భారత్ తో జరుగుతున్న మూడో వన్ డేలో సౌతాఫ్రికాకు శుభారంభం లభించింది. 10 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 59 పరుగులు చేసింది.
రాజ్ కోట్: గాంధీ- మండేలా సిరీస్ లో భాగంగా రాజ్ కోట్ లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా జరుగుతున్న మూడో వన్ డేలో దక్షిణాఫ్రికా నిలకడగా ఆడుతోంది. 10 ఓవర్లు ముగిసేసరికి వికెట్లేమీ కోల్పోకుండా 59 పరుగులు సాధించింది.
ఓపెనర్లు డికాక్ (31), మిల్లార్ (26 పరుగులు చేసి భారీ స్కోరుకు పునాదులు వేసే ప్రయత్నం చేస్తున్నారు. భారత జట్టు కూర్పులో ఒక మార్పు చోటుచేసుకుంది. అమిత్ మిశ్రా బరిలోకి దిగాడు.