కర్ణాటక సీఎం సిద్ధరామయ్య (ఫైల్‌ఫోటో)
సాక్షి, బెంగళూర్ : రైతు రుణ మాఫీపై ప్రధాని నరేంద్ర మోదీ, కర్ణాటక బీజేపీ చీఫ్ బీఎస్ యడ్యూరప్పలను టార్గెట్ చేస్తూ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య విమర్శలు గుప్పించారు. మోదీ సర్కార్ వ్యవసాయ రుణాలను మాఫీ చేయకపోగా, ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ 2.7 లక్షల కోట్ల విలువైన కార్పొరేట్ల రుణాలను రద్దు చేశాయని అన్నారు. రాష్ట్రంలో 22.5 లక్షల మంది రైతుల రుణాలను తమ ప్రభుత్వం మాఫీ చేస్తే కేంద్ర మంత్రులు ఇక్కడికొచ్చి అవాకులు చెవాకులు పేలుతున్నారని విమర్శించారు.
మోదీ సర్కార్ రైతు రుణమాఫీ గురించి ఏమీ మాట్లాడటం లేదని, రైతు రుణాల మాఫీకి తమవద్ద నోట్లు ముద్రించే యంత్రం లేదని బీజేపీ నేత యడ్యూరప్ప వ్యాఖ్యానించడం ఆక్షేపణీయమన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రం రూ లక్షల కోట్ల కార్పొరేట్ రుణాలను మాఫీ చేస్తున్నాయని లక్షలాది రైతులను పక్కనపెట్టిన మోదీ ప్రభుత్వం కొద్ది మంది కార్పొరేట్లకు అనుకూలంగా ఎందుకు వ్యవహరిస్తోందని సిద్ధరామయ్య నిలదీశారు.
Comments
Please login to add a commentAdd a comment