న్యూజిలాండ్‌కు బిగ్‌.. కేన్‌ మామ వరల్డ్‌కప్‌ నుంచి ఔట్‌! | Kane Williamson set to miss NZ vs AFG World Cup clash in Chennai | Sakshi
Sakshi News home page

World Cup 2023: న్యూజిలాండ్‌కు బిగ్‌.. కేన్‌ మామ వరల్డ్‌కప్‌ నుంచి ఔట్‌!

Published Sat, Oct 14 2023 3:47 PM | Last Updated on Sat, Oct 14 2023 4:14 PM

Kane Williamson set to miss NZ vs AFG World Cup clash in Chennai - Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023లో వరుస విజయాలతో దూసుకుపోతున్న న్యూజిలాండ్‌కు బిగ్‌షాక్‌ తగిలింది. ఆ జట్టు కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ చేతి వేలి గాయం కారణంగా టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో​ జరిగిన మ్యాచ్‌లో ఫీల్డర్‌ విసిరిన త్రో.. విలియమ్సన్‌ ఎడమ చేతి వేలికి తాకింది.

దీంతో మైదానంలోనే నొప్పితో కేన్‌మామ విల్లావిల్లాడు. వెంటనే ఫిజియో చికిత్స అందించినప్పటికీ విలియమ్సన్‌కు నొప్పి మాత్రం తగ్గలేదు. దీంతో ఫిజియో సాయంతో విలియమ్సన్‌ మైదానం వీడాడు. ఆ తర్వాత విలియమ్సన్‌ను స్కానింగ్‌కు తరలించారు.

అయితే స్కాన్‌ రిపోర్ట్‌లో అతడి ఎడమచేతి బొటనవేలు విరిగినట్లు తేలింది. బొటనవేలి ఫ్రాక్చర్ నుంచి కోలుకోవడానికి 6 వారాల సమయం పట్టనున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే అతడు మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యే ఛాన్స్‌ ఉ‍ంది. అయితే విలియమ్సన్‌ ప్రస్తుతం జట్టుతోనే ఉన్నాడు. అతడి ప్రత్యామ్నయంగా టామ్‌ బ్లండల్‌కు న్యూజిలాండ్‌ జట్టు మేనెజ్‌మెంట్‌ పిలుపునిచ్చింది.

కాగా ఐపీఎల్‌-2023 సందర్భంగా గాయపడిన విలియమ్సన్‌.. బంగ్లాదేశ్‌ మ్యాచ్‌తోనే తిరిగి రీ ఎంట్రీ ఇచ్చాడు. పునరాగమనం చేసిన మొదటి మ్యాచ్‌లోనే మళ్లీ గాయపడడం కివీస్‌కు గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పాలి. కాగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ ఘనవిజయం సాధించింది. ఇక న్యూజిలాండ్‌ తమ తదుపరి మ్యాచ్‌లో ఆక్టోబర్‌18న ఆఫ్గానిస్తాన్‌తో తలపడనుంది.
చదవండి: CWC 2023: భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌.. తొలి ఓవర్‌లోనే రికార్డులు బద్దలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement