
వన్డే ప్రపంచకప్-2023కు ముందు న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు గుడ్‌న్యూస్ అందే అవకాశం ఉంది. గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్న కెప్టెన్ కేన్ విలియమ్సన్ వన్డే ప్రపంచకప్ సమయానికి అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్-2023 తొలి మ్యాచ్‌లోనే కేన్ విలియమ్సన్ మోకాలికి తీవ్ర గాయమైన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ మొత్తానికి విలియమ్సన్ దూరమయ్యాడు.
వెంటనే స్వదేశానికి వెళ్లిపోయిన విలియమ్సన్.. పూర్తి ఫిట్‌నెస్ సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. రోజురోజుకి అతడి ఫిట్‌నెస్ మరింత మెరుగుతున్నట్లు సమాచారం. ఇక తన గాయం గురించి విలియమ్సన్ తాజాగా అప్‌డేట్ ఇచ్చాడు. జిమ్‌లో శిక్షణ పొందుతున్న వీడియోను కేన్‌మామ సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
"నేను 100 శాతం ఫిట్‌నెస్ సాధించడానికి ప్రయత్నిస్తున్నాను. నెమ్మదిగా కోలుకుంటున్నాను. నా కెరీర్‌లో ఇంతకుముందు ఎప్పుడు ఇంత పెద్ద గాయం కాలేదు. కాబట్టి పూర్తి ఫిట్‌నెస్ సాధించాడనికి కాస్త సమయం పడుతుంది. ఫిజియో, జిమ్ ట్రైనర్ సాయంతో నా శిక్షణను కొనసాగిస్తున్నాను.
కచ్చితంగా త్వరలోనే నెట్స్‌లోకి వెళ్తాను" అని విలియమ్సన్ థీమా వ్యక్తం చేశాడు. కాగా విలియమన్స్ సారధ్యంలోని న్యూజిలాండ్ జట్టు 2019 వన్డే ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచింది. ఇక ఈ ఏడాది ప్రపంచకప్‌లో ఆక్టోబర్ 5న న్యూజిలాండ్ తమ తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో తలపడనుంది.
చదవండి: #ICCWorldCup2023: 'అప్పుడు సచిన్ కోసం.. ఇప్పుడు కోహ్లి కోసం'
Comments
Please login to add a commentAdd a comment