కొంతమందిలో సోషల్ మీడియా పిచ్చి రోజురోజుకీ పెరిగిపోతుంది. చిన్నపిల్లల నుంచి ముసలివాళ్ల వరకు సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోవటంతో.. ఆ క్రేజ్‌ను ఉపయోగించుకుని ఓవర్ నైట్ స్టార్ కావాలని పిచ్చి పిచ్చి ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. త్వరగా ఫేమస్ అయిపోవాలని, తమ వీడియోలు వైరల్ అవ్వాలని కొన్నిసార్లు ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇలాంటి చేష్టలు చేయకూడదని ఎంతమంది చెప్పినా తమ ప్రవర్తనలో మార్పు తెచ్చుకోవడం లేదు. తాగా ఇలాంటి ఘటనలో మరొకటి వెలుగు చూసింది.
ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం కొంతమంది యువకులు తమ కారును సముద్రంలోకి నడిపి ప్రమాదంలో చిక్కుకున్నారు. ఈ ఘటన గుజరాత్‌లోని కచ్ సముద్ర తీరంలో జరిగింది. ఇద్దరు యుకులు రీల్స్ కోసం తమ రెండు మహీంద్రా థార్ ఎస్‌యూవీ కారులను ముంద్రా సముద్ర తీరంలోకి పోనిచ్చారు. నీరు లోతు పెరగడం, అలల కారణంగా రెండు వాహనాలు దాదాపు నీటిలో మునిగిపోయాయి. దీంతో యువకులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
రెడ్, వైట్ మహీంద్రా థార్ వాహనాలను నీటిలో నుంచి బయటకు తీయడానికి చాలా కష్టపడ్డారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. స్థానికుల సహాయంతో ఎట్టకేలకు వాహనాలను నీటిలో నుంచి బయటకు తీశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, కచ్ పోలీసులు ఇద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రెండు ఎస్‌వీలను స్వాధీనం చేసుకున్నామని, చట్టపరమైన చర్యలు ప్రారంభించామని పోలీసు అధికారి తెలిపారు.
Gujarat: In an attempt to make a reel, two young men drove 2 Thar vehicles into the deep waters near the seashore in Mundra, Kutch due to which both vehicles get stuck in the water. With the help of locals, both vehicles were retrieved, also Kutch police filed an FIR against the… pic.twitter.com/m9YR0ByK7b
— IANS (@ians_india) June 23, 2024
Comments
Please login to add a commentAdd a comment