కివీస్ క్లీన్ స్వీప్ | willamson, broom secure new zealand sweap 3-0 series against bangladesh | Sakshi
Sakshi News home page

కివీస్ క్లీన్ స్వీప్

Published Sat, Dec 31 2016 11:03 AM | Last Updated on Tue, Sep 5 2017 12:03 AM

కివీస్ క్లీన్ స్వీప్

కివీస్ క్లీన్ స్వీప్

నెల్సాన్: బంగ్లాదేశ్తో జరిగిన మూడు వన్డేల సిరీస్ను న్యూజిలాండ్ క్లీన్స్వీప్ చేసింది. శనివారం జరిగిన చివరిదైన మూడో వన్డేలో న్యూజిలాండ్ ఘన విజయం సాధించిన సిరిస్ను 3-0 తేడాతో కైవసం చేసుకుంది.  బంగ్లాదేశ్ విసిరిన 237 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ 41.2 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.న్యూజిలాండ్ ఓపెనర్లు మార్టిన్ గప్టిల్(6 ) రిటైర్డ్ హర్ట్గా వెనుదిరగగా, లాధమ్(4) నిరాశ పరిచాడు. 

 

ఆ తరువాత కేన్ విలియమన్స్ (95 నాటౌట్), బ్రూమ్(97)లు రాణించడంతో పాటు, చివర్లో నీషమ్ (28నాటౌట్) ఆకట్టుకోవడంతో కివీస్ సునాయాసంగా విజయం సాధించింది. తొలి రెండు వన్డేల్లో కివీస్ విజయాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో బ్రూమ్ సెంచరీ చేసే అవకాశాన్ని తృటిలో కోల్పోయాడు. గత వన్డేలో సెంచరీ చేసిన బ్రూమ్.. అతని వన్డే కెరీర్లో ఎనిమిదేళ్ల తరువాత తొలి శతకం సాధించిన ఆటగాడిగా నిలిచాడు. అయితే వరుసగా రెండో సెంచరీ అవకాశాన్ని బ్రూమ్ ఈ మ్యాచ్ లో జారవిడుచుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement