టీడీపీ క్యాంప్ రాజకీయం
టీడీపీ క్యాంప్ రాజకీయం
Published Mon, Mar 13 2017 11:02 PM | Last Updated on Wed, Aug 29 2018 6:26 PM
- బస్సులో టూర్‌కు వెళ్లిన విష్ణు వర్గీయులు
- శిల్పా చక్రపాణి రెడ్డికి ఓటు వేయాలని ఒతిళ్లు
- ఒక్కో ఓటుకు రూ. లక్ష ఇచ్చినట్లు సమాచారం
గూడూరు: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గర పడడంతో టీడీపీ క్యాంప్ రాజకీయాలు జోరందుకున్నాయి. ఆ పార్టీ అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి గెలుపే ధ్యేయంగా టీడీపీ నేతలు అడ్డదారులు తొక్కుతున్నారు. టీడీపీ కోడుమూరు నియోజకవర్గ ఇన్‌చార్జి డి.విష్ణువర్ధన్‌రెడ్డి వర్గానికి చెందిన స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లను సోమవారం బస్సులో టూరుకు తరలించారు. వీరంతా మొదట కర్నూలులో విష్ణువర్ధన్‌రెడ్డి ఇంటికి అక్కడి నుంచి తమిళనాడు రాష్ట్రానికి వెళ్తున్నట్లు సమాచారం.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసేందుకు ఒక్కో కౌన్సిలర్‌కు రూ. లక్ష డబ్బులు ఇచ్చినట్లు సమాచారం. టూర్‌కు వెళ్లిన వారిలో మున్సిపల్ చైర్‌పర్సన్ సుభాషిణి, వైస్ చైర్మన్ కె.రామాంజనేయులు, మరో పది మంది కౌన్సిలర్లు ఉన్నారు. వీంరంతా వైఎస్సార్సీపీ తరఫున గెలిచి టీడీపీలోకి ఫిరాయించారు. వీరి ఓటు వైఎస్‌ఆర్‌సీపీకి పడకుండా.. విహారయాత్ర పేరుతో ఇక్కడి నుంచి తరలించారు.
Advertisement