క్షిణాఫ్రికా-భారత్ జట్ల మధ్య జరిగిన మూడో వన్డే రద్దయ్యింది.
సెంచురీయన్: దక్షిణాఫ్రికా-భారత్ జట్ల మధ్య జరిగిన మూడో వన్డే రద్దయ్యింది. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ముగిసిన అనంతరం భారీ వర్షం రావడంతో మ్యాచ్ రద్దు చేసి ఇరుజట్లకు తలో పాయింట్ ఇచ్చారు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సఫారీలు నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 301 పరుగులు చేసింది. వరుస రెండు ఓటమిలు తరువాత భారత్ గెలుస్తుందని భావించిన సగటు అభిమానికి వరుణుడు అడ్డంకిగా మారాడు. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో మ్యాచ్ నిలిపివేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఇప్పటికే సిరీస్ గెలుచుకున్న దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్ లో కూడా సత్తా చాటింది.
ఓపెనర్ డి కాక్ (101) పరుగులతో భారత్ బౌలర్ల భరతం పట్టగా,. డివిలియర్స్ (109) పరుగులు చేసి జట్టు భారీ స్కోరు చేయడానికి తోడ్పడ్డాడు. చివర్లో మిల్లర్ (56) పరుగులతో విజృంభించడంతో సఫారీలు భారత్ ముందు 302 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచారు.