ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీకి సహకరించిన అధికారులపై చర్యలు
సాక్షి నెట్‌వర్క్: ఇటీవల జరిగిన స్థానిక సంస్థలు, పట్టభద్రులు, ఉపాధ్యాయ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార టీడీపీ పెద్దలు, నేతలు తొక్కని అడ్డదారి లేదు. పలు ప్రాంతాల్లో అధికారులను సైతం పావులుగా వాడుకున్నారు. అధికార పార్టీ మద్దతు ఇస్తున్న అభ్యర్థులకు అనుకూలంగా వ్యవహరించాలని మౌఖిక ఆదేశాలు జారీ చేయడంతో పలువురు అధికారులు ఆ దిశగా వారికి మేలు చేశారు. ఆ అధికారులపై ఫిర్యాదులు వెళ్లడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం సీరియస్‌గా తీసుకుంది.
పలువురు జిల్లా, మండల స్థాయి అధికారులకు నోటీసులు జారీ చేసింది. మరికొందరిపై కఠిన చర్యలు తీసుకుంది. ఇలా చిత్తూరులో ముగ్గురు తహశీల్దార్ల బదిలీవేటు పడింది. అలాగే జిల్లాలోని డీఈవో సహా 49 మంది ఎంఈవోలకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. కడపలో డ్వామా పీడీ ప్రభుత్వానికి సరెండర్ చేశారు. కర్నూలులో పలువురు ప్రిన్సిపాళ్లకు ఎన్నికల కమిషన్ సంజాయిషీ కోరింది.
రంగు పడింది.. ఎన్నికల కమిషన్ వేటు వేసింది
Published Sat, Mar 25 2017 2:36 AM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM
Advertisement