india newzealand
-
12 ఏళ్ల తర్వాత తొలిసారి.. టీమిండియాకు ఘోర పరాభవం (ఫోటోలు)
-
మూడో వన్డే : ఫీల్డింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్
మౌంట్ మాంగనీ: భారత్- న్యూజిలాండ్ మధ్య చివరి వన్డే ప్రారంభంమైంది. ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత్ జట్టులో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. కేదార్ జాదవ్ స్థానంలో మనీష్ పాండేను జట్టులోకి తీసుకున్నారు. సరిగ్గా ఏడాది క్రితం భారత జట్టు న్యూజిలాండ్‌లో పర్యటించింది. అప్పుడు టి20 సిరీస్ కోల్పోయిన టీమిండియా వన్డే సిరీస్‌ను గెలుచుకుంది. ఈ సారి సీన్ రివర్స్‌గా మారింది. టి20ల్లో జయభేరి అనంతరం వన్డే సిరీస్‌ను చేజార్చుకుంది. అయితే ఇప్పుడు పొట్టి ఫార్మాట్లో ప్రత్యర్థిని క్లీన్‌స్వీప్ చేసిన కోహ్లి సేన వన్డేల్లో అలాంటి పరాభవం తమకు ఎదురు కాకుండా చూసుకోవాల్సిన స్థితిలో నిలి చింది. ఈ నేపథ్యంలో ఎలాగైనా నెగ్గాలనే పట్టుదలతో భారత్... క్లీన్‌స్వీపే లక్ష్యంగా కీవిస్ బరిలోకి దిగుతున్నాయి. తుది జట్లు న్యూజిలాండ్: మార్టిన్ గుప్టిల్, హెన్రీ నికోల్స్, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), రాస్ టేలర్, టామ్ లాథమ్ ( వికెట్ కీపర్) , జిమ్మీ నీషామ్, కోలిన్ డి గ్రాండ్‌హోమ్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌతీ, కైల్ జామిసన్, హమీష్ బెన్నెట్ భారత్ : మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (డబ్ల్యుకె), మనీష్ పాండే, రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్, నవదీప్ సైని, యుజ్వేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా పిచ్, వాతావరణం: నెమ్మదైన వికెట్. బౌలర్లకు కూడా కాస్త అనుకూలిస్తుంది. భారీ స్కోర్లకు అవకాశం తక్కువ. మ్యాచ్ రోజు వర్ష సూచన లేదు. -
ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్
ఆక్లాండ్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించాడు. తొలి వన్డేలో 347 పరుగులు... ఇంత భారీ స్కోరు చేసిన తర్వాత కూడా భారత జట్టు మ్యాచ్‌ను కాపాడుకోలేకపోయింది. టీమిండియా బౌలింగ్, ఫీల్డింగ్ వైఫల్యాలు ఇక్కడ స్పష్టంగా కనిపించాయి. టి20 సిరీస్‌లో ఘన విజయం తర్వాత జట్టు ఉదాసీనత ప్రదర్శించినట్లు గత మ్యాచ్‌లో అనిపించింది. ఇప్పుడు ఆ పరాజయాన్ని మరచి కొత్త వ్యూహంతో బరిలోకి దిగాల్సిన సమయం వచ్చింది. తుది జట్ల వివరాలు: భారత్: కోహ్లి(కెప్టెన్), పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), జాదవ్, జడేజా, ఠాకూర్, సైని, బుమ్రా, చాహల్ న్యూజిలాండ్: లాథమ్ (కెప్టెన్, వికెట్ కీపర్), నికోలస్, గప్టిల్, చాప్మన్, బ్లండెల్, టేలర్, నీషామ్, డి గ్రాండ్‌హోమ్, సౌతీ, జామిసన్, బెన్నెట్ పిచ్, వాతావరణం ఇలా బ్యాట్‌కు బంతి తగలడమే ఆలస్యం అలా బౌండరీ దాటడం ఈడెన్ పార్క్‌లో సహజం. ప్రపంచంలో అతి చిన్న మైదానాల్లో ఇదొకటి. పరుగుల వరదతో భారీ స్కోర్లు ఖాయం. ఈ పర్యటనలో తొలి రెండు టి20లు ఇక్కడే జరిగాయి. ఛేదన సులువు కాబట్టి టాస్ కీలకం కానుంది. మ్యాచ్ రోజు వర్షం ముప్పు లేదు. -
ఇక ‘మిడిల్’దే భారం
తొలి టెస్టులో భారత్, న్యూజిలాండ్ ఒకే తరహాలో ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టాయి. ఇరుజట్లూ టపటపా మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డాయి. న్యూజిలాండ్ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ మెకల్లమ్, విలియమ్సన్ సెంచరీలతో భారీ స్కోరు అందించారు. ప్రస్తుతం భారత్‌కు కావలసింది కూడా అదే తరహా ఆట. మిడిలార్డర్ మ్యాజిక్ చేస్తే తప్ప... కివీస్ చేతిలో పరాభవం తప్పదు. ఈ మ్యాచ్ ఎటు సాగుతుందనేది మూడోరోజు తేలుతుంది. ఆక్లాండ్: బౌలర్లు విఫలమైన చోట భారత టాప్ ఆర్డర్ కూడా నిరాశపర్చింది. ప్రత్యర్థి బౌలింగ్‌ను ఎదుర్కోలేక ఓ దశలో 10 పరుగులకే 3 వికెట్లు చేజార్చుకుని కష్టాల్లో పడింది. ఫలితంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ధోనిసేన ఎదురీదుతోంది. శుక్రవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 39 ఓవర్లలో 4 వికెట్లకు 130 పరుగులు చేసింది. రోహిత్ (102 బంతుల్లో 67 బ్యాటింగ్; 8 ఫోర్లు, 1 సిక్సర్), రహానే (56 బంతుల్లో 23 బ్యాటింగ్; 2 ఫోర్లు) నిలకడగా ఆడుతున్నారు. ధావన్ (0), పుజారా (1), కోహ్లి (4), మురళీ విజయ్ (26) విఫలమయ్యారు. అంతకుముందు 329/4 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 121.4 ఓవర్లలో 503 పరుగులకు ఆలౌటైంది. మెకల్లమ్ (307 బంతుల్లో 224; 29 ఫోర్లు, 5 సిక్సర్లు) డబుల్ సెంచరీతో చెలరేగాడు. అండర్సన్ (109 బంతుల్లో 77; 13 ఫోర్లు, 1 సిక్సర్) ఫర్వాలేదనిపించాడు. ఇషాంత్ 6 వికెట్లు తీశాడు. ప్రస్తుతం 373 పరుగులు వెనుకబడి ఉన్న ధోనిసేన ఫాలోఆన్ తప్పించుకోవాలంటే ఇంకా 174 పరుగులు చేయాలి. సెషన్-1 ఓవర్లు: 24; పరుగులు: 144; వికెట్లు: 3 మెకల్లమ్ వీరవిహారం ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ మెకల్లమ్, అండర్సన్‌లు చెలరేగడంతో స్కోరు బోర్డు వేగంగా కదిలింది. 88 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న అండర్సన్ రెండో రోజు ఎదుర్కొన్న 26 బంతుల్లో 21 పరుగులు రాబట్టాడు. మెకల్లమ్ కూడా ధాటిగా ఆడుతూ 150 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. అయితే వేగంగా ఆడే ప్రయత్నంలో అండర్సన్... ఇషాంత్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 133 పరుగులు జోడించారు. వాట్లింగ్ (1) నిరాశపర్చినా... సౌతీ (21 బంతుల్లో 28; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) సాయంతో మెకల్లమ్ విజృంభించాడు. సోధి (27 బంతుల్లో 23; 3 ఫోర్లు) మెరుగ్గా ఆడాడు. మెకల్లమ్... జడేజా బౌలింగ్‌లో ఓ సిక్సర్, ఫోర్ కొట్టి కెరీర్లో రెండో ‘డబుల్’ సెంచరీ పూర్తి చేశాడు. ఇషాంత్ జోరు లంచ్ తర్వాత కివీస్ జోరుకు ఇషాంత్, జడేజా అడ్డుకట్ట వేశారు. చకచకా మూడు వికెట్లు తీసి కివీస్ ఇన్నింగ్స్‌ను ముగించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు కివీస్ పేసర్ బౌల్ట్ వరుసగా షాకిచ్చాడు. ఇన్నింగ్స్ రెండో బంతికి ధావన్, ఆరో బంతికి పుజారాను అవుట్ చేశాడు. విజయ్ వికెట్‌ను కాపాడుకునే ప్రయత్నం చేసినా... రెండో ఎండ్‌లో వచ్చిన కోహ్లిని సౌతీ దెబ్బతీశాడు. దీంతో భారత్ 10 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. రోహిత్, విజయ్ ఎక్కువ రిస్క్ తీసుకోకుండా ఇన్నింగ్స్‌ను నడిపించే ప్రయత్నం చేశారు. సెషన్-2 ఓవర్లు: 7.4; పరుగులు: 30; వికెట్లు: 3 (కివీస్) ఓవర్లు: 18; పరుగులు: 45; వికెట్లు: 3 (భారత్) స్కోరు వివరాలు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: ఫుల్టన్ ఎల్బీడబ్ల్యు (బి) జహీర్ 13; రూథర్‌ఫోర్డ్ (సి) రహానే (బి) ఇషాంత్ 6; విలియమ్సన్ (సి) ధోని (బి) జహీర్ 113; టేలర్ (సి) జడేజా (బి) ఇషాంత్ 3; బి.మెకల్లమ్ (సి) జడేజా (బి) ఇషాంత్ 224; అండర్సన్ ఎల్బీడబ్ల్యు (బి) ఇషాంత్ 77; వాట్లింగ్ (సి) ధావన్ (బి) ఇషాంత్ 1; సౌతీ (బి) షమీ 28; సోధి (సి) రోహిత్ (బి) ఇషాంత్ 23; వాగ్నేర్ (సి) కోహ్లి (బి) జడేజా 0; బౌల్ట్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు: 14; మొత్తం: (121.4 ఓవర్లలో ఆలౌట్) 503. వికెట్లపతనం: 1-19; 2-23; 3-30; 4-251; 5-384; 6-398; 7-434; 8-490; 9-495; 10-503. బౌలింగ్: షమీ 28-6-95-1; జహీర్ 30-2-132-2; ఇషాంత్ 33.4-4-134-6; జడేజా 26-1-120-1; కోహ్లి 1-0-4-0; రోహిత్ 3-0-12-0. భారత్ తొలి ఇన్నింగ్స్: ధావన్ (సి) విలియమ్సన్ (బి) బౌల్ట్ 0; విజయ్ (బి) వాగ్నేర్ 26; పుజారా (సి) వాట్లింగ్ (బి) బౌల్ట్ 1; కోహ్లి (సి) ఫుల్టన్ (బి) సౌతీ 4; రోహిత్ బ్యాటింగ్ 67; రహానే బ్యాటింగ్ 23; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: (39 ఓవర్లలో 4 వికెట్లకు) 130. వికెట్లపతనం: 1-1; 2-3; 3-10; 4-51 బౌలింగ్: బౌల్ట్ 10-1-20-2; సౌతీ 12-3-27-1; అండర్సన్ 2-0-9-0; వాగ్నేర్ 7-0-46-1; ఇష్ సోధి 6-0-13-0; విలియమ్సన్ 2-0-9-0. సెషన్-3 ఆదుకున్న రోహిత్ టీ విరామం తర్వాత విజయ్ విఫలమైనా రోహిత్ నిలకడగా ఆడాడు. రోహిత్ విజయ్ నాలుగో వికెట్‌కు 41 పరుగులు జోడించారు. రహానే ఆచితూచి ఆడగా... రోహిత్ మాత్రం అవకాశం దొరికినప్పుడల్లా బౌండరీలు సాధించాడు. ఈ సెషన్లో పరుగులు నెమ్మదిగా వచ్చినా... రోహిత్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. విలియమ్సన్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ కొట్టి ఆత్మ విశ్వాసాన్ని కనబర్చాడు. రోహిత్, రహానే ఐదో వికెట్‌కు అజేయంగా 79 పరుగులు జోడించారు. ఓవర్లు: 21; పరుగులు: 85; వికెట్లు: 1