగాక సిద్ధూను పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షునిగా చేస్తున్నారంటూ తను చేసిన వ్యాఖ్యలను మీడియా తప్పుగా అర్థం చేసుకుందన్నారు. కాగా, పంజాబ్‌లో సిద్ధూ, ఆయన ప్రత్యర్థి శిబిరం మధ్య పోస్టర్ల యుద్ధం మొదలైంది. సిద్ధూ మద్దతుదారులు అమృత్సర్, లూధియానాతో సహా పంజాబ్‌లోని పలు చోట్ల వేసిన పోస్టర్లలో లూధియానాలో కొన్ని పోస్టర్లను చింపేశారు. పార్టీ తీసుకొనే కొన్ని నిర్ణయాలపై పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ అసంతృప్తిగా ఉన్నారన్న ఊహాగానాలకు హరీష్ రావత్ తెరదించారు. ఈ విషయంలో కెప్టెన్‌కి ఏదైనా కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటే, దాన్ని సరిదిద్దడానికి ప్రయత్నిస్తామని రావత్ అన్నారు. మరోవైపు ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌కు సన్నిహితుడైన ఎంపీ, సీనియర్ నేత మనీష్ తివారీ కూడా ఈ వివాదంలో తనదైన శైలిలో అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. సామాజిక సమూహాల మధ్య సమతుల్యతను కాపాడటం ముఖ్యమని, సమానత్వం సామాజిక న్యాయానికి పునాది అని వ్యాఖ్యానించారు. పంజాబ్‌లో సిక్కులు 57.75 శాతం, హిందువులు 38.49 శాతం, దళితులు 31.94 శాతం ఉన్నారని తెలిపారు. లోక్‌సభ సభ్యుడు మనీష్ తివారీ తన ట్వీట్లో కాంగ్రెస్ పంజాబ్ ఇన్ఛార్జ్ హరీష్ రావత్‌ను ట్యాగ్ చేశారు. దీంతో సిద్ధూకి చెక్ పెట్టేలా సీఎం అమరీందర్‌కు అనుకూలంగా తివారీ ఈ ట్వీట్ చేసినట్లు భావిస్తున్నారు. -
రాజస్తాన్ హైడ్రామా: జైపూర్ నుంచి జైసల్మేర్‌కు
జైపూర్ : రాజస్తాన్‌లో రాజకీయ హైడ్రామా కొనసాగుతోంది. జైపూర్ ఫెయిర్‌మోంట్ హోటల్లో బసచేసిన ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ శిబిరానికి చెందిన ఎమ్మెల్యేలను జైసల్మేర్‌కు తరలిస్తున్నారు. జైసల్మేర్‌కు వెళ్లేందుకు జైపూర్ హోటల్ నుంచి గహ్లోత్‌కు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలు ఎయిర్‌పోర్ట్‌కు బస్సుల్లో తరలివెళ్లారు. ఆగస్ట్ 14 నుంచి అసెంబ్లీ సమావేశాలకు గవర్నర్ అంగీకరించడంతో తనకు మద్దతిచ్చే ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు గహ్లోత్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పైలట్ శిబిరం నుంచి ఎమ్మెల్యేలను తిరిగి కాంగ్రెస్ గూటికి రప్పించే ప్రయత్నాలు చేస్తూనే తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవాలని యోచిస్తున్నారు. మరోవైపు ఆగస్ట్ 17న అశోక్ గహ్లోత్ బలపరీక్షను కోరే అవకాశం ఉందని భావిస్తున్నారు. చివరి ప్రయత్నంగా తిరుగుబాటు నేత సచిన్ పైలట్‌ను తిరిగి కాంగ్రెస్ గూటికి రప్పించే ప్రయత్నాలు సాగుతున్నాయి. పార్టీలోకి తిరిగి రావాలని పైలట్‌కు రాజస్తాన్ పీసీసీ చీఫ్ గోవింద్ సింగ్ దోత్సరా విజ్ఞప్తి చేశారు. 2018లో పార్టీ టికెట్‌పై గెలిచిన వారంతా కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలని కోరారు. ఇక ఆగస్ట్ 14 నుంచి రాజస్తాన్ అసెంబ్లీ సమావేశాలు జరిపేందుకు గవర్నర్ కల్రాజ్ మిశ్రా అంగీకరించిన వెంటనే ఎమ్మెల్యేల బేరసారాలు కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ఆరోపించారు. చదవండి : ‘అసెంబ్లీ సమావేశాలు అడ్డుకోలేదు, కానీ..’ గతంలో ఎమ్మెల్యేలు గోడ దూకేందుకు రూ 10 కోట్ల నుంచి రూ 15 కోట్లు ఆఫర్ చేయగా ఇప్పుడవి ఊహించని స్ధాయికి చేరాయని గహ్లోత్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర పన్నిందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. పైలట్ వెనకుండి బీజేపీ కుట్రకు తెరలేపిందని గహ్లోత్ సైతం ఇటీవల కాషాయ పార్టీపై ఆరోపణలు గుప్పించారు. -
పైలట్ శిబిరం వద్ద హైడ్రామా
జైపూర్ : రాజస్దాన్‌లో రాజకీయ హైడ్రామా ఉత్కంఠ రేపుతోంది. తిరుగుబాటు నేత సచిన్ పైలట్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలున్న మనేసర్ రిసార్ట్స్ వద్దకు చేరుకున్న రాజస్ధాన్ పోలీసులను హరియాణ పోలీసులు అడ్డుకున్నారు. అశోక్ గహ్లోత్ సర్కార్‌ను కూలదోసేందుకు కుట్రపన్నిన బీజేపీ నేతలతో రెబల్ ఎమ్మెల్యే భన్వర్‌లాల్ శర్మ మంతనాలు సాగించారని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఆడియో టేపులను విడుదల చేసింది. కాంగ్రెస్ నేతల ఫిర్యాదు మేరకు భన్వర్ లాల్ శర్మ కోసం రాజస్ధాన్ పోలీసులు ఢిల్లీ సమీపంలోని మనేసర్ రిసార్ట్స్‌కు శుక్రవారం సాయంత్రం చేరుకున్నారు. 18 మంది సచిన్ పైలట్ వర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గత వారాంతం నుంచి ఈ రిసార్ట్స్‌లో గడుపుతున్నారు. కాగా బీజేపీతో వీరు ముడుపుల వ్యవహారం నడిపారనే ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే భన్వర్ లాల్ శర్మ మరో ఎమ్మెల్యే విశ్వేంద్ర సింగ్‌లను సస్పెండ్ చేసింది. ఇక వీరి కోసం మనేసర రిసార్ట్స్‌కు చేరుకున్న రాజస్దాన్ పోలీసులను హరియాణ పోలీసులు కొద్దిసేపు అడ్డుకున్నారు. కాగా ఆడియో టేపుల వ్యవహారాన్ని రెబెల్ ఎమ్మెల్యేలు భన్వర్ లాల్ శర్మ, విశ్వేంద్ర సింగ్‌లు తోసిపుచ్చారు. ఈ టేపుల్లో రికార్డయింది తమ వాయిస్ కాదని స్పష్టం చేశారు. మరోవైపు తన ప్రభుత్వాన్ని కూలదోసేందుకు సచిన్ పైలట్ బాహాటంగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని రాజస్ధాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ఆరోపించారు. ఇక ప్రియాంక గాంధీ సహా సీనియర్ కాంగ్రెస్ నేతల రాజీ ప్రతిపాదనలకు సచిన్ పైలట్ అంగీకరించలేదని ఆయన వర్గీయులు తేల్చిచెప్పారు. చదవండి : కాంగ్రెస్‌కు కాషాయ నేతల కౌంటర్ -
కర్ణాటక హైడ్రామా : నేడు సీఎల్పీ భేటీ
సాక్షి, బెంగళూర్ : కర్ణాటకలో జేడీయూ- కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని అస్ధిరపరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న ప్రచారం నేపథ్యంలో రాజకీయ హైడ్రామా కొనసాగుతోంది. బెంగళూర్‌లో సోమవారం మరోసారి సీఎల్పీ భేటీకి మాజీ కర్ణాటక సీఎం, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య పిలుపు ఇచ్చారు. వారం రోజుల కిందట జరిగిన సీఎల్పీ భేటీకి నలుగురు ఎమ్మెల్యేలు గైర్హాజరైన నేపథ్యంలో సీఎల్పీ భేటీకి హాజరుకాని వారిపై ఫిరాయింపు నిరోధక చట్టం వర్తిస్తుందని సిద్ధరామయ్య హెచ్చరించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసేందుకు నిర్ణయించుకునే సదరు ఎమ్మెల్యే హాజరు కాలేదని భావించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కాగా వారం రోజుల వ్యవధిలో మరోసారి జరుగుతున్న కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేల సీఎల్పీ భేటీ ప్రాధాన్యత సంతరించుంది.మరోవైపు బెంగళూరు రిసార్ట్స్‌లో బస చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో పార్టీ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్‌కు గాయాలవడంతో ఆయనను ఆదివారం ఆస్పత్రికి తరలించారు. ఇక గత వారం జరిగిన సీఎల్పీ భేటీకి హాజరు కాని నలుగురు ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. -
కర్ణాటక హైడ్రామా : రిసార్ట్స్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
-
కర్ణాటక హైడ్రామా : రిసార్ట్స్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
సాక్షి, బెంగళూర్ : కర్ణాటక రాజకీయ పరిణామాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కాంగ్రెస్ శుక్రవారం నిర్వహించిన శాసనసభాపక్ష సమావేశానికి నలుగురు ఎమ్మల్యేలు గైర్హాజరు కావడంతో ఎమ్మెల్యేలందరినీ బెంగళూర్‌లోని రిసార్ట్స్‌కు తరలించారు. సీఎల్పీ భేటీకి పార్టీ ఎమ్మెల్యేలు రమేష్ జర్కోలి, బీ నాగేంద్ర, మహేష్ కే, ఉమేష్ జాదవ్‌లు హాజరు కాలేదు. తాను అనారోగ్య కారణాలతో సమావేశానికి హాజరు కాలేనని జాదవ్ పార్టీ నేత సిద్ధరామయ్యకు లేఖ రాశారు. సీఎల్పీ భేటీకి 80 మంది ఎమ్మెల్యేలకు గాను 76 మంది హాజరయ్యారని సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య వెల్లడించారు. గైర్హాజరైన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసి హైకమాండ్ సూచలనకు అనుగుణంగా చర్యలు చేపడతామని చెప్పారు. సీఎల్పీ భేటీ అనంతరం సమావేశానికి హాజరైన 76 మందిని ప్రత్యేక బస్సుల్లో నగర శివార్లలోని ఈగల్టన్ గోల్ఫ్ రిసార్ట్స్‌కు తరలించారు. కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ సర్కార్‌ను అస్ధిరపరిచేందుకు బీజేపీ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తోందని సిద్ధరామయ్య ఆరోపించారు. -
ఎడపాడి ప్రభుత్వంలో ఎన్ని మలుపులో?
► నాడు శాసనసభ్యుల ఉపసంహరణతో భయం ► ఎమ్మెల్యేలకు అనర్హత వేటు సంజాయిషీ నోటీసులతో ధైర్యం ► కేంద్ర హోంమంత్రితో గవర్నర్ చర్చలు వాయిదా ► పుదుచ్చేరి రిసార్టులో ఎమ్మెల్యేలు ఉల్లాసంగా.. ఉత్సాహంగా ముఖ్యమంత్రిగా ఎడపాడి పళనిస్వామి ఏ ముహూర్తాన ఎన్నికయ్యారోగానీ ఆనాటి నుంచి చిక్కులపై చిక్కులు వెన్నంటుతూనే ఉన్నాయి. 122 మంది ఎమ్మెల్యేల మద్దతుతో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న ఎడపాడి క్రమేణా అస్థిర ప్రభుత్వంగా అగాథంలోకి జారిపోయారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: అధికార పార్టీకి సవాలు విసురుతున్న పన్నీర్‌సెల్వం వర్గంతో కొన్ని నెలలు పడరాని పాట్లు పడ్డారు. ప్రధాని మోదీ పుణ్యమాని పన్నీర్ సెల్వం ఎడపాడి పక్కకు చేరిపోయారు. హమ్మయ్యా.. అంటూ ఊపిరి పీల్చుకుంటున్న ఎడపాడికి దినకరన్ దిమ్మతిరిగేలా షాక్ ఇచ్చారు. తన వర్గానికి చెందిన 19 మంది ఎమ్మెల్యేల చేత మద్దతు ఉపసంహరణతో ఎడపాడి ప్రభుత్వాన్ని మైనార్టీలో పడేశారు. 117 మంది ఎమ్మెల్యేల మ్యాజిక్ ఫిగర్‌కు ఐదుగురు ఎమ్మెల్యేలు ఎడపాడికి అందుబాటులోకి రావాల్సి ఉంది. తన ఎమ్మెల్యేలకు ఎడపాడి ఎరవేయకుండా దినకరన్ పుదుచ్చేరిలో క్యాంప్ రాజకీయాలను ప్రారంభించారు. గవర్నర్ నుంచి లేదా న్యాయస్థానం నుంచి బలపరీక్ష ఆదేశాలు అందేలోపే జాగ్రత్తపడాలని అప్రమత్తమైన ఎడపాడి గురువారం స్పీకర్, ప్రభుత్వ విప్‌లతో సమావేశమయ్యారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించిన నేరంపై అనర్హత వేటు ఎందుకు వేయకూడదని 19 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ ద్వారా గురువారం నోటీసులు జారీచేయించి దినకరన్‌కు షాకిచ్చారు. స్పీకర్ ఇచ్చిన నోటీసులకు పది రోజుల్లోగా బదులివ్వాల్సి ఉంది. నోటీసులు జారీచేసింది వేటు వేసేందుకే కాబట్టి ఎమ్మెల్యేల సమాధానానికి అసంతృప్తి వ్యక్తంచేస్తూ వేటు ఆదేశాలు జారీచేసే అకాశం ఉంది. స్పీకర్ అనర్హత వేటు వేసిన పక్షంలో అసెంబ్లీలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేల సంఖ్య 135 నుంచి 116 కు పడిపోతుంది. ఈ లెక్కన మ్యాజిక్ ఫిగర్ 117 లేకున్నా ఎడపాడి ప్రభుత్వ మనుగడకు ముప్పు ఉండక పోవచ్చు. పొంచి ఉన్న మరో ముప్పు ఎమ్మెల్యేలను వదిలించుకోవడం ద్వారా తలనొప్పి బయటపడిన పక్షంలో ఎడపాడికి మరో ముప్పు పొంచి ఉం టుంది. రెండు పిల్లుల తగవు కోతి తీర్చినట్లుగా అన్నాడీఎంకేలో అంతర్గత కుమ్ములాట డీఎంకేని అధికార పీఠంలో కూర్చోబెట్టగలదని భావిస్తున్నారు. అసెంబ్లీలో డీఎం కేకు 89, మిత్రపక్ష కాంగ్రెస్‌కు 8, ఇండియన్ ముస్లింలీగ్‌కు 1 కలుపుకుంటే ప్రతిపక్షానికి మొత్తం 98 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. 19 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాలు ఖాళీ అయిన పక్షంలో ఆరు నెలల్లోగా ఉప ఎన్నికలను నిర్వహించాలి. జయలలిత ప్రాతిని«ధ్యం వహించిన ఆర్కేనగర్ కూడా ఎంతోకాలంగా ఖాళీగా ఉంది. అమ్మ మరణం అన్నాడీఎంకేకి శాపంగా మారగా డీఎంకేకు వరంగా పరిణమించే పరిస్థితులు నెలకొన్నాయి. ఉప ఎన్నికల్లో డీఎంకే గెలిస్తే.. ఉప ఎన్నికలు జరిగే 20 స్థానాల్లో డీఎంకే గెలిసిన పక్షంలో ప్రతిపక్ష బలం 118 కి చేరుకుంటుంది. అసెంబ్లీలో సీఎం ఎడపాడి కంటే ప్రధాన ప్రతిపక్ష ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతుంది. శాసనసభాపక్ష నేత (సీఎం)గా స్టాలిన్ ఎన్నిక య«థావిధిగా జరిగిపోతుంది. హోంమంత్రితో గవర్నర్ చర్చలు వాయిదా ఇదిలా ఉండగా, తమిళనాడు ప్రభుత్వంలో చోటుచేసుకున్న పరిణామాలను కేంద్ర హోంమంత్రి రాజ్నా«థ్సింగ్కు వివరించేందుకు తమిళనాడు ఇన్చార్జ్ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు గురువారం తీసుకున్న అపాయింట్మెంట్ రద్దయింది. ఈ చర్చలు శుక్రవారం జరిపే అవకాశం ఉందని తెలుస్తోంది. పుదుచ్చేరిలో పదనిసలు పుదుచ్చేరి రిసార్టులో 19 మంది ఎమ్మెల్యేలు జోరుగా హుషారుగా కాలక్షేపం చేస్తున్నారు. రిసార్టులో ఎమ్మెల్యేల పోషణకు రోజుకు రూ.5 లక్షలు ఖర్చు అవుతోంది. అనేక వసతులున్నా స్పా సౌకర్యం లేదని ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలి వరకు పనిచేస్తుండిన స్పా మసాజ్ సెంటర్ రెండు రోజుల క్రితం మూతపడింది. దీంతో ఇక చేసేదిలేక పిల్లల పార్కులో రకరాల ఆటలు ఆడుతూ, ఉయ్యాలలు ఊగుతూ గడుపుతున్నారు. ఈ రకంగా వారి ఫొటోలను వారే విడుదల చేస్తున్నారు. పార్టీ నుంచి శశికళను తొలగించే ప్రయత్నాలను నిరసిస్తూ ఎమ్మెల్యే రత్న సభాపతి.. దినకరన్‌కు మద్దతు ప్రకటించినట్లు సమాచారం. ఇదే నిజమైతే దినకరన్ వర్గ ఎమ్మెల్యేల సంఖ్య 20కి పెరుగుతుంది. దినకరన్ క్యాంపును కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయధరణి సమర్థించారు. కరూరు జిల్లా అరవకురిచ్చి ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీ ఇతర ఎమ్మెల్యేలతోపాటూ పుదుచ్చేరి రిసార్టులో బసచేసి ఉండడంతో ఆయన నియోజకవర్గ ప్రజలు తమ ఎమ్మెల్యే కనిపించడం లేదని పోలీసు స్టేషన్లో గురువారం ఫిర్యాదు చేశారు. పార్టీ నుంచి బహిష్కరించే అధికారం దినకరన్‌కు లేదని పార్టీ ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్ అన్నారు. అసెంబ్లీలో బలపరీక్షకు ఆదేశించాలని కోరుతూ దినకరన్ వర్గ ఎమ్మెల్యే ఒకరు తన న్యాయవాది ద్వారా మద్రాసు హైకోర్టులో గురువారం పిటిషన్ వేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఎమ్మెల్యేల క్యాంప్ వల్ల రిసార్ట్స్ పరిసరాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని కొందరు పోలీసుల కు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రిసార్ట్స్‌లో తనిఖీ చేసి అంతా సవ్యంగా ఉందని తెలిపారు. -
టీడీపీ క్యాంప్ రాజకీయం
- బస్సులో టూర్‌కు వెళ్లిన విష్ణు వర్గీయులు - శిల్పా చక్రపాణి రెడ్డికి ఓటు వేయాలని ఒతిళ్లు - ఒక్కో ఓటుకు రూ. లక్ష ఇచ్చినట్లు సమాచారం గూడూరు: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గర పడడంతో టీడీపీ క్యాంప్ రాజకీయాలు జోరందుకున్నాయి. ఆ పార్టీ అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి గెలుపే ధ్యేయంగా టీడీపీ నేతలు అడ్డదారులు తొక్కుతున్నారు. టీడీపీ కోడుమూరు నియోజకవర్గ ఇన్చార్జి డి.విష్ణువర్ధన్‌రెడ్డి వర్గానికి చెందిన స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లను సోమవారం బస్సులో టూరుకు తరలించారు. వీరంతా మొదట కర్నూలులో విష్ణువర్ధన్‌రెడ్డి ఇంటికి అక్కడి నుంచి తమిళనాడు రాష్ట్రానికి వెళ్తున్నట్లు సమాచారం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసేందుకు ఒక్కో కౌన్సిలర్‌కు రూ. లక్ష డబ్బులు ఇచ్చినట్లు సమాచారం. టూర్‌కు వెళ్లిన వారిలో మున్సిపల్ చైర్పర్సన్ సుభాషిణి, వైస్ చైర్మన్ కె.రామాంజనేయులు, మరో పది మంది కౌన్సిలర్లు ఉన్నారు. వీంరంతా వైఎస్సార్సీపీ తరఫున గెలిచి టీడీపీలోకి ఫిరాయించారు. వీరి ఓటు వైఎస్ఆర్సీపీకి పడకుండా.. విహారయాత్ర పేరుతో ఇక్కడి నుంచి తరలించారు. -
రాయ‘బేరా’లు
- టీడీపీ నేతల ప్రలోభాలు - ఊపందుకున్న క్యాంపు రాజకీయాలు - ఊటీ, గోవాలకు తీసుకెళ్లేందుకు రంగం సిద్ధం - అయినా ఓటు వేస్తారా లేదా అని అనుమానం - స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికారపార్టీలో టెన్షన్ సాక్షి ప్రతినిధి, కర్నూలు: అరకొర బలం..అయినా గెలవాలనే సంకల్పం..టీడీపీ నేతలను అడ్డదారి తొక్కిస్తోంది. ప్రభుత్వంపై వ్యతిరేకత..రచ్చకెక్కిన విభేదాలు.. ఆ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. మంత్రులు..పార్టీ సీనియర్ నేతలు..రంగంలోకి దిగినా ఫలితం ఉండడం లేదు. బుజ్జగింపులు.. బెదిరింపులు.. తాయిలాలు..సామదానదండోపాయాలు.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జిల్లాలో రసవత్తరంగా మారాయి. ముఖ్యంగా అధికార పార్టీలో ప్రలోభాల పర్వం ఊపందుకుంది. క్యాంప్ రాజకీయాలూ షురూ అయ్యాయి. ఓటమి భయం ఆ పార్టీ నేతలను వెన్నాడుతోంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార పార్టీలో టెన్షన్ మొదలయ్యింది. ఈ నేపథ్యంలో క్యాంపు రాజకీయాలకు తెరలేపాలని రంగం సిద్ధం చేసింది. ఊటీ, గోవా తదితర ప్రాంతాలకు ఎంటీటీసీ, జెడ్పీటీసీ సభ్యులను, కౌన్సిలర్లను తరలించాలని ప్రణాళికలు వేస్తోంది. క్యాంపులకు తరలించినప్పటికీ తమకు ఓటు వేస్తారా లేదా అనే అనుమానం అధికారపార్టీని వెన్నాడుతోంది. ఈ నేపథ్యంలో ఓటు వేసే ముందు చూపించి వేయాలని ఏకంగా మంత్రులు కూడా ఆదేశాలు జారీచేయడం ఆ పార్టీలో నెలకొన్న ఆందోళనకు అద్దం పడుతోంది. అయితే ఓటు చూపించి వేయడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధం. అయినప్పటికీ కేవలం ఓటర్లను భయపెట్టేందుకే అధికారపార్టీ ఈ రాజకీయానికి తెరలేపినట్టు తెలుస్తోంది. మరోవైపు శిల్పా చక్రపాణిరెడ్డికి ఎమ్మెల్సీ సీటు ఇవ్వడంతో ఆయన వ్యతిరేక వర్గం సహకరిస్తుందా లేదా అనేది అనుమానంగా మారింది. మొత్తం మీద అధికారపార్టీలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు గుబులు రేపుతున్నాయి. బేరసారాలు షురూ...! అధికార దౌర్జన్యంతో పాటు ఆర్థిక బలంతో గెలిచేందుకు అధికారపార్టీ సిద్ధమవుతోంది. తమకు ఓటు వేయకపోతే ఇబ్బందులు తప్పవని బెదిరింపులకు దిగుతున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఓటుకు ఇంత మొత్తం చొప్పున ఇచ్చేందుకు కూడా బేరసారాలు ప్రారంభమయ్యాయి. వాస్తవానికి స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గౌరు వెంకటరెడ్డికి పూర్తిస్థాయిలో గెలిచేందుకు అవసరమైన మెజార్టీ ఉంది. అయితే, ప్రజల అభిప్రాయానికి భిన్నంగా డబ్బు బలంతో ఎన్నికలను గెలవాలనేది అధికారపార్టీ ఆలోచనగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఓటుకు ఇంత మొత్తం అంటూ ఇవ్వడంతో పాటు క్యాంపులకు కూడా తరలించాలని నిర్ణయించింది. ఈ వారంలో ప్రత్యేక బస్సుల్లో క్యాంపులకు తరలించేందుకు ప్రణాళిక సిద్ధమయ్యింది. ప్రధానంగా తమకు ఓటు వేస్తారో లేదో అనే అనుమానం ఉన్న నియోజకవర్గాలపై అధికారపార్టీ దృష్టి సారించిందని సమాచారం. అయినప్పటికీ తమకు ఓటు వేస్తారో లేదా అనే అనుమానం మాత్రం ఆ పార్టీని వేధిస్తోంది. అంతేకాకుండా జిల్లా పరిషత్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న తెలుగుదేశంపార్టీకి ఓటు ఎలా వేస్తామని స్వయంగా అధికారపార్టీలో ఉన్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులే వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. వైఎస్ఆర్సీపీకి ఆధిక్యం వాస్తవానికి స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన ఆధికత్య ఉంది. అయితే, ఓటుకు నోటు తరహాలో అనేక మందిని అధికారపార్టీ అక్రమంగా అక్కున చేర్చుకుంది. తాము పార్టీ మారినప్పటికీ ఎటువంటి అభివృద్ధి పనులు జరగలేదని సదరు నేతలు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో తమను గెలిపించిన పార్టీకి ఓటు వేసి రుణం తీసుకోవాలని భావిస్తున్నారు. వైస్‌ఆర్‌సీపీకి 30 మంది జెడ్పీటీసీ సభ్యులుండగా, ఎంపీటీసీ సభ్యులు 395 మంది ఉన్నారు. కౌన్సిలర్లల్లో కూడా వైఎస్ఆర్సీపీకే మెజార్టీ ఉంది. కాంగ్రెస్‌తో పాటు వామపక్ష సభ్యులు కూడా వైస్ఆర్సీపీకే మద్దతిచ్చే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు గత రెండేళ్లుగా ఎమ్మెల్సీగా శిల్పా చక్రపాణి రెడ్డి ఏమీ చేయలేదనే అపవాదు ఉంది. ఇది కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గౌరు వెంకటరెడ్డికి కలిసి వస్తోందని విశ్లేషకులు అంటున్నారు. ఎంపీటీసీలు మొత్తం 815 కాగా ఇందులో ఒకరు డిస్–క్వాలిఫై అయ్యారు. మిగిలిన 814 మందిలోనూ వివిధ కారణాలతో (మరణించడం వగైరా) ప్రస్తుతం ఉన్న ఓటర్ల సంఖ్య 804 మంది మాత్రమే ఉన్నారు. కౌన్సిలర్లు 218 మందిలో వైసీపీకి 110 మంది బలం ఉంది. ఇక నంద్యాల ఎంపీతో పాటు 8 మంది ఎమ్మెల్యేలకు ఓటు హక్కు ఉంది. -
శశికళకు షాక్: ఎమ్మెల్యేలు మిస్సింగ్!
-
శశికళకు షాక్: ఎమ్మెల్యేలు మిస్సింగ్!
తమిళనాడు ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టాలని ఆశపడుతున్న శశికళా నటరాజన్‌కు అనుకోకుండా పెద్ద షాక్ తగిలింది. అత్యంత జాగ్రత్తగా బస్సులలో ఎమ్మెల్యేలందరినీ స్టార్ హోటళ్లు, రిసార్టులకు తరలించి.. వాళ్ల ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నా, అందులోంచి ఉన్నట్టుండి 43 మంది మిస్సయ్యారు. వీళ్లంతా పన్నీర్ సెల్వం క్యాంపులోకి చేరుకున్నట్లు సమాచారం. తనకు దాదాపు 50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని పన్నీర్ సెల్వం చెబుతున్నారు. తన వెంట 130 మంది ఎమ్మెల్యేలు ఉన్నందున పదవి చేపట్టడానికి ఎలాంటి ఇబ్బంది లేదంటున్న శశికళకు ఇది అనుకోని షాక్ అయ్యింది. ప్రభుత్వం నిలబడాలంటే 233 మంది ఎమ్మెల్యేలున్న తమిళనాడు అసెంబ్లీలో కనీసం 117 మంది మద్దతు అవసరం అవుతుంది. ఉన్న 130 మందిలోంచి 43 మంది వెళ్లిపోతే ఇక ఆమె వద్ద మిగిలేది 80-90 మంది మధ్య మాత్రమే. అలాంటప్పుడు ఆమె ఒకవేళ ప్రమాణ స్వీకారం చేసినా, సభలో బలం నిరూపించుకోలేక వెంటనే రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్, డీజీపీ రాజేంద్రన్ గురువారం ఉదయం సమావేశమయ్యారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాల నేపథ్యంలో పాలన, శాంతిభద్రతల గురించి చర్చించడానికే సీఎస్, డీజీపీలను పిలిపించినట్లు చెబుతున్నా.. నిజానికి ఎమ్మెల్యేల క్యాంప్ ఎక్కడ, ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులపై ఇంటెలిజెన్స్ విభాగం ఏమంటోందో తెలుసుకోడానికే పన్నీర్ వాళ్లను పిలిపించినట్లు తెలుస్తోంది. ఇక గురువారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో చెన్నై రాజ్‌భవన్‌కు వస్తున్న గవర్నర్ విద్యాసాగర్ రావు ఈరోజు రాజకీయ నాయకులను కలుస్తారో లేదోనన్నది అనుమానంగానే ఉంది. ముందుగా ఆయన అపాయింట్మెంట్ తీసుకోడానికి పన్నీర్ సెల్వం ప్రయత్నిస్తున్నారు. తనకు మద్దతుగా ఉన్న సుమారు 50 మంది ఎమ్మెల్యేల సంతకాలతో లేఖ ఇచ్చి, మిగిలినది తాను సభలో నిరూపించుకుంటానని చెప్పాలని చూస్తున్నట్లు సమాచారం. అయితే గవర్నర్ ముందుగా డీజీపీ, సీఎస్, ఇంటెలిజెన్స్ చీఫ్ తదితరులను పిలిపిస్తారు. ఆ తర్వాత తనవద్ద ఉన్న ఆప్షన్స్ ఏంటో చూసుకుంటారు. ఈ నేపథ్యంలో తమిళ రాజకీయాలు సాయంత్రం తర్వాత మరింత వేడెక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. -
చిలమత్తూరులో క్యాంపు రాజకీయం
హిందూపురం అర్బన్ : హిందూపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో చెలరేగిన అసమ్మతి జ్వాలలు చిలమత్తూరు, లేపాక్షి మండలాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఈరెండు మండలాల ఎంపీపీలు ఎమ్మెల్యే పీఏ శేఖర్‌కు మద్దతుగా నిల్వడంతో అతడి అవినీతిలో వీరికి భాగముందని అసమ్మతి టీడీపీ నాయకులు వీరిపై వేటు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈనేపథ్యంలో చిలమత్తూరులో రాజకీయం రసవత్తరంగా మారింది. చిలమత్తూరు ఎంపీపీ నౌజియాబానుతో మండలంలో 15 మంది ఎంపీటీసీలు ఉండగా వీరిలో 11 మంది ఎంపీటీసీల మద్దతుతో ఎంపీపీగా ఎన్నికయ్యారు. అయితే రాజకీయ పరిణామాలతో ప్రస్తుతం టీడీపీలో ఉన్న ఎంపీటీసీలు కొందరు జారిపోయే అవకాశం ఉండటంతో ఎంపీపీ మరిది అన్సార్ ఎంపీటీసీల మద్దతును కూడగట్టుకుని బలంగా ఉన్నట్లు నిరూపించుకోవడానికి క్యాంపు రాజకీయానికి తెరలేపుతున్నారు. తనకు మద్దతుగా ఉన్న ఎంపీటీసీలందరినీ చిత్తూరు జిల్లా పీఏ శేఖర్ స్వగ్రామం చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం పుల్లయ్యగారిపల్లి సమీపంలోకి రెండు, మూడురోజుల్లో తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేసున్నట్లు తెలిసింది. కాగా జెడ్పీటీసీ సభ్యుడు లక్ష్మీనారాయణరెడ్డి ప్రెస్మీట్లో రెండున్నరేళ్లు పాలన పూర్తి చేసిన నౌజియాబానును తొలగించి మరొకరికి అవకాశం కల్పించాలని పార్టీ అధిష్టానానికి డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎమ్మెల్యే బాలకృష్ణ వచ్చిన తర్వాత పార్టీ ఎంపీటీసీలందరూ తనకు అనుకూలంగా ఉన్నట్లు చూపించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే రీతిలో లేపాక్షి ఎంపీపీ హనోక్‌కు రెండున్నరేళ్లు పూర్తి చేసుకున్నారని అక్కడ కూడా మార్చాలని కొందరు భావిస్తున్నట్లు తెలిసింది. ఇదేరీతిలో వీరిని కూడా క్యాంపు రాజకీయం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. -
రహస్య ప్రాంతానికి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు
-
రహస్య ప్రాంతానికి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు
చెన్నై: శరవేగంగా సమీకరణాలు మారుతుండడంతో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్ జాగ్రత్త పడుతున్నారు. తనకు మద్దతు ఇచ్చిన ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు క్యాంపు రాజకీయాలకు తెర తీశారు. ఇందుల్లో భాగంగా 130 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను శశికళ వర్గీయలు బస్సుల్లో రహస్య ప్రాంతానికి తరలించారు. వీరందరినీ ఓ హోటల్ కు తరలించినట్టు సమాచారం. మరోవైపు తాను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేందుకు శశికళ రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తమకు అపాయింట్ మెంట్ ఇవ్వాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని శశికళ వర్గీయులు కోరారు. రాష్ట్రపతి అంగీకరిస్తే 130 మంది ఎమ్మెల్యేలను ఢిల్లీకి తీసుకెళ్లే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రపతి భవన్ లో 130 మంది ఎమ్మెల్యేలతో పరేడ్ నిర్వహించాలని శశికళ భావిస్తున్నట్టు సమాచారం. అలాగే గవర్నర్ తీరుపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేయాలని అన్నాడీఎంకే నిర్ణయించింది. శశికళపై తిరుగుబాటు చేసిన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వెంట ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. -
కారెక్కి.. క్యాంపులకు..!
- ఇతర రాష్ట్రాలకు స్థానిక ప్రజాప్రతినిధులు - ఓట్లు కాపాడుకునే పనిలో టీఆర్ఎస్ నాయకత్వం సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల కోటాలో జరుగుతున్న శాసనమండలి ఎన్నికలు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు భలే డిమాండ్ తెచ్చిపెట్టాయి. కాంగ్రెస్, టీడీపీల నుంచి టీ ఆర్ఎస్ గూటికి చేరిన వారి మనసు మారకుం డా, మళ్లీ తమ పాత పార్టీల గడప తొక్కకుం డా, ప్రలోభాలకు లొంగకుండా గులాబీ నేతలు అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏ జిల్లాలో ఎవరు అభ్యర్థి అనేది ముందే స్పష్టత ఉన్న ఆయా జిల్లాల మంత్రు లు కొంత చొరవ తీసుకుని బృందాలుగా వీరందరినీ విహార యాత్రలకు తరలించారు. అదే సమయంలో సొంత పార్టీ ప్రతినిధులూ నారా జ్ కాకుండా వారినీ క్యాంపులకు పంపించారు. పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉందని భావిస్తున్న జిల్లాల నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, కౌన్సిలర్లను క్యాంపులకు తరలించేందుకు ముందుగానే మేల్కొన్నారు. దక్షిణ తెలంగాణలోనే పోటీ తీవ్రం తొమ్మిది జిల్లాల పరిధిలోని 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నా... ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో పోటీ దాదాపు ఏకపక్షమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ జిల్లాల్లో టీఆర్ఎస్కు అత్యధికంగా స్థానిక ప్రజాప్రతినిధులు ఉండడం, ప్రతిపక్షాలకున్న కొద్దిమంది టీఆర్ఎస్ బాట పట్టడంతో సంఖ్య పెరిగింది. దీంతో ఆయా జిల్లాల మండలి స్థానాల్లో గెలుపుపై టీఆర్ఎస్ ధీమాతో ఉంది. కానీ, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో పరిస్థితి వేరు గా ఉంది. ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో కాం గ్రెస్, టీడీపీలకు టీఆర్ఎస్ కంటే ఎక్కువ మం ది ప్రజాప్రతినధులు ఉన్నారు. అయితే, వీరిలో అత్యధికులు టీఆర్ఎస్లో చేరారు. వీరందరితో పాటు, స్థానిక ఎన్నికల్లో తాము గెలుచుకున్న స్థానాల సంఖ్యను కలుపుకొని తమ అభ్యర్ధుల విజయానికి కావాల్సిన ఓట్లున్నాయని ధీమా వ్యక్తం చేస్తోంది. ఖమ్మం జిల్లాలో సీపీఐ అభ్యర్ధికి టీడీపీ, కాంగ్రెస్, సీపీఎంలు మద్దతు ఇస్తుండడంతో పోటీ తీవ్రంగా ఉంది. ఈ పరిస్థితుల్లో తమకున్న ఓట్లను కాపాడుకోవాల్సిన పరిస్థితిలో అధికార పార్టీ పడిపోయింది. నల్లగొండ జిల్లాలో మూడు విభాగాల్లో కలిపి 1,102మంది ప్రతినిధులుండగా, కాంగ్రెస్ చేతి లోని 546 మందికి గాను వలసల తర్వాత 400 మందే మిగిలారు. కాగా, కేవలం 136 మందే ప్రతినిధులున్న టీఆర్ఎస్ ప్రస్తుతం ఆ సంఖ్య ను 455కు పెంచుకుంది. దీంతో ఇరు పార్టీల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టుంది. వీట న్నింటి దృష్ట్యా ఓట్లు కాపాడుకునేందుకు టీఆర్ఎస్ క్యాంపు రాజకీయాలకు తెరలేపింది. ఖర్చులు తడిసి మోపెడు అభ్యర్థిత్వం ఖరారు కాక ముందే నల్లగొండ జిల్లా నుంచి తమ ప్రతినిధులను వివిధ ప్రాంతాలకు తరలించారు. గోవా, కేరళ రాష్ట్రంలోని మునార్, కొచ్చి తదితర ప్రాంతాలకు వీరిని పంపించారు. ఈ ఖర్చంతా అభ్యర్థిపైనే పడనుంది. ఏ నియోజకవర్గానికి ఆ నియోజకర్గాల ఎమ్మెల్యేలు, ఇన్చార్జిలు తమ నమ్మకస్తులతో క్యాంపులు పెట్టించారు. వీరు కూడా కొం త ఖర్చు భరిస్తున్నారని, ఒక్కో ఎమ్మెల్యేకు కనీసం రూ.25లక్షల బడ్జెట్ కేటాయించే అవకాశం ఉందని తెలిసింది. ఖమ్మం జిల్లా సభ్యులను సోమవారం క్యాంప్‌లకు తరలించనున్నట్టు సమాచారం. రంగారెడ్డి జిల్లా నాయకత్వం క్యాంపుల ఏర్పాటుకు ప్రదేశాలను ఎంపిక చేసినా, కాంగ్రెస్‌తో ఒక్కో సీటు విషయంలో అవగాహన కుద రవచ్చనే అనుమానంతో వాయిదా వేసుకున్నారని చెబుతున్నారు. -
శిబిరానికి గుడ్‌బై!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లా పరిషత్ చైర్మన్‌గిరీ క్యాంపు రాజకీయాలు కొత్త మలుపు తిరిగాయి. తడిసిమోపెడవుతున్న భారాన్ని భరించలేక కాంగ్రెస్ పార్టీ క్యాంపు ఎత్తివేసింది. చైర్మన్ ఎన్నికపై ప్రభుత్వం ఇంకా నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం.. ఇప్పటికే క్యాంపుల నిర్వహణతో జేబులు ఖాళీ అవుతుండడంతో జెడ్పీటీసీలను ఇంటిదారి పట్టించింది. స్పష్టమైన మెజార్టీ రాకపోయినప్పటికీ, అధిక స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్.. ఈసారి ఎలాగైనా జెడ్పీ పీఠాన్ని దక్కించుకోవాలని భావించింది. చిరకాల ప్రత్యర్థి టీడీపీతో దోస్తీ కట్టడం ద్వారా కుర్చీని ఎగురేసుకుపోవాలని ఆశించింది. ఈ క్రమంలో 14మంది జెడ్పీటీసీలను విహార యాత్రకు త రలించింది. గత పక్షం రోజులుగా గోవాలో విహరించిన సభ్యులకు మోహం మోత్తింది. ఇంటి బెంగ కూడా పట్టుకుంది. ఇప్పటివరకు నోటిఫికేషన్ రాకపోవడం, ఎప్పుడు వస్తుందో తెలియకపోవడం కూడా వారిని ఇంటికి వెళ్లేందుకు ప్రేరేపించింది. మరోవైపు శిబిరాల నిర్వహించలేక సతమతమవుతున్న చైర్మన్ పదవి ఆశావహుడు సైతం.. క్యాంపునకు తాత్కాలిక విరామం ప్రకటించాలని నిర్ణయించారు. దీంతో కొంతమేర ఖర్చును తగ్గించుకోవచ్చని ఆశించారు. ఈక్రమంలోనే శిబిరాన్ని ఎత్తివేశారు. దీంతో ఆ పార్టీ సభ్యులు ఇంటిముఖం పట్టడంతో అసలు కథ మొదలైంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పగ్గాలు చేజిక్కించుకున్న టీఆర్ఎస్ తాజాగా జెడ్పీ పీఠాన్ని దక్కించుకోవాలనే లక్ష్యానికి మరింత పదును పెట్టింది. ఎక్కువమంది సభ్యులున్న కాంగ్రెస్ క్యాంపుపై చేతులెత్తేయడంతో.. ఆ పార్టీ సభ్యులపై గులాబీ శిబిరం గురిపెట్టింది. దీంతో జెడ్పీ రాజకీయం రసకందాయంలో పడింది. జిల్లా పరిషత్‌లో 33 సభ్యులకుగాను కాంగ్రెస్ పార్టీ 14 స్థానాలను కైవసం చేసుకోగా.. టీఆర్ఎస్ 12, టీడీపీ ఏడు స్థానాలను గెలుచుకున్నాయి. జెడ్పీ పీఠం దక్కాలంటే కనిష్టంగా 17 మంది సభ్యులుం డాలి. అయితే ఏపార్టీకీ స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో.. ప్రధాన పార్టీలు పీఠాన్ని దక్కించుకునేందుకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటుచేసి ప్రత్యర్థి పార్టీల సభ్యులను ఆకర్షించుకునే ఎత్తుగడ వేశాయి. ఇందులో భాగంగా కాంగ్రెస్, టీఆర్ఎస్లు పోటాపోటీగా శిబిరాలు నిర్వహిస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ శిబిరం ఎత్తేయడంతో ఆ పార్టీ సభ్యులు ఇంటిబాట పట్టారు. అయితే ఇదే అదనుగా భావించిన టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ సభ్యులను తమ దారికి తెచ్చుకునే పనిలో పడింది. ఒకవైపు కేబినె ట్లో బెర్తు దక్కించుకున్ను టీఆర్ఎస్ నేత.. జెడ్పీ పీఠాన్ని సైతం కైవసం చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. -
శిబిరాలకు విజేతలు
నిజామాబాద్ అర్బన్, న్యూస్‌లైన్ : జిల్లాలోని కార్పొరేషన్‌తోపాటు మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన అ నంతరమే గెలిచిన అభ్యర్థు లు క్యాంపులకు తరలివెళ్లారు. మేయర్, చైర్మన్ స్థానాలపై కన్నేసిన ప్రధాన పా ర్టీలు తమ పార్టీలకు చెంది న వారిని విహార యాత్రల కు తీసుకెళ్లాయి. అయితే సార్వత్రిక ఎన్నికల ఫలితా లు వెలువడిన అనంతరమే నిజామాబాద్ నగరంతో పాటు పురపాలక సంఘాలకు పాలక వర్గాలు ఏర్పాటు కానున్నాయి. అప్పటి వరకు చైర్మన్ పీఠాలను కైవసం చేసుకోవాలని ఆరాట పడుతున్న పార్టీలు ఆగాల్సిందే. ఈనెల 16న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం పురపాలక సంఘాలకు ఎక్స్-అఫీషియో సభ్యులుగా ఎమ్మెల్యేల ఓట్లు అవసరమవుతాయి. ఎన్నికల్లో విజయం సాధించిన వారు కార్పొరేటర్లు, కౌన్సిలర్లుగా ప్రమాణ స్వీకారం, మేయర్, మున్సిపల్ చైర్మన్ల ఎన్నికలకు అధికారులు తేదీలను ఖరారు చేయనున్నారు.అయితే ఈ ప్రక్రియ పూర్తి కావడానికి మరో పదిహేను రోజులైనా పట్టొచ్చని అంటున్నారు. నిజామాబాద్ కార్పొరేషన్లో కాంగ్రెస్ నుంచి 16 మంది, ఎంఐఎం నుంచి 16 మంది, టీఆర్ఎస్ నుంచి 10 మంది, బీజేపీ నుంచి 6 ఆరుగురు, స్వతంత్రులు ఇద్దరు విజయం సాధించారు. మేయర్ పీఠం దక్కించుకోవాడానికి కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు పోటీ పడుతున్నాయి. ఇందులో టీఆర్ఎస్ పాత్ర కీలకంగా మారింది. దీంతో కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు తమ అభ్యర్థులను క్యాంపులకు తరలించడంతో పాటు టీఆర్ఎస్, బీజేపీ, స్వతంత్రుల మద్దతు కోసం ప్రయత్నిస్తున్నాయి. ఆర్మూర్ మున్సిపాలిటీలో 23 వార్డులకుగాను కాంగ్రెస్-11, టీఆర్ఎస్-10, బీజేపీ-1 , టీడీపీ-1 స్థానాలు సాధించాయి. అధికారం కోసం కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య పోటీ నెలకొంది. ఇందులో టీడీపీ, బీజేపీ మద్దతు, ఎక్స్ అఫీషియో ఓటు కీలకంగా మారనున్నాయి. బోధన్ పురపాలక సంఘం పరిధిలో మొత్తం 35 వార్డులు ఉండగా టీఆర్ఎస్-9, కాంగ్రెస్-15, బీజేపీ-3, టీడీపీ-1, ఎంఐఎం-7 సీట్లు సాధించాయి. ఇక్కడి మున్సిపల్ చైర్మన్ స్థానం కోసం టీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్య పోటీ నెలకొంది. ఇతర పార్టీలకు చెందిన వారి మద్దతు పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. తమ పార్టీలకు చెందిన అభ్యర్థులను క్యాంపుకు తరలించాయి. -
శిబిరాలకు వేళాయే!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రాదేశిక ఫలితాలు వెలువడిందే తరువాయి క్యాంపు రాజకీయాలు ఊపందుకున్నాయి. పలు మండలాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ దక్కకపోవడంతో చైర్మన్ అభ్యర్థులు శిబిరాలకు సన్నాహాలు చేస్తున్నారు. పోలింగ్ సరళిని విశ్లేషించుకొని హంగ్ తీర్పు వస్తుందని అంచనాకొచ్చిన ఆశావహులు మంగళవారం ఫలితాలు వెల్లడికాగానే విజేతలతో సంప్రదింపుల పర్వానికి తెరలేపారు. బహుముఖ పోటీ నెలకొనడంతో చాలా మండలాల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. దీంతో మండల పీఠం దక్కించుకోవడానికి అవసరమైన సంఖ్యాబలాన్ని కూడగట్టుకునేందుకు బేరసారాలకు దిగారు. ఈ క్రమంలో ఇతరులు, స్వతంత్రులకు ప్రధాన పార్టీలు గాలం వేస్తున్నాయి. మరోవైపు ప్రత్యర్థులకు గాలానికి చిక్కకుండా సొంత పార్టీ సభ్యులను కూడా విహారయాత్రలకు పంపే పనిలో బిజీగా మారారు. మండల, జెడ్పీ చైర్మన్ ఎన్నికలు వచ్చే నెలలో ఉండడంతో అప్పటివరకు వీరిని కాపాడేందుకు క్యాంపుల్లో ఉంచడం శ్రేయస్కరమని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో అవసరమైన సంఖ్యలో స్వతంత్ర అభ్యర్థులను మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. గెలిచిన అభ్యర్థులను కౌంటింగ్ కేంద్రాల నుంచే నేరుగా తమ శిబిరాలకు తరలించి విందు, వినోదాలు ఏర్పాటు చేస్తున్నారు. వారి కోరికలను తీర్చేందుకు ఎంత ఖర్చయినా వెనుకాడడం లేదు. ఇప్పటికే పూడూరులో ఎంపీపీ హంగ్ అవడంతో అక్కడ కీలకంగా మారిన ఇండిపెండెంట్ సభ్యుడిని మచ్చిక చేసుకునే పనిలో టీఆర్ఎస్ నిమగ్నమైంది. ఏకంగా కౌంటింగ్ హాల్ నుంచే ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి సదరు సభ్యుడిని కారెక్కించుకొని తీసుకెళ్లడం చూస్తే ఇక్కడ ఫలితం తారుమారయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఆశావహులకే క్యాంపుల భారం క్యాంపుల నిర్వహణ బాధ్యతను చైర్మన్ పదవి ఆశిస్తున్నవారికే అప్పగించారు. చైర్మన్ ఎన్నిక ముగిసేవరకు పార్టీ సభ్యులను కాపాడుకోవడమేకాకుండా.. వారిని సంతృప్తి పరిచే బాధ్యత కూడా వీరికే కట్టబెట్టారు. అధిష్టానం కూడా ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ అభ్యర్థులే శిబిరాల నిర్వహణ వ్యయాన్ని భరించాలని ఆదేశించిన నేపథ్యంలో ఆ మేరకు నిధులను సమకూర్చుకున్నారు. మరోవైపు హంగ్ రావడంతో తమ పంట పండిందని భావిస్తున్న విజేతలైన స్వతంత్ర ఎంపీటీసీ, జెడ్పీటీసీలు గొంతెమ్మ కోరికలు కోరుతున్నారు. ‘అవన్నీ మేం చూసుకుంటాం. ముందైతే కారెక్కండి’ అంటూ ప్రధాన పార్టీల నేతలు స్వంతంత్రులను బుజ్జగిస్తున్న దృశ్యాలు అనేకం కౌంటింగ్ కేంద్రాల వద్ద దర్శనమిస్తున్నాయి. టీఆర్ఎస్ జోరు రాజకీయ శిబిరాల నిర్వహణలో మిగిలిన పార్టీల కంటే టీఆర్ఎస్ ఓ అడుగు ముందుంది. తెలంగాణ తదుపరి ప్రభుత్వం మాదేనంటూ స్వతంత్రుల డిమాండ్లను నెరవేర్చేందుకు సిద్ధమంటూ హామీలిస్తూ అందిన వారిని ఎగరేసుకుపోతున్నారు. పార్టీలోకి వచ్చే వారందరికీ ప్రత్యేక స్థానం కల్పిస్తామని నచ్చజెప్తున్నారు. కీలకమైన పదవులు, ప్రయోజనాలు ఆశచూపుతున్నారు. జిల్లాలో తక్కువ స్థానాల్లోనే టీఆర్ఎస్ గెలుపొందినా హంగ్ ఏర్పడిన స్థానాలనైనా కైవసం చేసుకోవాలని గులాబీ దళం ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా చెప్పుకోదగ్గ స్థాయిలో ఎంపీటీసీలు గెలుపొందిన టీడీపీ, బీజేపీ అభ్యర్థులపై గులాబీ శిబిరం వల విసురుతోంది. ఏ పార్టీ అయితే బెటర్ అని ముందుగానే అంచనా వేసుకుంటున్న స్వతంత్రుల కూడా టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారు. కాంగ్రెస్ జోష్ మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా అప్రమత్తమైంది. అధిష్టానం ఆదేశాల మేరకు ఆ పార్టీ నేతలు కూడా క్యాంపుల నిర్వహణలో చురుగ్గా ఉన్నారు. కొందరు అభ్యర్థుల మద్దతిస్తే తమ పార్టీ జెడ్పీటీసీ, ఎంపీపీ పదవులను సొంతం చేసుకోవచ్చనుకున్న స్థానాల్లో స్వంతంత్రులను కాకా పట్టేందుకు కాంగ్రెస్ నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కారు పార్టీకి దీటుగా నజరానాలు ప్రకటిస్తున్నారు. మున్సిపల్, స్థానిక సంస్థల్లో తెలంగాణ వ్యాప్తంగా తమ పార్టీకే ఎక్కువ స్థానాలొచ్చాయని, దీన్ని బట్టి సార్వత్రిక ఎన్నికల్లో కూడా మేమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటూ కాంగ్రెస్ నేతలు భరోసా ఇస్తున్నారు. కొత్త ప్రభుత్వంలో భారీ ప్రయోజనాలు కల్పిస్తామంటూ విజేతలకు ఆఫర్లు ప్రకటిస్తున్నారు. -
పురలో పైచేయి
మూడు మున్సిపాలిటీలు కాంగ్రెస్ కైవసం - రెండు చోట్ల టీడీపీ, బీజేపీలు కలిస్తే అవకాశం - 210 వార్డుల్లో .. కాంగ్రెస్ ఖాతాలో104 వార్డులు - 42 వార్డులకు పరిమితమైన టీడీపీ - హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్‌కు దక్కని స్పష్టమైన మెజారిటీ - కోదాడ, హుజూర్‌నగర్‌లలో ఖాతా తెరిచిన వైఎస్సార్ కాంగ్రెస్ సాక్షిప్రతినిధి, నల్లగొండ,పుర జాతకం తేలింది. కాంగ్రెస్ తన పట్టు నిరూపించుకుంది. నల్లగొండ, మిర్యాలగూడ మున్సిపాలిటీలు, దేవరకొండ నగర పంచాయతీలను, హుజూర్నగర్ నగర పంచాయతీని సీపీఐతో కలిసి కాంగ్రెస్ సొంతం చేసుకుంది. భువనగిరి, సూర్యాపేట మున్సిపాలిటీల్లో టీడీపీ, బీజేపీలు కలిస్తే పాలకవర్గాన్ని ఏర్పాటు చేసే అవకాశముంది. ఇక, కోదాడలో కాంగ్రెస్‌కు 14 వార్డుల్లో విజయం లభించినా పాలకవర్గాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన పూర్తిస్థాయి మెజారిటీకి 2 స్థానాలతో వెనుకబడింది. ఇక్కడ టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఎంలు కలిసినా, మరో స్థానం తక్కువగా ఉండడంతో ఉన్నొక్క ఇండిపెండెంటు, సార్వత్రిక ఎన్నికల్లో గెలవబోయే ఎమ్మెల్యే (ఎక్స్ అఫీషియో మెంబరు)ఓటు కీలకం కానున్నాయి. మొత్తంగా మున్సిపాలిటీల ఫలితాలను విశ్లేషిస్తే, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న కొన్ని స్థానాల్లో ఆయా పార్టీలు బొక్కబోర్లా పడ్డాయి. సూర్యాపేట నియోజకవర్గానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆర్.దామోదర్‌రెడ్డి ప్రాతినిధ్యం వహించగా, ఇక్కడ 36 వార్డులకు గాను కాంగ్రెస్ కేవలం 9 స్థానాలకే పరిమితమైంది. అదే మాదిరిగా మిర్యాలగూడ ఎమ్మెల్యేగా సీపీఎంకు చెందిన జూలకంటి రంగారెడ్డి, 36 వార్డులున్న మిర్యాలగూడ మున్సిపాలిటీలో కేవలం రెండువార్డులు మాత్రమే సీపీఎం ఖాతాలో వేయగలిగారు. ఇక్కడ కాంగ్రెస్ ఏకంగా 30 స్థానాలను సొంతం చేసుకుని తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించింది. నల్లగొండ మున్సిపాలిటీలో 40 స్థానాలకు గాను కాంగ్రెస్ 22 వార్డుల్లో గెలిచి మున్సిపాలిటీని సొంతం చేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ హుజూర్‌నగర్‌లో రెండు వార్డులు, కోదాడ ఒక వార్డు గెలుచుకుని ఖాతా తెరిచింది. ఇక, భువనగిరి, సూర్యాపేట, కోదాడ మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. హుజూర్‌నగర్‌లో మాత్రం మిత్రపక్షమైన సీపీఐ సాయం లేకుండా కాంగ్రెస్ గట్టేక్కే పరిస్థితి లేదు. చైర్మన్, వైఎస్ చైర్మన్ ఎన్నికకు జూన్ 2వ తేదీ తర్వాతనే అవకాశం ఉండడంతో ఈ రెండు వారాలకు పైగా గెలిచిన తమ అభ్యర్థులను కాపాడుకోవడం ఆయా పార్టీలకు తలకు మించిన భారమే కానుంది. దీంతో క్యాంపు రాజకీయాలు నడపాల్సిన అగత్యమూ కనిపిస్తోంది. ఇప్పటికిప్పుడు క్యాంపు రాజకీయాలపై స్పష్టమైన సమాచారమేదీ లేకున్నా, ఈమూడు చోట్లా క్యాంపు రాజకీయాలు నడవడం కచ్చితమన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.