
నత్తనడకన శ్రీలంక బ్యాటింగ్
హైదరాబాద్:టీమిండియాతో ఇక్కడ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతున్న మూడో వన్డేలో శ్రీలంక ఆటగాళ్లు నత్తనడకన బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. ఐదు పరుగుల వద్ద కుశల్ పెరీరా(4) వికెట్టును కోల్పోయిన లంకేయులు వెంటనే సంగక్కార వికెట్టును కూడా చేజార్చుకుంది. కుమార సంగక్కార (0) పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ కు చేరి లంక అభిమానుల్ని నిరాశ పరిచాడు. టీమిండియా అటాకింగ్ బౌలర్ ఉమేష్ యాదవ్ రెండు వికెట్లు కూల్చి లంక షాకిచ్చాడు. ప్రస్తుతం 12.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయిన లంక 47 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. దిల్షాన్(20), మహేలా జయవర్ధనే(14)లు క్రీజ్ లో ఉన్నారు.
ఐదు వన్డేల్లో భాగంగా గత రెండు వన్డేల్లో ఒటమి పాలైన లంకేయులు ఈ మ్యాచ్ ను గెలిచి భారత్ ఆధిక్యాన్ని తగ్గించాలని భావిస్తుండగా, టీమిండియా మాత్రం ఈ మ్యాచ్ లో కూడా విజయ ఢంకా మోగించి సిరీస్ ను కైవసం చేసుకోవాలనే యోచనలో ఉంది.