రిషికేష్: హిమాచల్‌ప్రదేశ్ సంక్షోభం మళ్లీ మొదటికి వచ్చినట్లు కనిపిస్తోంది. ఇటీవల రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్‌ఓటింగ్‌కు పాల్పడ్డ ఆరుగురు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలతో పాటు ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు, మరో ఇద్దరు ఎమ్మెల్యేలు మొత్తం 11 మంది తాజాగా శనివారం(మార్చ్ 9) ఒక ప్రత్యేక బస్సులో బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌లోని రిషికేష్ చేరుకున్నారు.
అత్యంత భద్రత నడుమ బస్సు దిగి తాజ్ రిషికేష్ హోటల్‌లోనికి ఎమ్మెల్యేలు వెళ్లారు. శుక్రవారమే హిమాచల్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిశారు. రెబల్స్‌ను మళ్లీ తీసుకుంటారా అని ఢిల్లీలో మీడియా ఆయనను ప్రశ్నించగా తప్పు తెలుసుకుంటే మరో చాన్స్‌కు అర్హులవుతారు అని సుఖు సమాధానమిచ్చారు. ఇంతలోనే రెబల్ ఎమ్మెల్యేలు మళ్లీ క్యాంపునకు వెళ్లడం చర్చనీయాంశమైంది.
కాగా, ఫిబ్రవరిలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు బీజేపీకి ఓటు వేయడంతో బలం లేని కాషాయ పార్టీ అభ్యర్థి రాజ్యసభ ఎంపీగా గెలిచారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మనుసింఘ్వి ఓటమి పాలయ్యారు. ఈ సంక్షోభం తర్వాత స్పీకర్ ఆరుగురు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీ నుంచి బయటపడి మళ్లీ మెజారిటీలోకి వెళ్లింది. అయితే స్పీకర్ నిర్ణయంపై రెబల్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్‌పై సుప్రీం నిర్ణయం వెల్లడించాల్సి ఉంది.
ఇదీ చదవండి.. లోక్‌సభ ఎన్నికల వేళ.. బిహార్‌లో ఈడీ దాడుల కలకలం
Comments
Please login to add a commentAdd a comment