clp meet
-
Karnataka: నేడూ సీఎల్పీ భేటీ?
బనశంకరి: ఆదివారం నాటి సీఎల్పీ సమావేశానికి చాలామంది ఎమ్మెల్యేలు హాజరుకాలేదు. దాంతో నూతన సభ్యులందరి అభిప్రాయాలు తెలుసుకునేందుకు భేటీ సోమవారం కూడా కొనసాగుతుందని భావిస్తున్నారు. సిద్దరామయ్యకు 75 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండగా 40 మంది డీకే శివకుమార్ వెంట ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో వారిద్దరూ సీఎం పదవిని చెరో రెండున్నరేళ్లు పంచుకునేలా సూత్రంపైనా ఆదివారం భేటీలో చర్చించారు. సిద్ధరామయ్య, డీకే సోమవారం ఢిల్లీ వెళతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో సోనియాగాంధీ, రాహుల్ సమక్షంలో సీఎం అంశం కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు. -
క్లైమాక్స్ ఏంటి?.. సీఎం ఎవరు?.. నేడు ఢిల్లీకి సిద్దూ, డీకే?
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి ఎంపిక అంత తేలికగా ముగిసేలా కనిపించడంలేదు. సీఎం అభ్యర్థిని నిర్ణయించే అధికారాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకే నూతన ఎమ్మెల్యేలు కట్టబెట్టారు. ఆదివారం సాయంత్రం బెంగళూరులోని ఓ హోటల్లో కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘన విజయానికి కారకులైన నాయకులు, కార్యకర్తలు, కర్ణాటక ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ తొలుత పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సమావేశం ఆమోదించింది. అనంతరం సీఎం ఎంపిక అధికాన్ని ఖర్గేకు అప్పగిస్తూ మాజీ సీఎం సిద్దరామయ్య ప్రవేశపెట్టిన ఏక వాక్య తీర్మానాన్ని కూడా ఎమ్మెల్యేలు ఆమోదించినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. అధిష్టానం తరఫున ఖర్గే నియమించిన ముగ్గురు పరిశీలకులు సీఎం అభ్యర్థిపై ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకుంటారని చెప్పారు. ఆదివారం ఈ తతంగం పూర్తి చేసి సోమవారానికల్లా ఖర్గేకు వారు నివేదిక అందజేస్తారన్నారు. ఖర్గే నియమించిన పరిశీలకుల కమిటీలో మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్‌కుమార్ షిండే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జితేంద్ర సింగ్, ఏఐసీసీ మాజీ కార్యదర్శి దీపక్ బబారియా ఉన్నారు. వీరు, వేణుగోపాల్ అంతకుముందు సీఎం రేసులో ఉన్న సిద్దరామయ్య, డీకే శివకుమార్‌లతో వేర్వేరుగా భేటీ అయ్యారు. చదవండి: ఓవర్ టు రాజస్తాన్ కార్యకర్తల హడావుడి సీఎల్పీ భేటీ జరిగిన హోటల్ బయట కాంగ్రెస్ కార్యకర్తల హడావుడి కనిపించింది. సిద్దరామయ్య, శివకుమార్ వర్గీయులు బ్యానర్లు, జెండాలు చేతబూని తమ నేతే సీఎం అంటూ నినాదాలు చేశారు. అంతకుముందు ఇద్దరు నేతలు తమకు మద్దతు తెలిపే ఎమ్మెల్యేలతో వేర్వేరుగా భేటీలు జరిపారు. రెండు వర్గాలు పోటాపోటీగా పోస్టర్లు వేశాయి. ఇద్దరు నేతల నివాసాల వద్ద కూడా పోస్టర్లు కనిపించాయి. ఎన్నికలకు ముందు పార్టీ నేతలను ఒకే తాటిపైకి తేవడంలో సఫలీకృతమైన కాంగ్రెస్ పార్టీ ఫలితాల తర్వాత అదే ఐక్యతను కొనసాగించడానికి ఇబ్బందులు పడుతోంది. కర్ణాటక అసెంబ్లీ గడువు ఈ నెల 24తో ముగియనుంది. తాజా ఎన్నికల్లో పూర్తిస్థాయి మెజారిటీ సాధించిన కాంగ్రెస్ ఆలోపు ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉంది. -
కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయంపై ఉత్కంఠ.. సిద్ధూ, డీకేల్లో సీఎం ఎవరో!
సాక్షి బెంగళూరు: విభేదాలు పక్కన పెట్టి ఒక్కతాటిపై నిలిచి కాంగ్రెస్‌ను గెలుపు బాటన నడిపిన మాజీ సీఎం సిద్ధరామయ్య, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ మధ్య సీఎం పీఠం కోసం తీవ్ర పోటీ నెలకొంది. మరికొందరు సీనియర్లు కూడా రేసులో ఉండటంతో ఎంపిక అధిష్టానానికి సవాలుగా మారింది. సీఎం అభ్యర్థిని ఎన్నుకునేందుకు ఆదివారం సాయంత్రం కీలకమైన కాంగ్రెస్ శాసనసభా పక్ష భేటీ జరగనుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఇప్పటికే బెంగళూరు చేరారు. అధిష్టానం ఎవరికి ఓటేస్తుందన్నది ఆసక్తికరం. వెనుకబడిన వర్గానికి చెందిన సిద్ధరామయ్య సీఎం రేసులో ముందంజలో ఉన్నట్టు చెబుతున్నారు. అయితే పార్టీని అధికారంలోకి తేవడంలో ట్రబుల్ షూటర్ శివకుమార్ కూడా తీవ్రంగా శ్రమించారు. పైగా 61 ఏళ్ల డీకేకు గాంధీ కుటుంబం ఆశీస్సులున్నాయి. అయితే పార్టీ నేతల్లో అత్యధికుల మద్దతు సిద్ధూ సొంతం. చదవండి: హంగ్ అడ్డుగోడ బద్ధలు వీరిద్దరి మధ్య వివాదాలకు తావు లేని రీతిలో అధికార పంపిణీ చేయాలని అధిష్టానం యోచనగా చెబుతున్నారు. ఇకపై ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించిన 75 ఏళ్ల సిద్ధూకు సీఎం, డీకేకు డిప్యూటీ, లేదా కీలక మంత్రి పదవి ఇచ్చి కొంతకాలానికి వారిని పరస్పరం మారుస్తారని భావిస్తున్నారు. దళిత నేత వైపు అధిష్టానం మొగ్గితే పరమేశ్వరకు చాన్సుంటుంది. బీజేపీకి ఓటు బ్యాంకుగా ఉన్న లింగాయతులు ఈసారి కాంగ్రెస్ వైపు నిలిచినందున ఆ వర్గానికి చెందిన పాటిల్‌కు అవకాశమివ్వాలన్న డిమాండ్లూ విన్పిస్తున్నాయి. -
తెలంగాణ: అసెంబ్లీ ఆవరణలో సరదా సన్నివేశం
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డికి.. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డికి మధ్య నడిచే మాటల యుద్ధం గురించి ప్రత్యేకంగా తెలియంది కాదు. ఒకే ఇంట్లో సాగే టామ్ అండ్ జెర్రీ గోలలాగా.. ఒకేపార్టీలో ఉంటూ వీళ్లు ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు ఈ ఫైర్‌బ్రాండ్స్. ఈ క్రమంలో.. ఇవాళ(శుక్రవారం) ఆసక్తికర ఘటన ఒకటి చోటు చేసుకుంది. అసెంబ్లీ అవరణలో రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి ఎదురు పడ్డారు. సీఎల్పీకి వచ్చిన వీళ్లు తారసపడడంతో మీడియా ఆసక్తిగా వీళ్ల కలయికను చిత్రీకరించే యత్నం చేసింది. అది గమనించిన ఇద్దరూ చేతిలో చెయ్యేసుకుని సరదాగా సంభాషించారు. మా ఇద్దరి మద్య ఉంది తోటికోడలు పంచాయితీనే అంటూ చమత్కరించారు వాళ్లు. ‘మా ఇద్దరి మధ్య ఎలాంటి విబేధాలు లేవు. మాది తోడికోడళ్ళ పంచాయితీ. పొద్దున తిట్టుకుంటాం.. సాయంత్రానికి మళ్లీ కలిసిపోతాం’ అని కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. కలిసి నప్పుడు నవ్వుకొవ్వొద్దా.. కాంగ్రెస్‌ల ఒకరిని గుంజి గద్దె ఎక్కడం కుదరదు. టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ యాత్రకు మద్దతు ఇస్తానని చెప్పిన కదా అంటూ ఈ సందర్భంగా జగ్గారెడ్డి గుర్తు చేశారు. ఇంకా పదేళ్లు ఐనా.. రేవంత్ రెడ్డి దిగిపోయిన తర్వాతనే తాను పీసీసీ అధ్యక్షుడిని అవుతానని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఈ సమయంలో రేవంత్, చుట్టుపక్కల ఉన్నవాళ్లంతా నవ్వులు చిందించారు. #jaggannamla #Revanthreddy pic.twitter.com/4xuXbzqY4m — S-Punna Reddy (@125PunnaReddy) December 2, 2022 -
నేడు వైఎస్సార్సీపీ శాసనసభా పక్ష నేతగా వైఎస్ జగన్ ఎన్నిక
-
కర్ణాటక హైడ్రామా : నేడు సీఎల్పీ భేటీ
సాక్షి, బెంగళూర్ : కర్ణాటకలో జేడీయూ- కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని అస్ధిరపరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న ప్రచారం నేపథ్యంలో రాజకీయ హైడ్రామా కొనసాగుతోంది. బెంగళూర్‌లో సోమవారం మరోసారి సీఎల్పీ భేటీకి మాజీ కర్ణాటక సీఎం, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య పిలుపు ఇచ్చారు. వారం రోజుల కిందట జరిగిన సీఎల్పీ భేటీకి నలుగురు ఎమ్మెల్యేలు గైర్హాజరైన నేపథ్యంలో సీఎల్పీ భేటీకి హాజరుకాని వారిపై ఫిరాయింపు నిరోధక చట్టం వర్తిస్తుందని సిద్ధరామయ్య హెచ్చరించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసేందుకు నిర్ణయించుకునే సదరు ఎమ్మెల్యే హాజరు కాలేదని భావించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కాగా వారం రోజుల వ్యవధిలో మరోసారి జరుగుతున్న కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేల సీఎల్పీ భేటీ ప్రాధాన్యత సంతరించుంది.మరోవైపు బెంగళూరు రిసార్ట్స్‌లో బస చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో పార్టీ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్‌కు గాయాలవడంతో ఆయనను ఆదివారం ఆస్పత్రికి తరలించారు. ఇక గత వారం జరిగిన సీఎల్పీ భేటీకి హాజరు కాని నలుగురు ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. -
జానారెడ్డి ఇంట్లో సీఎల్పీ సమావేశం
-
లోటస్ పాండ్‌లో వైఎస్ జగన్ అధ్యక్షతన భేటీ
హైదరాబాద్: హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాను శాసన సభలో అడుగుపెట్టనీయకపోవడంపట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన వైఎస్ఆర్ సీఎల్పీ సమావేశమైంది. లోటస్‌పాండ్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ భేటీ ప్రారంభమైంది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈరోజు ఉదయం నుంచి జరిగిన పరిణామాలపై చర్చించారు. సభలో ప్రతిపక్షం లేకుండా సమావేశాలు జరపడంపై, స్పీకర్ తీరుపై కూడా చర్చిస్తున్నారు. గవర్నర్ వెంటనే జోక్యం చేసుకోవాలని, ఏవిధంగా ఈ అంశంపై ముందుకెళ్లాలని ఆలోచిస్తున్నారు. అయితే, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను ఉల్లంఘించిన అంశంపై న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లినందున రేపు సభకు వెళ్లాలా లేక సోమవారం కోర్టులో తేల్చుకున్నాకే వెళ్లాలా అనే అంశంపై ముఖ్యనేతలతో వైఎస్ జగన్ మాట్లాడుతున్నారు. భవిష్యత్ కార్యాచరణ గురించి సీనియర్ నేతలు చెప్పనున్నారు.