
రాజ్‌కోట్: సొంతగడ్డపై వెస్టిండీస్‌తో నవంబర్ 11న భారత జట్టు చివరి టి20 మ్యాచ్ ఆడుతుంది. సరిగ్గా పది రోజుల తర్వాత బ్రిస్బేన్‌లో తొలి టి20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను భారత్ ఎదుర్కోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బౌన్సీ పిచ్‌లపై టీమిండియా సన్నాహకాలకు సమయం చాలా తక్కువ. దాంతో విండీస్‌తో సిరీస్‌నే దీనికి వాడుకోవాలని భారత జట్టు మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లుగా తెలిసింది. అందుకే విండీస్‌తో సిరీస్ కోసం బౌన్సీ పిచ్‌లను తయారు చేయాలని కోరుతోంది. గురువారంనుంచి రాజ్‌కోట్‌లో జరిగే తొలి టెస్టు కోసం సిద్ధం చేస్తున్న పిచ్ క్యురేటర్‌కు దీని కోసం సూచనలు వెళ్లినట్లుగా సమాచారం.
గత కొన్నేళ్లుగా భారత్‌లో మ్యాచ్ ఎక్కడ జరిగినా పిచ్ ఏర్పాటులో స్థానిక క్యురేటర్లకు సహకరించేందుకు బీసీసీఐ తమ క్యురేటర్లను ప్రత్యేకంగా ఆ వేదిక వద్దకు పంపిస్తోంది. ఇప్పుడు కూడా బోర్డు క్యురేటర్ దల్జీత్ సింగ్ రాజ్‌కోట్ వెళ్లడం బోర్డు ఆలోచనలను తెలియజేస్తోంది. మరో వైపు తమ సొంత అసోసియేషన్ క్యురేటర్లు ఎలాంటి పిచ్‌లు తయారు చేసేందుకైనా సమర్థులని, బోర్డు ప్రత్యేకంగా క్యురేటర్‌ను పంపడాన్ని సౌరాష్ట్ర క్రికెట్ సంఘం నిరంజన్ షా తప్పు పట్టారు.
Comments
Please login to add a commentAdd a comment