ఇప్పటికే ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ను గెలిచి మంచి ఊపుమీద ఉన్న విరాట్ కోహ్లి నేతృత్వంలోని టీమిండియా క్లీన్స్వీప్పై కన్నేసింది. ఇరు జట్ల మధ్య ఆదివారం జరిగే చివరిదైన మూడో వన్డే జరుగనుంది. రేపు మధ్యాహ్నం గం.1.30.లకు ఈడెన్ గార్డెన్ లో జరిగే మ్యాచ్ లో గెలుపు కోసం భారత్-ఇంగ్లండ్ జట్లు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. ఒకవైపు సిరీస్ను వైట్ వాష్ చేయాలని విరాట్ సేన భావిస్తుండగా, కనీసం మ్యాచ్లోగెలిచి పరువు నిలుపుకోవాలని మోర్గాన్ అండ్ గ్యాంగ్ యోచిస్తోంది. తొలి రెండు వన్డేల్లో భారీ స్కోర్లు నమోదు కావడంతో మరోసారి కూడా భారీ స్కోరు నమోదు అయ్యే అవకాశం కనబడుతోంది. మొదటి వన్డేలో 350 పరుగుల లక్ష్యాన్ని భారత్ అవలీలగా ఛేదిస్తే, రెండో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన విరాట్ గ్యాంగ్ 381 పరుగులు నమోదు చేసింది.