రాష్ట్ర పదాధికారుల సమావేశంలో బీజేపీ ముఖ్యనేతలు
అనంతపురం సెంట్రల్: తెలుగుదేశం ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ అంశం రుజువైందని బీజేపీ ముఖ్య నాయకులు అభిప్రాయపడ్డారు. అందువల్ల 2019 ఎన్నికల నాటికి స్వతంత్రంగా పోటీకి సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు సూచించారు. అనంతపురంలో ఆదివారం బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం జరిగింది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు, రాష్ట్ర మంత్రులు కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావు, ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, మాధవ్, శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు, ఎంపీ గోకరాజు గంగరాజు తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. రాష్ట్ర రవాణాశాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంపై జరిగిన దాడిని ఎమ్మెల్సీ సోము వీర్రాజు తప్పుబట్టారు.
2019లో స్వతంత్రంగా పోటీచేద్దాం
Published Mon, Mar 27 2017 1:39 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement
Advertisement