చెప్పులు వేసుకుని రావద్దన్న‌ డాక్టర్‌పై దాడి.. వీడియో వైరల్‌ | Doctor Thrashed For Asking Patient Family To Remove Slippers | Sakshi
Sakshi News home page

చెప్పులు వేసుకుని రావద్దన్న‌ డాక్టర్‌పై దాడి.. వీడియో వైరల్‌

Published Wed, Sep 18 2024 7:03 PM | Last Updated on Wed, Sep 18 2024 7:27 PM

Doctor Thrashed For Asking Patient Family To Remove Slippers

భావ్‌నగర్‌: గుజరాత్‌లోని ఓ ఆసుపత్రిలో వైద్యుడిపై రోగి కుటుంబ సభ్యులు తమ ప్రతాపాన్ని చూపించారు. ఎమర్జెన్సీ వార్డులోకి ప్రవేశించే ముందు చెప్పులు తీసేయమని కోరినందుకు ఆ వైద్యుడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. భావ్‌నగర్‌లోని సిహోర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తలకు గాయమైన మహిళకు వైద్యులు చికిత్స అందిస్తుండగా, ఆమె కుటుంబ సభ్యులు పరామర్శించడానికి వచ్చిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 

ఆసుపత్రిలోని అత్యవసర గదిలోని సీసీటీవీలో ఈ మొత్తం ఘటన అంతా రికార్డు అయింది. ఆ వీడియోలో మంచంపై ఉన్న మహిళ పక్కన కొంతమంది పురుషులు నిలబడి ఉండగా, డాక్టర్ జైదీప్‌సిన్హ్ గోహిల్ గదిలోకి వచ్చారు. వైద్యుడు వారిని చెప్పులను తీసివేయమని కోరాడు.

ఇదీ చదవండి: 50 ఏళ్ల మిస్టరీకి చెక్‌..కొత్త బ్లడ్‌ గ్రూప్‌ని కనిపెట్టిన శాస్త్రవేత్తలు..!

దీంతో రోగి కుటుంబ సభ్యులు ఆగ్రహంతో డాక్టర్‌పై దాడి చేశారు. ఆయనను కిందపడేసి మరీ కొట్టడం సీసీటీవీలో రికార్డ్‌ అయ్యింది. మంచంపై పడుకున్న మహిళ, నర్సింగ్ సిబ్బంది నిలువరించడానికి ప్రయత్నించినప్పటికీ నిందితులు వైద్యుడిని కొడుతూనే ఉన్నారు. ఈ ఘర్షణలో గదిలోని మందులు, ఇతర పరికరాలు దెబ్బతిన్నాయి. నిందితులు హిరేన్ దంగర్, భవదీప్ దంగర్, కౌశిక్ కువాడియాలను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement