కచ్ మహోత్సవ్‌కు వెళ్లాలనుకున్న వాళ్లు టెంట్ సిటీలో బస చేయాలనుకుంటే షెడ్యూల్ విడుదల అయిన వెంటనే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. టెంట్ సిటీ అంటే... ఈ వేడుకల కోసం చక్కటి వ్యూ ఉన్న ప్రదేశంలో టూరిజం డిపార్ట్‌మెంట్ గుడారాలతో సిద్ధం చేసిన నగరం. ఇందులో దాదాపుగా స్టార్ హోటల్ సౌకర్యాలన్నీ ఉంటాయి.
►పగలు సూర్యుడి కిరణాలు కళ్ల మీద పడి దృష్టిని చెదరగొడుతుంటాయి. కాబట్టి టూర్‌కి వెళ్లేటప్పుడు కూలింగ్ గ్లాసెస్‌తోపాటు పెద్ద హ్యాట్, గొడుగు దగ్గర ఉంచుకోవాలి.
►రాత్రి ఉష్ణోగ్రతలు బాగా తక్కువ కాబట్టి ఉలెన్ జాకెట్‌లు తీసుకెళ్లాలి. దేశ సరిహద్దు కావడంతో ఇక్కడ సెక్యూరిటీ పటిష్టంగా ఉంటుంది.
►ఐడీ కార్డు దగ్గర ఉంచుకోవాలి. అలాగే గ్రూప్‌గా వెళ్లినవాళ్లు గ్రూప్ నుంచి విడివడి ఒంటరిగా మరీ దూరంగా వెళ్లకపోవడమే మంచిది.
►ఒకవేళ వెళ్లినట్లయితే ఐడీకార్డు చూపించి సెక్యూరిటీ ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగి ఉండాలి.
►పర్యటనకు వెళ్లినప్పుడు స్థానికుల సంప్రదాయాలను హేళన చేయరాదు, తేలిక చేసి మాట్లాడరాదు.
►ఇతరుల సంప్రదాయాలను గౌరవించడమే సంస్కారం అని మర్చిపోకూడదు.
చదవండి: చిన్నవయసులో ఆర్ధరైటిస్.. ఈ లక్షణాలు ఉన్నాయేమో చూసుకోండి
Comments
Please login to add a commentAdd a comment