భారత్, న్యూజిలాండ్ మధ్య వన్డే సిరీస్ ఫలితాన్ని తేల్చే చివరి మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఇక్కడి గ్రీన్‌పార్క్ మైదానంలో నేడు ఇరు జట్లు మూడో వన్డేలో తలపడనున్నాయి. భారత్, కివీస్ చెరో మ్యాచ్ గెలిచి 1–1తో సమంగా ఉన్న నేపథ్యంలో మరో ఆసక్తికర పోరుకు అవకాశం ఉంది.