బనశంకరి: ఆదివారం నాటి సీఎల్పీ సమావేశానికి చాలామంది ఎమ్మెల్యేలు హాజరుకాలేదు. దాంతో నూతన సభ్యులందరి అభిప్రాయాలు తెలుసుకునేందుకు భేటీ సోమవారం కూడా కొనసాగుతుందని భావిస్తున్నారు. సిద్దరామయ్యకు 75 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండగా 40 మంది డీకే శివకుమార్ వెంట ఉన్నట్టు ప్రచారం సాగుతోంది.
ఈ నేపథ్యంలో వారిద్దరూ సీఎం పదవిని చెరో రెండున్నరేళ్లు పంచుకునేలా సూత్రంపైనా ఆదివారం భేటీలో చర్చించారు. సిద్ధరామయ్య, డీకే సోమవారం ఢిల్లీ వెళతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో సోనియాగాంధీ, రాహుల్ సమక్షంలో సీఎం అంశం కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment