Travel Tips In Telugu: హిమకుండ్ సాహిబ్... ఇది సిక్కుల పవిత్రతీర్థం. సిక్కుల పదవ గురువు ‘గురు గోవింద్ సింగ్’ ధ్యానం చేసుకున్న ప్రదేశం. హిమకుండ్ అంటే మంచుసరస్సు. ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో, సముద్ర మట్టానికి 4,329 మీటర్ల ఎత్తున ఉంది ఈ ప్రదేశం.
ఇక మంచు టోపీలు పెట్టుకున్న పర్వత శిఖరాలు చూపరులను కట్టి పడేస్తాయి. ఇక్కడ గురుద్వారా, లక్ష్మణునికి ఆలయం ఉన్నాయి. సిక్కులు ఈ పవిత్ర తీర్థంలో మునిగి ఇక్కడ ఉన్న గురుద్వారాని దర్శించుకుంటారు.
ఆసక్తికర అంశాలు
►హిమకుండ్ సాహిబ్ టూర్‌లో వరల్డ్ హెరిటేజ్ సైట్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్‌ను కూడా కలుపుకోవచ్చు.
►ఘంఘారియా ప్రత్యేకతను కూడా తెలుసుకుని మరీ ఇక్కడ పర్యటన కొనసాగించాలి.
►ఇది పుష్పావతి, హిమగంగ నదుల కలయిక ప్రదేశం. హిమాలయాల్లో చివరి నివాస ప్రదేశం కూడా.
►డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు ఈ ప్రదేశం మంచుదుప్పటి కప్పుకుని ఉంటుంది.
►ట్రెకింగ్‌కి మే నెల నుంచి అక్టోబర్ వరకు అనుమతిస్తారు.
చదవండి: Beauty Tips In Telugu: నల్లని కురులకు.. బ్లాక్ జీరా ప్యాక్!
Comments
Please login to add a commentAdd a comment