గాంధీనగర్: గుజరాత్‌ను మరోసారి భూకంపం వణికించింది. 24 గంటలు గడవక ముందే రెండోసారి భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దాంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. సోమవారం మధ్యాహ్నం 12.57 గంటల సమయంలో రాజ్‌కోట్ సమీపంలో రెండోసారి భూకంపం చోటు చేసుకుంది. రిక్టార్ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.4గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ పేర్కొంది. రాజ్‌కోట్‌కు వాయవ్య దిశలో 83 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు.
గుజరాత్‌లో ఆదివారం రాత్రి 8 గంటలకు రాజ్‌కోట్, గుజరాత్ సమీప ప్రాంతాలకు 122 కిలోమీటర్ల దూరంలో వ్యాయువ్యంగా ఈ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టార్ స్కేల్‌పై 5.8గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. దీంతో రాజ్‌కోట్ వాసులు ఆందోళనకు గురయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment