
టీమిండియా విజయలక్ష్యం 243
హైదరాబాద్: టీమిండియాతో ఇక్కడ జరుగుతున్న మూడో వన్డేలో శ్రీలంక 243 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన శ్రీలంక ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.. ఐదు పరుగుల వద్ద కుశల్ పెరీరా (4) వికెట్టును కోల్పోయిన లంకేయులు వెంటనే సంగక్కరా వికెట్టును కూడా చేజార్చుకుంది. కుమార సంగక్కరా(0) పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ కు చేరి లంక అభిమానుల్ని నిరాశ పరిచాడు. అనంతరం మహేలా జయవర్ధనే సెంచరీ, దిల్షాన్ అర్ధ సెంచరీలతో బయటపడ్డ లంకేయులు 48.2 ఓవర్లలో 242 పరుగులు చేశారు. భారత బౌలర్లలో ఉమేష్ యాదవ్ నాలుగు వికెట్లు తీసి లంక పతనాన్ని శాసించగా, ఏఆర్ పటేల్ మూడు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు.
ఇదిలా ఉండగా ఈ వన్డేలో జయవర్ధనే అరుదైన ఘనతను దక్కించుకున్నాడు. వన్డేల్లో 17 సెంచరీలు, భారత్ పై నాలుగు సెంచరీలు చేసిన జయవర్ధనే 12 వేల పరుగుల క్లబ్ చేరాడు. అంతకముందు సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, జయసూర్య, సంగక్కార లు ఈ ఘనత సాధించిన ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు.