
ప్రతీకాత్మక చిత్రం
భుజ్: గుజరాత్‌లోని రణ్ ఆఫ్ కచ్ వద్ద, భారత్–పాక్ సరిహద్దులో 30 ఏళ్ల వయసున్న పాకిస్తానీ వ్యక్తిని సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) పట్టుకుందని ఓ అధికారి చెప్పారు. అతని పేరు మనహార్ సోటా అనీ, సింధ్ ప్రావిన్సులోని ఉమర్‌కోట్ జిల్లా వాసి అని అధికారి వెల్లడించారు. (పాక్‌కు భారత్ హెచ్చరిక)
అర్ధరాత్రి 2.40 సమయంలో అతను భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుండగా, ఆ సమయంలో గస్తీ నిర్వహిస్తున్న బీఎస్‌ఎఫ్ సిబ్బంది పట్టుకున్నారని తెలిపారు. అతని వద్ద ఆయుధాలు తదితరాలేవీ దొరకలేదనీ, విచారణ కోసం స్థానిక పోలీసులకు అప్పగిస్తామని చెప్పారు. భద్రతా దళాలు చుట్టుముట్టగానే అతనే లొంగిపోయాడని తెలిపారు. (పాక్ ముసుగు తొలగించిన ముషార్రఫ్)