
హైదరాబాద్ వన్డేలో జయవర్ధనే సెంచరీ
హైదరాబాద్:టీమిండియాతో ఇక్కడ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతున్న మూడో వన్డేలో జయవర్దనే సెంచరీతో ఆకట్టుకున్నాడు. లంకేయులు వరుసగా వికెట్లు చేజార్చుకున్నా జయవర్ధనే ఒంటరిగా పోరాటం చేశాడు. 111 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్స్ తో సెంచరీ చేసిన జయవర్ధనే భారత బౌలర్లకు పరీక్షగా నిలిచాడు. అంతకుముందు దిల్షాన్(53) పరుగుల మాత్రమే మహేలాకు సహకరించాడు. వన్డేల్లో 17 సెంచరీలు చేసిన మహేలా.. భారత్ పై నాల్గో సెంచరీ నమోదు చేశారు.
ఇదిలా ఉండగా జయవర్ధనే వ్యక్తిగత స్కోరు 116 పరుగుల వద్ద ఉండగా 12 వేలు పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. అంతకముందు సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, జయసూర్య, సంగక్కార లు ఈ ఘనత సాధించిన ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు.