Travel Tips
-
రైలు ప్రయాణం హాయిగా సాగిపోవాలంటే..!
రైలు ప్రయాణం అంటే ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు. స్లీపర్ క్లాస్‌లో వెళ్లితే ప్రశాంతత మాట దేవుడెరుగు..ఒకటే గజిబిజి గందరగోళంలా ఉంటుంది వాతావరణం. ఏదో ఫోన్లో తలదూర్చి లేదా పేపర్‌తోనే కాలక్షేపం చేస్తూ ఎప్పుడు దిగిపోతాం రా బాబు అనుకుంటుంటాం. అలాంటి విసుగు, ఇబ్బంది కలగకుండా హాయిగా ట్రైన్ జర్నీ సాగిపోవాలంటే బాలీవుడ్ నటి మలైకా అరోరా చెప్పే జర్నీ చిట్కాలను ప్రయత్నించి చూడండి. ఆమె తన రైలు ప్రయాణాన్ని వీడియో తీసి మరీ నెట్టింట్ షేర్ చేశారు. ఆ వీడియోలో మలైకా మీరు బుక్ చేసుకున్న క్లాస్‌ని బట్టి జర్నీ ఎంజాయ్ చేయడం అనేది ఆధారపడి ఉంటుందన్నారు. "తక్కవ బడ్జెట్లో వెళ్లాలనుకుంటే స్లీపర్, సెకండ్ క్లాస్‌లు అనువైనవి. అలాకాకుండా తన వ్యక్తిగత గోప్యత కోరుకునే ప్రయాణికులకు ఫస్ట్-క్లాస్ ఏసీ కంపార్ట్మెంట్లు అనుకూలం. రైల్లో ఎక్కువసేపు ప్రయాణించేవాళ్లు తప్పనిసరిగి పిల్లో, దుప్పటిని తప్పనిసరిగా తీసుకెళ్లడం ఉత్తమం. ఇది ఇంటిలో ఉన్న అనుభూతిని ఇస్తుంది. దీంతోపాటు సౌకర్యవంతమైన దుస్తులు ధరించడం మంచిది. తేలికగా జీర్ణమయ్యే తినుబండరాలను కూడా తీసుకువెళ్లండి. అలాగే రాత్రి సమయాల్లో నిద్రపట్టనప్పుడు కాలక్షేపమయ్యేలా మంచి పుస్తకాలను, లేదా మ్యూజిక్, సినిమా చూసేలా ఏర్పాట్లు చేసుకోండి. ఇలాంటి సింపుల్ చిట్కాలతో ట్రైన్ జర్నీని హాయిగా ఎంజాయ చేస్తే సరి." అని మలైకా వీడియోలో వివరించారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) (చదవండి: చర్మతత్వాన్ని బట్టి మాయిశ్చరైజర్లు రాసుకోవాలి..!) -
Travel: హిమాలయాల్లో చివరి నివాస ప్రదేశం ఇదే!
Travel Tips In Telugu: హిమకుండ్ సాహిబ్... ఇది సిక్కుల పవిత్రతీర్థం. సిక్కుల పదవ గురువు ‘గురు గోవింద్ సింగ్’ ధ్యానం చేసుకున్న ప్రదేశం. హిమకుండ్ అంటే మంచుసరస్సు. ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో, సముద్ర మట్టానికి 4,329 మీటర్ల ఎత్తున ఉంది ఈ ప్రదేశం. ఇక మంచు టోపీలు పెట్టుకున్న పర్వత శిఖరాలు చూపరులను కట్టి పడేస్తాయి. ఇక్కడ గురుద్వారా, లక్ష్మణునికి ఆలయం ఉన్నాయి. సిక్కులు ఈ పవిత్ర తీర్థంలో మునిగి ఇక్కడ ఉన్న గురుద్వారాని దర్శించుకుంటారు. ఆసక్తికర అంశాలు ►హిమకుండ్ సాహిబ్ టూర్లో వరల్డ్ హెరిటేజ్ సైట్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్‌ను కూడా కలుపుకోవచ్చు. ►ఘంఘారియా ప్రత్యేకతను కూడా తెలుసుకుని మరీ ఇక్కడ పర్యటన కొనసాగించాలి. ►ఇది పుష్పావతి, హిమగంగ నదుల కలయిక ప్రదేశం. హిమాలయాల్లో చివరి నివాస ప్రదేశం కూడా. ►డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు ఈ ప్రదేశం మంచుదుప్పటి కప్పుకుని ఉంటుంది. ►ట్రెకింగ్‌కి మే నెల నుంచి అక్టోబర్ వరకు అనుమతిస్తారు. చదవండి: Beauty Tips In Telugu: నల్లని కురులకు.. బ్లాక్ జీరా ప్యాక్! -
Travel: కివి, అప్రికాట్, ఎర్రటి యాపిల్ పండ్లు.. నది పాయలు, మంచు..
Reasons to Discover Sangti Valley: కనుచూపు మేరలో ఎటుచూసినా ధీరగంభీరంగా హిమాలయ పర్వతాలు. చడీచపుడు చేయకుండా సన్నగా కురిసే మంచు. మంచుకు ఆవల కనుచూపుమేర విస్తారమైన పండ్లతోటలు. కివి, అప్రికాట్, పెద్ద సీమ కమలాలు, కశ్మీర్ యాపిల్‌ను తలదన్నే ఎర్రటి యాపిల్ పండ్లు... రంగురంగుల్లో నోరూరిస్తుంటాయి. నల్ల మెడ తెల్ల కొంగలు ఈ తోటల్లో సొంతదారుల్లా విహరిస్తుంటాయి. ఈ తోటల వాలులో ఝమ్మని మంద్రంగా శబ్దం చేస్తూ కనిపించీ కనిపించకుండా ప్రవహించే నది పాయలు. ఇది అరుణాచల్ ప్రదేశ్, సంగ్తిలోయకు సొంతమైన ప్రకృతి సౌందర్యం. బస ఇలాగ! సంగ్తి వ్యాలీ పూర్తిగా ప్రకృతి ఒడి. ఇక్కడ ఆధునికత అంటే పర్యాటక ప్రధానమైన అభివృద్ధి మాత్రమే. పర్యాటకులు ప్రకృతితో మమైకమై జీవించిన అనుభూతి పొందడం కోసం బసకు గుడారాలుంటాయి. గుడారపు బసలు విలాసవంతంగా ఉండవు. కానీ చక్కటి బెడ్, లైట్లు, ఫ్యాన్, అటాచ్డ్ బాత్రూమ్తో సౌకర్యవంతంగానే ఉంటాయి. గుడారాలన్నీ నది తీరానే ఉంటాయి. ఈ ట్రిప్‌లో... రాత్రి భోజనం తర్వాత నది తీరాన చలిమంట వేసుకుని ఆ మంట చుట్టూ తిరుగుతూ డాన్స్ చేయడం మాత్రం మర్చిపోకూడదు. ఇక్కడ ఏమి తినాలి? ఆహారంలో మసాలాలు తక్కువగా ఉంటాయి. భోజనం రుచిగానే ఉంటుంది. స్థానిక భోజనం రుచి చూడాలంటే కొంచెం కష్టమే. ఇక్కడి హోటళ్లలో టూరిస్టుల కోసం నార్త్, సౌత్ ఇండియన్ రుచులనే ఎక్కువగా వండుతారు. ఇంకా! ►మొబైల్ సిగ్నల్స్ ఉండవు. కాబట్టి రూట్‌ని ముందుగా డౌన్లోడ్ చేసుకోవాలి. ఫోన్ కాల్స్ డిస్టర్బెన్స్ ఉండదు, కాబట్టి టూర్‌ని ఆసాంతం ఆస్వాదించవచ్చు. ►ఇక్కడి మనుషులు అత్యంత వినయశీలురు, నిజాయితీపరులు. క్యాబ్ డ్రైవర్లు డ్యూటీ టైమ్‌కి పది నిమిషాల ముందే సిద్ధంగా ఉంటారు. ►పర్యాటకులు క్యాబ్‌లో పర్సు మర్చిపోతే ఫోన్ చేసి మరీ ఆ పర్సును డబ్బుతో సహా జాగ్రత్తలగా పర్యాటకులకు చేరే ఏర్పాటు చేస్తారు. ►టూరిస్టు ప్రదేశాలన్నీ ప్లాస్టిక్ రహితంగా ఉంటాయి. కానీ స్థానికులకు ప్లాస్టిక్ వాడకం పట్ల పెద్దగా పట్టింపులు ఉన్నట్లు కనిపించదు. ►యధేచ్ఛగా వాడేస్తుంటారు. ప్లాస్టిక్ వాడకం పట్ల ప్రపంచం స్వీయనియంత్రణలు అనుసరిస్తున్న సంగతి బహుశా వాళ్లకు తెలియకపోవచ్చు. చదవండి: Chikmagalur: చిక్‌మగళూరు.. మంచి కాఫీలాంటి విహారం -
Travel Tips: ప్రయాణానికి ముందు జాగ్రత్తలు మర్చిపోకండి!
కచ్ మహోత్సవ్‌కు వెళ్లాలనుకున్న వాళ్లు టెంట్ సిటీలో బస చేయాలనుకుంటే షెడ్యూల్ విడుదల అయిన వెంటనే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. టెంట్ సిటీ అంటే... ఈ వేడుకల కోసం చక్కటి వ్యూ ఉన్న ప్రదేశంలో టూరిజం డిపార్ట్మెంట్ గుడారాలతో సిద్ధం చేసిన నగరం. ఇందులో దాదాపుగా స్టార్ హోటల్ సౌకర్యాలన్నీ ఉంటాయి. ►పగలు సూర్యుడి కిరణాలు కళ్ల మీద పడి దృష్టిని చెదరగొడుతుంటాయి. కాబట్టి టూర్‌కి వెళ్లేటప్పుడు కూలింగ్ గ్లాసెస్తోపాటు పెద్ద హ్యాట్, గొడుగు దగ్గర ఉంచుకోవాలి. ►రాత్రి ఉష్ణోగ్రతలు బాగా తక్కువ కాబట్టి ఉలెన్ జాకెట్లు తీసుకెళ్లాలి. దేశ సరిహద్దు కావడంతో ఇక్కడ సెక్యూరిటీ పటిష్టంగా ఉంటుంది. ►ఐడీ కార్డు దగ్గర ఉంచుకోవాలి. అలాగే గ్రూప్‌గా వెళ్లినవాళ్లు గ్రూప్ నుంచి విడివడి ఒంటరిగా మరీ దూరంగా వెళ్లకపోవడమే మంచిది. ►ఒకవేళ వెళ్లినట్లయితే ఐడీకార్డు చూపించి సెక్యూరిటీ ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగి ఉండాలి. ►పర్యటనకు వెళ్లినప్పుడు స్థానికుల సంప్రదాయాలను హేళన చేయరాదు, తేలిక చేసి మాట్లాడరాదు. ►ఇతరుల సంప్రదాయాలను గౌరవించడమే సంస్కారం అని మర్చిపోకూడదు. చదవండి: చిన్నవయసులో ఆర్ధరైటిస్.. ఈ లక్షణాలు ఉన్నాయేమో చూసుకోండి -
ఇండియాలో ఎక్కువ దూరం ప్రయాణించే రైలు ఏదో తెలుసా?
మనదేశంలో ఎక్కువ దూరం ప్రయాణించే రైలు వివేక్ ఎక్స్‌ప్రెస్. ఇది అస్సాంలోని దిబ్రూగఢ్ నుంచి తమిళనాడులోని కన్యాకుమారి వరకు 4,273 కి.మీల దూరం ప్రయాణిస్తుంది. తొమ్మిది రాష్ట్రాల మీదుగా సాగిపోతుంది. మధ్యలో 56 స్టేషన్లలో ఆగుతుంది. దిబ్రూగఢ్‌లో మొదలైన రైలు కన్యాకుమారి చేరడానికి ఐదు రోజులు పడుతుంది. ఇది వీక్లీ ట్రైన్. ట్రావెల్ టిప్స్: జాగ్రత్తగా వెళ్లి వద్దాం ► టూర్‌కి వెళ్తున్న ప్రదేశం ప్రత్యేకతలను ముందుగా తెలుసుకుని బయలుదేరితే పర్యటనను ఆసాంతం ఆస్వాదించవచ్చు. ► ముఖ్యంగా అక్కడికి మాత్రమే ప్రత్యేకమైన వంటలు, పండ్లు, అక్కడ మాత్రమే దొరికే వస్తువులను మిస్ కాకూడదు. ► టూర్లో ఉదయం బ్రేక్‌ఫాస్ట్ మాత్రం పూర్తి స్థాయిలో తీసుకోవాలి. ► ఇక రోజంతా ఆహారాన్ని ఒకేసారి ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు. కొద్ది కొద్దిగా ఎక్కువ సార్లు తీసుకోవాలి. ► టూర్‌కి వెళ్లే ముందు ఫ్యామిలీ డాక్టర్‌ను సంప్రదించి, డాక్టర్ సూచించిన మందులను వెంట తీసుకు వెళ్లాలి. -
Neelakurinji: ఆ పువ్వులు మళ్లీ 2030లో పూస్తాయి!
మున్నార్ అంటే మూడు నదుల సమ్మేళనం. పశ్చిమ కనుమలలో విస్తరించిన ఈ ప్రదేశం ముథిరాప్పుజ, నల్లతన్ని, కుండలి నదుల మధ్య ఉన్న హిల్‌స్టేషన్. ఈ కొండలకు నీలగిరులు అనే పేరు రావడానికి ‘నీలకురింజి’ పూలే కారణం. కేరళలో ఏ ప్రదేశానికి ట్రిప్ అయినా సరే ట్రైన్ పాలక్కాడ్ సమీపించగానే మరోలోకంలోకి వెళ్తున్న భావన కలుగుతుంది. పచ్చని పొలాలు, లెక్కపెట్టటానికి సాధ్యం కానన్ని కొబ్బరిచెట్లు కనువిందు చేస్తాయి. రైల్లోకి కనిపించే చిన్న చిన్న గ్రామాలు, ఇళ్లు ముచ్చటగా ఉంటాయి. చాలా వరకు పెంకుటిళ్లే. పెంకులను అమర్చడంలో నైపుణ్యం సీనియర్ ఆర్కిటెక్ట్‌ను కూడా మురిపించేటట్లు, ఇల్లంటే ఇలా ఉండాలి అనిపించేటట్లు ఉంటుంది. ఇటీవల ఆర్కిటెక్ట్‌లు ఎర్ర పెంకు కప్పు నిర్మాణాల మీద ప్రత్యేకంగా అధ్యయనం చేస్తున్నారు కూడా. పుష్కరకాలం ఎదురు చూపు నీలగిరుల్లో పన్నెండేళ్లకోసారి ప్రకృతి వరం వికసిస్తుంది. కొండల మీద ఎటు చూసినా నీలకురింజి చెట్లే. ఈ చెట్లు పన్నెండేళ్లకు ఒకసారి పూస్తాయి. పూసిన పువ్వు ఏడాది వరకు ఉంటుంది. ఒక చెట్టు ఒక్కపువ్వును మాత్రమే పూసి వాడిపోతుంది. ఆ పువ్వు పేరు నీలకురింజి. నీల అంటే నీలిరంగు, కురింజి అంటే మళయాళంలో పువ్వు అని అర్థం. ఆ నీలిపువ్వునుంచి రాలిన గింజలు మొలకెత్తి పన్నెండేళ్లకు పూతకు వస్తాయి. నీలకురింజి పూలు పూసిన ఏడాది పర్యటించగలగడం అదృష్టమనే చెప్పాలి. 2006లో ఈ పూలు పూశాయి, ఆ తర్వాత 2018లో పూశాయి. ఆ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం రోజు ప్రధానమంత్రి తన ప్రసంగంలో పశ్చిమ కనుమల్లో విరిసే నీలకురింజి గురించి ప్రస్తావించారు. అయితే ఆ ఏడాది ప్రకృతి వరం ఇవ్వడంతోపాటు కన్నెర్ర కూడా చేసింది. పూలు కొండల నిండుగా విరిసిన జూలై, ఆగస్టుల్లో కుంభవృష్టి కురిసింది. కొచ్చి ఎయిర్‌పోర్టు రన్‌వే మీద కూడా నీళ్లు నిలిచాయి. విమాన సర్వీసులు ఆగిపోయాయి. రైళ్లు నడవడం కూడా కష్టమైంది. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత కూడా టూరిజం గాడిన పడడానికి కొద్ది నెలలు పట్టింది. పర్యాటకుల పుష్కర కాలపు ఎదురు చూపు వృథా అయింది. ఒకటి కాదు... యాభై రకాలు! కురింజి పూసినప్పుడు కొండలన్నీ నీలిరంగు దుప్పటి పరిచినట్లు ఉంటాయి. మున్నార్, ఊటీ, కొడైకెనాల్‌లను మామూలు రోజుల్లో చూసిన వాళ్లు కూడా కురింజి కోసం ఆ పువ్వు పూసే ఏడాది మళ్లీ టూర్ ప్లాన్ చేసుకుంటారు. బొటానికల్‌గా వీటిని 50 రకాల జాతులుగా చెప్తారు కాని మనకు చూడడానికి అన్నీ నీలంగానే ఉంటాయి, షేడ్లు మాత్రం ఏ చిత్రకారుడూ మిక్స్ చేయలేనంత లలితంగా ఉంటాయి. ఈ పూలు మళ్లీ 2030లో పూస్తాయి. ఆ ఏడాది కోసం ఎదురు చూద్దాం. ట్రావెల్ టిప్స్: జాగ్రత్తగా వెళ్లి వద్దాం! కేరళలో ఎండాకాలం ఉష్ణోగ్రతలు ఎక్కువ. కాబట్టి టూర్లో తేలికపాటి దుస్తులు ధరించాలి. ఈ వాతావరణంలో పాదాలకు కూడా చెమట పడుతుంది. రెయినీ షూస్ అయితే తడి నేల మీద అడుగు వేసినప్పుడు జారదు. బురద అంటినా శుభ్రం చేసుకోవడం సులభం. కేరళ ఆహారంలో మసాలాలు ఉండవు కాబట్టి, జీర్ణాశయ సమస్యలు ఎదురుకావు. జలుబు, జ్వరం మందులు మాత్రం దగ్గర ఉంచుకుంటే సరిపోతుంది. కేరళ టూర్లో రోజూ తలస్నానం చేయాలి, ఒక కొబ్బరి బోండాం తాగడం కూడా మంచిది. కేరళలో దొరికే అరటికాయ చిప్స్ రుచి చూడాలి. కొబ్బరి నూనెలో వేయించిన అరటికాయ చిప్స్ నెల రోజుల వరకు తాజాగా ఉంటాయి. వీలయితే కొన్ని ప్యాకెట్లు తెచ్చుకోవచ్చు. ∙టీ ఆకులతో మరిగించిన టీ రుచి చూడాలి. టీ పొడులు రకరకాల ఫ్లేవర్లు దొరుకుతాయి. చదవండి: కొండల రాణి.. మేఘాల్లో తేలినట్లుగా ఉంటుంది! -
ప్రయాణంలో పిల్లలను వెంట తీసుకెళ్లాల్సి వస్తే...
ట్రావెల్ టిప్స్ వేసవిలో పిల్లలకోసం తప్పనిసరి ప్రయాణాలుంటాయి. వారిలో ప్రయాణపు ఆనందాన్ని పెంచడానికి కొన్ని సూచనలు... పిల్లలు ఎప్పుడూ ఫన్ కోరుకుంటారు. బొమ్మలు వారి సరదా తీర్చినా, అది కొంతసేపే! వారి మెదళ్లకు ఎక్కువ పని ఉండేవి.. బోర్ కొట్టని ‘బ్రెయిన్ బిల్డింగ్ గేమ్స్’ వెంట తీసుకెళ్లడం మంచిది. వాతావరణ మార్పులు పడక పిల్లలకు జలుబు, దగ్గు, జ్వరం వస్తుంటాయి. వీటికి సంబంధించిన మందుల కోసం ప్రయాణానికి ముందుగానే డాక్టర్ని సంప్రదించి, వారి సూచన తీసుకోవాలి. పెద్దవారి మందులతో కలిపి కాకుండా జిప్పర్లాక్ బ్యాగ్‌లో వేసి, విడిగా పెడితే త్వరగా తీసుకొని, ఉపయోగించడానికి వీలుగా ఉంటుంది. కొంతమంది పిల్లలకు వాహనాల్లో ప్రయాణించడం పడదు. వాంతి చేసుకోకుండా ఉండటానికి ‘సిక్నెస్’ మందులను కూడా వైద్యుల సూచన మేరకు వెంట ఉంచుకోవాలి.ఆకలి వేసి పిల్లలు విసిగించకుండా ఉండాలంటే అల్పాహారం, భోజనం సరిపడినంత తినిపించాలి. బిస్కెట్లు, పాలు, జ్యూస్, పెరుగు, పండ్లు.. ఇలా పిల్లలు తినదగ్గ, ఎంపిక చేసుకున్న ఇతర పదార్థాలను హోటల్‌రూమ్‌లో సిద్ధంగా ఉంచుకోగలిగితే సమయం, డబ్బు ఆదా అవుతాయి. వెళ్లే చోట పిల్లలు ఆనందించే విహార ప్రదేశాల గురించి ముందే తెలుసుకోవాలి. రోజులో పిల్లలు ఎక్కువ సేపు ఆడుకునే క్రీడా మైదానాలకు తీసుకెళితే, ఆ తర్వాత చూడాల్సిన ప్రదేశాలనూ వారు బాగా ఆనందిస్తారు.