
మూడో వన్డే: భారత్ విజయలక్ష్యం 302
సెంచూరియన్: మూడు వన్డేల సిరీస్లో భాగంగా భారత్ జరుగుతున్న చివరి మ్యాచ్లో దక్షిణాఫ్రికా 302 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న సఫారీలు మరోసారి తమ సత్తాను చాటారు. ఓపెనర్ ఆమ్లా(13)పరుగులు చేసి ఈ మ్యాచ్లో విఫలమైనప్పటికీ, మరో ఓపెనర్ డి కాక్ (101) పరుగులతో భారత్ బౌలర్ల భరతం పట్టాడు. అనంతరం డేవిడ్స్ (1), డుమినీ(0) కే వెనుదిరిగినా, డివిలియర్స్ (109) పరుగులు చేసి జట్టు భారీ స్కోరు చేయడానికి తోడ్పడ్డాడు. చివర్లో మిల్లర్ (56) పరుగులతో విజృంభించడంతో దక్షిణాఫ్రికా నిర్ణీత 50.0 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 301 పరుగులు చేసింది.
భారత్ బౌలర్లలో ఇషాంత్ శర్మకు నాలుగు వికెట్లు దక్కగా, మహ్మద్ సమీకి మూడు, ఉమేష్ యాదవ్కు ఒక వికెట్టు లభించింది. ఇప్పటికే సఫారీలు రెండు వన్డేలు గెలిచి సిరీస్ ను కైవసం చేసుకోగా, భారత్ మాత్రం ఈ మ్యాచ్లో గెలిచి పరువు దక్కించుకోవాలని చూస్తోంది.