Kutch
-
రీల్స్ పిచ్చి పీక్స్‌కు.. సముద్రంలో కార్లతో ఇరుక్కపోయిన యువకులు
కొంతమందిలో సోషల్ మీడియా పిచ్చి రోజురోజుకీ పెరిగిపోతుంది. చిన్నపిల్లల నుంచి ముసలివాళ్ల వరకు సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోవటంతో.. ఆ క్రేజ్‌ను ఉపయోగించుకుని ఓవర్ నైట్ స్టార్ కావాలని పిచ్చి పిచ్చి ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. త్వరగా ఫేమస్ అయిపోవాలని, తమ వీడియోలు వైరల్ అవ్వాలని కొన్నిసార్లు ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇలాంటి చేష్టలు చేయకూడదని ఎంతమంది చెప్పినా తమ ప్రవర్తనలో మార్పు తెచ్చుకోవడం లేదు. తాగా ఇలాంటి ఘటనలో మరొకటి వెలుగు చూసింది.ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం కొంతమంది యువకులు తమ కారును సముద్రంలోకి నడిపి ప్రమాదంలో చిక్కుకున్నారు. ఈ ఘటన గుజరాత్‌లోని కచ్ సముద్ర తీరంలో జరిగింది. ఇద్దరు యుకులు రీల్స్ కోసం తమ రెండు మహీంద్రా థార్ ఎస్యూవీ కారులను ముంద్రా సముద్ర తీరంలోకి పోనిచ్చారు. నీరు లోతు పెరగడం, అలల కారణంగా రెండు వాహనాలు దాదాపు నీటిలో మునిగిపోయాయి. దీంతో యువకులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.రెడ్, వైట్ మహీంద్రా థార్ వాహనాలను నీటిలో నుంచి బయటకు తీయడానికి చాలా కష్టపడ్డారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. స్థానికుల సహాయంతో ఎట్టకేలకు వాహనాలను నీటిలో నుంచి బయటకు తీశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, కచ్ పోలీసులు ఇద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రెండు ఎస్వీలను స్వాధీనం చేసుకున్నామని, చట్టపరమైన చర్యలు ప్రారంభించామని పోలీసు అధికారి తెలిపారు.Gujarat: In an attempt to make a reel, two young men drove 2 Thar vehicles into the deep waters near the seashore in Mundra, Kutch due to which both vehicles get stuck in the water. With the help of locals, both vehicles were retrieved, also Kutch police filed an FIR against the… pic.twitter.com/m9YR0ByK7b— IANS (@ians_india) June 23, 2024 -
గుజరాత్లో రూ. 130 కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం
గాంధీనగర్: గుజరాత్లో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. కచ్ తీరంలో సుమారు రూ. 130 కోట్ల విలువైన 13 ప్యాకెట్ల కొకైన్‌ను గురువారం తెల్లవారుజామున పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గాంధీధామ్ పట్టణంలోని మితి రోహర్ ప్రాంతంలో స్మగ్లర్లు సముద్ర తీరంలో మాదకద్రవ్యాలను దాచి పెట్టినట్లు సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో 13 ప్యాకెట్ల కొకైన్‌ను పట్టుకున్నారు. దీని విలువ రూ.130 కోట్లకు పైగా ఉంటుందని కచ్-ఈస్ట్ డివిజన్ పోలీసు సూపరింటెండెంట్ సాగర్ బాగ్మార్ పేర్కొన్నారు. స్మగ్లర్లు కొకైన్ పట్టుబడకుండా సముద్ర తీరంలో ప్యాకెట్లను దాచిపెట్టినట్లు తెలిపారు. వీటిని తరలిస్తున్న నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గత ఏడాది సెప్టెంబర్‌లో ఇదే ప్రాంతంలో రూ.800కోట్ల విలువైన 80 కొకైన్ ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
Ind vs Eng: భార్యతో కలిసి రవీంద్ర జడేజా పూజలు
Ravindra Jadeja - Rivaba Jadeja: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, గుజరాత్ క్రికెటర్ రవీంద్ర జడేజా భక్తి పారవశ్యంలో మునిగిపోయాడు. కచ్‌లో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకుని ఆశీర్వచనాలు అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను జడ్డూ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. సఫారీ పర్యటనలో విఫలం కాగా సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా టీ20, టెస్టు జట్లకు ఎంపికైన జడేజా స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. వెన్నునొప్పి కారణంగా తొలి టెస్టుకు దూరమైన అతడు.. ఆఖరిదైన రెండో మ్యాచ్‌లోనూ ప్రభావం చూపలేకపోయాడు. బ్యాటర్‌గా పూర్తిగా విఫలమయ్యాడు. ఈ మ్యాచ్‌లో డకౌట్ అయిన జడేజాకు ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేసే అవకాశం రాలేదు. సతీసమేతంగా అమ్మవారి సన్నిధిలో ఈ క్రమంలో స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత కుటుంబానికి సమయం కేటాయించిన రవీంద్ర జడేజా భార్య రివాబాతో కలిసి ప్రఖ్యాత ఆశాపుర మాతా ఆలయాన్ని దర్శించాడు. 14వ శతాబ్దంలో కచ్ ప్రాంతంలో నిర్మితమైన.. ఈ గుడిలో జడ్డూ కుటుంబం తాజాగా ప్రత్యేక పూజలు చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింటవైరల్ అవుతున్నాయి. కాగా జడేజా తదుపరి ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు సిద్ధం కానున్నాడు. స్వదేశంలో జరుగనున్న ఈ సిరీస్‌కు సంబంధించి తొలి రెండు మ్యాచ్‌లకు బీసీసీఐ ప్రకటించిన జట్టులో అతడికి స్థానం దక్కింది. బీజేపీ ఎమ్మెల్యే ఇక సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో టెస్టుల్లో ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో కలిపి జడ్డూ 29 వికెట్లు పడగొట్టడం విశేషం. కాగా జడేజా భార్య రివాబా బీజేపీ ఎమ్మెల్యే అన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. జనవరి 25 నుంచి ఇంగ్లండ్‌తో టీమిండియా ఐదు మ్యాచ్‌ల సిరీస్ ఆరంభం కానుంది. (Rivaba: ఆడపడుచు, మామ అడ్డుపడినా! జడ్డూ భార్య రివాబా బ్యాగ్రౌండ్ ఇదే) చదవండి: Ranji Trophy: కెప్టెన్సీకి విహారీ రాజీనామా! రహానే గోల్డెన్ డక్.. ఇక రీఎంట్రీ కష్టమే! -
వాడేసిన ప్లాస్టిక్‌తో వండర్స్
మనింట్లో చాలా ప్లాస్టిక్ కవర్స్ పోగవుతాయి. వాటిని చెత్తలో పడేస్తాము. అవి ఎప్పటికీ మట్టిలో కలవక అలాగే కాలుష్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. కాని ఈ ప్లాస్టిక్ కవర్లనే రాజిబెన్ దారాలుగా చేసి బ్యాగులు అల్లుతుంది. బుట్టలు చేస్తుంది. పర్సులు చేస్తుంది. డోర్మ్యాట్లు సరేసరి. అందుకే ఆమెకు చాలా గుర్తింపు వచ్చింది. ఆమె వల్ల ఎందరికో ఉపాధి కలుగుతోంది. కొత్త ఆలోచన చేసిన వారే విజేతలు. గుజరాత్ కచ్ ప్రాంతంలోని కోటె అనే చిన్న పల్లెలో ఏమీ చదువుకోని అమ్మాయి – రాజి బెన్ పెరిగి పెద్దదయ్యి లండన్ వెళ్లి అక్కడ పెద్దవాళ్లతో తాను చేసిన కృషిని వివరించింది. ఆమె తన జీవితంలో ఇంత పెద్ద ప్రయాణం చేసి, గుర్తింపు పొందేలా చేసింది ఏమిటో తెలుసా? వృధా ప్లాసిక్. వాడేసిన ప్లాస్టిక్ రోడ్ల మీద, ఇళ్ల డస్ట్బిన్లలో, చెత్త కుప్పల మీద అందరూ ప్లాస్టిక్ కవర్లను, రేపర్లను పారేస్తారు. వాటిని ఏం చేయాలో ఎవరికీ ఏమీ తోచదు. అవి తొందరగా మట్టిలో కలిసిపోవు. కాని రాజిబెన్ వాటిని ఉపయోగంలోకి తెచ్చింది. వాటిని సేకరించి, కట్ చేసి పీలికలుగా మార్చి, కలిపి నేసి అందమైన వస్తువులు తయారు చేసింది. బ్యాగులు, సంచులు, పర్సులు... వాటి మన్నిక కూడా ఎక్కువ. ఎలా చేస్తారు? వాడేసిన ప్లాస్టిక్ క్యారీబ్యాగ్స్ను సేకరించి సర్ఫ్ నీళ్లతో కడుగుతారు. ఆ తర్వాత వాటిలోని మలినాలు పోవడానికి వేడి నీళ్లలో నానబెడతారు. తర్వాత రెండు రోజులు ఎండలో ఆరబెడతారు. ప్లాస్టిక్ మందంగా ఉంటే అర ఇంచ్ వెడల్పు రిబ్బన్లుగా; పలుచగా ఉంటే ముప్పావు ఇంచ్ రిబ్బన్లుగా కట్ చేస్తారు. ఈ ముక్కలను నాణ్యమైన జిగురుతో అంటించి పొడవైన ఉండగా మారుస్తారు. అంటే మగ్గం మీద నేయడానికి దారం బదులు ఈ ప్లాస్టిక్ ఉండనే ఉపయోగిస్తారు. ఈ ప్లాస్టిక్ దారాలతో నేస్తే దళసరి వస్త్రం తయారవుతుంది. దానిని కట్ చేసుకుని రకరకాల వస్తువులుగా చేతి నైపుణ్యంతో తీర్చిదిద్దుతారు. హ్యాండ్ బ్యాగ్‌లు, కూరగాయల బ్యాగ్‌లు, ఫోన్ బాక్సులు, పర్సులు.. ఇవన్నీ చాలా అందంగా ఉంటాయి. మన్నికతో ఉంటాయి. ఎలా వచ్చింది ఐడియా? రాజి బెన్ నేత కుటుంబంలో పుట్టింది. అయితే తండ్రికి నేత మీద విసుగుపుట్టి వ్యవసాయం చేసేవాడు. అదీగాక ఆడపిల్లలు మగ్గం మీద కూచోవడం నిషిద్ధం. కాని రాజి బెన్కి మగ్గం మీద పని చేయాలని 12 ఏళ్ల వయసు నుంచే ఉండేది. అందుకని మేనమామ కొడుకు దగ్గర రహస్యంగా మగ్గం పని నేర్చుకుంది. 14 ఏళ్లు వచ్చేసరికి మగ్గం పనిలో ఎక్స్‌పర్ట్‌గా మారింది. అయితే ఆమెకు పుట్టింటిలో కాని మెట్టినింటిలో గాని మగ్గం మీద కూచునే అవకాశమే రాలేదు. ఏడేళ్లు కాపురం చేశాక భర్త హటాత్తుగా మరణించడంతో రాజి బెన్ ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టాల్సి వచ్చింది ముగ్గురు పిల్లల కోసం. కచ్‌లో ఒక ఎన్.జి.ఓ ఉంటే అక్కడ మగ్గం పని ఖాళీ ఉందని తెలిస్తే వెళ్లి చేరింది. అందమైన వస్త్రాలు అల్లి వాటిని ఆకర్షణీయమైన వస్తువులుగా తీర్చిదిద్దే స్థానిక కళలో ఆమె ప్రావీణ్యం చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు. ఎన్.జి.ఓ వారు ఆమె చేసిన ఉత్పత్తులతో ఎగ్జిబిషన్ సేల్ నిర్వహించేవారు. 2012లో జరిగిన ఎగ్జిబిషన్లో ఒక విదేశీ డిజైనర్ ప్లాస్టిక్‌ను రీసైకిల్ చేసి తయారు చేసిన బ్యాగ్‌ను చూపించి ‘ఇలాంటిది తయారు చేయగలవా?’ అని అడిగాడు. అది ఎలా తయారయ్యిందో అర్థమయ్యాక రాజి బెన్‌కు నాలుగు రోజులు కూడా పట్టలేదు అలాంటి బ్యాగులు తయారు చేయడానికి. ఆ డిజైనర్ వాటిని చూసి సంతృప్తిగా కొనుక్కుని వెళ్లాడు. మరికొన్ని బ్యాగులు జనం క్షణాల్లో ఎగరేసుకుపోయారు. అప్పటి నుంచి వేస్ట్ ప్లాస్టిక్ నుంచి రాజి బెన్ హస్తకళా ఉత్పత్తులను తయారు చేస్తోంది. స్వచ్ఛ్ సుజల్ శక్తి సమ్మాన్ రాజి బెన్ ఖ్యాతి ఎంత దూరం వెళ్లిందంటే అమృత మహోత్సవం సందర్భంగా ‘స్వచ్ఛ్ సుజల్ శక్తి సమ్మాన్’ పురస్కారం ఆమెకు ప్రకటించారు. అలాగే యూరప్ దేశాల నుంచి ఆమె ఉత్పత్తులకు ఆర్డర్లు వస్తున్నాయి. ‘ప్లాస్టిక్ పీడ విరగడ అవ్వాలంటే దానిని ఎన్ని విధాలుగా రీసైకిల్ చేయవచ్చో అన్ని విధాలుగా చేయాలి. రాజి బెన్ కొత్త తరాన్ని తనతో కలుపుకుంటే ఆమె ఉత్పత్తులు చాలా దూరం వెళ్లడమే కాక పర్యావరణానికి మేలు కూడా జరుగుతుంది’ అని విదేశీ ఎంట్రప్రెన్యూర్లు అంటున్నారు. రాజి బెన్ ప్రస్తుతం 90 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తోంది. 2018 నుంచి సొంత సంస్థ పెట్టుకోవడంతో దాని టర్నోవర్ ఇప్పుడు సంవత్సరానికి 10 లక్షలు దాటిపోయింది. ఆమె గెలుపు గాథ మరింత విస్తరించాలని కావాలని కోరుకుందాం. -
దేశంలో అతిపెద్ద జిల్లా ఏది? ఈ పేరుతో రాష్ట్రం ఉండేదని తెలుసా?
భారతదేశంలో మొత్తం 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. కేంద్రపాలిత ప్రాంతాల్లో రాష్ట్రపతి సారధ్యంలో పరిపాలన కొనసాగుతుంది. రాజ్యాంగంలో జిల్లాలను నిర్ణయించే వ్యవస్థ కూడా ఉంది. కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాల్లో అవసరాన్ని అనుసరించి జిల్లాలు ఏర్పడతాయి. రాష్ట్ర ప్రభుత్వం అవసరమైతే జిల్లాల సంఖ్యను పెంచుతుంది. అంటే కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తుంది. అయితే భారతదేశంలో అతిపెద్ద జిల్లా గురించి మీకు తెలుసా? నాటి రోజుల్లో ఆ జిల్లా పేరుతో ఒక రాష్ట్రం ఉండేది. ఆ ఆసక్తికర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ జిల్లాలో సగభాగం ఎడారి భారతదేశంలోని అతిపెద్ద జిల్లా పేరు కచ్. ఇది గుజరాత్లో ఉంది. విస్తీర్ణం పరంగా ఇది అతిపెద్ద జిల్లాగా పేరొందింది. గుజరాత్‌లోని ఈ జిల్లా మొత్తం వైశాల్యం 45,674 చదరపు కిలోమీటర్లు. ఇది రాష్ట్రంలోని 23.7 శాతం భూభాగంలో విస్తరించివుంది. ఈ జిల్లాలోని సగానికి పైగా ప్రాంతం ఎడారితో నిండి ఉంది. ఇది ఇక్కడికి వచ్చే పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తుంది. ఒకప్పుడు ఈ జిల్లా పేరుతో రాష్ట్రం ఒకప్పుడు భారతదేశంలో కచ్ పేరుతో ఒక రాష్ట్రం ఉండేది. ఇది 1950లో ఏర్పాటయ్యింది. 1956 నవంబర్ ఒకటిన ముంబై రాష్ట్రంలో విలీనమయ్యింది. మరాఠీ, గుజరాతీ ప్రజలు అప్పట్లో కచ్‌లో నివసించేవారు. మార్వాడీలు కూడా అధిక సంఖ్యలో ఉండేవారు. 1960లో ముంబై రాష్ట్రాన్ని భాష ఆధారంగా విభజించారు. దీంతో రెండు కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అవి మహారాష్ట్ర, గుజరాత్. ఈ నేపథ్యంలో కచ్ జిల్లా గుజరాత్లో చేరింది. 2001 జనవరి 26న కచ్‌లో సంభవించిన భూకంపం ఆ జిల్లాను అతలాకుతలం చేసింది. ఇది కూడా చదవండి: ‘హిప్పీలు’ ఇస్కాన్ అనుచరులుగా ఎలా మారారు? -
ఆమె పేరే ఓ బ్రాండ్
గుజరాత్‌లోని కచ్‌లో ఒక మారుమూల గ్రామవాసి పాబిబెన్ రబారి. మేకలు, గొర్రెల పెంపకమే ప్రధాన వృత్తిగా ఉన్న పాబిబెన్ ఇప్పుడు 300 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తోంది. జరీ ఎంబ్రాయిడరీ, బ్యాగుల తయారీతో ప్రపంచ వ్యాప్తంగా పేరు సంపాదించింది. హస్తకళాకారిణిగా ఆమె కృషి, సాధించిన విజయం ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తుంది. పాబిబెన్ బాల్యం తీవ్ర కష్టాలతో గడిచింది. ఐదేళ్ల వయసులో తండ్రిని కోల్పోవడం, తల్లి కొన్ని ఇళ్లలో పాచిపని చేస్తూ తనను, తన చెల్లెలిని పెంచిన విధానాన్ని, మేకలను, గొర్రెలను మేపుకుంటూ బతికిన రోజులను గుర్తు చేసుకుంటుంది ఆమె. ఉన్న కొద్దిపాటి సమయంలో తల్లి సంప్రదాయ ఎంబ్రాయిడరీ పని చేస్తుండేది. అక్కడి వారి కమ్యూనిటీ వివాహ వేడుకల సమయాల్లో తప్పనిసరిగా ధరించే సంప్రదాయ ఎంబ్రాయిడరీ బ్లౌజులు, దుప్పట్లను తయారు చేసేది. ఒక్కో సంప్రదాయ ఎంబ్రాయిడరీ తయారీకి ఏడాదికి పైగా సమయం పట్టేది. ఈ సంప్రదాయం కారణంగా వారి కమ్యూనిటీలో వివాహాలు ఆలస్యం అయ్యేవి. దీంతో కొన్నాళ్లకు ఈ ఎంబ్రాయిడరీని ఆ కమ్యూనిటీ పక్కనపెట్టేసింది. ఈ సమయంలోనే పాబిబెన్ ఈ సంప్రదాయ ఎంబ్రాయిడరీలో ప్రావీణ్యం సాధించింది. ఒక కళారూపం కనుమరుగు కాకుండా కాపాడాలని నిశ్చయించుకుంది. తమ కమ్యూనిటీలో సంప్రదాయ ఎంబ్రాయిడరీని ప్రతిబింబించే కొత్త రూపాన్ని కనిపెట్టింది. ఇది వేగంగా, తక్కువ శ్రమతో కూడుకున్న కళ కావడంతో అందరినీ తన వైపుకు తిప్పుకుంది. పాబిబెన్ మొదట నలుగురైదుగురు మహిళలతో కలిసి వివాహ సమయంలో ధరించే ఎంబ్రాయిడరీ బ్లౌజ్‌లను తయారు చేసేది. చదువు లేకపోయినా తమకు వచ్చిన కళను కాపాడాలని, సాటి మహిళలకు ఉపాధి కల్పించాలనుకొని కొన్ని స్వచ్ఛంద సంస్థలను కలిసింది. కళలకు సంబంధించిన ఆ సంస్థల నుండి కొన్ని ప్రాజెక్ట్ వర్క్‌లను తీసుకుంది. ‘కానీ, నన్ను ఒక ఆలోచన ఎప్పుడూ వేధిస్తూనే ఉండేది. ఈ కళ మా సొంతం. కానీ, మాకు సరైన గుర్తింపు వచ్చేది కాదు. మేం తయారు చేసిన వాటిని వేర్వేరు బ్రాండ్ల కింద అమ్మేవారు. దీనినుంచి బయటపడేందుకు, మా హస్తకళకు మేమే ప్రాచుర్యం తెచ్చుకోవాలని ఉండేది. దీంతో పెద్దస్థాయి అధికారులను కలిశాను. వారి సూచనల మేరకు మా కళకు ఒక ఇంటిని ఏర్పాటు చేశాం. చేతివృత్తుల వారికి మార్కెట్ ప్లేస్‌గా ఆ స్థలాన్ని ప్రారంభించాం. మొదట ఇది చిన్న వ్యాపారంగానే ప్రారంభమైంది కానీ, పనితో పాటు గుర్తింపు కూడా రావాలనుకున్నాను. అది ఈ ఏడేళ్ల సమయంలో సాధించగలిగాం’ అని చెబుతుంది పాబిబెన్. పాబిబెన్ మొదటి ఉత్పత్తి స్లింగ్ బ్యాగ్. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ‘పాబీ బ్యాగ్’ అని ఆమె పేరుతోనే ఆ బ్యాగ్‌ను పిలిచేటంత ఘనత సాధించింది ఈ హస్తకళాకారిణి. పాబిబెన్ బ్రాండ్‌తో ఈ కామర్స్ మార్కెట్ ప్లేస్ అయిన ‘పాబిబెన్.కామ్’ అక్కడి గ్రామీణ మహిళలకు మరిన్ని ఉపాధి అవకాశాలను తెచ్చిపెడుతోంది. -
బిపర్జోయ్ విలయం.. ఇద్దరు మృతి, 22 మందికి గాయాలు
కఛ్(గుజరాత్): గత పదిరోజులుగా భయాందోళనకు గురిచేస్తున్న తీవ్ర తుపాను బిపర్జోయ్ ఎట్టకేలకు గురువారం సాయంత్రం గుజరాత్లో తీరాన్ని తాకింది. గంటకు 125 కిమీ నుంచి 140 కిమీ వేగంతో కఛ్ జిల్లాలోని జఖౌ పోర్టు సమీపంలో సౌరాష్ట్ర, కచ్ తీరాలను దాటిందని భారత వాతావరణశాఖ వెల్లడించింది. బిపర్జోయ్ తుపాను గుజరాత్లో తీరం తాకిన తర్వాత అతి తీవ్రమైన కేటగిరి నుంచి తీవ్ర స్థాయికి తగ్గిందని ఐఎండీ పేర్కొంది. ప్రస్తుతం తుపాను సముద్రం నుంచి భూమి వైపు కదిలిందని సౌరాష్ట్ర-కచ్ వైపు కేంద్రీకృతమై ఉందని తెలిపింది. బిపర్జోయ్ తీవ్రత 105-115 కి.మీ.కి తగ్గిందని పేర్కొంది. గుజరాత్ విధ్వంసం తర్వాత తుపాన్ రాజస్థాన్‌కు మళ్లిందని ఐఎండీ డైరెక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. రాజస్థాన్ మీదుగా తుపాను బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని తెలిపారు . ఇది వాయువ్య దిశగా కదులుతున్నందున జూన్ 16, 17 తేదీల్లో రాజస్థాన్‌లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. చదవండి: గుజరాత్‌లోని కఛ్, సౌరాష్ట్ర తీర ప్రాంతాల్లో కుంభవృష్టి కాగా తుపాను సృష్టించిన విలయానికి ఇప్పటి వరకు 22 మంది గాయపడ్డారని, 23 జంతువులు చనిపోయాయని గుజరాత్ రిలీఫ్ కమిషనర్ అలోక్ పాండే తెలిపారు. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాల కారణంగా పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, 524 చెట్లు నేలకొరిగాయని తెలిపారు. దాదాపు 940 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని అధికారులు తెలిపారు. అయితే భావ్‌నగర్ జిల్లాలో చిక్కుకున్న మేకలను రక్షించే ప్రయత్నంలో పశువుల యజమాని, అతని కుమారుడు మరణించినట్లు పీటీఐ పేర్కొంది. #WATCH | Gujarat: Trees uprooted and property damaged in Naliya amid strong winds of cyclone 'Biparjoy' pic.twitter.com/d0C1NbOkXQ — ANI (@ANI) June 16, 2023 తుపాను నేపథ్యంలో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇండియన్ కోస్ట్ గార్డ్ సహా అన్ని సాయుధ బలగాలు గుజరాత్ స్థానిక ప్రజలకు సహాయం అందించడానికి సన్నద్ధం చేశాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. 15 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, 12 రాష్ట్ర విపత్తు స్పందన దళాలు, భారత వాయు సేన, నేవీ, ఆర్మీ బలగాలు, తీరగస్తీ దళాలు, బీఎస్ఎఫ్ సిబ్బంది తుపాను సహాయక కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారని పేర్కొంది. తీర ప్రాంతాలకు చెందిన లక్ష మందిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించామని తెలిపింది. ఇదిలా ఉండగా వాతావరణ శాఖ పలు రాష్ట్రాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాజస్తాన్‌లోని పలు ప్రాంతాలకు సైతం రెడ్ అలర్ట్ ప్రకటించింది. అదే విధంగా బిపర్జోయ్ తుపాను కారణంగా శుక్రవారం పలు రైళ్లను రద్దు చేసినట్లు పశ్చిమ రైల్వే ప్రకటించింది. తుఫాను పీడిత ప్రాంతాలలో ముందుజాగ్రత్త చర్యగా పలు రైళ్లను పూర్తిగా రద్దు చేయగా, మరికొన్నింటిని ఆసల్యంగా నడుపుతున్నట్లు పేర్కొంది. రద్దైన రైళ్ల జాబితా #WRUpdates #CycloneBiparjoyUpdate For the kind attention of passengers. The following trains of 16/06/2023 have been Fully Cancelled/Short-Originate by WR as a precautionary measure in the cyclone-prone areas over Western Railway.@RailMinIndia pic.twitter.com/NcxSLeqK7a — Western Railway (@WesternRly) June 16, 2023 -
గుజరాత్ తీరంలో పట్టుబడ్డ పాక్ భారీ డ్రగ్స్ రాకెట్
సాక్షి, అహ్మదాబాద్: సరిహద్దులో మరోసారి భారీ మోతాదులో డ్రగ్స్ పట్టుబడింది. అరేబియా సముద్రం గుండా భారత జలాల్లోకి చొరబడిన.. పాకిస్థాన్ పడవను ఇండియన్ కోస్ట్‌గార్డ్, గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ సంయుక్త ఆపరేషన్ ద్వారా గుజరాత్ తీరంలో పట్టుకున్నాయి. సుమారు 40 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. వీటి విలువ ఏకంగా రూ.200 కోట్ల విలువ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. కచ్ జిల్లా జకావ్ ఓడరేవు సమీపంలోని సముద్రంలో చేపలు పట్టే పడవలో హెరాయిన్‌ను తరలిస్తుండగా కోస్టుగార్డు, ఏటీఎస్ సిబ్బంది గుర్తించారు. ఆ ఆపరేషన్‌లో ఆరుగురు పాకిస్థానీలను అదుపులోకి తీసుకున్నారు. సముద్రమార్గం ద్వారా డ్రగ్స్‌ను గుజరాత్‌కు చేర్చి.. రోడ్డుమార్గంలో పంజాబ్‌కు తరలించాలని నేరస్తులు ప్లాన్ చేశారని అధికారులు వెల్లడించారు. Indian Coast Guard & ATS Gujarat jointly apprehended a Pakistani Boat with 6 crew in Indian waters carrying approx 40 kgs of Heroine worth Rs 200 crores: Indian Coast Guard https://t.co/HQxRIMJNNe pic.twitter.com/yY705W2lKP — ANI (@ANI) September 14, 2022 ఇదిలా ఉంటే.. గత నెలలోనూను కచ్ జిల్లాలో భారత జలాల్లోకి ప్రవేశించిన పాకిస్థానీ చేపల బోటును బీఎస్ఎఫ్ సైనికులు పట్టుకున్నారు. గతేడాది అక్టోబర్‌లో గుజరాత్ మంద్రాపోర్టులో పెద్దమొత్తంలో హెరాయిన్ పట్టుబడిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: పిల్లలను ఎత్తుకెళ్లే ముఠా అనుకుని.. -
గుజరాత్‌పై కుట్రలు
భుజ్: గుజరాత్ వరుస ప్రాకృతిక విపత్తులతో అల్లాడుతున్న సమయంలో రాష్ట్రాన్ని దేశంలోనే గాక అంతర్జాతీయంగా కూడా అప్రతిష్టపాలు చేసి పెట్టుబడులు రాకుండా చేసేందుకు చాలా కుట్రలు జరిగాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. కానీ వాటన్నింటినీ అధిగమించి పారిశ్రామికంగా, ఇతరత్రా కూడా రాష్ట్రం అద్భుతంగా పురోగమించిందని కొనియాడారు. రెండు రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా ఆదివారం కచ్ జిల్లాలో రూ.4,400 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపన చేశారు. అనంతరం ర్యాలీని ఉద్దేశించి మాట్లాడారు. ‘‘2001 కచ్ భూకంపం మాటకందని విషాదం. ఆ విలయాన్ని అవకాశంగా మార్చుకుని కచ్‌ను పునర్నిర్మించుకుంటామని అప్పుడే చెప్పాను. దాన్నిప్పుడు సాధించి చూపించాం. ప్రపంచంలోనే రెండో అతి పెద్ద టెక్స్టైల్ ప్లాంట్, ఆసియాలో తొలి సెజ్ తదితరాలకు కచ్ వేదికైంది. దేశ రవాణాలో 30 శాతం ఇక్కడి కాండ్లాం, ముంద్రా పోర్టుల గుండానే జరుగుతోంది. దేశానికి కావాల్సిన ఉప్పు 30 శాతం కచ్‌లోనే తయారవుతోంది’’ అని మోదీ చెప్పారు. ‘‘భూకంపం వచ్చినప్పుడు నేను గుజరాత్ సీఎంను కాను. సాధారణ బీజేపీ కార్యకర్తను. రెండో రోజే కచ్ చేరుకుని సహాయ కార్యక్రమాల్లో పాలుపంచుకున్నా’’ అని గుర్తు చేసుకున్నారు. భూకంపానికి బలైన 13 వేల మందికి స్మృత్యర్థం నిర్మించిన రెండు స్మారకాలను ప్రారంభించారు. ఆ సమయంలో అనేక భావాలు తనను ముప్పిరిగొన్నాయని చెప్పారు. స్మృతి వన్ స్మారకాన్ని అమెరికా ట్విన్ టవర్స్ స్మారకం, జపాన్‌లోని హిరోషిమా స్మారకంతో పోల్చారు. ఇలాంటి అనుభవాల నేపథ్యంలో విపత్తు నిర్వహణ చట్టం తెచ్చిన తొలి రాష్ట్రంగా గుజరాత్ నిలిచిందని చెప్పారు. దాని స్ఫూర్తితోనే కేంద్ర స్థాయిలో అలాంటి చట్టం వచ్చిందన్నారు. అవగాహన పెరగాలి పౌష్టికాహార లోపాన్ని రూపుమాపాలని, నీటి సంరక్షణపై ప్రజల్లో అవగాహన మరింత పెరగాలని మోదీ అన్నారు. ఈ దిశగా పోషన్ అభియాన్, జల్ జీవన్ మిషన్ బాగా పని చేస్తున్నాయని చెప్పారు. సెప్టెంబర్‌ను పౌష్టికాహార నెలగా జరుపుకుంటున్నట్టు గుర్తు చేశారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడారు. 2023ను అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరంగా జరుపుకోవాలన్న భారత ప్రతిపాదనకు ఐరాస అంగీకరించడాన్ని గుర్తు చేశారు. ‘‘ఏళ్లుగా విదేశీ అతిథులకు మన తృణధాన్యపు వంటకాలను రుచి చూపిస్తూ వస్తున్నా. వారంతా వాటి రుచిని ఎంతో ఆస్వాదించారు. ముడి ధాన్యం అనాది కాలం నుంచి మన సాగులో, సంస్కృతితో, నాగరికతలో భాగం’’ అన్నారు. ఈసారి పంద్రాగస్టు ఉత్సవాలను దేశ ప్రజలంతా గొప్ప జోష్‌తో జరుపుకున్నారంటూ హర్షం వెలిబుచ్చారు. లెక్కలేనన్ని వైరుధ్యాలు, వైవిధ్యాలున్న ఇంత పెద్ద దేశం తాలూకు సమష్టి శక్తి ఎంత బలవత్తరమైనదో ప్రపంచానికి చూపారన్నారు. స్వాతంత్య్ర అమృతోత్సవాల వేళ దేశంలో మూలమూలలా అమృత ధార పారుతోందన్నారు. ఈశాన్య భారతం వంటి మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ వ్యాప్తి కొత్త వెలుగులు తెచ్చిందని చెప్పారు. ‘‘డిజిటల్ ఇండియా ద్వారా వాటికి అభివృద్ధి ద్వారాలు తెరుచుకున్నాయి. ఒకప్పుడు పెద్ద నగరాలకే పరిమితమైన సదుపాయాలు ప్రతి గ్రామానికీ చేరాయి. ఫలితంగా డిజిటల్ పారిశ్రామికవేత్తలు పుట్టుకొస్తున్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌లోని అత్యంత మారుమూల జోర్సింగ్ గ్రామానికి పంద్రాగస్టు నుంచే 4జీ సేవలందుతున్నాయి’’ అంటూ పలు ఉదాహరణలను ప్రస్తావించారు. సమర యోధుల త్యాగాలను కళ్లముందుంచే స్వరాజ్ సీరియల్‌ను దూరదర్శన్‌లో ప్రజలంతా చూడాలన్నారు. 2047కల్లా భారత్ అభివృద్ధి చెందిన దేశంగా రూపొందుతుందని తనకు పూర్తి నమ్మకముందని పునరుద్ఘాటించారు. -
ప్రధాని పర్యటన వేళ.. గుజరాత్లో మతఘర్షణల అలజడి!
గాంధీనగర్: ప్రధాని నరేంద్ర మోదీ తన స్వరాష్ట్రం గుజరాత్లో పర్యటించే వేళ.. మత ఘర్షణల అలజడి చెలరేగింది. కచ్ జిల్లా భుజ్ ప్రాంతంలో ఓ వ్యక్తి హత్యతో శుక్రవారం రాత్రి రెండు వర్గాల మధ్య ఘర్షణ.. అల్లర్లకు, ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ ప్రాంతంలోనే షెడ్యూల్ ప్రకారం.. ప్రధాని మోదీ శనివారం ముందుగా పర్యటించాల్సి ఉంది. భుజ్ మాదాపూర్‌లో శుక్రవారం సాయంత్రం స్థానిక పాల వ్యాపారం చేసే ఓ వ్యక్తిని కత్తితో హత్య చేశారు. ఈ వార్త దావానంలా వ్యాపించగా.. ఆగ్రహంతో ఊగిపోయిన కొందరు వీధుల్లో విధ్వంసం సృష్టించారు. ఈ క్రమంలో దుకాణాలతో పాటు ఓ మసీదును ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. శాంతిభద్రతలు దెబ్బతినకుండా ఉండేందుకు భారీగా మోహరించారు. ప్రస్తుతం అక్కడి పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇరు వర్గాల నుంచి ఫిర్యాదులు తీసుకున్న పోలీసులు.. దర్యాప్తులు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. గుజరాత్లో ఇవాళ్టి నుంచి రెండు రోజులపాటు ప్రధాని మోదీ పర్యటిస్తారు. 2001 భూకంప సమయంలో మరణించిన బాధితులకు నివాళిగా, ఆ సమయంలో ప్రజలు కనబర్చిన మనోధైర్యానికి గుర్తుగా భుజ్‌లో 470 ఎకరాల్లో ‘స్మృతి వన్’ ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీ స్వయంగా ఈ ప్రాజెక్టును పర్యవేక్షించడం విశేషం. ఈ నేపథ్యంలో మత ఘర్షణలు తలెత్తడం భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. అలాగే సబర్మతి తీరం వద్ద ఖాదీ ఉత్సవ్‌ను ప్రధాని మోదీ ప్రారంభించి.. ప్రసంగిస్తారు. ఇక ఆదివారం గాంధీనగర్‌లో సుజుకీ కంపెనీ 40 ఏళ్ల వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అక్కడే రూ.7,300 కోట్లతో సుజుకీ సంస్థ చేపడుతున్న ఈవీ బ్యాటరీ తయారీ కంపెనీకి శంకుస్థాపన చేస్తారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ప్రధాని పర్యటన షెడ్యూల్ ప్రకటించింది. ఇదీ చదవండి: గులాం నబీ ఆజాద్ కోసం మోదీ కన్నీరు -
Travel Tips: ప్రయాణానికి ముందు జాగ్రత్తలు మర్చిపోకండి!
కచ్ మహోత్సవ్‌కు వెళ్లాలనుకున్న వాళ్లు టెంట్ సిటీలో బస చేయాలనుకుంటే షెడ్యూల్ విడుదల అయిన వెంటనే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. టెంట్ సిటీ అంటే... ఈ వేడుకల కోసం చక్కటి వ్యూ ఉన్న ప్రదేశంలో టూరిజం డిపార్ట్మెంట్ గుడారాలతో సిద్ధం చేసిన నగరం. ఇందులో దాదాపుగా స్టార్ హోటల్ సౌకర్యాలన్నీ ఉంటాయి. ►పగలు సూర్యుడి కిరణాలు కళ్ల మీద పడి దృష్టిని చెదరగొడుతుంటాయి. కాబట్టి టూర్‌కి వెళ్లేటప్పుడు కూలింగ్ గ్లాసెస్తోపాటు పెద్ద హ్యాట్, గొడుగు దగ్గర ఉంచుకోవాలి. ►రాత్రి ఉష్ణోగ్రతలు బాగా తక్కువ కాబట్టి ఉలెన్ జాకెట్లు తీసుకెళ్లాలి. దేశ సరిహద్దు కావడంతో ఇక్కడ సెక్యూరిటీ పటిష్టంగా ఉంటుంది. ►ఐడీ కార్డు దగ్గర ఉంచుకోవాలి. అలాగే గ్రూప్‌గా వెళ్లినవాళ్లు గ్రూప్ నుంచి విడివడి ఒంటరిగా మరీ దూరంగా వెళ్లకపోవడమే మంచిది. ►ఒకవేళ వెళ్లినట్లయితే ఐడీకార్డు చూపించి సెక్యూరిటీ ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగి ఉండాలి. ►పర్యటనకు వెళ్లినప్పుడు స్థానికుల సంప్రదాయాలను హేళన చేయరాదు, తేలిక చేసి మాట్లాడరాదు. ►ఇతరుల సంప్రదాయాలను గౌరవించడమే సంస్కారం అని మర్చిపోకూడదు. చదవండి: చిన్నవయసులో ఆర్ధరైటిస్.. ఈ లక్షణాలు ఉన్నాయేమో చూసుకోండి -
మనకు తెలిసిన పేరు... తెలియని ఊరు!
కచ్.. మనకు తెలిసిన పేరు... తెలియని ఊరు. సరిహద్దు రాష్ట్రంలో ఓ సరిహద్దు జిల్లా. అరేబియా సముద్రం ఓ ఎల్ల.. పొరుగుదేశం పాకిస్థాన్ మరో ఎల్ల. ఇది జిల్లా అనే కానీ.. ఓ రాష్ట్రమంత విస్తారమైనది. ఎడారిని తలపించే ఉప్పు నేలలు. ఏటా మూడు నెలల వేడుకలు. గాంధీ పుట్టిన గుజరాత్ వైభవం ఇది. సంగీతం, నాట్యం... వీటికి నేపథ్యంగా తెల్లటి ఎడారిని తలపించే ఉప్పు నేలలు. ఈ అద్భుతాన్ని చూడడానికే వచ్చినట్లు...ఆకాశం కిటికీకి ఉన్న మబ్బు తెరలు తీసి తొంగి చూస్తున్నట్లు చంద్రుడు నిండుగా ఉంటాడు. పగలైతే సూర్యుడు దేదీప్యమానంగా వెలిగిపోతూ... తెల్లటి ఉప్పు మీద కిరణాల దాడి చేస్తుంటాడు. ధవళవర్ణంలోని ఉప్పు నేల ఏడురంగుల్ని ప్రతిఫలిస్తూ కళ్లు మిరుమిట్లు గొలుపుతూ ఉంటుంది. ఈ ప్రకృతి నైపుణ్యాన్ని తలవంచి ఆస్వాదించాల్సిందే తప్ప తలెత్తి చూడడం కష్టమే. తలెత్తడానికి కూడా బెదిరిపోయేటట్లు భయభ్రాంతుల్ని చేస్తుంటాడు భానుడు. ధైర్యం చేసి తలెత్తి చూస్తే ఏడురంగులు ఒకేసారి కళ్ల మీద దాడి చేస్తున్నట్లుంటాయి. ఎప్పుడు వెళ్లవచ్చు! గుజరాత్ రాష్ట్రంలో కచ్ మహోత్సవ్ ఏటా శీతాకాలంలో మూడు నెలలపాటు జరుగుతుంది. ఈ ఏడాది నవంబర్ 12 మొదలై వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 వరకు కొనసాగుతుందని అంచనా. అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ ఉత్సవాలకు టూర్ ప్యాకేజ్‌లు ఉంటాయి. ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. నిండు పున్నమి రోజుల్లో కచ్ తీరంలో రాత్రి బస ఉండేటట్లు ప్లాన్ చేసుకుంటే టూర్‌ని ఆద్యంతం సమగ్రంగా ఆస్వాదించవచ్చు. ఏమేమి చూడవచ్చు! ఉప్పు నేల మీద ఎర్రటి తివాచీ పరుచుకుని, ఎర్రటి తలపాగాలు చుట్టుకున్న కళాకారులు సంప్రదాయ గుజరాతీ కచ్ జానపద సంగీతాన్ని ఆలపిస్తుంటారు. మరోవైపు డాన్స్ ప్రదర్శనలు. ఇక హాండీక్రాప్ట్స్ విలేజ్‌లో అడుగుపెట్టగానే రంగురంగుల కుండల మీద చూపు ఆగిపోతుంది. కృష్ణుడు వెన్న దొంగలించిన కథనాలు కళ్ల ముందు మెదలుతాయి. కృష్ణుడికి అందకుండా ఉట్టి మీద పెట్టిన కుండలు గుర్తొస్తాయి. ఈ ట్రిప్‌కి గుర్తుగా ఒక్క కుండనైనా తెచ్చుకోవాలని మనసు లాగుతుంది. కానీ ఇంటికి చేరేలోపు పగిలిపోతుందేమోననే భయం ఆపేస్తుంది. లెదర్ ఆర్టికల్స్, ఉడెన్ హ్యాండీక్రాఫ్ట్స్, కాపర్ బెల్స్ దొరుకుతాయి. ఇక దుస్తులైతే బాతిక్ ప్రింట్, అజ్రక్ ప్రింట్, రోగన్ వర్క్, సిల్వర్ వర్క్, మడ్మిర్రర్ వర్క్, కచ్ వర్క్ ఎంబ్రాయిడరీలు వందల రకాలు దేనికందే ప్రత్యేకం అన్నట్లుంటాయి. నిజానికి కచ్ అనే పేరు మనకు బాగా సుపరిచితమైనదే. ఎంబ్రాయిడరీ నేర్చుకునే వాళ్లకు కచ్ వర్క్‌లో నైపుణ్యం సాధించాలనే కల ఉంటుంది. ‘కచ్ వర్క్ వచ్చు’ అని చెప్పడంలో ఓ సంతోషంతోపాటు కొంత అతిశయం, మరికొంత ఆత్మవిశ్వాసం కూడా తొణికిసలాడుతుంటాయి. ఒంటెబండి విహారం మనకు ఒంటెద్దు బండి తెలుసు. ఇక్కడ మాత్రం ఒంటె బండి విహారం ప్రత్యేకత. హనీమూన్ కపుల్‌కి ఒంటె సవారీ, కుటుంబంతో వెళ్లిన వాళ్ల కోసం ఒంటెబండి సవారీ రెండూ ఉంటాయి. సూర్య కిరణాలు సోకి తెల్లగా మిలమిల మెరుస్తున్న ఉప్పు కయ్యల్లో ఒంటె పాదాల ముద్రలు పడుతుంటాయి. కొంత సేపటికే ఉప్పు కరిగి పాదముద్రలు మాయమైపోతాయి. మాండవి తీరాన ఒంటె సవారీ కూడా మంచి అనుభూతిగా మిగులుతుంది. ఒంటెబండి సవారీతోపాటు హాట్ ఎయిర్ బెలూన్ ఎక్కిస్తే పిల్లలకు ఈ టూర్ హండ్రెడ్ పర్సెంట్ సంతోషాన్నిచ్చినట్లే. -
ప్రధాని రాష్ట్రానికి బహుమతి: యునెస్కో జాబితాలో మరో చారిత్రక కట్టడం
న్యూఢిల్లీ: ఇటీవల తెలంగాణలోని రామప్ప ఆలయం యునెస్కో జాబితాలో చేర్చగా తాజాగా మరో కట్టడం యునెస్కో జాబితాలో చేరింది. గుజరాత్‌లోని ధోలవిరాకు యునెస్కో వారసత్వ గుర్తింపు లభించింది. ఈ విషయాన్ని యునెస్కో మంగళవారం అధికారికంగా ప్రకటించింది. ధోలవిరాను ప్రపంచ వారసత్వ జాబితాలో చేరుస్తూ యునెస్కో ట్వీట్ చేసింది. హరప్పా నాగరికత నాటి పట్టణంగా ధోలవిరా ప్రసిద్ధి చెందింది. కచ్ జిల్లాలో ఉన్న ఈ పట్టణం 4,500 ఏళ్ల చరిత్ర ఉందని ఆధారాలు ఉన్నాయి. భారత్ నుంచి యునెస్కో గుర్తింపు పొందిన 40వ వారసత్వ సంపద ధొలవిరా పట్టణం. ఈ విషయాన్ని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ట్విటర్లో తెలిపారు. 🔴 BREAKING! Dholavira: A Harappan City, in #India🇮🇳, just inscribed on the @UNESCO #WorldHeritage List. Congratulations! 👏 ℹ️ https://t.co/X7SWIos7D9 #44WHC pic.twitter.com/bF1GUB2Aga — UNESCO 🏛️ #Education #Sciences #Culture 🇺🇳😷 (@UNESCO) July 27, 2021 It gives immense pride to share with my fellow Indians that #Dholavira is now the 40th treasure in India to be given @UNESCO’s World Heritage Inscription. Another feather in India’s cap as we now enter the Super-40 club for World Heritage Site inscriptions. pic.twitter.com/yHyHnI6sug — G Kishan Reddy (@kishanreddybjp) July 27, 2021 -
రైతులకు సహకరించేందుకు 24 గంటలు సిద్ధం
-
గుజరాత్లో మరోసారి భూకంపం
గాంధీనగర్: గుజరాత్‌ను మరోసారి భూకంపం వణికించింది. 24 గంటలు గడవక ముందే రెండోసారి భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దాంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. సోమవారం మధ్యాహ్నం 12.57 గంటల సమయంలో రాజ్‌కోట్ సమీపంలో రెండోసారి భూకంపం చోటు చేసుకుంది. రిక్టార్ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.4గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ పేర్కొంది. రాజ్‌కోట్‌కు వాయవ్య దిశలో 83 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. గుజరాత్లో ఆదివారం రాత్రి 8 గంటలకు రాజ్‌కోట్, గుజరాత్ సమీప ప్రాంతాలకు 122 కిలోమీటర్ల దూరంలో వ్యాయువ్యంగా ఈ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టార్ స్కేల్‌పై 5.8గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. దీంతో రాజ్‌కోట్ వాసులు ఆందోళనకు గురయ్యారు. -
పాకిస్తాన్ వ్యక్తి అరెస్టు
భుజ్: గుజరాత్‌లోని రణ్ ఆఫ్ కచ్ వద్ద, భారత్–పాక్ సరిహద్దులో 30 ఏళ్ల వయసున్న పాకిస్తానీ వ్యక్తిని సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) పట్టుకుందని ఓ అధికారి చెప్పారు. అతని పేరు మనహార్ సోటా అనీ, సింధ్ ప్రావిన్సులోని ఉమర్కోట్ జిల్లా వాసి అని అధికారి వెల్లడించారు. (పాక్‌కు భారత్ హెచ్చరిక) అర్ధరాత్రి 2.40 సమయంలో అతను భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుండగా, ఆ సమయంలో గస్తీ నిర్వహిస్తున్న బీఎస్ఎఫ్ సిబ్బంది పట్టుకున్నారని తెలిపారు. అతని వద్ద ఆయుధాలు తదితరాలేవీ దొరకలేదనీ, విచారణ కోసం స్థానిక పోలీసులకు అప్పగిస్తామని చెప్పారు. భద్రతా దళాలు చుట్టుముట్టగానే అతనే లొంగిపోయాడని తెలిపారు. (పాక్ ముసుగు తొలగించిన ముషార్రఫ్) -
ఆ ఆస్పత్రిలో 1000 మంది చిన్నారుల మృతి!
గాంధీనగర్: ఆదానీ ఫౌండేషన్ ఆధ్వర్యంలోని ఓ ఆస్పత్రిలో గత ఐదేళ్ల కాలంలో వెయ్యి మందికిపైగా చిన్నారులు మరణించారు. కఛ్ జిల్లా బూజ్ పట్టణంలోని జీకే ఆస్పత్రిలో ఈ మరణాలు చోటుచేసుకున్నాయి. ఈ విషయాన్ని గుజరాత్ డిప్యూటీ సీఎం, ఆరోగ్య శాఖ మంత్రి నితిన్ పటేల్ బుధవారం శాసనసభలో వెల్లడించారు. క్వశ్చన్ అవర్ సయమంలో ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నకు నితిన్ పటేల్ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. జీకే ఆస్పత్రిలో గడిచిన ఐదేళ్ల కాలంలో 1,018 మంది చిన్నారులు చనిపోయినట్టు తెలిపారు. 2014-15లో 188 మంది, 2015-16లో 187 మంది, 2016-17లో 208 మంది, 2017-18లో 276 మంది, 2018-19(ఇప్పటివరకు) 159 మంది చిన్నారులు చనిపోయినట్టు వెల్లడించారు. జీకే ఆస్పత్రిలో చిన్నారుల మరణాలపై దర్యాప్తు చేపట్టడానికి గత ఏడాది మే నెలలో కమిటీని ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ కమిటీ తన నివేదికలో పిల్లల మరణాలకు వేర్వేరు కారణాలను పేర్కొందన్నారు. చనిపోయినవారిలో ఆ ఆస్పత్రిలో జన్మించిన శిశువులతోపాటు, అక్కడికి రిఫర్ చేయబడిన చిన్నారులు కూడా ఉన్నారని తెలిపారు. -
పాకిస్తాన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు..
అహ్మదాబాద్: భారత్-పాకిస్తాన్ల వైరం ఓ జంటకు సమస్య తెచ్చిపెట్టింది. గుజరాత్‌లోని కచ్ జిల్లా భుజ్‌కు చెందిన అల్తాఫ్ పలేజా.. పాకిస్తాన్‌లోని కరాచీకి చెందిన సిద్రాను పెళ్లి చేసుకున్నాడు. కాగా సిద్రా పాకిస్తాన్ జాతీయురాలు అయినందున సరిహద్దు జిల్లా అయిన కచ్‌లోకి ఆమె, కుటుంబ సభ్యులు వెళ్ళేందుకు భారత ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. దీంతో అల్తాఫ్ భార్య, అత్తమామల కోసం ఊరికి దూరంగా ఉంటున్నాడు. ఎనిమిది నెలల క్రితం సిద్రా, ఆమె కుటుంబ సభ్యులు భారత్‌కు వచ్చారు. అయితే కచ్ తప్ప ఇతర ప్రాంతాల్లో ఉండాలన్న షరతుతో వీసా మంజూరు చేశారు. దీంతో కచ్‌కు సమీపంలోని మోర్బి జిల్లాలో వారు బస చేశారు. అల్తాఫ్ తన భార్య సిద్రి, ఆరు నెలల కొడుకుతో కలసి వారితో ఉంటున్నాడు. మోర్బిలో అద్దె ఇంటి కోసం అన్వేషించగా, పాకిస్తాన్ నుంచి వచ్చారనే కారణంతో ఇల్లు ఇవ్వడానికి ఎవరూ ముందుకురాలేదు. భుజ్‌లో ఉన్న కుటుంబ సభ్యులకు దూరంగా అల్తాఫ్ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడటంతో పాటు మోర్బిలో ఇల్లు లేక హోటల్లో ఉండాల్సి వచ్చింది. తన భార్యను సొంతూరుకు తీసుకెళ్లేందుకు అధికారులు ఎందుకు అనుమతించడం లేదో కారణం కనిపించడం లేదని అల్తాఫ్ వాపోయాడు. -
గుజరాత్లో స్వల్ప భూకంపం
కచ్: గుజరాత్‌లోని కచ్ జిల్లాలో శనివారం ఉదయం రెండుసార్లు భూప్రకంపనలు వచ్చాయి. ఉదయం 6 గంటల ప్రాంతంలో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.3గా నమోదైంది. బచావు పట్టణానికి వాయవ్య దిశలో 22 కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. ఓ గంట తర్వాత మళ్లీ ప్రకంపనలు వచ్చాయి. ఎలాంటా ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్టు వార్తలు రాలేదు.