సాక్షి, బెంగళూర్ : కర్ణాటకలో జేడీయూ- కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని అస్ధిరపరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న ప్రచారం నేపథ్యంలో రాజకీయ హైడ్రామా కొనసాగుతోంది. బెంగళూర్‌లో సోమవారం మరోసారి సీఎల్పీ భేటీకి మాజీ కర్ణాటక సీఎం, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య పిలుపు ఇచ్చారు. వారం రోజుల కిందట జరిగిన సీఎల్పీ భేటీకి నలుగురు ఎమ్మెల్యేలు గైర్హాజరైన నేపథ్యంలో సీఎల్పీ భేటీకి హాజరుకాని వారిపై ఫిరాయింపు నిరోధక చట్టం వర్తిస్తుందని సిద్ధరామయ్య హెచ్చరించారు.
పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసేందుకు నిర్ణయించుకునే సదరు ఎమ్మెల్యే హాజరు కాలేదని భావించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కాగా వారం రోజుల వ్యవధిలో మరోసారి జరుగుతున్న కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేల సీఎల్పీ భేటీ ప్రాధాన్యత సంతరించుంది.మరోవైపు బెంగళూరు రిసార్ట్స్‌లో బస చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో పార్టీ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్‌కు గాయాలవడంతో ఆయనను ఆదివారం ఆస్పత్రికి తరలించారు. ఇక గత వారం జరిగిన సీఎల్పీ భేటీకి హాజరు కాని నలుగురు ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment