
భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును న్యూజిలాండ్ క్రికెట్ ప్రకటించింది. ఈ జట్టుకు కేన్ విలియమ్సన్ సారథిగా ఎంపికయ్యాడు. గాయం కారణంగా దాదాపు ఆరు నెలలగా జట్టుకు దూరంగా ఉంటున్న విలియమ్సన్.. ఇప్పడు పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. దీంతో ఈ మెగా ఈవెంట్ జట్టులో చోటు దక్కింది.
ఈ ఏడాది ఐపీఎల్ సందర్భంగా గాయపడిన విలియమ్సన్.. అప్పటి నుంచి ఆటకు దూరంగా ఉంటున్నాడు. అదే విధంగా యువ ఆల్‌రౌండర్లు రచిన్ రవీంద్ర, మార్క్ చాప్‌మన్‌కూ ఈ జట్టులో చోటు దక్కింది. మరోవైపు విధ్వంసకర ఓపెనర్ ఫిన్ అలెన్‌పై సెలక్టర్లు వేటు వేశారు. ఇక గాయం కారణంగా స్టార్ పేసర్ ఆడమ్ మిల్నే టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు.
వరల్డ్‌కప్‌కు న్యూజిలాండ్ జట్టు: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ట్రెంట్ బౌల్ట్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి, టిమ్ సౌతీ, విల్ యంగ్
చదవండి: ENG vs NZ: లివింగ్ స్టోన్ అద్భుత ఇన్నింగ్స్.. న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్ ఘన విజయం
Our 15 for the @cricketworldcup in India! More | https://t.co/D2jqxQxWeE #BACKTHEBLACKCAPS pic.twitter.com/wIlzA5N3qU
— BLACKCAPS (@BLACKCAPS) September 10, 2023