రాజ్‌కోట్: భారత యువ క్రికెటర్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా బుధవారం తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు.
ఇందుకోసం ఐపీఎల్-7లో భాగంగా ఏప్రిల్ 28న బెంగళూరుతో మ్యాచ్ ముగిసిన వెంటనే పంజాబ్ ఫ్రాంచైజీ నుంచి అనుమతి తీసుకొని స్వస్థలమైన రాజ్‌కోట్‌కు వచ్చాడు. ఎన్నికల కమిషన్ తరపున రాజ్‌కోట్ జిల్లాకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న పుజారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఐపీఎల్ నుంచి రావడం స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ ప్రశంసించారు. మరోవైపు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు పార్థివ్ పటేల్ కూడా అహ్మదాబాద్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు.
ఓటు వేసిన పుజారా, పార్థివ్
Published Thu, May 1 2014 1:09 AM | Last Updated on Sat, Sep 2 2017 6:44 AM
Advertisement
Advertisement