మౌంట్ మాంగనీ: భారత్- న్యూజిలాండ్ మధ్య చివరి వన్డే ప్రారంభంమైంది. ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత్ జట్టులో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. కేదార్ జాదవ్ స్థానంలో మనీష్ పాండేను జట్టులోకి తీసుకున్నారు. సరిగ్గా ఏడాది క్రితం భారత జట్టు న్యూజిలాండ్‌లో పర్యటించింది. అప్పుడు టి20 సిరీస్ కోల్పోయిన టీమిండియా వన్డే సిరీస్‌ను గెలుచుకుంది. ఈ సారి సీన్ రివర్స్‌గా మారింది. టి20ల్లో జయభేరి అనంతరం వన్డే సిరీస్‌ను చేజార్చుకుంది. అయితే ఇప్పుడు పొట్టి ఫార్మాట్‌లో ప్రత్యర్థిని క్లీన్‌స్వీప్ చేసిన కోహ్లి సేన వన్డేల్లో అలాంటి పరాభవం తమకు ఎదురు కాకుండా చూసుకోవాల్సిన స్థితిలో నిలి చింది. ఈ నేపథ్యంలో ఎలాగైనా నెగ్గాలనే పట్టుదలతో భారత్... క్లీన్‌స్వీపే లక్ష్యంగా కీవిస్ బరిలోకి దిగుతున్నాయి.
తుది జట్లు
న్యూజిలాండ్: మార్టిన్ గుప్టిల్, హెన్రీ నికోల్స్, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), రాస్ టేలర్, టామ్ లాథమ్ ( వికెట్ కీపర్) , జిమ్మీ నీషామ్, కోలిన్ డి గ్రాండ్‌హోమ్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌతీ, కైల్ జామిసన్, హమీష్ బెన్నెట్
భారత్ : మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (డబ్ల్యుకె), మనీష్ పాండే, రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్, నవదీప్ సైని, యుజ్వేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా
పిచ్, వాతావరణం: నెమ్మదైన వికెట్. బౌలర్లకు కూడా కాస్త అనుకూలిస్తుంది. భారీ స్కోర్లకు అవకాశం తక్కువ. మ్యాచ్ రోజు వర్ష సూచన లేదు.
Comments
Please login to add a commentAdd a comment