ఆసీస్ క్లీన్స్వీప్
మెల్బోర్న్:న్యూజిలాండ్తో జరిగిన మూడు వన్డేల సిరీస్ను ఆస్ట్రేలియా క్లీన్స్వీప్ చేసింది. చివరిదైన మూడో వన్డేలో ఆసీస్ 117పరుగుల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్ను 3-0 తో సాధించింది. ఆసీస్ విసిరిన 265 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్ 36.1 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌటై వైట్వాష్ అయ్యింది.
కివీస్ ఆటగాళ్లలో గప్టిల్(34),లాధమ్(28)లు మోస్తరుగా ఫర్వాలేదనిపించినా మిగతా ఆటగాళ్లు ఘోరంగా విఫలం కావడంతో ఓటమి తప్పలేదు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ మూడు వికెట్లు సాధించగా, కమ్మిన్స్ ,ఫాల్కనర్, ట్రాయిస్ హెడ్లు తలో మూడు వికెట్లు తీసి కివీస్ను కుప్పకూల్చడంలో ప్రధాన పాత్ర పోషించారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్(156) వీరోచిత సెంచరీతో ఆసీస్ భారీ స్కోరు సాధించింది.