వన్డే ప్రపంచకప్-2023లో వరుసగా మూడో విజయంపై న్యూజిలాండ్ కన్నేసింది. ఈ మెగా టోర్నీలో భాగంగా శుక్రవారం చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌తో కివీస్ తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు న్యూజిలాండ్‌కు గుడ్ న్యూస్ అందింది. ఆ జట్టు రెగ్యూలర్ కెప్టెన్, స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు బరిలో దిగనున్నాడు. ఈ టోర్నీలో తొలి రెండు మ్యాచ్‌లకు గాయం కారణంగా విలియమ్సన్ దూరమయ్యాడు.
అయితే ఇప్పుడు కేన్ మామ పూర్తి ఫిట్‌నెస్ సాధించినట్లు సమాచారం. విలియమ్సన్ రాకతో కివీస్ జట్టు మరింత బలంగా తయారుకానుంది. కాగా ఐపీఎల్-2023 సీజన్ సందర్భంగా గాయపడిన విలియమ్సన్ అప్పటినుంచి కివీస్ జట్టుకు దూరంగా ఉన్నాడు. ఈ మెగా టోర్నీ ఆరంభానికి ముందు రెండు వామప్ మ్యాచ్‌ల్లోనూ బ్యాటింగ్ చేసిన కేన్.. మ్యాచ్ మధ్యలోనే రిటైర్ హర్ట్‌గా వెనుదిరిగాడు.
ఇప్పడు తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవడంతో రిఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యాడు. మరోవైపు స్టార్ పేసర్ టిమ్ సౌథీ ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించనట్లు తెలుస్తోంది. సౌథీ చేతివేలి గాయంతో బాధపడతున్నాడు. ఈ క్రమంలో బంగ్లాతో మ్యాచ్‌కు కూడా సౌథీ దూరమయ్యే ఛాన్స్ ఉంది.
వరల్డ్‌కప్‌కు న్యూజిలాండ్ జట్టు: డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), డారిల్ మిచెల్, రచిన్ రవీంద్ర, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, మిచెల్ సాంట్నర్, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్, విల్ యంగ్, టిమ్ సౌతీ, జేమ్స్ నీషమ్, ఇష్ సోధి
చదవండి: SMT 2023: తిలక్ వర్మకు బంపరాఫర్.. ఏకంగా జట్టు కెప్టెన్‌గా ప్రమోషన్
Comments
Please login to add a commentAdd a comment