ఆదుకున్న తిరిమన్నే
పల్లెకెలె: భారత్ తో జరుగుతున్న మూడో వన్డేలో శ్రీలంక ఆచితూచి ఆడుతోంది. 28 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన శ్రీలంకను చండిమాల్- తిరుమన్నే జో్డి ఆదుకుంది. ఈ జోడి మూడో వికెట్ కు 72 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన తరువాత చండిమాల్(36) మూడో వికెట్ గా అవుటయ్యాడు. దాంతో వంద పరుగుల వద్ద లంక జట్టు మూడో వికెట్ ను నష్టపోయింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన లంకకు బూమ్రా షాకిచ్చాడు. డిక్ వెల్లా(13), కుశాల్ మెండిస్(1)లు అవుట్ చేసి భారత్ కు శుభారంభం అందించాడు. దాంతో రక్షణాత్మక ధోరణి అవలంభించిన లంకేయులు జాగ్రత్తగా స్కోరు బోర్డును కదిలిస్తున్నారు.
ఈ క్రమంలోనే తిరుమన్నే హాఫ్ సెంచరీ సాధించాడు. 69 బంతుల్లో అర్థ శతకాన్ని పూర్తి చేసి జట్టును ఆదుకున్నాడు. దాంతో శ్రీలంక 30 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది. లంక కోల్పోయిన మూడు వికెట్లలో బూమ్రాకు రెండు వికెట్లు దక్కగా, హార్దిక్ పాండ్యాకు వికెట్ లభించింది.