third one day
-
మూడో వన్డే : ఫీల్డింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్
మౌంట్ మాంగనీ: భారత్- న్యూజిలాండ్ మధ్య చివరి వన్డే ప్రారంభంమైంది. ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత్ జట్టులో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. కేదార్ జాదవ్ స్థానంలో మనీష్ పాండేను జట్టులోకి తీసుకున్నారు. సరిగ్గా ఏడాది క్రితం భారత జట్టు న్యూజిలాండ్‌లో పర్యటించింది. అప్పుడు టి20 సిరీస్ కోల్పోయిన టీమిండియా వన్డే సిరీస్‌ను గెలుచుకుంది. ఈ సారి సీన్ రివర్స్‌గా మారింది. టి20ల్లో జయభేరి అనంతరం వన్డే సిరీస్‌ను చేజార్చుకుంది. అయితే ఇప్పుడు పొట్టి ఫార్మాట్లో ప్రత్యర్థిని క్లీన్‌స్వీప్ చేసిన కోహ్లి సేన వన్డేల్లో అలాంటి పరాభవం తమకు ఎదురు కాకుండా చూసుకోవాల్సిన స్థితిలో నిలి చింది. ఈ నేపథ్యంలో ఎలాగైనా నెగ్గాలనే పట్టుదలతో భారత్... క్లీన్‌స్వీపే లక్ష్యంగా కీవిస్ బరిలోకి దిగుతున్నాయి. తుది జట్లు న్యూజిలాండ్: మార్టిన్ గుప్టిల్, హెన్రీ నికోల్స్, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), రాస్ టేలర్, టామ్ లాథమ్ ( వికెట్ కీపర్) , జిమ్మీ నీషామ్, కోలిన్ డి గ్రాండ్‌హోమ్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌతీ, కైల్ జామిసన్, హమీష్ బెన్నెట్ భారత్ : మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (డబ్ల్యుకె), మనీష్ పాండే, రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్, నవదీప్ సైని, యుజ్వేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా పిచ్, వాతావరణం: నెమ్మదైన వికెట్. బౌలర్లకు కూడా కాస్త అనుకూలిస్తుంది. భారీ స్కోర్లకు అవకాశం తక్కువ. మ్యాచ్ రోజు వర్ష సూచన లేదు. -
సిరీస్ ఎవరి ఖాతాలో?
-
సిరీస్ ఎవరి ఖాతాలో?
కాన్పూర్: భారత్, న్యూజిలాండ్ మధ్య వన్డే సిరీస్ ఫలితాన్ని తేల్చే చివరి మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఇక్కడి గ్రీన్‌పార్క్ మైదానంలో నేడు ఇరు జట్లు మూడో వన్డేలో తలపడనున్నాయి. భారత్, కివీస్ చెరో మ్యాచ్ గెలిచి 1–1తో సమంగా ఉన్న నేపథ్యంలో మరో ఆసక్తికర పోరుకు అవకాశం ఉంది. 1986 నుంచి 14 వన్డేలకు ఆతిథ్యం ఇచ్చిన ఈ స్టేడియంలో తొలిసారి డే అండ్ నైట్ మ్యాచ్ జరగనుంది. బ్యాట్స్‌మెన్ చెలరేగితే... రెండో వన్డేలో అలవోక విజయం సాధించిన భారత జట్టులో ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగే అవకాశం ఉంది. గత మ్యాచ్‌లో ధావన్ అర్ధ సెంచరీ సాధించగా మరో ఓపెనర్ రోహిత్ రెండు వన్డేల్లోనూ ప్రభావం చూపలేకపోయాడు. అతను తన సహజశైలిలో చెలరేగితే భారీ స్కోరుకు పునాది పడుతుంది. కోహ్లి బ్యాటింగ్‌పై ఎలాంటి సందేహాలు లేవు. అయితే అనూహ్యంగా నాలుగో స్థానంలో వచ్చి అర్ధ సెంచరీ సాధించిన దినేశ్ కార్తీక్ తన వన్డే కెరీర్‌ను మళ్లీ నిలబెట్టుకునే ఇన్నింగ్స్ ఆడాడు. మిడిలార్డర్లో అతను మరోసారి కీలకం కానున్నాడు. ధోని, పాండ్యా తమ స్థాయికి తగ్గ ఆటను ప్రదర్శిస్తే భారత్‌కు తమ బ్యాటింగ్‌తోనే మ్యాచ్‌పై పట్టు చిక్కుతుంది. ఇక స్వింగ్‌తో కింగ్‌లా చెలరేగిపోతున్న భువనేశ్వర్ తన సొంత రాష్ట్రంలో గుర్తుంచుకునే ప్రదర్శన ఇవ్వాలని పట్టుదలగా ఉన్నాడు. అతనికి బుమ్రా నుంచి తగిన సహకారం లభిస్తోంది. వికెట్లపైనే నేరుగా కచ్చితత్వంతో బంతులు విసిరి రెండో వన్డేలో కివీస్‌ను కట్టి పడేసిన అక్షర్‌కు మళ్లీ చోటు ఖాయం కాగా... సొంతగడ్డపై కుల్దీప్కు అవకాశం ఇవ్వాలని భావిస్తే చహల్‌ను పక్కన పెట్టే అవకాశం ఉంది. విలియమ్సన్ రాణించేనా... తొలి వన్డేలో గెలిచిన తర్వాత న్యూజిలాండ్ ఒక్కసారిగా పటిష్టంగా కనిపించింది. అయితే ఆ జట్టు బ్యాటింగ్ లోపాలను రెండో మ్యాచ్‌లో భారత బౌలర్లు బహిర్గతం చేశారు. ఇప్పుడు ఇదే కివీస్‌కు సమస్యగా మారింది. ప్రపంచం లోని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న విలియమ్సన్ విఫలం కావడం ఆ జట్టును దెబ్బతీస్తోంది. ఈ సారైనా కెప్టెన్ చెలరేగితే కివీస్ గెలుపుపై ఆశలు పెట్టుకోవచ్చు. మిడిలార్డర్లో టేలర్, లాథమ్ మరోసారి రాణించాల్సి ఉంది. తాము కూడా సత్తా చాటగలమని నికోల్స్, గ్రాండ్‌హోమ్ గత మ్యాచ్‌లో నిరూపించారు. గత మ్యాచ్‌లో విఫలమైన ప్రధాన పేసర్ బౌల్ట్పై కివీస్ ఆశలు పెట్టుకుంది. అతనికి సౌతీ, సాన్‌ట్నర్ నుంచి మంచి సహకారం లభించడం అవసరం. సిరీస్ గెలిచే అరుదైన అవకాశాన్ని కోల్పోరాదని భావిస్తున్న న్యూజిలాండ్ అందు కోసం రెట్టింపు శ్రమించాల్సి ఉంది. భారత గడ్డపై గతంలో మూడు సార్లు న్యూజిలాండ్ వన్డే సిరీస్ విజయానికి చేరువగా వచ్చింది. అయితే ప్రతీసారి ఫలితాన్ని తేల్చే ఆఖరి మ్యాచ్‌లో చతికిలపడి ఆ అవకాశం కోల్పోయింది. సరిగ్గా ఏడాది క్రితం కూడా 2–2తో సమంగా ఉండి చివరి మ్యాచ్‌లో చిత్తుగా ఓడింది. ఇప్పుడు మరోసారి ఆ జట్టు అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. తొలి వన్డేలో సంచలన ఆటతీరును కనబర్చిన కివీస్, ఆ ఆటను పునరావృతం చేసి అరుదైన ఘనతను అందుకోవాలని పట్టుదలగా ఉంది.అయితే... బలమైన బ్యాటింగ్, పదునైన పేస్ బౌలింగ్, ఆకట్టుకునే స్పిన్... ఇలా అన్ని రంగాల్లో పటిష్టంగా కనిపిస్తున్న భారత్ ప్రత్యర్థికి అలాంటి అవకాశం ఇస్తుందా! మొదటి వన్డేలో అనూహ్య పరాజయానికి గత మ్యాచ్‌లో దీటైన జవాబిచ్చి బరిలో నిలిచిన కోహ్లి సేన మరో పొరపాటు చేయకపోవచ్చు. సొంతగడ్డపై సిరీస్ పరాభవం ఎదురు కాకుండా ఉండేందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉన్న టీమిండియా గత మ్యాచ్ జోరును కొనసాగిస్తే వరుసగానాలుగో సిరీస్ జట్టు ఖాతాలో పడుతుంది. ►83 విరాట్ కోహ్లి మరో 83 పరుగులు చేస్తే వన్డేల్లో 9 వేల పరుగులు సాధించిన ఆరో భారత ఆటగాడిగా నిలుస్తాడు. ► 9 ఈ మైదానంలో ఆడిన 14 వన్డేల్లో భారత్ 9 గెలిచి 5 ఓడింది. తుది జట్ల వివరాలు (అంచనా): భారత్: కోహ్లి (కెప్టెన్), ధావన్, రోహిత్, కార్తీక్, జాదవ్, ధోని, పాండ్యా, భువనేశ్వర్, అక్షర్, బుమ్రా, చహల్/కుల్దీప్. న్యూజిలాండ్: విలియమ్సన్ (కెప్టెన్), గప్టిల్, మున్రో, టేలర్, లాథమ్, నికోల్స్, గ్రాండ్‌హోమ్, సాన్‌ట్నర్, బౌల్ట్, సౌతీ, మిల్నే/సోధి. పిచ్, వాతావరణం సాధారణ బ్యాటింగ్ వికెట్. భారీ స్కోరుకు అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఉత్తరాదిలో ఉన్న వాతావరణం కారణంగా ఆరంభంలో స్వింగ్‌కు అనుకూలించవచ్చు. రాత్రి సమయంలో మంచు ప్రభావం వల్ల టాస్ కీలకం కానుంది. ► మ.గం.1.30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం -
మైదానంలో నిద్రపోయిన ధోని!
-
మైదానంలో నిద్రపోయిన ధోని!
పల్లెకెలె: శ్రీలంకతో జరగుతున్న మూడో వన్డేలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని స్డేడియంలో హాయిగా నిద్రించాడు. అదేంటి.. మ్యాచ్ మధ్యలో నిద్రేంటి అనుకుంటున్నారా..! లంక నిర్దేశించిన 218 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత్ 44 ఓవర్లలో 210 పరుగులు చేసింది. రోహిత్ శర్మ సెంచరీ (122 నాటౌట్), ధోని (61 నాటౌట్) క్రీజులో ఉన్న సమయంలో భారత్ విజయాన్ని తట్టుకోలేని స్డేడియంలోని లంక అభిమానులు మైదానంలోకి బాటిళ్లు విసరడం ప్రారంభించారు. పెద్ద ఎత్తున ఫ్యాన్స్ అరుస్తూ బాటిళ్లు, తమ చేతిలోని వస్తువులను మైదానంలోకి విసురుతూ ఆటకు అంతరాయం కలిగించారు. కొందరు గ్రౌండ్ సిబ్బంది సాయంతో బాటిళ్లు, ఇతరత్రా వస్తువులను తొలగించారు. బాటిళ్లు తీసేసిన తర్వాత కూడా మ్యాచ్ జరగడంపై స్పష్టత లేకపోవడంతో రోహిత్, ధోనిలు కాసేపు కూర్చుని రిలాక్స్ అయ్యారు. ఎంతకూ మ్యాచ్ జరుగుతుందా లేదా అనే విషయం తేలకపోవడంతో ధోని కొద్దిసేపు హాయిగా నిద్రిస్తూ కనిపించాడు. కూల్ ప్లేయర్ గా ముద్రపడ్డ ధోని, లంక అభిమానుల చేష్టలకు అసలు కాస్త కూడా అసహనానికి గురికాలేదు. ఫీల్డ్ అంపైర్లు కాసేపు చర్చించి ఆటను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇరు జట్ల ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూము వైపునకు వెళ్లారు. పరిస్థితి సద్దుమణిగిన అనంతరం ఇరుజట్ల ఆటగాళ్లు మైదానంలోకి వచ్చారు. విజయానికి అవసరమైన 8 పరుగులను మరో ఏడు బంతుల్లో చేసిన టీమిండియా ఆరు వికెట్ల తేడాతో మూడో వన్డే నెగ్గింది. దీంతోపాటు ఐదు వన్డేల సిరీస్ ను కూడా కోహ్లీసేన సొంతం చేసుకుంది. -
రోహిత్ శర్మ ఒంటరి పోరాటం..!
పల్లెకెలె: శ్రీలంకతో జరగుతున్న మూడో వన్డేలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ శతకం సాధించాడు. 118 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో సెంచరీ చేసి జట్టును నడిపించాడు. మరోవైపు లంక నిర్దేశించిన 218 పరుగుల స్వల్ప టార్గెట్ తో బ్యాటింగ్ కు దిగిన టీమిండియా టపార్డర్ బ్యామ్స్ మెన్ తడబడటంతో రెండో వన్డే పరిస్థితి మరోసారి కనిపించింది. అయితే ఓపెనర్ రోహిత్ శర్మ ఆచితూచి ఆడుతూ, చెత్త బంతులనే బౌండరీలకు తరలిస్తూ ఇన్నింగ్స్ ను నడిపించాడు. భారత్ 61 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండగా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (43 నాటౌట్) తో కలిసి రోహిత్ ఇన్నింగ్స్ ను సరిదిద్దాడు. భారత్ 39 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది. ఆకట్టుకున్న ధనంజయ రెండో వన్డేలో భారత టాప్, మిడిలార్డర్ వెన్ను విరిచిన లంక యువ సంచలన అఖిల ధనంజయ ఈ మ్యాచ్ లోనూ ఆకట్టుకున్నాడు. జట్టు స్కోరు 61 వద్ద తాను వేసిన తొలి ఓవర్లోనే కేఎల్ రాహుల్ (17) ను వెనక్కి పంపాడు. బౌండరీ దగ్గర లంక ఆటగాడు క్యాచ్ పట్టడంతో నిరాశగా వెనుదిరిగాడు. ఆ తర్వాత కేదార్ జాదవ్ ను డకౌట్ చేయడంతో భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. -
ఆదుకున్న తిరిమన్నే
పల్లెకెలె: భారత్ తో జరుగుతున్న మూడో వన్డేలో శ్రీలంక ఆచితూచి ఆడుతోంది. 28 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన శ్రీలంకను చండిమాల్- తిరుమన్నే జో్డి ఆదుకుంది. ఈ జోడి మూడో వికెట్ కు 72 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన తరువాత చండిమాల్(36) మూడో వికెట్ గా అవుటయ్యాడు. దాంతో వంద పరుగుల వద్ద లంక జట్టు మూడో వికెట్ ను నష్టపోయింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన లంకకు బూమ్రా షాకిచ్చాడు. డిక్ వెల్లా(13), కుశాల్ మెండిస్(1)లు అవుట్ చేసి భారత్ కు శుభారంభం అందించాడు. దాంతో రక్షణాత్మక ధోరణి అవలంభించిన లంకేయులు జాగ్రత్తగా స్కోరు బోర్డును కదిలిస్తున్నారు. ఈ క్రమంలోనే తిరుమన్నే హాఫ్ సెంచరీ సాధించాడు. 69 బంతుల్లో అర్థ శతకాన్ని పూర్తి చేసి జట్టును ఆదుకున్నాడు. దాంతో శ్రీలంక 30 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది. లంక కోల్పోయిన మూడు వికెట్లలో బూమ్రాకు రెండు వికెట్లు దక్కగా, హార్దిక్ పాండ్యాకు వికెట్ లభించింది. -
రోహిత్ అద్భుతమైన క్యాచ్
-
రోహిత్ అద్భుతమైన క్యాచ్
పల్లెకెలె:శ్రీలంకతో ఇక్కడ ఆదివారం జరుగుతున్న మూడో వన్డేలోనూ భారత బౌలర్లు తమ హవా కొనసాగిస్తున్నారు. తొలి ఎనిమిది ఓవర్లలోపే రెండు లంక వికెట్లు తీసి ఆ జట్టును ఆదిలోనే కష్టాల్లోకి నెట్టారు. ఓపెనర్ నిరోషన్ డిక్ వెల్లా(13), కుశాల్ మెండిస్ (1)లను పది పరుగుల వ్యవధిలో పెవిలియన్ కు పంపి పైచేయి సాధించారు. బూమ్రా వేసిన ఇన్నింగ్స్ నాల్గో ఓవర్ నాల్గో బంతికి డిక్ వెల్లా ఎల్బీగా పెవిలియన్ చేరితే, మళ్లీ బూమ్రా వేసిన ఎనిమిదో ఓవర్ నాల్గో బంతికి మెండిస్ అవుటయ్యాడు. అయితే మెండిస్ ను రోహిత్ శర్మ అద్భుతమైన క్యాచ్ తో పెవిలియన్ కు పంపాడు. రెండో స్లిప్ లో ఉన్న రోహిత్ శర్మ కుడి వైపుకు పూర్తిస్థాయిలో డైవ్ కొట్టి క్యాచ్ ను ఒడిసిపట్టుకున్నాడు. దాంతో భారత్ శిబిరంలో్ ఆనందం వెళ్లివిరియగా, లంకేయులు మాత్రం నిరాశకు గురయ్యారు. -
విరాట్ సేన తొలిసారి!
పల్లెకెలె: తొలి రెండు వన్డేల్లో విజయాలతో మంచి జోరు మీదున్న విరాట్ కోహ్లి నేతృత్వంలోని టీమిండియా సిరీస్ పై కన్నేసింది. మూడో వన్డేలో సైతం విజయం సాధించి హ్యాట్రిక్ విజయాలతో పాటు సిరీస్ ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. పల్లెకెలె వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన శ్రీలంక యాక్టింగ్ కెప్టెన్ చమర కపుగెదెరా తొలుత బ్యాటింగ్ చేసేందుకు మొగ్గు చూపాడు. కాగా, ఈ పర్యటనలో విరాట్ గ్యాంగ్ టాస్ ఓడిపోవడం ఇదే తొలిసారి. లంక పర్యటనలో ఆ జట్టుతో జరిగిన మూడు టెస్టుల్లోనూ భారత టాస్ గెలవగా, ఆపై వరుస రెండు వన్డేల్లో సైతం మనల్నే టాస్ వరించింది. ఇదిలా ఉంచితే, గత రెండు వన్డేల్లోనూ భారత్ ఛేజింగ్ చేసే విజయాలు సాధించడం ఇక్కడ పరిశీలించాల్సిన విషయం. ఈ మ్యాచ్ లో కూడా భారత్ కు ఛేజింగ్ అవకాశమే రావడంతో విరాట్ బృందం టాస్ ఓడినా హ్యాపీగానే ఉందనే చెప్పాలి. ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా మొదటి వన్డేలో ఘన విజయం సాధించిన భారత్.. రెండో వన్డేలో పోరాడి గెలిచింది. దాంతో సిరీస్ లో 2-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ క్రమంలోనే ఆదివారం పల్లెకెలె వేదికగా జరుగుతున్న మూడో వన్డేలోనూ విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకునేందుకు భారత్ కసరత్తు చేస్తోంది. ఇక్కడే జరిగిన రెండో వన్డేలో ఓటమి అంచుల వరకూ వెళ్లి గట్టెక్కిన విరాట్ సేన.. ఈసారి ఎటువంటి ఉదాసీనతకు తావివ్వకూడదనే యోచనలో ఉంది. ఒకవైపు సిరీస్ కోసం భారత్ తపిస్తుంటే, మరొకవైపు లంకేయులి పరువు దక్కించుకోవాలని చూస్తున్నారు. ఇరు జట్ల మధ్య జరుగుతున్న ఓవరాల్ ద్వైపాక్షిక సిరీస్ లో ఇప్పటివరకూ శ్రీలంక బోణి కొట్టలేదు. దాంతో కనీసం ఒక్క మ్యాచ్ ను గెలిచి గౌరవం కాపాడుకోవాలనే యోచనలో లంక ఉంది. కాగా, శ్రీలంక రెండు వన్డేల్లో విజయం సాధిస్తే నేరుగా ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తుంది. ఈ నేపథ్యంలో భారత్ ను నిలువరించేందుకు లంక జట్టు శాయశక్తులా ఒడ్డుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ స్టేడియంలో భారత్-శ్రీలంక జట్ల మధ్య పెద్దగా వన్డేలు జరగలేదు. మొన్న జరిగిన రెండో వన్డే ఒకటైతే, అంతకుముందు ఒక వన్డే మ్యాచ్ మాత్రమే ఇక్కడ భారత్ ఆడింది. 2012లో పల్లెకెలెలో శ్రీలంకతో ఆడిన తన మొదటి వన్డే మ్యాచ్ లో భారత్ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ తరువాత గత గురువారం జరిగిన మ్యాచ్ లో భారత్ మూడు వికెట్లతో గెలుపొందింది. రేపటి మ్యాచ్ లో భారత్ గెలిస్తే ఇక్కడ హ్యాట్రిక్ విజయాల్ని సాధించడమే కాకుండా, సిరీస్ ను కూడా దక్కుతుంది. ఇదిలా ఉంచితే ఇరు జట్ల మధ్య 1985 నుంచి చూస్తే 26 ద్వైపాక్షిక వన్డేలు జరిగాయి. అందులో భారత్ 13 మ్యాచ్ ల్లో విజయం సాధించగా, లంకేయులు 10 వన్డేలు గెలిచారు.మూడు మ్యాచ్ ల్లో ఫలితం తేలలేదు. చివరిసారి 2012లో భారత్-శ్రీలంక జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరిగింది. శ్రీలంకలో జరిగిన ఆ సిరీస్ ను భారత్ 4-1 తో సొంతం చేసుకుంది. ఈసారి కూడా భారత్ వన్డే సిరీస్ ను 'భారీ' తేడాతో గెలవాలనే యోచనలో్ ఉంది. శ్రీలంక అనుభవలేమిని తమకు వరంగా మార్చుకుని సిరీస్ ను వైట్ వాష్ చేయాలనే భావనలో కోహ్లి అండ్ గ్యాంగ్ ఉంది. ఎంఎస్ ధోని సారథిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత లంకతో జరిగిన మూడు వన్డే సిరీస్ లను భారత్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక్కడ ఇలా.. మొదటి ఇన్నింగ్స్ యావరేజ్.. 242 పరుగులు రెండో ఇన్నింగ్స్ యావరేజ్.. 198 పరుగులు అత్యధిక స్కోరు 327/6(50 ఓవర్లు), జింబాబ్వేపై శ్రీలంక అత్యల్ప స్కోరు 167 ఆలౌట్(43.2 ఓవర్లు) దక్షిణాఫ్రికాపై శ్రీలంక అత్యధిక పరుగుల ఛేజింగ్; 288/8(48.1 ఓవర్లు) పాకిస్తాన్ పై శ్రీలంక -
సిరీస్ పై కన్నేసిన టీమిండియా
-
సిరీస్ పై కన్నేసిన టీమిండియా
పల్లెకెలె: తొలి రెండు వన్డేల్లో విజయాలతో జోరు మీదున్న విరాట్ కోహ్లి నేతృత్వంలోని టీమిండియా సిరీస్ పై కన్నేసింది. హ్యాట్రిక్ విజయాలు సాధించి ఇంకా రెండు వన్డేలు మిగిలి ఉండగానే సిరీస్ ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా మొదటి వన్డేలో ఘన విజయం సాధించిన భారత్.. రెండో వన్డేలో పోరాడి గెలిచింది. దాంతో సిరీస్ లో 2-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ క్రమంలోనే ఆదివారం పల్లెకెలె వేదికగా జరుగుతున్న మూడో వన్డేలోనూ విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకునేందుకు భారత్ కసరత్తు చేస్తోంది. ఇక్కడే జరిగిన రెండో వన్డేలో ఓటమి అంచుల వరకూ వెళ్లి గట్టెక్కిన విరాట్ సేన.. ఈసారి ఎటువంటి ఉదాసీనతకు తావివ్వకూడదనే యోచనలో ఉంది. రేపు మధ్యాహ్నం గం.2.30 ని.లకు ఇరు జట్ల మధ్య మూడో వన్డే జరుగనుంది. ఒకవైపు సిరీస్ కోసం భారత్ తపిస్తుంటే, మరొకవైపు లంకేయులి పరువు దక్కించుకోవాలని చూస్తున్నారు. ఇరు జట్ల మధ్య జరుగుతున్న ఓవరాల్ ద్వైపాక్షిక సిరీస్ లో ఇప్పటివరకూ శ్రీలంక బోణి కొట్టలేదు. దాంతో కనీసం ఒక్క మ్యాచ్ ను గెలిచి గౌరవం కాపాడుకోవాలనే యోచనలో లంక ఉంది. కాగా, శ్రీలంక రెండు వన్డేల్లో విజయం సాధిస్తే నేరుగా ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తుంది. ఈ నేపథ్యంలో భారత్ ను నిలువరించేందుకు లంక జట్టు శాయశక్తులా ఒడ్డుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది మూడోది మాత్రమే.. ఈ స్టేడియంలో భారత్-శ్రీలంక జట్ల మధ్య పెద్దగా వన్డేలు జరగలేదు. మొన్న జరిగిన రెండో వన్డే ఒకటైతే, అంతకుముందు ఒక వన్డే మ్యాచ్ మాత్రమే ఇక్కడ భారత్ ఆడింది. 2012లో పల్లెకెలెలో శ్రీలంకతో ఆడిన తన మొదటి వన్డే మ్యాచ్ లో భారత్ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ తరువాత గత గురువారం జరిగిన మ్యాచ్ లో భారత్ మూడు వికెట్లతో గెలుపొందింది. రేపటి మ్యాచ్ లో భారత్ గెలిస్తే ఇక్కడ హ్యాట్రిక్ విజయాల్ని సాధించడమే కాకుండా, సిరీస్ ను కూడా దక్కుతుంది. ఇదిలా ఉంచితే ఇరు జట్ల మధ్య 1985 నుంచి చూస్తే 26 ద్వైపాక్షిక వన్డేలు జరిగాయి. అందులో భారత్ 13 మ్యాచ్ ల్లో విజయం సాధించగా, లంకేయులు 10 వన్డేలు గెలిచారు.మూడు మ్యాచ్ ల్లో ఫలితం తేలలేదు. చివరిసారి 2012లో భారత్-శ్రీలంక జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరిగింది. శ్రీలంకలో జరిగిన ఆ సిరీస్ ను భారత్ 4-1 తో సొంతం చేసుకుంది. ఈసారి కూడా భారత్ వన్డే సిరీస్ ను 'భారీ' తేడాతో గెలవాలనే యోచనలో్ ఉంది. శ్రీలంక అనుభవలేమిని తమకు వరంగా మార్చుకుని సిరీస్ ను వైట్ వాష్ చేయాలనే భావనలో కోహ్లి అండ్ గ్యాంగ్ ఉంది. ఎంఎస్ ధోని సారథిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత లంకతో జరిగిన మూడు వన్డే సిరీస్ లను భారత్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక్కడ ఇలా.. మొదటి ఇన్నింగ్స్ యావరేజ్.. 242 పరుగులు రెండో ఇన్నింగ్స్ యావరేజ్.. 198 పరుగులు అత్యధిక స్కోరు 327/6(50 ఓవర్లు), జింబాబ్వేపై శ్రీలంక అత్యల్ప స్కోరు 167 ఆలౌట్(43.2 ఓవర్లు) దక్షిణాఫ్రికాపై శ్రీలంక అత్యధిక పరుగుల ఛేజింగ్; 288/8(48.1 ఓవర్లు) పాకిస్తాన్ పై శ్రీలంక -
112 పరుగులకే కుప్పకూల్చారు..
వెల్లింగ్టన్: ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా న్యూజిలాండ్ తో జరిగిన మూడో వన్డేలో దక్షిణాఫ్రికా 159 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ఆద్యంత చెలరేగిపోయిన సఫారీలు.. న్యూజిలాండ్ ను 32.2 ఓవర్లలో 112 పరుగులకే కుప్పకూల్చి ఘన విజయం సాధించారు. . దక్షిణాఫ్రికా బౌలర్లు విజృంభించడంతో న్యూజిలాండ్ వంద మార్కుల స్కోరును కష్టపడి దాటింది. సఫారీలు విసిరిన 272 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన న్యూజిలాండ్ ఏ దశలోనూ పోరాట పటిమ కనబర్చకుండా పెవిలియన్ కు క్యూకట్టేసింది. కివీస్ జట్టులో గ్రాండ్ హోమ్(38 నాటౌట్), కేన్ విలియమ్సన్(28)లు మాత్రమే మోస్తరుగా ఫర్వాలేదనిపించగా, మిగతా వారు ఘోరంగా విఫలమయ్యారు. ఏడుగురు కివీస్ ఆటగాళ్లు సింగిల్ డిజిట్ కే పరిమితం కావడంతో ఆ జట్టుకు ఘోర ఓటమి తప్పలేదు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ప్రెటోరియస్ మూడు వికెట్లు సాధించగా, రబడా, పార్నెల్, పెహ్లుక్వో లు తలో రెండు వికెట్లు తీసి న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ను కుప్పకూల్చారు. తాజా విజయంతో సిరీస్ లో దక్షిణాఫ్రికా 2-1 తో ఆధిక్యం సాధించింది. తొలి వన్డేలో సఫారీలు విజయం సాధించగా, రెండో వన్డేలో న్యూజిలాండ్ గెలుపొందింది. -
క్రికెట్ చరిత్రలో తొలిసారి..
కోల్‌కతా: ఇటీవల భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ముగిసిన మూడు వన్డేల సిరీస్ లో కొత్త చరిత్ర లిఖించబడింది. ఈ మూడు వన్డేల సిరీస్‌లో ఇరు జట్లు బ్యాటింగ్ లో సత్తాను చాటుకుంటూ పరుగుల దాహాన్ని తీర్చుకున్నాయి. మూడు వన్డేల సిరీస్‌లో ఆరు ఇన్నింగ్స్‌ల్లో మూడొందలకు పైగా పరుగులు నమోదు కావడం ఒకటైతే.. అత్యధిక పరుగుల రికార్డుకు తెరలేచింది. ఈ సిరీస్ లో మొత్తంగా ఇరు జట్లు నమోదు చేసిన స్కోరు 2090. ఇది మూడు వన్డేల సిరీస్ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగుల రికార్డుగా నమోదైంది. అంతకుముందు 2007లో భారత్ లో జరిగిన ఆఫ్రికా-ఆసియా కప్‌లో 1892 పరుగులు నమోదయ్యాయి. ఇదే ఇప్పటివరకూ మూడు వన్డేల సిరీస్‌ల అత్యధిక పరుగుల రికార్డు కాగా, ఆ తరువాత 2009-10 సీజన్ లో దక్షిణాఫ్రికా-భారత్ జట్ల మధ్య జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో 1884 పరుగులు నమోదయ్యాయి. ఈ సిరీస్‌లో రికార్డులు.. మూడు వన్డేల సిరీస్‌లో ఆరుసార్లూ మూడొందలకు పైగా స్కోర్లు లిఖించబడ్డాయి. కనీసం ఐదు మ్యాచ్‌లు ఆడిన ఒక ద్వైపాక్షిక సిరీస్ పరంగా చూస్తే ఇలా ఆరు సార్లు మూడొందలకు పైగా స్కోర్లు నమోదు కావడం ఇదే తొలిసారి. 144.09.. ఇది ఈ సిరీస్‌లో టీమిండియా ఆల్ రౌండర్ కేదర్ జాదవ్ స్ట్రైక్ రేట్. ఒక సిరీస్‌లో 150కు పైగా బంతులు ఆడిన భారత్ ఆటగాడు పరంగా ఇది మూడో అత్యుత్తమ స్ట్రైక్ రేట్. గతంలో వీరేంద్ర సెహ్వాగ్(150.25), రోహిత్ శర్మ(147.56)లు తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. 232.. ఈ సిరీస్‌లో జాదవ్ చేసిన పరుగులు. 77.33 సగటుతో 232 పరుగులు చేసి ఈ సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ సిరీస్ లో ఇంగ్లండ్ మూడు సార్లు మూడొందలకు పైగా స్కోర్లు సాధించింది. అంతకుముందు 2015లో న్యూజిలాండ్ తో జరిగిన స్వదేశీ సిరీస్‌లో ఇంగ్లండ్ నాలుగుసార్లు మూడొందల మార్కును దాటింది. ఒక వన్డేలో ఇంగ్లండ్ ఆల్ రౌండర్ హాఫ్ సెంచరీ చేయడంతో పాటు మూడు వికెట్లు తీయడం ఇప్పటివరకూ 15సార్లు జరిగింది. భారత్ తో చివరి వన్డేలో ఇంగ్లండ్ ఆటగాడు బెన్ స్టోక్స్ హాఫ్ సెంచరీ తో పాటు మూడు వికెట్లు సాధించాడు. 2009 నుంచి చూస్తే ఇప్పటివరకూ ఇంగ్లండ్ మూడుసార్లు ఈ ఘనతను సాధించగా, స్టోక్స్ రెండు సార్లు ఆ ఘనతను సాధించాడు. -
పోరాడి ఓడిన విరాట్ సేన
కోల్‌కతా: ఇంగ్లండ్ తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా పోరాడి ఓడింది. ఆదివారం ఉత్కంఠ భరితంగా సాగిన చివరి వన్డేలో భారత్ ఐదు పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇంగ్లండ్ నిర్దేశించిన 322 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ తొమ్మిది వికెట్లు కోల్పోయి 316 పరుగులకే పరిమితమై పరాజయం చెందింది. అయితే చివరి ఓవర్ వరకూ జాదవ్(90; 75 బంతుల్లో 12ఫోర్లు, 1 సిక్స్) పోరాడినా మ్యాచ్ ను మాత్రం గెలిపించలేకపోయాడు. భారీ లక్ష్యాన్ని ఛేజింగ్ చేసే క్రమంలో భారత్ ఆదిలోనే ఓపెనర్లు అజింక్యా రహానే(1), కేఎల్ రాహుల్(11) వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తరుణంలో విరాట్ కోహ్లి-యువరాజ్ సింగ్‌ల జోడి ఇన్నింగ్స్ ను చక్కదిద్దింది. ఈ జోడి 65 పరుగుల జోడించి భారత్ ను గాడిలో పెట్టారు. అయితే కోహ్లి(55;63 బంతుల్లో 8 ఫోర్లు) హాఫ్ సెంచరీ సాధించి మూడో వికెట్ గా అవుట్ కాగా, ఆ తరువాత కాసేపటికి యువరాజ్(45;57 బంతుల్లో 5 ఫోర్లు,1 సిక్స్) తృటిలో హాఫ్ సెంచరీ కోల్పోయి నాల్గో వికెట్‌గా పెవిలియన్ చేరాడు.అప్పటికి భారత్ స్కోరు 133 పరుగులు. ఆపై ధోని-కేదర్ జాదవ్‌లో ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లారు. కాగా, ధోని(25)ఐదో వికెట్ గా అవుట్ కావడంతో భారత్ జట్టు కాస్త తడబడినట్లు కనిపించింది. ఆ సమయంలో జాదవ్ తో జత కలిసిన హార్దిక్ పాండ్యా బాధ్యతాయుతంగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలోనే జాదవ్ 46 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించగా, కాసేపటికి 38 బంతుల్లో పాండ్యా అర్థ శతకం సాధించాడు. ఈ జోడి 104 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని సాధించిన తరువాత పాండ్యా ఆరో వికెట్ గా పెవిలియన్ బాట పట్టాడు. బెన్ స్టోక్స్ బౌలింగ్ లో భారీ షాట్ కు యత్నించిన పాండ్యా బౌల్డ్ అయ్యాడు. ఇక చివరి నాలుగు ఓవర్లలో భారత విజయానికి 43 పరుగులు కావాల్సిన తరుణంలో జడేజా దూకుడును కొనసాగించాడు. వోక్స్ వేసిన ఇన్నింగ్స్ 47.0 ఓవర్లలో వరుసగా రెండు ఫోర్లు కొట్టి భారత్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపాడు. కాగా ఆ తరువాత బంతిని సిక్స్ గా మలిచే యత్నంలో భారీ షాట్‌కు యత్నించి జడేజా(10) పెవిలియన్ చేరాడు. ఇక ఆపై స్వల్ప వ్యవధిలోనే అశ్విన్(1) కూడా అవుట్ కావడంతో జాదవ్ పై భారం పడింది. అయితే చివరి ఓవర్లో 16 పరుగులు చేయాల్సిన తరుణంలో తొలి రెండు బంతుల్ని సిక్స్, ఫోర్ గా మలచిన జాదవ్.. మూడు, నాలుగు బంతుల్ని వృథా చేశాడు. ఈ క్రమంలో 50 ఓవర్ ఐదో బంతికి భారీ షాట్ కు యత్నించిన జాదవ్ అవుట్ కావడంతో భారత్ కు ఓటమి తప్పలేదు. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 322 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇంగ్లండ్ ఓపెనర్లు జాసన్ రాయ్(65;56 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్), బిల్లింగ్స్(35;58 బంతుల్లో 5 ఫోర్లు)కు తోడు మోర్గాన్(43;44 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు), బెయిర్ స్టో(56;64 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), బెన్ స్టోక్స్(57 నాటౌట్;39 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు)లు రాణించడంతో ఆ జట్టు మరోసారి మూడొందల మార్కును చేరింది. ఇంగ్లండ్ ఓపెనర్లు జాసన్ రాయ్-బిల్లింగ్స్ లు చక్కటి పునాది వేశారు. ఈ జోడి 98 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించి శుభారంభం అందించారు. ఆ తరువాత మోర్గాన్, బెయిర్ స్టోలు ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ను నిలబెట్టగా, చివర్లో బెన్ స్టోక్స్ ధాటిగా బ్యాటింగ్ చేశాడు. 34 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి ఇంగ్లండ్ స్కోరును పరుగులు పెట్టించాడు. అతనికి జతగా వోక్స్(34;19 బంతుల్లో 4ఫోర్లు, 1 సిక్స్) బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేయడంతో ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలోఎనిమిది వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా మూడు వికెట్లు సాధించగా, జడేజాకు రెండు, బూమ్రాకు ఒక వికెట్ దక్కింది. -
టీమిండియాకు భారీ లక్ష్యం
కోల్‌కతా: భారత్ తో జరుగుతున్న చివరిదైన మూడో వన్డేలో ఇంగ్లండ్ 322 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇంగ్లండ్ ఓపెనర్లు జాసన్ రాయ్(65;56 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్), బిల్లింగ్స్(35;58 బంతుల్లో 5 ఫోర్లు)కు తోడు మోర్గాన్(43;44 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు), బెయిర్ స్టో(56;64 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), బెన్ స్టోక్స్(57 నాటౌట్;39 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు)లు రాణించడంతో ఆ జట్టు మరోసారి మూడొందల మార్కును చేరింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు తొలుత బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ కు శుభారంభం లభించింది. ఇంగ్లండ్ ఓపెనర్లు జాసన్ రాయ్-బిల్లింగ్స్ లు చక్కటి పునాది వేశారు. ఈ జోడి 98 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించి ఇంగ్లండ్ ను పటిష్ట స్థితిలో నిలిపింది. ఆ తరువాత మోర్గాన్, బెయిర్ స్టోలు ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ను నిలబెట్టగా, చివర్లో బెన్ స్టోక్స్ ధాటిగా బ్యాటింగ్ చేశాడు. 34 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి ఇంగ్లండ్ స్కోరును పరుగులు పెట్టించాడు. అతనికి జతగా వోక్స్(34;19 బంతుల్లో 4ఫోర్లు, 1 సిక్స్) బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేయడంతో ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలోఎనిమిది వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. పాండ్యా విజృంభణ గత రెండు వన్డేల్లో పెద్దగా ప్రభావం చూపని భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా.. నామ మాత్రమైన చివరి వన్డేలో ఆకట్టుకున్నాడు. 10 ఓవర్ల బౌలింగ్ కోటాను పూర్తి చేసిన పాండ్యా 49 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. ప్రధానంగా బెయిర్ స్టో, మోర్గాన్, బట్లర్ వంటి స్టార్ ఆటగాళ్ల వికెట్లను పాండ్యా సాధించి సత్తా చాటుకున్నాడు. ఇంగ్లండ్ భారీ స్కోరు దిశగా పయనిస్తున్న సమయంలో పాండ్యా చక్కటి లైన్ లెంగ్త్ తో రాణించి భారత్ శిబిరంలో ఆనందం నింపాడు. అతనికి జతగా జడేజా రెండు వికెట్లు తీశాడు. ఓపెనర్లు జాసన్ రాయ్-బిల్లింగ్స్ వికెట్లను జడేజా తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక భారత బౌలర్లలో బూమ్రా వికెట్ తీశాడు. -
భారీ స్కోరు దిశగా ఇంగ్లండ్
కోల్‌కతా:భారత్ తో జరుగుతున్న చివరిదైన మూడో వన్డేలో ఇంగ్లండ్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ 35.0 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఓపెనర్లు జాసన్ రాయ్(65;56 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్), బిల్లింగ్స్(35;58 బంతుల్లో 5 ఫోర్లు) శుభారంభం ఇచ్చారు. ఒకవైపు జాసన్ రాయ్ దూకుడుగా ఆడితే, మరొకవైపు బిల్లింగ్స్ మాత్రం నిలకడగా బ్యాటింగ్ చేశాడు. అయితే ఈ జోడి ప్రమాదకరంగా మరింత ప్రమాదకరంగా మారుతున్న సమయంలో బిల్లింగ్స్ ను తొలుత జడేజా పెవిలియన్ కు పంపాడు. దాంతో వీరి 98 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం స్వల్ప వ్యవధిలో రాయ్ ను కూడా జడేజా అవుట్ చేయడంతో ఇంగ్లండ్ 110 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఆ దశలో బెయిర్ స్టో, మోర్గాన్‌లు ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. మోర్గాన్ 44 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 43 పరుగులు చేసి మూడో వికెట్ గా అవుటయ్యాడు. స్టోతో కలిసి 84 పరుగుల్ని జత చేసిన మోర్గాన్..భారత బౌలర్ పాండ్యా బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ పటిష్ట స్థితిలో ఉండటంతో మరోసారి భారీ స్కోరు నమోదయ్యే అవకాశం ఉంది. -
విరాట్ సేన ఏం చేస్తుందో?
కోల్‌కతా:ఇప్పటికే ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ ను గెలిచిన టీమిండియా.. నగరంలోని ఈడెన్ గార్డెన్ లో జరుగుతున్న చివరదైన మూడో వన్డేలో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్‌పై పచ్చిక ఎక్కువగా ఉండటంతో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే ఇక్కడ కొన్ని గణాంకాలు మాత్రం తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు విజయం సాధించిన విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. గత చివరి నాలుగు మ్యాచ్‌ల ఫలితాలను పరిశీలిస్తే ఇక్కడ తొలుత బ్యాటింగ్ చేసిన జట్టే విజయం సాధించడంతో ఈ మ్యాచ్‌లో ఫలితంపై ఏమి అవుతుందా? అనే దానిపై ఆసక్తి నెలకొంది. టాస్ గెలిచిన వెంటనే విరాట్ కోహ్లి ఫీల్డింగ్ వైపు మొగ్గు చూపాడు. పుణెలో జరిగిన తొలి వన్డేలో టాస్ గెలిచిన కోహ్లి అండ్ గ్యాంగ్..ఇంగ్లండ్ విసిరిన భారీ లక్ష్యాన్ని సైతం ఛేదించి విజయం సాధించింది. ఈ సిరీస్ లో రెండో సారి విరాట్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దాంతో్ ఈ స్టేడియంలో ఫలితాలపై చర్చ మొదలైంది. 2014లో ఇక్కడ చివరిసారి శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆ మ్యాచ్ లో భారత్ 404 పరుగుల్ని సాధించి 153 పరుగులతో విజయం సాధించింది. అంతకుముందు 2013 జనవరిలో ఈడెన్‌లో పాకిస్తాన్ తో భారత్ తలపడింది. ఆ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ తీసుకుని 250 పరుగులు చేసింది. ఆ మ్యాచ్‌లో భారత్ 85 పరుగులతో గెలుపును సొంతం చేసుకుంది. 2011 అక్టోబర్‌లో ఇంగ్లండ్ తో జరిగిన వన్డేలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 271 పరుగులు చేసి 95 పరుగులతో విజయం సాధించగా, అంతకుముందు 2011 వరల్డ్ కప్ లో భాగంగా మార్చిలో దక్షిణాఫ్రికా-ఐర్లాండ్ జట్ల మధ్య వన్డే జరిగింది.ఆ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 271 పరుగులు చేసి 131 పరుగుల తేడాతో గెలిచింది. ఇలా చివరి నాలుగు మ్యాచ్‌ల్లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు గెలుపొందడంతో తాజా మ్యాచ్‌పై ఫలితం ఎలా ఉండబోతుంది అనేది దానిపై ఆసక్తి నెలకొంది. మరి విరాట్ సేన ఫలితాన్ని సవరిస్తుందా?లేదా?అనేది మరి కొద్ది సేపట్లో తేలిపోనుంది. -
క్లీన్ స్వీప్ పై విరాట్ సేన గురి!
-
క్లీన్ స్వీప్ పై విరాట్ సేన గురి!
కోల్‌కతా: ఇప్పటికే ఇంగ్లండ్ తో వన్డే సిరీస్‌ను గెలిచి మంచి ఊపుమీద ఉన్న విరాట్ కోహ్లి నేతృత్వంలోని టీమిండియా క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. ఇరు జట్ల మధ్య ఆదివారం జరిగే చివరిదైన మూడో వన్డే జరుగనుంది. రేపు మధ్యాహ్నం గం.1.30.లకు ఈడెన్ గార్డెన్ లో జరిగే మ్యాచ్ లో గెలుపు కోసం భారత్-ఇంగ్లండ్ జట్లు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. ఒకవైపు సిరీస్‌ను వైట్ వాష్ చేయాలని విరాట్ సేన భావిస్తుండగా, కనీసం మ్యాచ్లోగెలిచి పరువు నిలుపుకోవాలని మోర్గాన్ అండ్ గ్యాంగ్ యోచిస్తోంది. తొలి రెండు వన్డేల్లో భారీ స్కోర్లు నమోదు కావడంతో మరోసారి కూడా భారీ స్కోరు నమోదు అయ్యే అవకాశం కనబడుతోంది. మొదటి వన్డేలో 350 పరుగుల లక్ష్యాన్ని భారత్ అవలీలగా ఛేదిస్తే, రెండో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన విరాట్ గ్యాంగ్ 381 పరుగులు నమోదు చేసింది. ఇదిలా ఉంచితే, 2014లో భారత్-శ్రీలంక జట్ల్లు ఈ స్టేడియంలో ఆఖరిసారి తలపడ్డాయి. చివరిసారి ఇక్కడ భారత్ ఆడిన వన్డేలో 404 పరుగులు చేసింది. ఆ మ్యాచ్‌లో భారత్ 153 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఆనాటి మ్యాచ్‌లో రోహిత్ శర్మ (264) డబుల్ సెంచరీతో లంకేయులపై చెలరేగి ఆడి భారత్ భారీ స్కోరు చేయడంలో తోడ్పడ్డాడు. ప్రస్తుత భారత జట్టు మంచి ఫామ్ లో ఉండటంతో భారీ స్కోరు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఇది పూర్తిగా బ్యాటింగ్ కు అనుకూలించే పిచ్ కావడంతో మరోసారి భారీ షాట్లు అభిమానుల్ని అలరించే అవకాశం ఉంది. కాగా, ఇప్పటివరకూ ఈ స్టేడియంలో భారత్ 20 వన్డేలు ఆడగా, 11 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఇక్కడ రెండు వన్డేలు జరిగాయి. ఆ రెండింటిలోనూ భారత్‌నే విజయం వరించడం ఇక్కడ విశేషం. దాంతో ఈ మ్యాచ్‌లో భారత్ నే ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంది. గతంలో ఇంగ్లండ్ పై ఆడిన రెండు వన్డేల్లోనూ భారత్ 270కు పైగా పరుగులు చేసి విజయం సాధించింది. భారత ఓపెనర్లకు పరీక్ష మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఇంగ్లండ్ తో జరిగిన రెండు వన్డేల్లో భారత్ ఓపెనర్లు శిఖర్ ధవన, కేఎల్ రాహుల్ లు ఘోరంగా విఫలమయ్యారు. ఆ రెండు వన్డేల్లో రాహుల్(8),(5) పరుగులు చేసి నిరాశపరిస్తే, ధవన్ కూడా అదే స్థాయిలో విఫలమయ్యాడు. తొలి వన్డేల్లో ధవన్ పరుగు మాత్రమే చేసి అవుట్ కాగా, రెండో వన్డేలో 11 పరుగులు చేశాడు. వీరిద్దరూ మినహా మిగతా ఆటగాళ్లు రాణించడంతో భారత జట్టు సిరీస్ ను కైవసం చేసుకోగల్గింది. భారత్ సిరీస్ ను గెలిచిన పక్షంలో ఇప్పుడు శిఖర్, రాహుల్ కు పరీక్ష ఎదురయ్యే అవకాశం ఉంది. తుది వన్డేలో తుది జట్టులో ఈ ఇద్దరూ ఆడితో తమ బ్యాటింగ్ లో సత్తాను నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. -
కివీస్ క్లీన్ స్వీప్
నెల్సాన్: బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను న్యూజిలాండ్ క్లీన్‌స్వీప్ చేసింది. శనివారం జరిగిన చివరిదైన మూడో వన్డేలో న్యూజిలాండ్ ఘన విజయం సాధించిన సిరిస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకుంది. బంగ్లాదేశ్ విసిరిన 237 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ 41.2 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.న్యూజిలాండ్ ఓపెనర్లు మార్టిన్ గప్టిల్(6 ) రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగగా, లాధమ్(4) నిరాశ పరిచాడు. ఆ తరువాత కేన్ విలియమన్స్ (95 నాటౌట్), బ్రూమ్(97)లు రాణించడంతో పాటు, చివర్లో నీషమ్ (28నాటౌట్) ఆకట్టుకోవడంతో కివీస్ సునాయాసంగా విజయం సాధించింది. తొలి రెండు వన్డేల్లో కివీస్ విజయాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో బ్రూమ్ సెంచరీ చేసే అవకాశాన్ని తృటిలో కోల్పోయాడు. గత వన్డేలో సెంచరీ చేసిన బ్రూమ్.. అతని వన్డే కెరీర్లో ఎనిమిదేళ్ల తరువాత తొలి శతకం సాధించిన ఆటగాడిగా నిలిచాడు. అయితే వరుసగా రెండో సెంచరీ అవకాశాన్ని బ్రూమ్ ఈ మ్యాచ్ లో జారవిడుచుకున్నాడు. -
ఆసీస్ క్లీన్‌స్వీప్
మెల్బోర్న్:న్యూజిలాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను ఆస్ట్రేలియా క్లీన్‌స్వీప్ చేసింది. చివరిదైన మూడో వన్డేలో ఆసీస్ 117పరుగుల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్‌ను 3-0 తో సాధించింది. ఆసీస్ విసిరిన 265 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్ 36.1 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌటై వైట్‌వాష్ అయ్యింది. కివీస్ ఆటగాళ్లలో గప్టిల్(34),లాధమ్(28)లు మోస్తరుగా ఫర్వాలేదనిపించినా మిగతా ఆటగాళ్లు ఘోరంగా విఫలం కావడంతో ఓటమి తప్పలేదు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ మూడు వికెట్లు సాధించగా, కమ్మిన్స్ ,ఫాల్కనర్, ట్రాయిస్ హెడ్లు తలో మూడు వికెట్లు తీసి కివీస్‌ను కుప్పకూల్చడంలో ప్రధాన పాత్ర పోషించారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్(156) వీరోచిత సెంచరీతో ఆసీస్ భారీ స్కోరు సాధించింది. -
అమ్మాయిలు అదరహో
మూడో వన్డేలోనూ భారత్‌దే గెలుపు విండీస్‌పై 3-0తో క్లీన్‌స్వీప్ విజయవాడ స్పోర్ట్స్ కీలక సమయంలో కేసియా నైట్ (94 బంతుల్లో 55 పరుగులు; 5 ఫోర్లు) ఆడిన అనవసరమైన స్వీప్ షాట్ విండీస్ కొంపముంచింది. బ్యాటింగ్‌లోనే కాకుండా ఫీల్డింగ్‌లోనూ భారత అమ్మాయిలు అదరగొట్టారు. మూలపాడులో బుధవారం జరిగిన చివరి వన్డేలో మిథాలీ రాజ్ నాయకత్వంలోని భారత జట్టు 15 పరుగుల తేడాతో విండీస్‌పై విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. విండీస్ జట్టు 5 వికెట్లు చేతిలోఉన్నప్పుడు 20 బంతుల్లో 27 పరుగులు చేస్తే గెలిచేది. ఈ తరుణంలో భారత లెఫ్టార్మ్ స్పిన్నర్ రాజేశ్వరీ (4/34) చక్కటి బౌలింగ్‌తో విండీస్ ఆశలను ఆవిరి చేసింది. భారత జట్టు బౌలింగ్‌తో పాటు అద్భుతమైన ఫీల్డింగ్ (మూడు రనౌట్లు) చేసింది. చివరి 11 పరుగుల వ్యవధిలో విండీస్ జట్టు వెంటవెంటనే నాలుగు వికెట్లు కోల్పోరుుంది. తుదకు 49.1 ఓవ ర్లలో 184 పరుగులకు ఆలౌటైంది. అంతకుముందు టాస్ గెలిచిన భారత జట్టు బ్యాటింగ్ ఎంచుకొని 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. వేద కృష్ణమూర్తి (79 బంతుల్లో 71 పరుగులు; 10 ఫోర్లు) అర్ధ సెంచరీ చేసింది. మిథాలీరాజ్ (15), దీప్తీ శర్మ (23), వైస్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ (19), జులన్ గోస్వామి (18) ఫర్వాలేదనిపించారు. ఈనెల 18న విండీస్‌తో టి20 సిరీస్ తొలి మ్యాచ్ ఇదే గ్రౌండ్లో జరుగనుంది. -
అక్కడ భారత్..ఇక్కడ కివీస్!
మొహాలీ:న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసే క్రమంలో భారత ఆటగాళ్లు పలు రికార్డులను తమ ఖాతాలో వేసుకుంటే.. వన్డే సిరీస్‌లో కివీస్ ఆటగాళ్లు పలు ఘనతలను సాధిస్తున్నారు. గత వన్డేలో టిమ్ సౌథీ 10వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి అర్థ శతకాన్ని సాధించడం ద్వారా ఒక రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. న్యూజిలాండ్ వన్డే ఇన్నింగ్స్ ల్లో 10 లేదా 11 వ స్థానాల్లో బ్యాటింగ్ కు వచ్చి అర్థశతకం సాధించిన ఆ దేశ తొలి ఆటగాడిగా నిలిచాడు. తాజా వన్డేలో న్యూజిలాండ్ ఆల్ రౌండర్ జేమ్స్ నీషమ్-హెన్రీల జోడి సరికొత్త భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ లో తొమ్మిది వికెట్‌కు 84 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించింది. తద్వారా 9వ వికెట్ కు అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన కివీస్ జోడిగా నిలిచింది. ఈ భాగస్వామ్యంతో 2009లో భారత్ పై 9 వికెట్ కు కివీస్ జోడి మిల్స్-సౌథీలు నమోదు చేసిన 83 పరుగుల భాగస్వామ్యం చెరిగిపోయింది. అంతకుముందు జరిగిన టెస్టు సిరీస్‌లో రవి చంద్రన్ అశ్విన్, విరాట్ కోహ్లిలు పలు అరుదైన ఘనతలను సాధించిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్ తో జరిగిన తొలి టెస్టు ద్వారా అశ్విన్ రెండొందల వికెట్ల క్లబ్లో చేరాడు. దాంతో అత్యంత వేగవంతంగా రెండొందల టెస్టు వికెట్లు సాధించిన రెండో బౌలర్ గా గుర్తింపు సాధించాడు. తొలి ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లతో ఆకట్టుకున్న అశ్విన్.. రెండో ఇన్నింగ్స్ లో తొలి మూడు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు ఇండోర్‌లో న్యూజిల్యాండ్‌తో జరిగిన మూడో టెస్టులో ఏకంగా 13వికెట్లు పడగొట్టి.. కెరీర్లోనే ఉత్తమ గణాంకాలు (13/140) నమోదు చేశాడు. దీంతో గత వందేళ్లలో ఏ బౌలర్ సాధించిన స్ట్రైక్ రేట్ (49.4)ను అశ్విన్ సొంతం చేసుకున్నాడు. ఇదిలా ఉండగా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా టెస్టుల్లో డబుల్ సెంచరీ సాధించి రికార్డు సృష్టించాడు. మూడో టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి డబుల్ సెంచరీ నమోదు చేశాడు. భారత తొలి ఇన్నింగ్స్ లో భాగంగా విరాట్ 347 బంతుల్లో 18 ఫోర్లు సాయంతో ద్విశతకాన్ని పూర్తి చేశాడు. ఇది విరాట్ టెస్టు కెరీర్ లో రెండో డబుల్ సెంచరీ. తద్వారా టెస్టుల్లో రెండు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక భారత కెప్టెన్ గా కోహ్లి కొత్త చరిత్ర సృష్టించాడు. మూడు టెస్టుల సిరీస్‌లో రికార్డులను ఖాతాలో వేసుకున్న భారత్.. ఇప్పుడు సుదీర్ఘ వన్డే సిరీస్‌లో రికార్డులను సమర్పించుకుంటుంది. -
భారత్‌కు భారీ లక్ష్యం
మొహాలి:ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇక్కడ పంజాబ్ క్రికెట్ అసోసియేషన్(పీసీఏ)స్టేడియంలో భారత్ తో జరుగుతున్న మూడో వన్డేలో న్యూజిలాండ్ కష్టాల్లో ఉన్న సమయంలో ఆల్ రౌండర్ జేమ్స్ నీషమ్ ఆదుకున్నాడు. బ్యాటింగ్ ఆల్ రౌండర్‌గా పేరున్న నీషమ్ ( 57 ; 47 బంతుల్లో 7 ఫోర్లు) బాధ్యతాయుతంగా ఆడటంతో కివీస్ 286 పరుగుల లక్ష్యాన్ని భారత్ ముందుంచింది. ఓ దశలో 199 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయిన కివీస్.. నీషమ్ సొగసైన ఇన్నింగ్స్‌తో తేరుకుని భారీ స్కోరును సాధించకల్గింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన న్యూజిలాండ్ ఆదిలో కుదురుగా ఆడినప్పటికీ, కీలక సమయంలో వరుసగా వికెట్లను కోల్పోయింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ లో గప్టిల్(27), కేన్ విలియమ్సన్(22)మోస్తరుగా ఫర్వాలేదనిపించారు. ఆ తరువాత టామ్ లాధమ్-రాస్ టేలర్ జోడి ఇన్నింగ్స్ ను మరమ్మత్తులు చేపట్టింది. వీరిద్దరూ 73 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన తరువాత టేలర్ (44) మూడో వికెట్ గా అవుటయ్యాడు. అప్పటికి న్యూజిలాండ్ స్కోరు 28.3 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 153 పరుగులు. అయితే కోరీ అండర్సన్(6), ల్యూక్ రోంచీ(1) లు ఇలా వచ్చి అలా వెళ్లడంతో కివీస్ ఇబ్బందుల్లో పడింది. ఆ తరువాత టామ్ లాధమ్(61)కూడా నిష్కమించడంతో కివీస్ 169 పరుగులకే ఆరు వికెట్లను కోల్పోయింది. ఆపై సాంట్నార్(7), సౌతీ(13)ల వికెట్లను తీసి పైచేయి సాధించినట్లు కనిపించిన భారత్‌ను నీషామ్ తీవ్రంగా ప్రతిఘటించాడు. టెయిలెండర్ హెన్రీతో కలిసి 84 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. ఈ క్రమంలోనే నీషామ్ హాఫ్ సెంచరీ సాధించాడు. మరోవైపు హెన్రీ(39 నాటౌట్;37 బంతుల్లో 4 ఫోర్లు,1 సిక్స్ ) కూడా ధాటిగా ఆడాడు. దాంతో కివీస్ 49. 4 ఓవర్లలో 285 పరుగులకు చేసి ఇంకా రెండు బంతులుండగా ఇన్నింగ్స్ ముగించింది. భారత బౌలర్లలో కేదర్ జాదవ్, ఉమేశ్ యాదవ్ తలో మూడు వికెట్లు సాధించగా, అమిత్ మిశ్రా, బూమ్రాలు చెరో రెండు వికెట్లు లభించాయి. -
అంతలోనే కివీస్ టపటపా..
మొహాలీ:భారత్‌తో జరుగుతున్న మూడో వన్డేలో న్యూజిలాండ్ నిలకడగా ఆడుతుంది అనుకునేలోపే వరుసగా కీలక వికెట్లను కోల్పోయింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ లో భాగంగా 80 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయిన కివీస్.. మూడో వికెట్ కు 73 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించింది. దాంతో మూడు వికెట్ల నష్టానికి 153 పరుగులతో పటిష్టంగా కనిపించింది. అయితే ఆపై స్వల్ప విరామాల్లో మరో మూడు వికెట్లను నష్టపోయి కష్టాల్లో పడింది. న్యూజిలాండ్ స్కోరు 160 పరుగుల వద్ద అండర్సన్(6) వికెట్ ను కోల్పోయిన కివీస్.. మరో పరుగు వ్యవధిలో ల్యూక్ రోంచీ(1) వికెట్ ను నష్టపోయింది. ఆ తరువాత క్రీజ్ లో కుదురుగా ఆడుతున్నట్లు కనిపించిన టామ్ లాధమ్(61) కూడా వెనుదిరగడంతో కివీస్ 169 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. అంతకుముందు గప్టిల్(27), విలియమ్సన్(22), రాస్ టేలర్(44)లు పెవిలియన్ చేరారు. ఈ ఆరు వికెట్లలో్ కేదర్ జాదవ్ మూడు వికెట్లు సాధించగా,మిశ్రాకు రెండు, ఉమేశ్ కు ఒకటి దక్కింది. -
నిలకడగా కివీస్ బ్యాటింగ్
మొహాలి:భారత్ తో జరుగుతున్న మూడో వన్డేలో న్యూజిలాండ్ నిలకడగా బ్యాటింగ్ కొనసాగిస్తోంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన న్యూజిలాండ్ 25.0 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 132 పరుగులతో బ్యాటింగ్ చేస్తోంది. న్యూజిలాండ్ జట్టులో గప్టిల్(27), కేన్ విలియమ్సన్(22)లు మోస్తరుగా ఫర్వాలేదనిపించి పెవిలియన్ చేరారు. మరో ఓపెనర్ టామ్ లాధమ్ మాత్రం హాఫ్ సెంచరీ సాధించాడు. 59 బంతుల్లో లాధమ్ అర్థ శతకం నమోదు చేశాడు. న్యూజిలాండ్ కోల్పోయిన రెండు వికెట్లలో ఉమేశ్ యాదవ్, కేదర్ జాదవ్‌లకు తలో వికెట్ తీశారు. -
మళ్లీ టీమిండియానే..
మొహాలి:ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇక్కడ పంజాబ్ క్రికెట్ అసోసియేషన్(పీసీఏ) స్టేడియంలో న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడో వన్డేలో భారత జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. న్యూజిలాండ్ తో జరిగే సుదీర్ఘ సిరీస్‌లో భారత జట్టు ఇలా టాస్ గెలవడం ఆరోసారి. గత ఐదు మ్యాచ్‌ల్లో(మూడు టెస్టుల సహా) భారత్ నే టాస్ వరించిడం విశేషం. ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుండగా, న్యూజిలాండ్ జట్టులో తిరిగి నీషామ్ వచ్చి చేరాడు. డెవిచ్ స్థానంలో నీషామ్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు. గత మ్యాచ్‌లో భారత్ ను ఓడించిన న్యూజిలాండ్ అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని భావిస్తుండగా, భారత్ మాత్రం న్యూజిలాండ్‌ను ఓడించి సిరీస్‌లో ముందంజ వేయాలని యోచిస్తోంది. రెండో వన్డేలో గెలుపు న్యూజిలాండ్ జట్టులో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ సెంచరీతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కాగా, ఆ మ్యాచ్‌లో భారత్ పోరాడి ఓడిపోవడం జట్టును ఆందోళనకు గురి చేసింది. ఇదిలా ఉంచితే, మొహాలీలో భారత్ జట్టు మంచి వన్డే రికార్డును కల్గి వుంది. ఇక్కడ పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం(పీసీఏ)లో ఇప్పటివరకూ భారత్ ఓవరాల్ గా 13 వన్డేలు ఆడగా, ఎనిమిదింట విజయం సాధించింది. ఐదు వన్డేల్లో ఓటమి పాలైంది. ఈ స్టేడియంలో భారత్ తొలిసారి 1993లో దక్షిణాఫ్రికాపై గెలవగా, చివరిసారి 2013 లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో ఓటమి పాలైంది. కాగా, 2016లో ఇక్కడ ఆస్ట్రేలియాతో చివరిసారి ఆడిన వరల్డ్ టీ20లో భారత్ జయకేతనం ఎగురవేసింది. న్యూజిలాండ్ తుది జట్టు:కేన్ విలియమ్సన్(కెప్టెన్) మార్టిన్ గప్టిల్, టామ్ లాధమ్, రాస్ టేలర్, కోరీ అండర్సన్, ల్యూక్ రోంచీ, నీషామ్, సాంట్నార్, సౌథీ , హెన్రీ, బౌల్ట్ భారత తుది జట్టు: ఎంఎస్ ధోని(కెప్టెన్), రోహిత్ శర్మ,అజింక్యా రహానే, విరాట్ కోహ్లి, మనీష్ పాండే, కేదర్ జాదవ్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, అమిత్ మిశ్రా,ఉమేశ్ యాదవ్, బూమ్రా -
ధోని అండ్ గ్యాంగ్ పైచేయి సాధించేనా?
మొహాలి:ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా మరో మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకునేందుకు భారత్-న్యూజిలాండ్ జట్లు సిద్ధమవుతున్నాయి. ఆదివారం ఇరు జట్ల మధ్య జరిగే మూడో వన్డే ఇరు జట్లకు కీలకంగానే చెప్పొచ్చు. ఇప్పటికే చెరో మ్యాచ్ గెలిచి సిరీస్‌లో సమంగా ఉండటంతో మూడో వన్డేలో విజయంతో పై చేయి సాధించాలని ఇరు జట్లు కసరత్తు చేస్తున్నాయి. రేపు మొహాలీలో మధ్యాహ్నం గం.1.30 ని.లకు ఆరంభం కానున్న మ్యాచ్‌లో ఇరు జట్లు తమ పూర్తి బలాబలాతో బరిలోకి దిగే అవకాశం ఉంది. గత మ్యాచ్‌లో మూడు మార్పులతో బరిలోకి దిగిన న్యూజిలాండ్.. అదే జట్టును కొనసాగించే అవకాశం ఉంది. మరోవైపు భారత్ తొలి రెండు వన్డేల్లో కొనసాగించిన తుది జట్టుతోనే తమ అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం ఉంది. కాగా, గత మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు ఊహించని షాకివ్వడం భారత శిబిరంలో కలవరానికి గురి చేసింది. ఈ విజయం మూడు టెస్టుల సిరీస్‌లో క్లీన్ స్వీప్ అయిన న్యూజిలాండ్ జట్టులో రెట్టించిన ఉత్సాహాన్నిచ్చింది. దాంతో పాటు కెప్టెన్ కేన్ విలియమ్సన్ కూడా మంచి టచ్ లోకి వచ్చాడు. తొలి వన్డేలో మూడు పరుగులు చేసి నిరాశపరిచిన విలియమ్సన్.. రెండో వన్డేలో శతకం సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇది ఆ జట్టులో పూర్తి విశ్వాసాన్ని నింపుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇదిలా ఉంచితే న్యూజిలాండ్ ఫీల్డింగ్ కూడా అద్భుతంగా ఉంది. ప్రత్యేకంగా క్యాచ్‌ల విషయంలో ఆ జట్టులోని ఆటగాళ్లు ఎటువంటి పొరబాట్లకు తావివ్వడం లేదు. మొహాలిలో భారత్ కు మెరుగైన రికార్డు మొహాలీలో భారత్ జట్టు మంచి వన్డే రికార్డును కల్గి వుంది. ఇక్కడ పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం(పీసీఏ)లో ఇప్పటివరకూ భారత్ ఓవరాల్ గా 13 వన్డేలు ఆడగా, ఎనిమిదింట విజయం సాధించింది. ఐదు వన్డేల్లో ఓటమి పాలైంది. ఈ స్టేడియంలో భారత్ తొలిసారి 1993లో దక్షిణాఫ్రికాపై గెలవగా, చివరిసారి 2013 లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో ఓటమి పాలైంది. కాగా, 2016లో ఇక్కడ ఆస్ట్రేలియాతో చివరిసారి ఆడిన వరల్డ్ టీ20లో భారత్ జయకేతనం ఎగురవేసింది. ఓపెనర్ల భాగస్వామ్యం కీలకం ఇప్పటివరకూ జరిగిన రెండు వన్డేల్లో భారత ఓపెనర్ల నుంచి ఆశించిన భాగస్వామ్యం రాలేదు. ఒక ఎండ్ లో ఓపెనర్‌గా అజింక్యా రహానే ఫర్వాలేదనిపిస్తున్నా, మరోవైపు రోహిత్ శర్మ పూర్తిగా వైఫల్యం చెందుతున్నాడు. రేపటి మ్యాచ్‌లో కివీస్‌ను ఒత్తిడిలోకి నెట్టాలంటే మంచి ఆరంభం కావాలి. దాంతో పాటు మిడిల్ ఆర్డర్ లో కీలక భాగస్వామ్యం అవసరం. తొలి వన్డేలో విరాట్ చలవతో గట్టెక్కిన భారత్.. రెండో వన్డేలో విరాట్ విఫలం కావడంతోనే తేలిపోయింది. దాన్ని మిగతా టాపార్డర్ ఆటగాళ్లు అధిగమించాల్సి ఉంది. దాదాపు 13ఏళ్ల తరువాత భారత్‌లో భారత్‌పై వన్డే గెలుపు ఆనందంలో ఉన్న న్యూజిలాండ్ జట్టును ఏమాత్రం తేలిగ్గా తీసుకున్నా మరోసారి మూల్యం చెల్లించుకోకతప్పదు. రేపటి మ్యాచ్‌లో సమష్టిగా పోరాడితేనే ధోని అండ్ గ్యాంగ్ సిరీస్‌లో పైచేయి సాధించే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ న్యూజిలాండ్ కూడా కీలకం కావడంతో ఇరు జట్ల మధ్య ఆసక్తికర పోరు జరగవచ్చు. -
దీప్తి శర్మ 6/20
మూడో వన్డే కూడా భారత మహిళలదే శ్రీలంకపై 3-0తో క్లీన్‌స్వీప్ రాంచీ: శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు జోరు కొనసాగింది. వరుసగా రెండు విజయాలతో ఇప్పటికే సిరీస్ సొంతం చేసుకున్న మిథాలీ రాజ్ సేన శుక్రవారం మూడో వన్డేలోనూ గెలిచి ద్వైపాక్షిక పోరును 3-0తో ముగించింది. చివరి మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో లంకను చిత్తు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లంక 38.2 ఓవర్లలో 112 పరుగులకే కుప్పకూలింది. సురాంగిక (23) టాప్ స్కోరర్‌గా నిలిచింది. భారత బౌలర్లలో ఆఫ్‌స్పిన్నర్ దీప్తి శర్మ 9.2 ఓవర్లలో కేవలం 20 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టడం విశేషం. కెరీర్లో తొలి వన్డే ఆడుతున్న ఆఫ్‌స్పిన్నర్ ప్రీతి బోస్ (8-4-8-2) కట్టుదిట్టమైన బౌలింగ్ గణాంకాలు నమోదు చేసింది. అనంతరం భారత్ 29.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసింది. 18 పరుగులకే 2 వికెట్లు కోల్పోయినా... వేద కృష్ణమూర్తి (90 బంతుల్లో 61 నాటౌట్; 8 ఫోర్లు), దీప్తి శర్మ (59 బంతుల్లో 28; 5 ఫోర్లు) మూడో వికెట్‌కు 70 పరుగులు జోడించి జట్టు విజయాన్ని ఖాయం చేశారు. దీప్తికే ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. నాలుగో స్థానానికి భారత్... ఐసీసీ మహిళల చాంపియన్‌షిప్‌లో భాగంగా జరిగిన ఈ సిరీస్‌లో మూడు విజయాల ద్వారా భారత్‌కు మొత్తం 6 పాయింట్లు లభించాయి. ఫలితంగా పట్టికలో మొత్తం 13 పాయింట్లతో జట్టు ప్రస్తుతం నాలుగో స్థానంలో నిలిచింది. ఇప్పటికే 15 మ్యాచ్‌లు ఆడిన భారత్... ఇకపై వెస్టిండీస్‌తో 3, పాకిస్తాన్‌తో 3 వన్డేలు ఆడాల్సి ఉంది. ఈ చాంపియన్‌షిప్‌లో అన్ని మ్యాచ్‌లు ముగిసిన అనంతరం టాప్-4 టీమ్‌లు 2017లో ఇంగ్లండ్‌లో జరిగే వరల్డ్ కప్‌కు నేరుగా అర్హత సాధిస్తాయి. మొదటి నాలుగు స్థానాల్లో నిలవలేకపోతే... మొత్తం 10 జట్లతో కూడిన క్వాలిఫయింగ్ టోర్నీలో ఆడాల్సి ఉంటుంది. భారత్‌తో పోలిస్తే విండీస్, పాక్ బలహీన జట్లే కావడంతో మన జట్టుకు ఇంకా అవకాశం ఉంది. -
మూడో వన్డేలో దక్షిణాఫ్రికా విజయం
డికాక్, ఆమ్లా సెంచరీలు సెంచూరియన్: ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో దక్షిణాఫ్రికా స్ఫూర్తిదాయక విజయం సాధించింది. తొలి రెండు వన్డేల్లో ఓడిపోయిన సఫారీలు మూడో వన్డేలో 319 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించి ఏడు వికెట్లతో ఘన విజయం సాధించారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 318 పరుగులు చేసింది. రూట్ (113 బంతుల్లో 125; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీ చేయగా... హేల్స్ (65), స్టోక్స్ (53) అర్ధసెంచరీలు సాధించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో అబాట్, రబడ రెండేసి వికెట్లు తీసుకున్నారు. దక్షిణాఫ్రికా జట్టు 46.2 ఓవర్లలోనే మూడు వికెట్లకు 319 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు డికాక్ (117 బంతుల్లో 135; 16 ఫోర్లు, 4 సిక్సర్లు), ఆమ్లా (130 బంతుల్లో 127; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీలతో చెలరేగారు. ఈ ఇద్దరూ తొలి వికెట్‌కు ఏకంగా 239 పరుగులు జోడించడం విశేషం. డు ప్లెసిస్ (29 బంతుల్లో 33 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్సర్) రాణించాడు. డికాక్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఐదు వన్డేల సిరీస్‌లో ప్రస్తుతం ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలో ఉంది. నాలుగో వన్డే శుక్రవారం జరుగుతుంది. వన్డేల్లో వేగంగా పది సెంచరీలు (55 ఇన్నింగ్స్ లో) చేసిన ఆటగాడిగా డికాక్ రికార్డు సృష్టించాడు. ఆమ్లా (57 ఇన్నింగ్స్) రికార్డును అతను అధిగమిం చాడు. దక్షిణాఫ్రికా జట్టు 319 అంతకంటే ఎక్కువ లక్ష్యాన్ని ఛేదించడం ఇది మూడోసారి మాత్రమే.: ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో దక్షిణాఫ్రికా స్ఫూర్తిదాయక విజయం సాధించింది. తొలి రెండు వన్డేల్లో ఓడిపోయిన సఫారీలు మూడో వన్డేలో 319 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించి ఏడు వికెట్లతో ఘన విజయం సాధించారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 318 పరుగులు చేసింది. రూట్ (113 బంతుల్లో 125; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీ చేయగా... హేల్స్ (65), స్టోక్స్ (53) అర్ధసెంచరీలు సాధించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో అబాట్, రబడ రెండేసి వికెట్లు తీసుకున్నారు. దక్షిణాఫ్రికా జట్టు 46.2 ఓవర్లలోనే మూడు వికెట్లకు 319 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు డికాక్ (117 బంతుల్లో 135; 16 ఫోర్లు, 4 సిక్సర్లు), ఆమ్లా (130 బంతుల్లో 127; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీలతో చెలరేగారు. ఈ ఇద్దరూ తొలి వికెట్‌కు ఏకంగా 239 పరుగులు జోడించడం విశేషం. డు ప్లెసిస్ (29 బంతుల్లో 33 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్సర్) రాణించాడు. డికాక్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఐదు వన్డేల సిరీస్‌లో ప్రస్తుతం ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలో ఉంది. నాలుగో వన్డే శుక్రవారం జరుగుతుంది.వన్డేల్లో వేగంగా పది సెంచరీలు (55 ఇన్నింగ్స్ లో) చేసిన ఆటగాడిగా డికాక్ రికార్డు సృష్టించాడు. ఆమ్లా (57 ఇన్నింగ్స్) రికార్డును అతను అధిగమిం చాడు. దక్షిణాఫ్రికా జట్టు 319 అంతకంటే ఎక్కువ లక్ష్యాన్ని ఛేదించడం ఇది మూడోసారి మాత్రమే. -
సౌతాఫ్రికాకు శుభారంభం
రాజ్ కోట్: గాంధీ- మండేలా సిరీస్ లో భాగంగా రాజ్ కోట్ లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా జరుగుతున్న మూడో వన్ డేలో దక్షిణాఫ్రికా నిలకడగా ఆడుతోంది. 10 ఓవర్లు ముగిసేసరికి వికెట్లేమీ కోల్పోకుండా 59 పరుగులు సాధించింది. ఓపెనర్లు డికాక్ (31), మిల్లార్ (26 పరుగులు చేసి భారీ స్కోరుకు పునాదులు వేసే ప్రయత్నం చేస్తున్నారు. భారత జట్టు కూర్పులో ఒక మార్పు చోటుచేసుకుంది. అమిత్ మిశ్రా బరిలోకి దిగాడు. -
మూడో వన్డేపై 'పటేల్' మేఘాలు
- మ్యాచ్ వేదికగా నిరసనలకు హార్దిక్ అండ్ కో సన్నాహాలు - రాజ్ కోట్ లో మొబైల్ ఇంటర్నెట్ పై నిషేధం - అసాధారణ భద్రత నడుమ నేడు భారత్- దక్షిణాఫ్రికా మూడో వన్ డే రాజ్‌కోట్: పటేల్ రిజర్వేషన్ ఉద్యమకారుల బెదిరింపుల నేపథ్యంలో ఆదివారం రాజ్ కోట్ లో జరగనున్న భారత్- దక్షిణాఫ్రికా మూడో వన్ డే మ్చాచ్ కు కనీవినీ ఎరుగని రీతిలో భద్రత కల్పించారు. ఇప్పటికే 50 వేల మంది పటేల్ ఉద్యమకారులు మ్యాచ్ టికెట్లు కొనుగోలు చేసినట్లు తెలియరావడంతో అటు పోలీసులు, ఇటు సౌరాష్ట్ర క్రికెటల్ అసోసియేషన్ ను గుబులు వెంటాడుతూనే ఉంది. అయితే ఎట్టిపరిస్థితుల్లోనూ మ్యాచ్ నిరాటంకంగా సాగుతుందని వారు భరోసా ఇస్తున్నారు. పటేల్ ఉద్యమకారులు కూడా ఇంతే గట్టిగా నిరసన తెలుపుతామని ప్రకటించారు. ముందస్తు చర్యల్లో భాగంగా రాజ్ కోట్ జిల్లా వ్యాప్తంగా మొబైల్ ఇంటర్నెట్ పై పోలీసులు నిషేధం విధించారు. రాత్రి 10 గంటల వరకు ఈ నిషేధం ఉంటుందని తెలిపారు. జిల్లా కేంద్రం శివారులోని ఖందేరీలోగల సౌరాష్ట్రా క్రికెట్ అసోసియేషన్ (ఎస్ సీఏ) స్టేడియానికి ప్రేక్షకులు వచ్చే అన్ని మార్గాల్లో నిఘా పెంచారు. కనీవినీ ఎరుగని రీతిలో నిఘా డ్రోన్ కెమెరాలు, నాలుగు వేల సాయుధబలగాలతో మ్యాచ్ కు భద్రతా ఏర్పాట్లు చేశారు. నేటి మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. తనతో సహా 50 వేల మంది పటేల్ ఉద్యమకారులు ఇప్పటికే మ్యాచ్ టికెట్లను పొందామని హార్ధిక్ పటేల్ చెప్పారు. ఒకవేళ స్టేడియం లోపలికి తమను అనుమతించకుంటే.. మరో రూపంలో సత్తా చాటేందుకు పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి (పాస్) కార్యకర్తలు, పటేల్ కులస్తులంతా సిద్ధంగా ఉన్నారని తెలిపారు. పోలీసుల భద్రతా ఏర్పాట్లలో ముఖ్యాంశాలు.. - ప్రత్యేకంగా రూపొందించిన మూడు డ్రోన్ కెమెరాలతో ప్రేక్షకుల కదలికలపై నిరంతర నిఘా - స్టేడియం లోపల, వెలుపల 90కిపైగా సీసీ టీవీ కెమెరాల ఏర్పాటు - రెండు వేల మంది సాధారణ పోలీసులు - మూడు కంపెనీల స్టేట్ రిజర్వు పోలీస్ ఫోర్స్ (ఎస్ ఆర్ పీఎఫ్) బలగాల మోహరింపు - ఒక కంపెనీ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్) - మూడు బృందాల క్విక్ రెస్పాన్స్ సెల్ (క్యూఆర్ సీ) - ఐదుగురు సూపరింటెండెంట్ ల పర్యవేక్షణ స్టేడియంలో విధులు నిర్వహించే భద్రతా సిబ్బంది ఎవరైనా నిఘాను వదిలేసి మ్యాచ్ ను చూసినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాజ్ కోట్ రేంజ్ ఐజీ డీఆర్ పటేల్ స్పష్టం చేశారు. ఎస్ సీఏ సెక్రటరీ నిరంజన్ షా మీడియాతో మాట్లాడుతూ రిజర్వేషన్లపై క్రికెట్ మ్యాచ్ లో నిరసన తెలపడం సరైన చర్యకాదని, క్రీడలను క్రీడలుగానే చూడాలని అన్నారు. స్టేడియంలో నిరసనలు వద్దని తాను హార్దిక్ పటేల్ కు ఫోన్ చేసి విన్నవించినట్లు తెలిపారు. -
ధోని సేన జోరు కొనసాగించేనా?
రాజ్ కోట్: దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో అద్భుత విజయాన్ని సాధించి మంచి ఊపుమీద ఉన్న టీమిండియా మరో పోరుకు సన్నద్ధమవుతోంది. ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా ఆదివారం రాజ్ కోట్ లో మూడో వన్డే జరుగనుంది. రేపు మధ్యాహ్నం గం.1.30 ని.లకు ప్రారంభమయ్యే మ్యాచ్ కోసం రెండు జట్లు ముమ్మర ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఇప్పటికే చెరో వన్డేలో గెలిచి 1-1 తో సమంగా ఉన్న ఇరు జట్లు సిరీస్ లో పైచేయి సాధించాలనే తీవ్ర పట్టుదలతో ఉన్నాయి. తొలి వన్డేలో గెలిచిన సఫారీలు.. ఆ తరువాత జరిగిన రెండో వన్డేలో స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తడబడ్డారు. కాగా, టీమిండియాకు మాత్రం రెండో వన్డేలో గెలుపు మంచి ఉత్సాహాన్నిచ్చింది. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కీలక ఇన్నింగ్స్ ఆడటంతోపాటు బౌలర్లు కూడా మెరుగ్గా రాణించడంతో విజయం సాధించిన టీమిండియా.. మూడో వన్డేలో కూడా అదే పునరావృతం చేయాలని భావిస్తోంది. తొలి వన్డేలో లక్ష్యం దగ్గర కంటే వెళ్లి చతికిలబడ్డ ధోని సేన.. రెండో వన్డేలో మాత్రం సఫారీలకు షాకిచ్చింది. ఆ మ్యాచ్ లో తొలుత దక్షిణాఫ్రికాకే ఎక్కువ విజయావకాశాలు ఉన్నట్లు భావించినా.. టీమిండియా మాత్రం చివరి వరకూ పోరాడి గెలిచింది. కాగా ఆ ఓటమితో సఫారీలు మాత్రం కాస్త డీలా పడ్డారు. అయితే ప్రధానంగా టీమిండియాలో శిఖర్ ధవన్, విరాట్ కోహ్లి, సురేష్ రైనాలు ఆటతీరు కలవరపెడుతోంది. గత మ్యాచ్ ల్లో పెద్దగా ఆకట్టుకోలేని వీరు మూడో వన్డేలో రాణించాల్సిన అవసరం ఉంది. కేవలం ఒకరిద్దరిపైనే ఆధారపడకుండా పూర్తిస్థాయిలో ఆడితేనే దక్షిణాఫ్రికాపై మరోవిజయాన్ని సాధించే అవకాశం ఉంది. కాగా, రెండో వన్డేలో ఓటమితో అనూహ్య షాక్ తిన్న సఫారీలు మూడో వన్డేలో మాత్రం పక్కా ప్రణాళికలతో సిద్ధమవుతారనడంలో ఎటువంటి సందేహం లేదు. రెండో వన్డేలో బౌలర్లు రాణించినా, బ్యాట్స్ మెన్ వైఫల్యం వల్ల దక్షిణాఫ్రికా ఓటమి చెందింది. దీన్ని అధిగమించేందుకు డివిలియర్స్ సేన కసరత్తులు చేస్తోంది. దీంతో ఇరుజట్లు మధ్య మరో ఆసక్తికర పోరు జరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా మూడో వన్డేను అడ్డుకుంటామని ఇప్పటికే పాటీదార్ అనామత్ ఆందోళన్ సమితి నాయకుడు హర్దిక్ పటేల్ హెచ్చరించడంతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. స్టేడియం చుట్టూ భారీ బందోబస్తును ఏర్పాటు చేసేందుకు పోలీసులు సన్నద్ధమవుతున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మ్యాచ్ సజావుగా జరిగేందుకు కసరత్తులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే స్టేడియం చుట్టూ 90 సీసీ కెమెరాల ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు. -
భారత మహిళలకు మరో ఓటమి
మూడో వన్డేలో కివీస్ విజయం బెంగళూరు : భారత మహిళల క్రికెట్ జట్టుకు వరుసగా రెండో పరాజయం. వేద కృష్ణమూర్తి (85 బంతుల్లో 61; 6 ఫోర్లు), మిథాలీ రాజ్ (70 బంతుల్లో 30; 5 ఫోర్లు) మినహా మరో బ్యాట్స్‌వుమన్ రాణించకపోవడంతో శుక్రవారం న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో ఓడింది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌లో కివీస్ 2-1తో ఆధిక్యంలో ఉంది. ఆరున ఇదే వేదికపై నాలుగో వన్డే జరుగుతుంది. టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన మిథాలీ సేన 50 ఓవర్లలో 9 వికెట్లకు 182 పరుగులు మాత్రమే చేయగలిగింది. వేద, దీప్తి (22) ఐదో వికెట్‌కు 71 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. డెవిన్‌కు మూడు వికెట్లు దక్కాయి. అనంతరం బరిలోకి దిగిన కివీస్ 45.4 ఓవర్లలో నాలుగు వికెట్లకు 186 పరుగులు చేసి నెగ్గింది. ఓపెనర్లు రాచెల్ ప్రీస్ట్ (101 బంతుల్లో 64; 7 ఫోర్లు; 1 సిక్స్), సుజీ బేట్స్ (87 బంతుల్లో 59; 7 ఫోర్లు) విజయంలో కీలక పాత్ర పోషించారు. -
టీమిండియాదే సిరీస్
హైదరాబాద్: శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ ను టీమిండియా కైవశం చేసుకుంది. ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా ఇక్కడ జరిగిన మూడో వన్డేలో భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్ ను చేజిక్కించుకుంది. 243 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా సునాయాసంగా గెలుపొందింది. భారత ఓపెనర్లు అజ్యింకా రహానే, శిఖర్ ధవన్ లు జట్టుకు శుభారంభాన్నిచ్చారు. రహానే(31) పరుగుల వద్ద పెవిలియన్ కు చేరినా..ధవన్ మరోసారి చక్కటి ఆటతో ఆకట్టుకున్నాడు. తృటిలో సెంచరీ చేజార్చుకున్న ధవన్ (91; 79 బంతుల్లో 8ఫోర్లు, 1 సిక్స్) పరుగులు చేసి టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించాడు. అంబటి రాయుడి (35) పరుగులు చేసి రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. అనంతరం భారత కెప్టెన్ కోహ్లీ (53), సురేష్ రైనా(18 *) పరుగులు చేసి మ్యాచ్ ను విజయతీరాలకు చేర్చారు. చివర్లో సాహా (11) పరుగులు చేసి మ్యాచ్ ను ముగించాడు. కేవలం నాలుగు వికెట్లు కోల్పోయిన టీమిండియా 44.1 ఓవర్లో లక్ష్యాన్ని సాధించింది. శ్రీలంక బౌలర్లలో కులశేఖర, పెరీరా, దిల్షాన్ లకు తలో వికెట్టు దక్కింది. అంతకుముందు టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ చేపట్టింది. ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన శ్రీలంకను మహేలా జయవర్ధనే, దిల్షాన్ లు ఆదుకున్నారు. ఐదు పరుగుల వద్ద కుశల్ పెరీరా (4) వికెట్టును కోల్పోయిన లంకేయులు వెంటనే సంగక్కరా వికెట్టును కూడా చేజార్చుకుంది. జయవర్ధనే సెంచరీ, దిల్షాన్ అర్ధ సెంచరీలతో బయటపడ్డ లంకేయులు 48.2 ఓవర్లలో 242 పరుగులకే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో ఉమేష్ యాదవ్ నాలుగు వికెట్లు తీసి లంక పతనాన్ని శాసించగా, ఏఆర్ పటేల్ మూడు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. -
టీమిండియా విజయలక్ష్యం 243
హైదరాబాద్: టీమిండియాతో ఇక్కడ జరుగుతున్న మూడో వన్డేలో శ్రీలంక 243 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన శ్రీలంక ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.. ఐదు పరుగుల వద్ద కుశల్ పెరీరా (4) వికెట్టును కోల్పోయిన లంకేయులు వెంటనే సంగక్కరా వికెట్టును కూడా చేజార్చుకుంది. కుమార సంగక్కరా(0) పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ కు చేరి లంక అభిమానుల్ని నిరాశ పరిచాడు. అనంతరం మహేలా జయవర్ధనే సెంచరీ, దిల్షాన్ అర్ధ సెంచరీలతో బయటపడ్డ లంకేయులు 48.2 ఓవర్లలో 242 పరుగులు చేశారు. భారత బౌలర్లలో ఉమేష్ యాదవ్ నాలుగు వికెట్లు తీసి లంక పతనాన్ని శాసించగా, ఏఆర్ పటేల్ మూడు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. ఇదిలా ఉండగా ఈ వన్డేలో జయవర్ధనే అరుదైన ఘనతను దక్కించుకున్నాడు. వన్డేల్లో 17 సెంచరీలు, భారత్ పై నాలుగు సెంచరీలు చేసిన జయవర్ధనే 12 వేల పరుగుల క్లబ్ చేరాడు. అంతకముందు సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, జయసూర్య, సంగక్కార లు ఈ ఘనత సాధించిన ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు. -
థర్డ్ వన్డే ఎట్ హైదరాబాద్
-
హైదరాబాద్ వన్డేలో జయవర్ధనే సెంచరీ
హైదరాబాద్:టీమిండియాతో ఇక్కడ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతున్న మూడో వన్డేలో జయవర్దనే సెంచరీతో ఆకట్టుకున్నాడు. లంకేయులు వరుసగా వికెట్లు చేజార్చుకున్నా జయవర్ధనే ఒంటరిగా పోరాటం చేశాడు. 111 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్స్ తో సెంచరీ చేసిన జయవర్ధనే భారత బౌలర్లకు పరీక్షగా నిలిచాడు. అంతకుముందు దిల్షాన్(53) పరుగుల మాత్రమే మహేలాకు సహకరించాడు. వన్డేల్లో 17 సెంచరీలు చేసిన మహేలా.. భారత్ పై నాల్గో సెంచరీ నమోదు చేశారు. ఇదిలా ఉండగా జయవర్ధనే వ్యక్తిగత స్కోరు 116 పరుగుల వద్ద ఉండగా 12 వేలు పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. అంతకముందు సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, జయసూర్య, సంగక్కార లు ఈ ఘనత సాధించిన ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు. -
జయవర్ధనే, దిల్షాన్ లు హాఫ్ సెంచరీలు
హైదరాబాద్:టీమిండియాతో ఇక్కడ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతున్న మూడో వన్డేలో శ్రీలంక ఆటగాళ్లు మహేలా జయవర్ధనే, దిల్షాన్ లు హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. ఆదిలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాలో పడిన లంకను వీరిద్దరూ ఆదుకున్నారు. ఐదు పరుగుల వద్ద కుశల్ పెరీరా (4) వికెట్టును కోల్పోయిన లంకేయులు వెంటనే సంగక్కరా వికెట్టును కూడా చేజార్చుకుంది. కుమార సంగక్కరా(0) పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ కు చేరి లంక అభిమానుల్ని నిరాశ పరిచాడు. అనంతరం దిల్షాన్(53)పరుగులు చేసి మూడు వికెట్టు రూపంలో వెనుదిరిగగా, జయవర్ధనే(76)పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. ప్రస్తుతం ఆరు వికెట్లు కోల్పోయిన శ్రీలంక 34.5 ఓవరల్లో 154 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. జయవర్ధనే జతగా డిసిల్వా క్రీజ్ లో ఉన్నాడు. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్, ఏఆర్ పటేల్ లు తలో రెండు వికెట్లు తీసి లంక పతనానికి పునాది వేశారు. ఐదు వన్డేల్లో భాగంగా గత రెండు వన్డేల్లో ఒటమి పాలైన లంకేయులు ఈ మ్యాచ్ ను గెలిచి భారత్ ఆధిక్యాన్ని తగ్గించాలని భావిస్తుండగా, టీమిండియా మాత్రం ఈ మ్యాచ్ లో కూడా విజయ ఢంకా మోగించి సిరీస్ ను కైవసం చేసుకోవాలనే యోచనలో ఉంది. -
నత్తనడకన శ్రీలంక బ్యాటింగ్
హైదరాబాద్:టీమిండియాతో ఇక్కడ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతున్న మూడో వన్డేలో శ్రీలంక ఆటగాళ్లు నత్తనడకన బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. ఐదు పరుగుల వద్ద కుశల్ పెరీరా(4) వికెట్టును కోల్పోయిన లంకేయులు వెంటనే సంగక్కార వికెట్టును కూడా చేజార్చుకుంది. కుమార సంగక్కార (0) పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ కు చేరి లంక అభిమానుల్ని నిరాశ పరిచాడు. టీమిండియా అటాకింగ్ బౌలర్ ఉమేష్ యాదవ్ రెండు వికెట్లు కూల్చి లంక షాకిచ్చాడు. ప్రస్తుతం 12.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయిన లంక 47 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. దిల్షాన్(20), మహేలా జయవర్ధనే(14)లు క్రీజ్ లో ఉన్నారు. ఐదు వన్డేల్లో భాగంగా గత రెండు వన్డేల్లో ఒటమి పాలైన లంకేయులు ఈ మ్యాచ్ ను గెలిచి భారత్ ఆధిక్యాన్ని తగ్గించాలని భావిస్తుండగా, టీమిండియా మాత్రం ఈ మ్యాచ్ లో కూడా విజయ ఢంకా మోగించి సిరీస్ ను కైవసం చేసుకోవాలనే యోచనలో ఉంది. -
వైజాగ్ వన్డే జరిగేనా?
విశాఖపట్నం: ఈ నెల 14న విశాఖపట్నంలో వెస్టిండీస్-భారత్‌ల మధ్య మూడో వన్డే జరగాల్సి ఉంది. అయితే హుదూద్ తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో ఈ మ్యాచ్ జరుగుతుందా అనే సందేహాలు మొదలయ్యాయి. 12వ తేదీన తుపాన్ తీరం దాటుతుందనే వార్తలు ఆంధ్ర క్రికెట్ సంఘం అధికారుల్లో ఆందోళన పెంచాయి. అయితే 14వ తేదీ ఒక్క రోజు వర్షం లేకపోయినా మ్యాచ్‌ను నిర్వహిస్తామని ధీమాగా ఉన్నారు. ‘వైజాగ్ క్రికెట్ స్టేడియంలో అద్భుతమైన డ్రైనేజ్ వ్యవస్థ ఉంది. ఎంత పెద్ద వర్షం, ఎన్ని రోజుల పాటు వర్షం పడినా... ఆ రోజు రెండు గంటల పాటు సమయం దొరికితే మేం స్టేడియంను మ్యాచ్ కోసం సిద్ధం చేస్తాం’ అని ఏసీఏ మీడియా ఆపరేషన్స్ అధికారి సి.ఆర్.మోహన్ చెప్పారు. మూడో వన్డేకు సంబంధించిన టికెట్ల అమ్మకం శుక్రవారం నుంచి జరుగుతుంది. విశాఖలో మీ సేవా కేంద్రాలతో పాటు ఆన్‌లైన్‌లోనూ టికెట్లు కొనుక్కోవచ్చు. స్టేడియం సామర్థ్యం 27,500 కాగా... 12 వేల టికెట్లను అమ్మకానికి ఉంచారు. నాలుగో వన్డే ఇస్తారా? ధర్మశాలలో నాలుగో వన్డే నిర్వహించలేకపోతే ఆ మ్యాచ్‌ను కూడా విశాఖపట్నంలో జరిపే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. ఒకవేళ అవకాశం వస్తే రెండు వన్డేలు నిర్వహించగల సామర్ధ్యం తమకు ఉందని ఏసీఏ చెబుతోంది. అయితే ఈ విషయంపై బీసీసీఐ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ నాలుగో వన్డేను కూడా నగరానికి కే టాయిస్తే... పొరపాటున వర్షం కారణంగా మూడో వన్డే రద్దయినా నగర ప్రేక్షకులు మరో మ్యాచ్ చూడొచ్చు. -
మహిళల మూడో వన్డే రద్దు
లండన్:ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత మహిళల జట్టును కూడా వరుణుడు వదిలి పెట్టలేదు. సోమవారం జరగాల్సిన భారత-ఇంగ్లండ్ ల పురుషుల తొలి వన్డేకు వర్షం ఆటంకం కల్గించడంతో ఆ మ్యాచ్ రద్దయిన సంగతి తెలిసిందే. అయితే మహిళల విభాగంలో జరగాల్సిన మూడో వన్డేను కూడా వర్షం అడ్డుకుంది. లార్డ్స్ లో భారీ వర్షం కురవడంతో మూడో వన్డేను రద్దు చేయకతప్పలేదు. తొలి వన్డేలో స్లాగ్ ఓవర్లలో బ్యాటింగ్‌లో విఫలమైన భారత మహిళల జట్టు... ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలోనూ 13 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో ఆతిథ్య జట్టు 2-0తో సిరీస్ ను గెలుచుకుంది. ఈ మ్యాచ్ లోనైనా గెలిచి పరువు నిలుపుకుందామనుకున్న భారత మహిళలకు ఆ ఆశ తీరలేదు. ఇంగ్లండ్ మహిళలతో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్ లో భారత్ మహిళలు విజయం సాధించినా.. వన్డేల్లో మాత్రం ఘోరంగా విఫలమైయ్యారు. -
67 పరుగులకే లంక ఆలౌట్
మూడో వన్డేలో ఇంగ్లండ్ విజయం మాంచెస్టర్: ఆల్‌రౌండ్ నైపుణ్యంతో ఆకట్టుకున్న ఇంగ్లండ్... శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో నిలిచింది. ఓల్డ్ ట్రాఫర్డ్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో కుక్‌సేన టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్‌కు దిగిన లంక 24 ఓవర్లలో 67 పరుగులకే కుప్పకూలింది. లంకకు ఇది మూడో అత్యల్ప స్కోరు. పేసర్ క్రిస్ జోర్డాన్ (5/29) పదునైన బంతులతో లంక బ్యాటింగ్ లైనప్‌ను వణికించాడు. దీంతో సంగక్కర (13), జయవర్ధనే (12), మాథ్యూస్ (11)తో సహా అందరూ విఫలమయ్యారు. అండర్సన్, ట్రేడ్వెల్ చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 12.1 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా 73 పరుగులు చేసి గెలిచింది. కుక్ (30 నాటౌట్), బెల్ (41 నాటౌట్) నిలకడగా ఆడారు. ఇరుజట్ల మధ్య నాలుగో వన్డే లార్డ్స్‌లో శనివారం జరుగుతుంది. -
మూడో వన్డే టై
-
భారత్ 314.. న్యూజిలాండ్ 314; మూడో వన్డే టై
న్యూజిలాండ్‌తో ఐదు వన్డేల సిరీస్‌లో టీమిండియా పుంజుకుంది. వరుసగా తొలి రెండు మ్యాచ్‌లో ఓటమి చవిచూసిన ధోనీసేన మూడో వన్డేలో సత్తాచాటింది. ఓ దశలో ఓటమి అంచులకు వరకు వెళ్లినా జడేజా, అశ్విన్, ధోనీ పోరాట పటిమతో మ్యాచ్‌ను టైగా ముగించింది. తద్వారా సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. విజయానికి పరుగు దూరంలో భారత్ ఆగిపోయినా మ్యాచ్ మాత్రం అభిమానులకు అసలైన వన్డే క్రికెట్ మజా అందించింది. తొలి రెండు వన్డేల్లో కివీస్ గెలుపొందిన సంగతి తెలిసిందే. మరో రెండు వన్డేలు జరగాల్సివుంది. 315 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 46వ ఓవర్లో 275/8తో ఓటమి అంచున నిలిచింది. అలాంటి పరిస్థితి నుంచి జడేజా టీమిండియాను విజయం దిశగా నడిపించాడు. కాగా టీమిండియా నిర్ణీత ఓవర్లలో 314 పరుగులే చేసింది. ఆఖరి బంతికి రెండు పరుగులు చేయాల్సివుండగా, జడేజా పరుగే చేశాడు. కాగా ఈ ఓవర్లో జడేజా రెండు ఫోర్లు, సిక్సర్‌తో చెలరేగడంతో ఓటమి తప్పింది. రోహిత్ శర్మ 39 (38 బంతుల్లో), శిఖర్ ధావన్ 28 (25 బంతుల్లో) మొదట్లో కాస్త పర్వాలేదనిపించారు. తర్వాత విరాట్ కోహ్లీ 6 పరుగులకే వెనుదిరగడం, అజింక్య రహానే కూడా 3 పరుగులతో నిరాశపరిచాడు. ఆ స్థితిలో సురేష్ రైనా, కెప్టెన్ ధోనీ కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ధోనీ నిదానంగా ఆడుతూ వికెట్ పడకుండా జాగ్రత్తగా 60 బంతుల్లో అర్ధశతకం పూర్తిచేసుకుని ఆండర్సన్ బౌలింగులో సౌతీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇక ఆ తర్వాత వచ్చిన అశ్విన్, జడేజా దుమ్ము దులిపారు. అశ్విన్ 46 బంతుల్లో 65 పరుగులు చేశాడు. ఒకవైపు సహచరులు భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ తక్కువ పరుగులకే ఔటయినా, జడేజా మాత్రం చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో 45 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 66 పరుగులు చేశాడు. అంతకుముందు న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ విశ్వరూపం చూపించారు. 315 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా ముందుంచారు. ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌గా వచ్చిన గుప్తిల్ సెంచరీ చేసి దుమ్ము దులిపాడు. మిగిలిన వాళ్లలో విలియంసన్ ఒక్కడూ 65 పరుగులు చేసి కాస్త పర్వాలేదనిపించాడు. ఐదో ఓవర్లోనే రైడర్‌ను భువనేశ్వర్ కుమార్ క్లీన్‌బౌల్డ్ చేసి భారత శిబిరంలో ఆశలు రేకెత్తించాడు. అయితే ఆ ఆశలు కాస్తా కాసేపటికే నీరుగారిపోయాయి. న్యూజిలాండ్ జట్టు స్కోరు 36 పరుగుల వద్ద ఉన్నప్పుడు 20 పరుగులు చేసిన రైడర్ భువనేశ్వర్ కుమార్‌కు అడ్డంగా దొరికిపోయాడు. కానీ ఆ తర్వాత రెండో వికెట్ కోసం దాదాపు 28 ఓవర్లు వేచి చూడాల్సి వచ్చింది. గుప్తిల్ వీర విజృంభణకు తోడు ఫస్ట్ డౌన్లో వచ్చిన విలియం సన్ కూడా తోడవ్వడంతో భారత బౌలర్ల వికెట్ల ఆకలి ఏమాత్రం తీరలేదు. చివరకు ఈ భాగస్వామ్యాన్ని షమీ విడగొట్టాడు. షమీ బౌలింగ్‌లో విలియంసన్ (65) కూడా క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఇతడి స్కోరులో నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. తర్వాత కొద్ది సేపటికే ఆండర్సన్‌ను అశ్విన్ 8 పరుగులకే ఇంటికి పంపించాడు. జడేజా బౌలింగులో స్లాగ్ స్వీప్ కోసం ప్రయత్నించిన గుప్తిల్.. డీప్ మిడ్ వికెట్లో రహానేకు క్యాచ్ ఇచ్చి నాలుగో వికెట్‌గా ఔటయ్యాడు. 123 బంతులలో 11 ఫోర్లు, ఒక సిక్సర్‌తో సెంచరీ చేసిన గుప్తిల్.. మరో్ 11 పరుగులు మాత్రం పూర్తి చేసి పెవిలియన్ బాట పట్టాడు. మిగిలిన బ్యాట్స్‌మన్ రోంచి (38), సౌతీ (27) మినహా మిగిలిన ఎవరూ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. ఇషాంత్ శర్మను తప్పించి, ఆ స్థానంలో వరుణ్ ఆరోన్‌ను తీసుకున్నా, ఆ మార్పు పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేదు. ఏడు ఓవర్లు వేసి 52 పరుగులు సమర్పించుకున్న ఆరోన్.. మెకల్లం వికెట్ మాత్రమే తీయగలిగాడు. మిగిలినవారిలో షమీ, రవీంద్ర జడేజా రెండేసి వికెట్లు పడగొట్టారు. భువనేశ్వర్ కుమార్, ఆరోన్, అశ్విన్‌లకు ఒక్కో వికెట్ దక్కింది. అయితే.. జడేజా, అశ్విన్ మాత్రం పొదుపుగా బౌలింగ్ చేశారు. పదేసి ఓవర్లు వేసిన వీరిద్దరూ కేవలం 47 చొప్పున మాత్రమే పరుగులిచ్చారు. భువనేశ్వర్ కుమార్ కూడా 9 ఓవర్లలో 48 పరుగులిచ్చి పర్వాలేదనిపించాడు. మిగిలినవాళ్లను మాత్రం కివీస్ బ్యాట్స్‌మన్ ఆడుకున్నారు. మొదటి వన్డేలో తడబడి, రెండో వన్డేలో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి కారణంగా ఓడిపోయిన టీమిండియా.. పరువు దక్కించుకుని సిరీస్ ఓటమి ఎదురుకాకుండా ఉండాలంటే ఈ వన్డేలో తప్పనిసరిగా గెలిచి నిలవాలి. ఇండియన్ బ్యాట్స్‌మన్ ఏం చేస్తారో చూడాలి మరి. -
భారత విజయలక్ష్యం 315
-
భారత్-దక్షిణాఫ్రికాల మూడో వన్డే రద్దు
సెంచురీయన్: దక్షిణాఫ్రికా-భారత్ జట్ల మధ్య జరిగిన మూడో వన్డే రద్దయ్యింది. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ముగిసిన అనంతరం భారీ వర్షం రావడంతో మ్యాచ్ రద్దు చేసి ఇరుజట్లకు తలో పాయింట్ ఇచ్చారు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సఫారీలు నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 301 పరుగులు చేసింది. వరుస రెండు ఓటమిలు తరువాత భారత్ గెలుస్తుందని భావించిన సగటు అభిమానికి వరుణుడు అడ్డంకిగా మారాడు. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో మ్యాచ్ నిలిపివేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఇప్పటికే సిరీస్ గెలుచుకున్న దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్ లో కూడా సత్తా చాటింది. ఓపెనర్ డి కాక్ (101) పరుగులతో భారత్ బౌలర్ల భరతం పట్టగా,. డివిలియర్స్ (109) పరుగులు చేసి జట్టు భారీ స్కోరు చేయడానికి తోడ్పడ్డాడు. చివర్లో మిల్లర్ (56) పరుగులతో విజృంభించడంతో సఫారీలు భారత్ ముందు 302 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచారు. -
భారత్, సౌతాఫ్రికా మూడో వన్డేకు వర్షం ఆటంకం
సెంచూరియన్: దక్షిణాఫ్రికా, భారత్ ల మూడు వన్డేల సిరీస్ లో భాగంగా చివరి మ్యాచ్ కు వర్షం ఆటంకం కలిగించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న సఫారీలు సత్తా చాటారు. ఓపెనర్ ఆమ్లా(13), డేవిడ్స్ (1), డుమినీ(0) తక్కువ పరుగులకే వెనుదిరిగినా, డి కాక్ (101), డివిలియర్స్ (109) సెంచరీలు చేసి దక్షిణాఫ్రికాను ఆదుకున్నారు. చివర్లో మిల్లర్ (56) పరుగులతో విజృంభించడంతో దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 301 పరుగులు చేసింది. భారత్ బౌలర్లలో ఇషాంత్ శర్మకు నాలుగు వికెట్లు దక్కగా, మహ్మద్ షమీ మూడు, ఉమేష్ యాదవ్ వికెట్ తీశారు. అనంతరం వర్షం కారణంగా భారత్ లక్ష్యఛేదనకు ఆటంకం ఏర్పడింది. -
మూడో వన్డే: భారత్ విజయలక్ష్యం 302
సెంచూరియన్: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్ జరుగుతున్న చివరి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 302 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న సఫారీలు మరోసారి తమ సత్తాను చాటారు. ఓపెనర్ ఆమ్లా(13)పరుగులు చేసి ఈ మ్యాచ్‌లో విఫలమైనప్పటికీ, మరో ఓపెనర్ డి కాక్ (101) పరుగులతో భారత్ బౌలర్ల భరతం పట్టాడు. అనంతరం డేవిడ్స్ (1), డుమినీ(0) కే వెనుదిరిగినా, డివిలియర్స్ (109) పరుగులు చేసి జట్టు భారీ స్కోరు చేయడానికి తోడ్పడ్డాడు. చివర్లో మిల్లర్ (56) పరుగులతో విజృంభించడంతో దక్షిణాఫ్రికా నిర్ణీత 50.0 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 301 పరుగులు చేసింది. భారత్ బౌలర్లలో ఇషాంత్ శర్మకు నాలుగు వికెట్లు దక్కగా, మహ్మద్ సమీకి మూడు, ఉమేష్ యాదవ్‌కు ఒక వికెట్టు లభించింది. ఇప్పటికే సఫారీలు రెండు వన్డేలు గెలిచి సిరీస్ ను కైవసం చేసుకోగా, భారత్ మాత్రం ఈ మ్యాచ్‌లో గెలిచి పరువు దక్కించుకోవాలని చూస్తోంది. -
కాన్పూర్ చేరిన భారత్, వెస్టిండీస్ జట్లు
కాన్పూర్ : సిరీస్ ఫలితం తేల్చే చివరి వన్డే కోసం భారత్, వెస్టిండీస్ జట్లు మంగళవారం కాన్పూర్ చేరుకున్నాయి. చాలా రోజుల తర్వాత వచ్చిన టీమిండియాకు నిర్వాహకులు సాంప్రదాయ స్వాగతం పలికారు. ఆటగాళ్లు బస చేసే హోటల్లో ప్రత్యేకంగా ఓ కేక్ కూడా నిర్వాహకులు ఏర్పాటు చేశారు. మూడు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే రెండు టీమ్స్ 1-1తో సమంగా ఉన్నాయి. దీంతో చివరి వన్డే కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన టీమ్ సిరీస్‌ను కైవసం చేసుకోనుంది. విశాఖలో జరిగిన రెండో వన్డేలో అనూహ్యంగా టీమిండియాకు షాకిచ్చిన వెస్టిండీస్.. ఆ కొత్త ఉత్సాహంతో మూడో వన్డే మ్యాచ్ కోసం బరిలోకి దిగుతోంది. అటు ఈ ఏడాది వరసగా ఏడో వన్డే సిరీస్ గెలవాలని ధోనీసేన ఉబలాటపడుతోంది.