నిజామాబాద్ అర్బన్, న్యూస్‌లైన్ : జిల్లాలోని కార్పొరేషన్‌తోపాటు మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన అ నంతరమే గెలిచిన అభ్యర్థు లు క్యాంపులకు తరలివెళ్లారు. మేయర్, చైర్మన్ స్థానాలపై కన్నేసిన ప్రధాన పా ర్టీలు తమ పార్టీలకు చెంది న వారిని విహార యాత్రల కు తీసుకెళ్లాయి. అయితే సార్వత్రిక ఎన్నికల ఫలితా లు వెలువడిన అనంతరమే నిజామాబాద్ నగరంతో పాటు పురపాలక సంఘాలకు పాలక వర్గాలు ఏర్పాటు కానున్నాయి. అప్పటి వరకు చైర్మన్ పీఠాలను కైవసం చేసుకోవాలని ఆరాట పడుతున్న పార్టీలు ఆగాల్సిందే. ఈనెల 16న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం పురపాలక సంఘాలకు ఎక్స్-అఫీషియో సభ్యులుగా ఎమ్మెల్యేల ఓట్లు అవసరమవుతాయి.
ఎన్నికల్లో విజయం సాధించిన వారు కార్పొరేటర్లు, కౌన్సిలర్లుగా ప్రమాణ స్వీకారం, మేయర్, మున్సిపల్ చైర్మన్‌ల ఎన్నికలకు అధికారులు తేదీలను ఖరారు చేయనున్నారు.అయితే ఈ ప్రక్రియ పూర్తి కావడానికి మరో పదిహేను రోజులైనా పట్టొచ్చని అంటున్నారు. నిజామాబాద్ కార్పొరేషన్‌లో కాంగ్రెస్ నుంచి 16 మంది, ఎంఐఎం నుంచి 16 మంది, టీఆర్‌ఎస్ నుంచి 10 మంది, బీజేపీ నుంచి 6 ఆరుగురు, స్వతంత్రులు ఇద్దరు విజయం సాధించారు. మేయర్ పీఠం దక్కించుకోవాడానికి కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు పోటీ పడుతున్నాయి. ఇందులో టీఆర్‌ఎస్ పాత్ర కీలకంగా మారింది. దీంతో కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు తమ అభ్యర్థులను క్యాంపులకు తరలించడంతో పాటు టీఆర్‌ఎస్, బీజేపీ, స్వతంత్రుల మద్దతు కోసం ప్రయత్నిస్తున్నాయి. ఆర్మూర్ మున్సిపాలిటీలో 23 వార్డులకుగాను కాంగ్రెస్-11, టీఆర్‌ఎస్-10, బీజేపీ-1 , టీడీపీ-1 స్థానాలు సాధించాయి. అధికారం కోసం కాంగ్రెస్, టీఆర్‌ఎస్ మధ్య పోటీ నెలకొంది.
ఇందులో టీడీపీ, బీజేపీ మద్దతు, ఎక్స్ అఫీషియో ఓటు కీలకంగా మారనున్నాయి. బోధన్ పురపాలక సంఘం పరిధిలో మొత్తం 35 వార్డులు ఉండగా టీఆర్‌ఎస్-9, కాంగ్రెస్-15, బీజేపీ-3, టీడీపీ-1, ఎంఐఎం-7 సీట్లు సాధించాయి. ఇక్కడి మున్సిపల్ చైర్మన్ స్థానం కోసం టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల మధ్య పోటీ నెలకొంది. ఇతర పార్టీలకు చెందిన వారి మద్దతు పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. తమ పార్టీలకు చెందిన అభ్యర్థులను క్యాంపుకు తరలించాయి.
శిబిరాలకు విజేతలు
Published Wed, May 14 2014 4:02 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement