Bangladesh vs New Zealand ODI Series: ప్రపంచకప్-2023 టోర్నీకి ముందు బంగ్లాదేశ్.. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ ఆడనుంది. ఐసీసీ ఈవెంట్‌కు ముందు పటిష్ట కివీస్ జట్టుతో మూడు మ్యాచ్‌లలో తలపడనుంది. సెప్టెంబరు 21 నుంచి ఈ వన్డే సిరీస్ షురూ కానుంది.
ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఈ క్రమంలో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్, మహ్మదుల్లా రియాద్ పునరాగమనం చేయడం ఖాయమైంది.
గుడ్‌న్యూస్.. అతడు వచ్చేశాడు
వెన్నునొప్పితో అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు దూరమైన తమీమ్ రాక బంగ్లాకు శుభవార్తగా పరిణమించింది. ఇక అక్టోబరు 5 నుంచే వరల్డ్‌కప్ టోర్నీ ఆరంభం కానున్న తరుణంలో కెప్టెన్ షకీబ్ అల్ హసన్‌కు విశ్రాంతినిచ్చారు సెలక్టర్లు.
కివీస్‌తో సిరీస్‌కు కెప్టెన్‌గా లిటన్ దాస్
దీంతో సొంతగడ్డపై లిటన్ దాస్ కివీస్‌తో సిరీస్‌కు సారథ్యం వహించనున్నాడు. ఇక ఆసియా కప్-2023 సందర్భంగా గాయపడిన బ్యాటర్ నజ్ముల్ హొసేన్ షాంటో పేరును సెలక్టర్లు పరిగణనలోకి తీసుకోలేదు. మేజర్ టోర్నీ ముందున్న దృష్ట్యా అతడికి కూడా రెస్ట్ ఇచ్చారు.
ముగ్గురు అన్‌క్యాప్డ్ ప్లేయర్ల ఎంపిక
ఇక మహ్మద్ నయీం, ఆఫిఫ్ హొపేస్, షమీమ్ హొసేన్‌లను తప్పించిన మేనేజ్‌మెంట్.. అన్‌క్యాప్డ్ ప్లేయర్లు జాకీర్ హసన్, సయ్యద్ ఖలీద్ అహ్మద్, రిషద్ హుస్సేన్‌కు న్యూజిలాండ్‌తో ఆడే జట్టులో చోటిచ్చింది.
అందుకే షకీబ్ దూరం
జట్టు ప్రకటన సందర్భంగా బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు సెలక్టర్ మిన్‌హాజుల్ అబెదిన్ మాట్లాడుతూ.. ప్రపంచకప్‌నకు ముందు న్యూజిలాండ్‌తో సిరీస్ తమకు సన్నాహకంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నాడు. ఇక మెగా ఈవెంట్‌కు ముందు మానసికంగా, శారీరకంగా ఫిట్‌గా ఉండేందుకే కెప్టెన్ సహా ఇతర ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చినట్లు పేర్కొన్నాడు.
టీమిండియా గెలుపొందిన జోష్‌లో బంగ్లా
ఇదిలా ఉంటే.. ఆసియా కప్-2023లో షకీబ్ అల్ హసన్ బృందం మెరుగ్గా ఆడకపోయినప్పటికీ.. సూపర్-4 చివరి మ్యాచ్‌లో ఏకంగా టీమిండియానే ఓడించింది. అనూహ్య రీతిలో అద్భుత ఆటతీరుతో రోహిత్ సేనకు షాకిచ్చి 6 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొంది జోష్‌లో ఉంది. మరోవైపు ఇంగ్లండ్ పర్యటనలో 3-1తో న్యూజిలాండ్ వన్డే సిరీస్ కోల్పోయిన విషయం తెలిసిందే.
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు బంగ్లాదేశ్ జట్టు
లిటన్ దాస్ (కెప్టెన్), తమీమ్ ఇక్బాల్, సౌమ్య సర్కార్, అనముల్ హక్ బిజోయ్, తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా, నురుల్ హసన్ సోహన్, మెహీది హసన్, నసుమ్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, తంజిమ్ హసన్ సకీబ్, తాంజిద్ హసన్ తమీమ్, జాకీర్ హసన్, రిషద్ హుస్సేన్, సయ్యద్ ఖలీద్ అహ్మద్.
చదవండి: ఆర్సీబీ పేసర్‌కు లక్కీ ఛాన్స్! టీమిండియాలో చోటు.. బీసీసీఐ ప్రకటన
Ind vs SL: అభిమానులకు చేదువార్త! లంకను తక్కువ అంచనా వేస్తే అంతే ఇక!
Comments
Please login to add a commentAdd a comment